Posts

Showing posts from April, 2026

వైశాఖపురాణం 12వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 వైశాఖపురాణం - 12. 12వ అధ్యాయము - రతి దుఃఖము - దేవతల ఊరడింపు నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖమహాత్మ్యమును వివరించునిట్లనెను. మిధిలాపతియగు శ్రుతకీర్తి శ్రుతదేవుని ముక్కంటి కంటిమంటకు యెర అయిన ఆ మన్మధుని జన్మయెట్టిది? అతడు చేసిన కర్మ వలన అతడెట్టి దుఃఖముననుభవించెనో వివరింపుమని కోరెను. శ్రుతదేవుడిట్లనెను. కుమారస్వామి జన్మకథ పవిత్రమైనది. విన్నంతనే చేసిన పాపములన్నియు నశించును. కీర్తిని, పుత్రులను కలిగించును. ధర్మబుద్దిని కలిగించును. సర్వరోగములను హరించును. అట్టి మహత్తరమైన కథను చెప్పుచున్నాను సావధానముగ వినుము. శివుని కంటిమంటకు మన్మధుడు దహింపబడుటను చూచి మన్మధుని భార్యయగు రతి బూడిగప్రోగు అయిన భర్తను జూచి దుఃఖపీడితయై మూర్చిల్లెను. ముహూర్త కాలమునకు తెప్పరిల్లి బహువిధములుగ దుఃఖించెను. ఆమె దుఃఖము చూచు వారికిని దుఃఖమును కలిగించుచుండెను. ఆమె తన భర్తతో సహగమనము చేయవలెనని తలచెను. అందులకై తగిన యేర్పాట్లను చేయుటకు తన భర్తకు మిత్రుడగు వసంతుని తలచెను. వీరపత్నియగు ఆమె కోరిక ప్రకారము చితిని యేర్పరచుటకై వసంతుడచటకు వచ్చెను. మిత్రుని దుర్మరణమునకు, మిత్రుని భార్య దురవస్థకు విచా...

💥సుబ్రహ్మణ్య తత్వం

Image
 ⚜️🕉️🚩ఓం సుబ్రహ్మణ్యాయ నమః🌹🙏 💥 సుబ్రహ్మణ్య తత్వం 💥 షడాననం చందన లేపితాంగం మహారసం దివ్య మయూర వాహనం! రుదస్య నూనుం సురలోకనాథం శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపథ్యే!! మనకు ‘షణ్మతము’లను ఆరు మతములు ఉన్నవి. అందులో ఆరు దేవతా స్వరూపాలను పరబ్రహ్మ స్వరూపాలుగా పూజిస్తాము. అవి, గాణాపత్యము - గణపతి; సౌరము - సూర్యుడు; శాక్తము - పార్వతి (శక్తి); శైవము - శివుడు; వైష్ణవము - విష్ణువు; కౌమారము - సుబ్రహ్మణ్యుడు. వీరిని పూజించే పద్ధతినే "పంచాయతన పూజ" అంటారు. కౌమారము అనే శాఖ ‘కుమార’ అన్న శబ్దము నుండే వచ్చింది. ఇచ్ఛా జ్ఞాన క్రియా రూప మహాశక్త్ధిరం భజే! శివశక్తి జ్ఞానయోగం జ్ఞానశక్తి స్వరూపకం!! - అని శివపురాణ వచనం. వైదిక మతంలో శివ శక్త్యాత్మకుడైన సుబ్రహ్మణ్యోపాసన గురించి చెప్పబడింది. షణ్మతాలలో- సౌర, శాక్త, గాణాపత్య, వైష్ణవ, శివమతాలతో పాటు కుమారోపాసన గురించి చెప్పినప్పటికీ, పంచ దేవతారాధనలో స్థానం కల్పించలేదు. సుబ్రహ్మణ్యునికి ‘‘అగ్నిగర్భుడ’’ని నామం ఉంది. అయితే, సుబ్రహ్మణ్యారాధన అగ్ని ఉపాసనతోనే ప్రారంభం అవుతుందని తత్త్వజ్ఞుల అభిప్రాయం. ఏ పూజ మొదలెట్టినా దీపారాధనతోనే ప్రారంభం కావడం తెలియంది కాదు. ‘దీపారాధన’...

వైశాఖపురాణం 11వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 వైశాఖపురాణం - 11 11వ అధ్యాయము - దక్షయజ్ఞనాశము కామదహనము రుద్రుడా వార్తను విని కాలాంతకునివలె భయంకరాకారుడై వేయి బాహువులుకల మహాబలశాలియగు వీరభద్రుడు వెలువడెను. అతడును పరమేశ్వరునకు నమస్కరించి నన్ను సృష్టించిన కారణమును తెలుపుమని చేతులు జోడించి యడిగెను. పరమేశ్వరుడును నా భార్య వినజాలనిరీతిలో నన్ను నిందించిన ఆమె శరీర త్యాగమునకు కారణమైన దక్షుని సంహరింపుమని యానతిచ్చెను. భూతసంఘములను వీరభద్రుని వెంటపొండని పంపెను. ఇట్లు పరమేశ్వరుని యాజ్ఞనందిన వీరభద్రుడు, వాని వెంట వెళ్లిన పరివారము యజ్ఞశాలను చేరి యచటనున్న దేవతలు, రాక్షసులు, మానవులు మున్నగు మహావీరులను అందరనుకొట్టిరి. సతీదేవి మాటలకు నవ్విన సూర్యుని దంతములను వీరభద్రుడు రాలగొట్టెను. సతీదేవి మాటను సతీదేవిని పరిహసించుచు నెవరు యే అవయవమును సవరించుకొనిరో వారి ఆ అవయవమును వీరభద్రుడు నాశము గావించెను. దక్షుని శిరమును ఖండింపవలెనని వీరభద్రుడు ప్రయత్నించెను. కాని మునిమంత్ర రక్షితమగు వాని శిరస్సును ఖండింపలేక పోయెను. పరమేశ్వరుడా విషయమును గ్రహించి తానే స్వయముగ దక్షుని శిరమును ఖండించెను. ఈ విధముగ వీరభద్రుడు శివుడు వారి పరివారము యజ్ఞశా...

మహాలింగ స్తుతి🙏

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 మహాశివరాత్రి నాడు లింగోద్భవ కాలంలో (అర్థరాత్రి) బ్రహ్మ, ఋషులు మరియు దేవతలు జ్యోతిర్లింగ రూపుడైన శివుడిని స్తుతించిన శక్తివంతమైన మహా లింగ స్తుతి (లింగోద్భవ స్తుతి). ఈ స్తోత్రం శివుని అనంతునిగా, జ్యోతి స్వరూపునిగా కీర్తిస్తుంది.  ఈ స్తోత్రం అష్టదరిద్రాలను పోగొట్టి, శివ కృపను కలిగిస్తుందని నమ్మకం.  🌹మహాలింగ స్తుతి🙏 అనాదిమల సంసార రోగ వైద్యాయ శంభవే! నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!! ఆదిమధ్యాంత హీనాయ స్వభావానలదీప్తయే! నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!! ప్రళయార్ణవ సంస్థాయ ప్రళయోత్పత్తి హేతవే! నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!! జ్వాలామాలావృతాంగాయ జ్వలనస్తంభరూపిణే! నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!! మహాదేవాయ మహతే జ్యోతిషేనంతతేజసే! నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!! ప్రధాన పురుషేశాయ వ్యోమరూపాయ వేధసే! నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!! నిర్వికారాయ నిత్యాయ సత్యాయామలతేజసే! నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!! వేదాంతసార రూపాయ కాలరూపాయ ధీమతే! నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే! ⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

వైశాఖపురాణం 10వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 వైశాఖపురాణం - 10. 10వ అధ్యాయము - సతీదేహ త్యాగము అంబరీష మహారాజుతో నారదుడిట్లు పలికెను. శ్రుతదేవుడు చెప్పిన పిశాచత్వ మోక్షకథను విని శ్రుతకీర్తి మహారాజిట్లు పలికెను. శ్రుతదేవ మహామునీ! యిక్ష్వాకు వంశరాజగు హేమాంగదుడు జలదానము చేయకపోవుటవలన ముమ్మారు చాతకముగను, జన్మించి బల్లిగా నా గృహమున నుండెను కదా! పుణ్యమును కలిగించు యజ్ఞ యాగాదికములను దానములను చేసిన హేమాంగదుడు కర్మానుసారము చాతకము మున్నగు జన్మలనెత్తవచ్చును గాని సత్పురుషులను సేవింపక పోవుట వలన గ్రద్దగను, పలుమార్లు కుక్కగను జన్మించుట మాత్రము తగినట్లుగ నాకు తోచుటలేదు. హేమాంగద మహారాజు సజ్జనులను పూజింపలేదు. కావున వానికి పుణ్యలాభము కలుగక పోవచ్చును. పరులకు పీడ కలిగించినచో బధలు రావచ్చును. అట్టి అనర్థమును చేయలేదు కదా. అనగా పరపీడను చేయలేదు కదా. కావున వీనికి శునకాది జన్మలెందులకు కలిగెనో వివరించి నా సందేహమును తీర్చగోరుచున్నాను. అని అడిగిన శ్రుతకీర్తిని మెచ్చి శ్రుతదేవుడిట్లు పలికెను. రాజా! వినుము, ఈ విషయమున పార్వతికి శివుడు కైలాస శిఖరమున చెప్పిన విషయమును వినుము. భగవంతుడీ లోకములన్నిటిని సృష్టించెను. వాని స్థితిని యిహలోక ...

వైశాఖపురాణం 9వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 వైశాఖపురాణం - 9 9వ అధ్యాయము - పిశాచ మోక్షము పూర్వము రేవానదీ తీరమున మా తండ్రిగారు మృతినంది పిశాచ రూపమునందెను. ఆకలి దప్పికల వలన బాధపడుచు తన మాంసమునే తినుచు శుష్కించిన శరీరముతో నీడలేని బూరుగ చెట్టు వద్ద నివసించుచుండెను. పూర్వము చేసిన పాపముల వలన, ఆకలి దప్పికలచేత బాధపడుచున్న వాని కంఠమున సన్నని రంధ్రమేర్పడినది. అది గాయమై మిక్కిలి బాధించుచుండెను. దగ్గరనున్న చెరువులోని చల్లని నీరు కూడ త్రాగగనే కాలకూట విషమువలె బాధించుచుండెను. నేను గంగాయాత్ర చేయవలయునను కోరికతో ప్రయాణము చేయుచు దైవికముగ నా ప్రదేశమునకు వచ్చితిని. నీడలేని బూరుగు చెట్టుపైనుండి ఆకలిదప్పికల బాధను భరింపలెక తన మాంసమునే తినుచు దుఃఖభారమున కంఠబాధ ననుభవింపలేక అరచుచున్న ఆ పిశాచమును జూచి అబ్బురపడితిని. ఇదేమి యద్భుతమా యని అనుకొంటిని. పిశాచరూపమున నున్న అతడు నన్ను జూచి చంపవచ్చెను. కాని నా ధార్మిక ప్రవర్తనా బలము వలన నన్నేమియు చేయజాలకపోయెను. నేనును వానిని జూచి జాలిపడి ఓయీ భయపడకుము. నీకు నావలన నేభయమును రాదు. నీవెవరవు నీకిట్టి బాధ కలుగుటకు కారణమేమి? వెంటనే చెప్పుము. నిన్నీ కష్టముండి విడిపింతునని పలికితిని. నేనతని ...

వైశాఖపురాణం 8వ అధ్యాయము.

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 వైశాఖపురాణం - 08 8వ అధ్యాయము - వైశాఖమాస దానములు అంబరీష మహారాజు నారదమహర్షికి నమస్కరించి యిట్లనెను. మహర్షీ! నేను చూచినది సత్పురుషుల చరిత్రవలె మహాశ్చర్యకరముగ నున్నది. ఇక్ష్వాకు మహారాజగు హేమాంగదుడు ముక్తినందిన ధర్మమును మరింత వివరముగ తెలిసికొన గోరుచున్నాను. దయయుంచి నాకు వివరింపగోరుచున్నాను. శ్రుతకీర్తిని మాటలను విని శ్రుత దేవమహాముని నాయనా నీవడిగినది మంచి విషయము తప్పక చెప్పదగినది. బాగు బాగు వినుమని యిట్లు వివరింపసాగెను. రాజర్షీ శ్రీ మహావిష్ణువునకు ప్రీతికరములగు ధర్మములను వినవలయునను కోరిక యుక్తమైనది. నీ బుద్దికి గల సదాసక్తిని తెలుపుచున్నది. ఎన్నో జన్మల పుణ్యమున్నప్పుడే శ్రీ మహావిష్ణు కథాప్రసంగము నందాసక్తి కలుగును. నీవు యువకుడవు రాజాధిరాజువు. నీకిట్టి విష్ణుకధాసక్తి ధర్మజిజ్ఞాస కలుగుటచే నీవు పరిశుద్దుడవైన ఉత్తమ భాగవతుడవని తలచుచున్నాను. కావున జన్మసంసార బంధములను విడిపించి ముక్తిని కలిగించు శుభకరములగు భాగవత ధర్మములను వివరింతును వినుము. యధోచితములగు శుద్ది, మడి, స్నానము, సంధ్యావందనము, దేవతలకు ఋషులకు పితృదేవతలకు తర్పణములు, అగ్నిహోత్రము, పితృ శ్రాద్దము మానకుండుట, ...

ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹 🙏 నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి । సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ కార్యసిద్ధిదాయినిగా, సంపత్ప్రదాయినిగా మహాలక్ష్మీ దేవిని పూజించడం మన దేశంలో అనాదిగా వస్తున్న సంప్రదాయం. ప్రత్యేకించి శ్రావణ, మార్గశిర మాసాల్లో లక్ష్మీ ఆరాధన అభీష్టాలను నెరవేరుస్తుందన్న విశ్వాసం ఉంది. దేశంలో అత్యంత పురాతనమైన లక్ష్మీ మందిరంగా మహారాష్ట్రలోని కొల్హాపూర్‌ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటి. పంచగంగ నదీ తీరాన శ్రీ మహాలక్ష్మి కొలువైన క్షేత్రం కొల్హాపూర్‌. పూర్వం దీన్ని ‘కరవీరపురం’ అనేవారు. ఇక్కడ అమ్మవారిని ‘కరవీర వాసిని’గా, ‘అంబాబాయి’గా పిలుస్తారు. కాశీ అంతటి ప్రాచీన క్షేత్రంగా... ఆరువేల ఏళ్ళ నాటిదిగా కొల్హాపూర్‌ భక్తులు పరిగణిస్తారు. కాశీని విడిచిపెట్టి మహా శివుడు ఉండడనీ, అదే విధంగా మహాలక్ష్మి స్థిర నివాసం కొల్హాపూర్‌ అనీ ప్రతీతి. ఈ క్షేత్ర ప్రస్తావన దేవీ భాగవతంలో, స్కాంద పురాణంలో ఉంది. అష్టాదశ శక్తి పీఠాల్లో ఏడవదిగానూ కొల్హాపూర్‌కు విశిష్టత ఉంది. సతీదేవి దేహంతో శివుడు తాండవం చేస్తున్నప్పుడు.. ఆమె నేత్రాలు ఈ ప్రదేశంలో పడ్డాయనీ, సర్వేం...

వైశాఖపురాణం 7వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 వైశాఖపురాణం - 07 7వ అధ్యాయము - జలదాన మహత్మ్యము - గృహగోధికా కథ నారదుని మాటలను వినిన అంబరీష మహారాజు నారదునకు నమస్కరించి మహర్షీ! వైశాఖమాస విశిష్టతను వివరించిన మీకు కృతజ్ఞుడను. వైశాఖమాస విశిష్టతను మరింతగా వివరింపగోరుచున్నానని ప్రార్తించెను. అప్పుడు నారదమహర్షి యిట్లనెను. మహారాజా! వినుము మాసవ్రతములన్నిటిలో ఉత్తమమగు వైశాఖమాసమున మార్గాయాసమున దప్పిక పడిన వారికి నీటినీయనివారు పశు పక్ష్యాది జన్మముల నందుదురు. ఈ విషయమున ఒక బ్రాహ్మణునకు పూర్వము జరిగిన సంవాదమును వినుము. ఈ కథ మిక్కిలి ఆశ్చర్యమును కలిగించును. ఈ కథ వైశాఖమాస దాన మహిమకు తార్కాణమైన ఉదాహరణ. పూర్వము యిక్ష్వాకురాజ వంశమున హేమాంగుడను రాజు కలడు. అతడు గోదానముల ననేకములగావించెను. భూమియందు రేణువులను లెక్కించుట, నీటిబొట్టులను గణించుట, ఆకాశామునందలి నక్షత్రములిన్నియని లెక్కించుట యెంత కష్టమో ఆ రాజు చేసిన గోదానములను లెక్కించుట అంత కష్టము. అనేక యజ్ఞములను చేసెను. గోదానము, భూదానము, తిలదానము మున్నగు దానములను గూడ లెక్కింపరాని అంత సంఖ్యలో చేసి చాలామంది బ్రాహ్మణులను సంతోషపరచెను. అతడు చేయని దానమే లేదని ప్రసిద్దినందెను. అందరకు...

ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః🌹🙏

Image
 ⚜️🕉️ 🚩 ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః🌹 🙏 ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే । నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః ॥ ఉపదేశం విభిన్న రూపాలలో ఉంటుంది. ఉత్తమ గురువు తాను ఉపదేశం చేసే వారి అభిలాష, గ్రాహ్య శక్తి, జిజ్ఞాసలను బట్టి అది ఏ రూపంలో ఇవ్వాలో, ఎంత స్థాయిలో ఇవ్వాలో నిర్ణయం చేస్తాడు. అంతేకాదు.. విద్యార్థి సంకల్పశక్తి, దానికి అతడు జత చేయగల ధృతి స్థాయిని కూడ అంచనా వేస్తాడు. అపుడే ఉపదేశ పద్దతి, దాని స్థాయిని, లోతును నిర్ణయం చేస్తాడు. సామాన్యులకు వాగ్రూప ఉపదేశం. కొంత పక్వ మనస్కు లకు నయనోపదేశం. అతి పక్వచిత్తులకు మౌనమే ఉపదేశం అవుతుంది. గురూపదేశంలో పద్ధతులు ఇవి. దీనికి మరొక కోణం ఉంది. గురువు తన ప్రవర్తన ద్వారా, మాట్లాడే తీరు వల్ల ఎంతో గొప్ప జ్ఞానాన్ని, ఎన్నో గొప్ప విషయాలను చెప్పకనే చెపుతాడు. అంటే, పరిశీలనాసక్తి తన శిష్యుల్లో పెంపొందేటట్టు చేస్తాడు. పరిశీలన దృష్టిని అలవరచుకున్న శిష్యులు తమ నిర్ణీత విద్యాభ్యాస కాలానికే నేర్చుకోవటం పరిమితం చేయరు. తమ జీవితాంతం పరిశీలన అన్న అలవాటును వీడరు.  వీరు గురువు ద్వారా నేర్చు కున్న విద్యను, జ్ఞానాన్ని అనూహ్యమైన రీతిలో వృద్ధి చేస్తారు. గు...

వైశాఖపురాణం 06 అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 వైశాఖపురాణం - 06 06 అధ్యాయము - వైశాఖమాస వైశిష్ట్యం నారదుని మాటలను విని అంబరీష మహారాజు నారదునితో నిట్లనెను. వైశాఖ మాసము ఇతర మాసములకంటె తపోధర్మాదులకంటె అధికము ఉత్తమము అని చెప్పిన మాట నాకు సరిగా అర్థము కాలేదు. ఏ కారణము వలన వైశాఖము అన్నిటికంటెనుత్తమమైనదో వివరింపగోరుచున్నానని పలికెను. అప్పుడు నారదుడిట్లు సమాధానము నిచ్చెను. మహారాజా ! శ్రద్దగా వినుము. కల్పాంతకాలమున సృష్టి అంతమగు సమయమున దేవతలకును ప్రభువైన శేషశాయియగు శ్రీమహావిష్ణువు లోకములనన్నిటిని తన ఉదరమున నిలుపుకొని ప్రళయకాల సముద్రమున శయనించియుండెను. జీవరూపమున అనేకత్వమునందిన తన మహిమను తనయందే ఉపసంహరించుకొని యుండెను. నిద్రాంతమున వేదములు శ్రీమహావిష్ణువును మేల్కొల్పినవి. దయానిధియగు శ్రీమన్నారాయణుడు శ్రుతి ప్రబోధమున మేల్కొని తన ఉదరమందున్న సర్వజీవలోకములను రక్షింపనెంచెను. తన ఉదరమున విలీనమైయున్న ప్రాణికోటికి తగిన కర్మ ఫలప్రాప్తికై సృష్టిని ప్రారంభింపవలయునను కోరిక కలుగగనే సర్వలోకాశ్రయమైన సువర్ణపద్మము ఆయన నాభి నుండి వెలువడెను. విరాట్ పురుషునకి చెందినవాడగు బ్రహ్మను పురుషనామముతో సృష్టించెను. వానితోబాటు పదునాలుగు భువన...

💥ఉచ్ఛిష్టగణపతి స్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏 "ఉచ్ఛిష్ట గణపతి స్తోత్రం" గణేశుడి దివ్యక్రీడలు, శక్తి, కరుణ, జ్ఞానం, మోక్షప్రసాదం వంటి అంశాలను స్తుతిస్తుంది. ఆయన శివపుత్రుడిగా, పార్వతీప్రియుడిగా, విఘ్ననాశకుడిగా సర్వలోకాల ఆరాధ్యుడు. తండ్రికి గంగా జలంతో పూజచేసిన కర్తవ్యభక్తుడు. వ్యాసమహర్షి రాసిన పురాణాలకు ప్రేరణగా నిలిచిన విజ్ఞానస్వరూపుడు. ఈ స్తోత్రాన్ని స్మరించినవారికి దారిద్ర్యం తొలగి, శ్రేయస్సు, జ్ఞానం, ఆనందం కలుగుతాయి. గణేశుడు భక్తుల హృదయంలో ఎల్లప్పుడూ విఘ్నరహిత మార్గాన్ని ప్రసాదిస్తాడు. 💥 ఉచ్ఛిష్టగణపతి స్తోత్రం 💥 దేవ్యువాచ | నమామి దేవం సకలార్థదం తం సువర్ణవర్ణం భుజగోపవీతం | గజాననం భాస్కరమేకదంతం లంబోదరం వారిభవాసనం చ ||1|| #తాత్పర్యం:  సర్వకామప్రదాత అయిన స్వర్ణవర్ణుడైన, సర్పాన్ని యజ్ఞోపవీతంలా ధరించిన, ఏకదంతుడైన, లంబోదరుడైన, సూర్యప్రభావంతో ప్రకాశించే గజాననుని నమస్కరిస్తున్నాను. కేయూరిణం హారకిరీటజుష్టం చతుర్భుజం పాశవరాభయాని | సృణిం చ హస్తం గణపం త్రినేత్రం సచామరస్త్రీయుగలేన యుక్తం ||2|| #తాత్పర్యం:  కంకణాలు, కిరీటాలు ధరించి, నాలుగు చేతులతో పాశం, వరం, అభయం, సృణి ధరించిన, త్రినేత్రుడైన గణపతి...

వైశాఖ పురాణం పంచమ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 వైశాఖపురాణం - 05 5వ అధ్యాయము - వైశాఖధర్మ ప్రశంస నారద మహర్షిని అంబరీష మహారాజు "మహర్షీ! వైశాఖమాసమున చేయవలసిన చేయదగని ధర్మములను దయయుంచి వివరింపుమని కోరెను. అప్పుడు నారద మహర్షి యిట్లనెను. అంబరీషమహారాజా! నీకు గల ధర్మాసక్తికి మిక్కిలి సంతోషము కలుగుచున్నది. వినుము, నూనెతో తలనంటుకొని చేయు అభ్యంగస్నానము, పగటినిద్ర, కంచుపాత్రలో భుజించుట, (కంచుపాత్ర కాక మరియొక పాత్రలో భుజింపవలెనని నారదుని యుద్దేశ్యము కాదు. వ్రతమునాచరించువారు పాత్రలో, కంచములో భుజింపరాదు. అరటీఅకు, విస్తరాకు, తామరాకు మున్నగు ఆకులయందు భుజింపవలెనని నారదుని అభిప్రాయము. ధనవంతులు - బంగారు, వెండిపాత్రల లోను, సామాన్యులు కంచుపాత్రలలోను ప్రాతకాలమున వెనుకటి దినములలో భుజించెడివారు.) మంచముపై పరుండుట, గృహస్నానము, నిషిద్దములైన ఆహారములను ఉల్లి మొదలైన వానిని భుజింపకుండుట అను ఎనిమిదిటిని వైశాఖమాసవ్రతము చేయువారు మానవలెను. రెండుమార్లు భుజింపరాదు. పగలు మాని రాత్రి యందు భుజింపరాదు అనగా పగటియందు భుజించి రాత్రి భోజనమును మానవలెను. వైశాఖమాసవ్రతమును పాటించు వాడు తామరాకున భుజించిన పాప విముక్తుడై వైకుంఠమును చేరును. వైశాఖమాసవ్...

వైశాఖ శుద్ధ పంచమి... ఆదిశంకరాచార్యుల జయంతి.

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🙏 💥ఆధ్యాత్మిక జగత్తుకు మార్గదర్శి.. జగద్గురు ఆదిశంకరాచార్యులు. వైశాఖ శుద్ధ పంచమి... ఆదిశంకరాచార్యుల జయంతి . శ్రుతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం | నమామి భగవత్పాదం శంకరం లోక శంకరం || భారత ఆధ్యాత్మిక చరిత్రలో జగద్గురు ఆదిశంకరాచార్యులు మహనీయులు. కేవలం 32 ఏళ్ల జీవితంలోనే ఆయన చూపిన జ్ఞానమార్గం యుగయుగాలపాటు మానవాళికి మార్గదర్శకంగా నిలిచింది. సనాతన ధర్మాన్ని సమగ్రంగా ప్రతిష్ఠించి, వేదాలు, ఉపనిషత్తుల సారాన్ని సులభంగా వివరించారు. విభిన్న ఆరాధనా మార్గాలలో ఏకత్వాన్ని చూపించి, మతసామరస్యాన్ని నెలకొల్పారు. భారతదేశ ఆధ్యాత్మిక చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మహనీయులలో జగద్గురు ఆదిశంకరాచార్యులు ముఖ్యులు. కేవలం 32 సంవత్సరాల చిన్న జీవితం గడిపినప్పటికీ.. ఆయన చూపిన జ్ఞానమార్గం యుగయుగాలపాటు మానవాళికి దివ్యదీపంలా వెలుగొందుతోంది. సనాతన ధర్మాన్ని సమగ్రంగా ప్రతిష్ఠించి, ప్రపంచానికి దాని గొప్పతనాన్ని చాటి చెప్పిన మహాగురువుగా ఆయనకు అపారమైన గౌరవం లభించింది. వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు వంటి ఆధ్యాత్మిక సంపదల సారాన్ని గ్రహించి, వాటి అంతరార్థాన్ని ప్రజలకు సులభంగా అర్థమయ్యేలా వి...

💥వైశాఖపురాణం 04 నాల్గవ అధ్యాయము.

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥వైశాఖపురాణం 04 నాల్గవ అధ్యాయము. వివిధ దానములు - వాని మాహత్మ్యములు. నారదమహర్షి మాటలను వినిన అంబరీష మహారాజు నారదమహర్షికి నమస్కరించి మహర్షీ ! వైశాఖమాసమున చేయదగిన దానము లివియేనా ? మరి యింకనూ ఉన్నవా ? అవి యేవి ? వాని ఫలితములను గూడ దయ యుంచి వివరింపుమని కోరెను*. *అప్పుడు నారదమహర్షి యిట్లనెను. చల్లనిగాలి తగులుచు సుఖనిద్రను కలిగించు పర్యంకమును (మంచమును) సద్బ్రాహ్మణ గృహస్థునకు దానమిచ్చినవారు ధర్మసాధనకు హేతువైన శరీరమున వ్యాధి బాధలు లేకుండా జీవింతురు. ఎట్టి తాపత్రయములు ఆధివ్యాధులు లేకుండా సుఖముగ జీవింతురు. ఇహలోకసుఖముల ననుభవింతురు. పాపములు లేకుండనుందురు. అంతియేకాదు మహాయోగులు సైతము పొందలేని అఖండమోక్ష సామ్రాజ్యమునందుదురు. వైశాఖమాసపు ఎండలకు బాధపడినవారికి, బ్రాహ్మణ శ్రేష్ఠులకు, శ్రమను పోగొట్టునట్టి యుత్తమ పర్యంకమునిచ్చిన, ఇహలోకముననెట్టి బాధను పొందరు. ఆ సత్పురుషుడు, సద్బ్రాహ్మణుడు ఆ శయనముపై శయనించినను, కూర్చున్నను, దాత తెలిసీ తెలియక చేసిన సర్వపాపములును అగ్నిచే కర్పూరము దహింపబడినట్లు నశించును. ఇహలోక సుఖములననుభవించి మోక్షమును పొందును. స్నానమాత్రముననే పుణ్యములనిచ్చు వైశా...

💥సింహాచల చందనోత్సవం💥

Image
 ⚜️🕉️🚩ఓం నమో నారసింహాయ నమః🌹🙏 💥సింహాచల చందనోత్సవం💥 శ్లో|| యఃకరోతి తృతీయాయాం కృష్ణం చందన భూషితం       వైశాఖస్య సితేపక్షే సయాత్యచ్యుత మందిరం || అనగా వైశాఖ శుక్ల తృతీయ నాడు కృష్ణుడికి చందన లేపనమిచ్చిన విష్ణు సాలోక్యం కలుగుతుందని అర్థం. ఇదియే #అక్షయతృతీయ. అదే అచ్యుతుడైన నరసింహునికి చందన సమర్పణ మహోత్సవము.  శ్రీ వరాహ నారసింహ స్వామి ప్రహ్లాద వరదుడు.. ప్రహ్లాదునీ రక్షించి “ప్రహ్లాద భద్ర భద్రంతే ప్రీతోహం" అంటూ తృప్తిగా ప్రహ్లాదుని కోరిక మేరకు లక్ష్మి వరాహ నృసింహ స్వరూపుడుగా నిలచిన భక్తి సులభుడు. వరాహ, నారసింహ అవతారాలను రెండింటినీ మేళవించి సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే అప్పన్నస్వామిగా వెలసిన ప్రాంతం సింహగిరి. నిత్యం చందనార్చితుడై లింగాకృతిలో సాక్షాత్కరించే స్వామి వైశాఖ శుద్ధ తదియ (అక్షయ తృతీయ)నాడు మాత్రమే తన నిజరూప దర్శన భాగ్యాన్ని కల్పిస్తాడు.  వరాహ వదనంతో, మానవ శరీరంతో, సింహ వాలంతో విలక్షణ మూర్తిగా భాసిల్లుతున్న స్వామి వరాహ నరసింహమూర్తిగా దర్శనమిచ్చేది ఆ రోజే. ప్రహ్లాదుడి కోరిక మేరకు... హిరణ్యాక్షుడిని వధించిన వరాహావతారం, హిరణ్యకశిపుడిని సంహరించిన నరసింహావతారం రె...

వైశాఖపురాణం 3వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 వైశాఖపురాణం - 3 3వ అధ్యాయము  వైశాఖమాసమున చేయవలసిన వివిధ దానములు - వాని ఫలితములు నారదమహర్షి అంబరీష మహారాజుతో మరల నిట్లనెను. అంబరీష మహారాజా! వినుము. విష్ణుప్రీతికరమగుటచే మాధవమాసమని వైశాఖమునందురు. వైశాఖ మాసముతో సమానమైన మాసములేదు. కృతయుగమంతటి ఉత్తమ యుగము లేదు. వేదసమానమైన శాస్త్రము లేదు. గంగాజలమునకు సాటియగు తీర్థ జలము లేదు. జలదానముతో సమానమైన దానము లేదు. భార్యా సుఖముతో సమానమైన సుఖము లేదు. వ్యవసాయము చేయుటవలన వచ్చు ధనమునకు సాటియైన ధనము లేదు. జీవించుటవలన వచ్చు లాభమునకు సమానమైన లాభము లేదు. నిరాహారముగ చేసిన తపమును మించిన తపము లేదు. దానము చేయుటవలన వచ్చు సుఖమునకు సాటియైన సుఖము లేదు. దయాసమానమైన ధర్మము లేదు. కంటితో సమమైన కాంతియును లేదు. భోజనతృప్తితో సమమైన తృప్తి వ్యవసాయముతో సమమైన వ్యాపారము, ధర్మసమమైన మిత్రుడు, సత్యసమమైన కీర్తి లేవు. ఆరోగ్యముతో సమానమగు అభివృద్ధి, శ్రీమహావిష్ణుసముడైన రక్షకుడు, వైశాఖసమమైన మాసము లేవని కవులు వర్ణించుచున్నారు. శేషశాయియగు శ్రీమహావిష్ణువునకు వైశాఖమాసము మిక్కిలి ప్రియమైన మాసము. ఇట్టి మాసమును వ్రతమును పాటింపక వ్యర్థముగ గడపిన వాడు ధర్మహ...