శ్రీరామ జయ రామ జయజయ రామ 🌹🙏
⚜️🕉️🚩 శ్రీరామ జయ రామ జయజయ రామ 🌹🙏
💥సత్యం, ధర్మాన్ని ఆచరించిన శ్రీరామచంద్రుడిని మూడు సంధ్యల్లో మనస్ఫూర్తిగా ధ్యానించడం వల్ల సకల సమస్యలు తీరి ప్రశాంతతని పొందుతారని పండితులు చెబుతారు.
మూడు పూటలా రాముడి శ్లోకం చదవడం ద్వారా మనస్సు శుద్ధి జరగడంతో పాటూ కష్ట నష్టాలు ఇబ్బందులు తొలగి ప్రశాంతతని, విజయాన్ని పొందుతామని చెబుతారు.
-- ఇవే ఆ శ్లోకాలు...
("శ్రీరామ కర్ణామృతం" నుంచి సేకరించిన శ్లోకాలివి)
💥ఉదయం చదవాల్సిన శ్లోకం:
ధ్యాయే ప్రాతస్సురేశం రవికులతిలకం రంజితానంతలోకం
బాలం బాలారుణాక్షం భవముఖవినుతం భావగమ్యం భవఘ్నమ్,
దీప్యంతం స్వర్ణక్లప్తై ర్మణిగణనికరై ర్భూషణై రుజ్జ్వలాంగం
కౌసల్యాదేహజాతం మమ హృదయగతం రామ మీషత్ స్మితాస్యమ్
భావం:
దేవతలకు అధిపతి అయిన వాడు, సూర్యవంశ శ్రేష్ఠుడు, ఎల్ల లోకాలనూ ఆనందింప జేయువాడు, బాలుడు, లేతసూర్యుని పోలిన ఎఱ్ఱనైన నేత్రములు కలిగినవాడు, హృదయంలో ధ్యానింపదగినవాడు, సంసారబాధను పోగొట్టువాడు, శ్రేష్ఠుడు, మణులు పొదగబడిన కనకాభరణములతో ప్రకాశించువాడు, కౌసల్య కుమారుడు, నా హృదయందున్నవాడు, చిరునవ్వు మోమువాడు అయిన రాముని ప్రాతఃకాలమందు ధ్యానం చేస్తున్నాను.
💥మధ్యాహ్నం చదవాల్సిన శ్లోకం:
మధ్యాహ్నే రామచంద్రం మణిగణలలితం మందహాసావలోకం
మార్తాండానేకభాసం మరకతనికరాకార మానందమూర్తిమ్,
సీతావామాంకసంస్థం సరసిజనయనం పీతవాసో వసానం
వందేఽహం వాసుదేవం వరశరధనుషం మానసే మే విభాంతమ్.
భావం:
మాణిక్య సమూహముచే సుందరుడు, చూపులతో చిరునవ్వులు చిందించువాడు, బహు సూర్యుల కాంతి గలిగిన వాడు, మరకత మణుల ప్రోగువంటి ఆకారము కలవాడు, ఆనంద స్వరూపుడు, ఎడమ తొడపై సీత ఉన్నవాడు, పద్మాలవంటి నేత్రాలు కలిగినవాడు, పచ్చని వస్త్రం ధరించినవాడు, అన్ని లోకాలకు నివాస స్థానమైన వాడు, శ్రేష్ఠములైన ధనుర్బాణములు ధరించినవాడు, నా మనస్సులో ప్రకాశిస్తున్నవాడు అయిన రామచంద్రునికి మధ్యాహ్నం నమస్కరిస్తున్నాను.
💥సాయంత్రం చదవాల్సిన శ్లోకం:
ధ్యాయే రామం సుధాంశుం నతసకలభవారణ్యతాపప్రహారం
శ్యామం శాంతం సురేంద్రం సురమునివినతం కోటిసూర్యప్రకాశమ్,
సీతసౌమిత్రిసేవ్యం సురనరసుగమం దివ్యసింహాసనస్థం
సాయాహ్నే రామచంద్రం స్మితరుచిరముఖం సర్వదా మే ప్రసన్నమ్.
భావం:
చంద్రుడిలా ఉండేవాడు, నమస్కరించే వారికి సంసారారణ్య బాధను అంతం చేయువాడు, నల్లనివాడు, శాంతుడు, దేవతలు మునులతో పూజలందుకునేవాడు, కోటి సూర్యుల కాంతిని కలిగి ఉండేవాడు, సీతాలక్ష్మణులు సేవిస్తున్నవాడు, దేవతలకు మనుష్యులకు సులభుడైనవాడు , గొప్ప సింహాసనమందున్నవాడు , నవ్వుచే సుందరమైన మోముగల రామచంద్రుడిని సాయంకాలం ధ్యానిస్తున్నాను.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment