💥చైత్ర శుక్ల నవమి.. శ్రీరామనవమి.

 ⚜️🕉️🚩 శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🌹🙏


💥చైత్ర శుక్ల నవమి.. శ్రీరామనవమి.


లోకాభిరామం రణరంగధీరం

రాజీవనేత్రం రఘువంశనాథమ్ ।

కారుణ్యరూపం కరుణాకరం తం

శ్రీరామచంద్రం శరణం ప్రపద్యే ॥


చైత్రశుక్ల నవమీ పునర్వసు నక్షత్రం మధ్యాహ్నము కర్కాటక లగ్నములో శ్రీరామచంద్రుడు అవతరించాడు.


శ్రీరాముని జన్మదినమైన చైత్రశుద్ధ నవమి నాడు "శ్రీ రామ నవమి"గా పూజలు జరుపుకుంటుంటాం. దేశవ్యాప్తంగా రామునికి పూజలు జరుగుతాయి. శ్రీరామనవమి రోజున వీధులలో పెద్ద పెద్ద తాటాకు పందిళ్ళు వేసి, సీతారామ కళ్యాణం చేస్తారు. శ్రీ రాముడికి అరటి పండ్లంటే ప్రీతికరం. కొలిచేటపుడు అరటిపండ్లతో నివేదన తప్పనిసరిగా వుండాలన్నది శాస్త్ర నియమం. శ్రీ రామనవమి రోజున పానకం-వడపప్పు ప్రాముఖ్యత ఉంటుంది. నవమి రోజున పానకం-వడపప్పు తయారు చేసి మహా ప్రసాదంగా స్వీకరిస్తారు. దీని వెనుక ప్రాకృతిక పరమార్థమూ లేకపోలేదు. ఇది వేసవికాలం కాబట్టి, వీటిని ప్రసాదరూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యం, ఆయుష్షు అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేదం సైతం చెబుతొంది. ఇళ్ళల్లో కూడా యధాశక్తిగా రాముని షోడసోపచారాలతో పూజించి వడపప్పు, పానకం నైవేద్యం చేసి అందరికీ పంచడం ఏనాటి నుండో ఒక సాంప్రదాయంగా వస్తొంది.


శ్రీ రామచంద్రుడు వసంతఋతువులోని చైత్రమాసం శుద్ధ నవమి రోజు పునర్వసు నక్షత్రం కర్కాటక లగ్నంలో మిట్ట మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో లోకాభి రాముడైన శ్రీరాముడు జన్మించాడు. ప్రతి సంవత్సరం ఈ రోజునే శ్రీరామనవమిని జరుపుకోవాలన్నది శాస్త్ర నియమం.. రావణ సంహారం పిదప శ్రీరాముడు సతీసమేతంగా చైత్రశుద్ధ నవమి నాడే అయోధ్య రాజ్య పాలకుడిగా పట్టాభిషిక్తుడైనాడు. శ్రీ సీతారాముల కళ్యాణం జరిగింది కూడా ఈ రోజే కావడం విశేషం. కోదండ రాముని కళ్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల దేవతలు దివి నుండి భువికి దిగి వచ్చి కల్యాణ మహోత్సవాన్ని చూసి పులకించిపోతారట.


శ్రీరాముడు సత్యపాలకుడు, ధర్మాచరణం తప్పనివాడు, ఏకపత్నీ వ్రతుడు, సర్వ సద్గుణాలు మూర్తీభవించిన దయార్ధ హృదయుడు. రావణ సంహారం చేసి ధర్మాన్ని రక్షించడంతో పాటు అతి దుర్లభమైన మానవ జన్మను పొందిన మానవుడు ఎలా ఉండాలి, బంధాలను ఎలా గౌరవించాలి, కాపాడుకోవాలి అని ఆచరించి చూపించాడు శ్రీరామచంద్రుడు.


అందుకే ప్రతి ఏటా భద్రాద్రిలో జరిగే సీతారామ కళ్యాణాన్ని చూసి తరించిన వారి జన్మ సార్థకం అవుతుందని భక్తుల విశ్వాసం. 


మన కష్టాలను దూరం చేసే దేవుడు శ్రీరాముడు. ఏ కష్టం వచ్చినా పెద్దలు రామ రామ అనడం మీరు వినే ఉంటారు. జానకీవల్లభ అనేక మంత్రాలు జీవితంలో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండటానికి, వృత్తిలో విజయాన్ని పొందడానికి, కష్టాలను తొలగించడానికి సహాయపడతాయి. రామ మంత్రాలను పఠించేవాడు చెడు నుండి రక్షించబడతాడు. రామ మంత్రం మహిమ అద్భుతం. ప్రత్యేకించి, రామ మంత్రాలను పఠించడం ద్వారా శ్రీరాముడి ఆశీస్సులతో పాటు హనుమంతుని అనుగ్రహాన్ని పొందవచ్చు.


శ్రీ రామనవమి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి, తలంటు స్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి. పూజామందిరము, ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి. పూజామందిరము, గడపకు పసుపు, కుంకుమ ఇంటి ముందు రంగవల్లికలతో అలంకరించుకోవాలి. పూజకు ఉపయోగించే పటములకు గంధము, కుంకుమ పెట్టి సిద్ధంగా ఉంచాలి. పూజకు సన్నజాజి, తామర పువ్వులు, నైవేద్యానికి పానకం, వడపప్పు సిద్ధం చేసుకోవాలి. అలాగే పూజకు ముందు శ్రీరామ అష్టోత్తరము, శ్రీరామరక్షా స్తోత్రము, శ్రీరామాష్టకము, శ్రీరామ సహస్రము, శ్రీమద్రామాయణం వంటి స్తోత్రాలతో శ్రీరాముడిని స్తుతించాలి. ఇంకా శ్రీరామ పట్టాభిషేకము అనే అధ్యాయమును పారాయణము చేయడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి. శ్రీ రామ నవమి రోజున సీతారామ కల్యాణం చేయించిన లేక కల్యాణంలో పాల్గోన్న సకల శుభాలు మరియు అష్టైశ్వర్యాలు కలుగుతాయి.


💥శివుడు పార్వతికి ఉపదేశించిన శ్లోకం:


శ్లో|| శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే |

      సహస్ర నామతత్తుల్యం రామనామ వరాననే ||


విష్ణు సహస్రనామ, శివసహస్రనామ స్తోత్రం ఒకసారి పారాయణం చేస్తే వచ్చే ఫలితం పై శ్లోకం 3 సార్లు స్మరిస్తే వచ్చే ఫలితముకు సమానం అని సాక్షాత్తు పరమేశ్వరుడు పార్వతీ దేవికి చెప్పాడు. కాబట్టి విశేష ఫలితానిచ్చే పై శ్లోకాన్ని యధాశక్తిన కనీసం 108 సార్లు జపిస్తే శ్రీ రామానుగ్రహం తప్పక సిద్ధిస్తుంది.


జయతు జయతు మంత్రం జన్మ సాఫల్య మంత్రం

జనన మరణభేద క్లేశ విచ్చేద మంత్రమ్

సకల నిగమ మంత్రం సర్వశాస్త్రైక మంత్రం

రఘుపతి నిజమంత్రం రామ రామేతి మంత్రమ్!!


💥శ్రీరామనవమి "శ్రీ సీతారాముల కళ్యాణోత్సవము" జరుగుతున్న శుభ సందర్భంగా... వేదపండితులు ఉచ్చరించే కళ్యాణ ప్రవరలు.


#శ్రీరామ_ప్రవర:-


చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్యః శుభం భవతు. 

వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రయార్షేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ, 

నాభాగ మహారాజ వర్మణో నప్త్రే...

అజ మహారాజ వర్మణః పౌత్రాయ...

దశరథ మహారాజ వర్మణః పుత్రాయ...

శ్రీరామచంద్ర స్వామినే కన్యార్ధినే వరాయ.


#సీతాదేవి_ప్రవర:-


చతుస్సాగర పర్యంతం గో బ్రాహ్మణేభ్యః శుభం భవతు

ఆంగీరస ఆయాస్య గౌతమ త్రయార్షేయ ప్రవరాన్విత గౌతమస గోత్రోద్భవీం...

స్వర్ణరోమ మహారాజ వర్మణో నప్త్రీం...

హ్రస్వరోమ మహారాజ వర్మణః పౌత్రీం...

జనక మహారాజ వర్మణః పుత్రీం...

సీతాదేవి నామ్నీం వరార్ధినీం కన్యాం...


ఈ వివరాలు తెలుసుకున్న వారికి, తెలియజేసినవారికి వంశాభివృద్ధి.. గోత్రాభివృద్ధి కలుగుతుంది.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు