Posts

Showing posts from May, 2026

శ్రీ రామ నామం సర్వ జగద్రక్షా కవచం⚜️💥

Image
 ⚜️🕉️🚩 శ్రీరామ జయ రామ జయ జయ రామ 🌹 🙏 హరునకు నవ్విభీషణునక ద్రిజకుం దిరుమంత్ర రాజమై కరికి నహల్యకుం ద్రుపదకన్యకు నార్తిహరించుచుట్టమై పరగినయట్టి నీపతిత పావననామము జిహ్వపై నిరం తరము నటింపజేయుమిక దాశరథీ కరుణాపయోనిధీ 💥శివుడికీ, పార్వతికీ, విభీషణుడికీ, శుభకరమగు మంత్రమై గజేంద్రుడికీ, అహల్యకూ, ద్రౌపదికీ కష్టాలు పోగొట్టిన చుట్టమై అలరారి, పాపాత్ములను పాప విముక్తులను చేసే గొప్ప మహిమాన్విత మంత్రం - రామ నామమని, ఆ రామ నామం తన నాలుకపై నటింప జేయుమని భక్త రామదాసు శ్రీరామచంద్రున్ని కోరుతూ ఆ రామ నామ మహిమ వైభవాన్ని ఎంతో మహనీయంగా కొనియాడాడు. 💥⚜️ శ్రీ రామ నామం సర్వ జగద్రక్షా కవచం⚜️💥 ప్రపంచంలో భక్త జనులందరూ సర్వ కాల సర్వావస్థలలో తమను రక్షించమని కోరుతూ... ఆపదామప హర్తారం దాతారం సర్వ సంపదామ్ లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ - అని శ్రీరామ ధ్యాన శ్లోకాన్ని పలుమార్లు పఠిస్తూ, శ్రీరామానుగ్రహాన్ని సదా పొందుతూ, సకల భీష్టా సిద్ధి పొందుతూ ధన్యులౌతు న్నారు. 'రా' కలుషంబులెల్ల బయలంబడద్రోచిన 'మా'క వాటమై డీకొనిప్రోవుచునిక్క మనిధీయుతులెన్నఁదదీయ వర్ణముల్ గైకొని భక్తి చే నుడువఁగానరు గాక విపత్పరంపరల్ ద...

ఆదిత్యహృదయం

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్య నారాయణ స్వామినే నమః🌹 🙏 💥 ఆదిత్యహృదయం 💥 తతో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయాస్థితమ్ । రావణం చాగ్రతో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితమ్ ॥ 1 ॥ దైవతైశ్చ సమాగమ్య ద్రష్టుమభ్యాగతో రణమ్ । ఉపాగమ్యాబ్రవీద్రామం అగస్త్యో భగవాన్ ఋషిః ॥ 2 ॥ రామ రామ మహాబాహో శృణు గుహ్యం సనాతనమ్ । యేన సర్వానరీన్ వత్స సమరే విజయిష్యసి ॥ 3 ॥ ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రు-వినాశనమ్ । జయావహం జపేన్నిత్యం అక్షయ్యం పరమం శివమ్ ॥ 4 ॥ సర్వమంగళ-మాంగళ్యం సర్వపాప-ప్రణాశనమ్ । చింతాశోక-ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమమ్ ॥ 5 ॥ రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతమ్ । పూజయస్వ వివస్వంతం భాస్కరం భువనేశ్వరమ్ ॥ 6 ॥ సర్వదేవాత్మకో హ్యేష తేజస్వీ రశ్మిభావనః । ఏష దేవాసుర-గణాన్ లోకాన్ పాతి గభస్తిభిః ॥ 7 ॥ ఏష బ్రహ్మా చ విష్ణుశ్చ శివః స్కందః ప్రజాపతిః । మహేంద్రో ధనదః కాలో యమః సోమో హ్యపాం పతిః ॥ 8 ॥ పితరో వసవః సాధ్యా హ్యశ్వినౌ మరుతో మనుః । వాయుర్వహ్నిః ప్రజాప్రాణః ఋతుకర్తా ప్రభాకరః ॥ 9 ॥ ఆదిత్యః సవితా సూర్యః ఖగః పూషా గభస్తిమాన్ । సువర్ణసదృశో భానుః హిరణ్యరేతా దివాకరః ॥ 10 ॥ హరిదశ్వః సహస్రార్చిః సప్తసప్తి-ర్మరీచిమాన్ । తిమిరోన్మథనః శంభుః త్వ...

పాండురంగాష్టకం - తాత్పర్యము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో పాండురంగాయ 🌹🙏 జై జై విఠల పాండురంగ జై హరి విఠల పాండురంగ ఆపద్బాంధవ పాండురంగ అనాధరక్షక పాండురంగ 💥ఆ పండరీ పుర వాసుని స్తుతిస్తూ జగద్గురువులు రచించిన పాండురంగాష్టకము.. తాత్పర్యము మీకోసం. 💥 పాండురంగాష్టకం - తాత్పర్యము మహాయోగపీఠే తటే భీమరథ్యా వరం పుండరీకాయ దాతుం మునీంద్రైః | సమాగత్య తిష్ఠంతమానందకందం పరబ్రహ్మలింగం భజే పాండురంగం || 1 || 🌹తాత్పర్యము: మహాయోగ పీఠం అయిన పండరీపురంలో, భీమ రథీ తీరంలో, మునీన్ద్రులతో కూడి పుండరీకునికి వరములిచ్చిన, అనంతమైన ఆనందమునకు మూలమైన, పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను.  తటిద్వాససం నీలమేఘావభాసం రమామందిరం సుందరం చిత్ప్రకాశం | వరం త్విష్టకాయాం సమన్యస్తపాదం పరబ్రహ్మలింగం భజే పాండురంగం || 2 || 🌹తాత్పర్యము: తన పాదపద్మములను ఇటుకలో స్థిరముగా ఉంచిన వాడు (విఠలుడు), మెరుపు తీగవలె అలంకరించబడిన వాడు, నీల మేఘ శ్యాముడు, లక్ష్మీ దేవికి నివాసమైన వాడు, సుందరమైన వాడు, ప్రకాశించే అంతరంగము కలవాడు,  పరబ్రహ్మమైన పాండురంగని నేను పూజిస్తున్నాను.  ప్రమాణం భవాబ్ధేరిదం మామకానాం నితంబః కరాభ్యాం ధృతో యేన తస్మాత్ | విధాతుర్వసత్యై ధృతో నాభికోశః ప...

గాయత్రీ కవచం

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ గాయత్రీ దేవ్యై నమః 🌹🙏 💥 గాయత్రీ కవచం 💥 నారద ఉవాచ స్వామిన్ సర్వజగన్నాధ సంశయోఽస్తి మమ ప్రభో చతుషష్టి కళాభిజ్ఞ పాతకా ద్యోగవిద్వర ముచ్యతే కేన పుణ్యేన బ్రహ్మరూపః కథం భవేత్ దేహశ్చ దేవతారూపో మంత్ర రూపో విశేషతః కర్మత చ్ఛ్రోతు మిచ్ఛామి న్యాసం చ విధిపూర్వకం ఋషి శ్ఛందోఽధి దైవంచ ధ్యానం చ విధివ త్ప్రభో నారాయణ ఉవాచ అస్య్తేకం పరమం గుహ్యం గాయత్రీ కవచం తథా పఠనా ద్ధారణా న్మర్త్య స్సర్వపాపైః ప్రముచ్యతే సర్వాంకామానవాప్నోతి దేవీ రూపశ్చ జాయతే గాయత్త్రీ కవచస్యాస్య బ్రహ్మవిష్ణుమహేశ్వరాః ఋషయో ఋగ్యజుస్సామాథర్వ చ్ఛందాంసి నారద బ్రహ్మరూపా దేవతోక్తా గాయత్రీ పరమా కళా తద్బీజం భర్గ ఇత్యేషా శక్తి రుక్తా మనీషిభిః కీలకంచ ధియః ప్రోక్తం మోక్షార్ధే వినియోజనం చతుర్భిర్హృదయం ప్రోక్తం త్రిభి ర్వర్ణై శ్శిర స్స్మృతం చతుర్భిస్స్యాచ్ఛిఖా పశ్చాత్త్రిభిస్తు కవచం స్స్ముతం చతుర్భి ర్నేత్ర ముద్ధిష్టం చతుర్భిస్స్యాత్తదస్ర్తకం అథ ధ్యానం ప్రవక్ష్యామి సాధకాభీష్టదాయకం ముక్తా విద్రుమ హేమనీల ధవళ చ్ఛాయైర్ముఖై స్త్రీక్షణైః యుక్తామిందు నిబద్ధ రత్న మకుటాం తత్వార్ధ వర్ణాత్మికామ్ । గాయత్త్రీం వరదాభయాం కుశకశాశ్శుభ్రం కపాలం గ...

అష్టలక్ష్మీ స్వరూపాలు..

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏 💥 అష్టలక్ష్మీ స్వరూపాలు.. భక్తాభీష్ట ప్రదాయిని, ధర్మసంవర్ధిని అయిన జగన్మాత శ్రీమహాలక్ష్మి అష్టలక్ష్మీ రూపాల్లో ఈ జగత్తుని పరిపాలిస్తోంది. విష్ణుమూర్తి ధరించిన మత్స్య, కూర్మ, వరాహ, నరసింహ, వామన, పరుశురామ, రామ, కృష్ణ, బుద్ధ, కల్క్యావతారాలు ఏ రకంగా జగత్కల్యాణానికి ఉద్దేశింపబడ్డాయో, అలాగే విష్ణువు పత్నియైన లక్ష్మీదేవి అవతారాలు కూడా జగత్కల్యాణ కారకాలే. ధర్మ సంరక్షణ, సమాజ సంక్షేమం కోసం దుష్టశిక్షణ చేసి శిష్టరక్షణ చేశాడు నారాయణుడు. సమాజం వ్యక్తుల సమూహం కాబట్టి ఆయా వ్యక్తుల సంరక్షణకోసం, అభివృద్ధి కోసం, ఉన్నతి కోసం లక్ష్మీదేవి అష్టలక్ష్మీ రూపధారణ చేసింది. ఒక మాతృమూర్తి తన కన్న బిడ్డలని సరైనమార్గంలో పెంచటం కోసం రోజూ ఎన్నో రకాల అవతారాలను ఎత్తుతుంది. వాత్సల్యపూరితంగా అనునయిస్తునే తప్పు చేస్తే దండిస్తుంది. మనకి విద్యాబుద్ధులు నేర్పిన ప్రథమగురువు అయిన ఆ తల్లే అవసరమైప్పుడు ధైర్యాన్ని నూరిపోసి వీరత్వాన్ని వృద్ధి చేస్తుంది. ముఖ్యంగా ధర్మచింతన, యుక్తాయుక్త విచక్షణా జ్ఞానం, కరుణ, జాలి, వివేకం ఇవన్నీ ఆ అమ్మ పెట్టిన భిక్షలే. ఒక సాధారణ మాతృమూర్తే తన పిల్లల కో...

ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః 🌹🙏

Image
 🕉️⚜️🚩 ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః 🌹 🙏 " రుద్ర యతే దక్షిణం ముఖం తేన మాం పాహి నిత్యమ్" ఓ రుద్రా! నీ దక్షిణ ముఖంతో నిత్యం మమ్ము రక్షించు🙏 దక్షిణామూర్తి విగ్రహాన్ని పరిశీలిస్తే కుడిచెవికి "మకరకుండలం" ఎడమ చెవికి "తాటంకం' అలంకారాలుగా కనిపిస్తాయి. మకరకుండలం పురుషుల శ్రవణాలంకారం. తాటంకం స్త్రీల అలంకృతి. దక్షిణామూర్తిగా సాక్షాత్కరించినది శివశకుల సమైక్య రూపమేనని తెలియజేస్తాయి ఈ రెండు అలంకారాలు. సనకసనందనాదులకు ముందు రెండుగా కనబడిన శివశక్తులే ఇప్పుడు ఏకాకృతిగా దర్శనమిచ్చాయి. అందుకే దక్షిణామూర్తి అయ్యరూపమే కాక, అమ్మమూర్తి కూడా ఈ విషయాన్నే లలితాసహస్రంలో "దక్షిణామూర్తి రూపిణీ | సనకాదిసమారాధ్యా శివజ్ఞాన ప్రదాయినీ" అని వివరిస్తోంది. ఉత్తరాభిముఖులై ఉంటారు. ఉత్తరం జ్ఞానదశ. ఆ దిశలో కూర్చున్న స్వామిని చూస్తూ ఉన్నవారికి వెనుక భాగాన ( పృష్ట భాగాన ) దక్షిణ దిశ. అంటే యమ (మృత్యు) దిశ. దీని భావం ఎవరు దేవుని వైపు చూస్తారో, వారు యముని ( మృత్యువుని ) చూడరు. యముని చూపు మనపై పడకుండా స్వామి చూపు 'నిఘా', వేస్తుంది. ఆత్మ స్వరూపాన్ని ఎరుగకపోవడమే మృత్యువు.  "ప్...

"శనైశ్చర" కృత "శ్రీ నరసింహ స్తుతి"

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామినే నమః 🌹🙏 💥 "శనైశ్చర" కృత  "శ్రీ నరసింహ స్తుతి" అనేది "శనైశ్చరుడు" చేసిన ప్రార్థన. శ్రీనరసింహ స్వామి మరియు శనైశ్చరుడు మధ్య జరిగిన సంభాషణగా "శ్రీకృష్ణుడు" ద్వారా తెలియజేయబడింది. శ్రీ కృష్ణుడు ధర్మరాజుతో ఇలా చెప్పాడు, "ఈ భక్తి ప్రార్ధన రూపంలో శనిదేవుడు మరియు నృసింహ భగవానుడు మధ్య జరిగే ఈ సంభాషణను ఎవరు వింటారో లేదా పఠిస్తారో వారికి ఖచ్చితంగా అన్ని కోరికలు నెరవేరుతాయి మరియు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటారు. 💥ఏలినాటి శని (7/ 12 సంవత్సరాలు), అష్టమశని, అర్ధాష్టమశని, శనిమహాదశ లేదా శనిఅంతర్ధశ జరుగుతున్నప్పుడు "శనైశ్చర కృత శ్రీనరసింహ స్తుతి" చెయ్యడం చాల శక్తివంతమైన పరిహారక్రియ గా విశ్వసిస్తారు. 💥 ॥ శ్రీనరసింహ స్తుతి (శనైశ్చర కృతం) ॥💥 శ్రీ కృష్ణ ఉవాచ | సులభో భక్తియుక్తానాం దుర్దర్శో దుష్టచేతసామ్ | అనన్యగతికానాం చ ప్రభుర్భక్తైకవత్సలః || ౧ || శనైశ్చరస్తత్ర నృసింహదేవ స్తుతిం చకారామల చిత్తవృతిః | ప్రణమ్య సాష్టాంగమశేషలోక కిరీట నీరాజిత పాదపద్మమ్ || ౨ || శ్రీ శనిరువాచ | యత్పాదపంకజరజః పరమాదరేణ సంసేవితం సకలకల్మషరాశి...

💥శ్రీ ప్రసన్నాంజనేయ స్తోత్ర పంచరత్నాని💥

Image
 ⚜️🕉️🚩శ్రీ ఆంజనేయం 🌹🙏 💥శ్రీ ప్రసన్నాంజనేయ స్తోత్ర పంచరత్నాని💥 శ్రీ ప్రసన్నాంజనేయ స్తోత్ర పంచరత్నాని అనేది భక్తాగ్రేసరుడైన హనుమంతుని అనుగ్రహం కోసం రోజూ పఠించదగిన అత్యంత శక్తివంతమైన స్తోత్రం. దీనిని భక్తి శ్రద్ధలతో నిత్యం పఠించడం వల్ల సమస్త భయాలు తొలగిపోయి, కార్యసిద్ధి కలుగుతుంది. శ్రీ సీతారామ పాదాంబుజ మధులహరీ పానమత్త ద్విరేఫః విజ్ఞా తాగాధ సేవా విది సలిలనిధి స్ఫార గంభీర భావః దుర్వారోద్య ద్దృషీక ప్రణవ తురగ సంశిక్ష ణాత్యంత దక్షః స్వార్థత్యా గైకధీరః సమది మమ మమ భవ త్వాంజనేయః ప్రసన్నః|| శ్రుత్వా రామాభిదానం పులకిత సుతను ర్యో విధత్తే జదత్వం రామా ఖ్యోచ్చారణా ద్యో నయన జలభరా రుధ్ధ కంఠో విభాతి రామం హిత్వా న కించి న్నివసతి హృదయే యస్యభక్తి ప్రపూర్ణే భూయ శ్శ్రేయః ప్రదాతా స హి మమ భవతదంజనేయః ప్రసన్నః || అంభోదే ర్లంఘనే నాసురపతి నగరే భూమి జాన్వేషణేన లంకాయాం చారణేన ప్రతిభట బలవ ద్దైత్య విద్రావణేన సంజీవిన్యాః ప్రదానాత్ స్మృతిరహీత రఘు భ్రాతు రుజ్జీవనేన ప్రఖ్యా తాతి ప్రభావ స్స హి మమ భవతా దాంజనేయః ప్రసన్నః || పౌరందర్యం శివత్వం జలరుహభవతా భూతయ స్సిద్దయోష్ట శ్రీమ ద్రామాంఘ్రి పంకేరుహగత రజసో యస్యనాంశేన తుల...

💥చంద్రశేఖరుడు🌙

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥 చంద్రశేఖరుడు 🌙 శివుని తల్చుకోగానే తల మీద చంద్రవంకతో, మెడలో ఫణిహారంతో కూడిన రూపం మెదుల్తుంది. ఇంతకీ ఈ పరమశివుడు చంద్రశేఖరుడు ఎలా అయ్యాడు? అంటే ఆసక్తికరమైన గాథలు వినిపిస్తాయి. చంద్రుడు, పరమపతివ్రత అనసూయాదేవి సుతుడు. దత్తాత్రేయునికి సోదరుడు. స్వయంగా మహా శక్తిసంపన్నుడు. అందుకే భూమి మీద ఉన్న ఔషధాలకు చంద్రుడు అధిపతిగా మారాడు. ఆఖరికి మనిషి మనస్సుని శాసించేవాడిగా జ్యోతిషంలో స్థానాన్ని పొందాడు.  అలాంటి చంద్రునికి తన కుమార్తెలను ఇచ్చి వివాహం చేయాలని అనుకున్నాడు బ్రహ్మకుమారుడైన దక్షుడు. ఆ దక్షునికి ఒకరు కాదు ఇద్దరు కాదు 27 మంది కుమార్తెలు.  దక్షుని కోరికను మన్నించి ఆయన కుమార్తెలను వివాహం చేసుకున్నాడు చంద్రుడు. అయితే వివాహానికి ముందు దక్షుడు, చంద్రుని దగ్గర ఒక మాట తీసుకున్నాడు. తన 27 మంది కుమార్తెలకీ సమానమైన ప్రేమని అందిచాలన్నదే ఆ మాట. ఆ మాటకు మారు మాటాడకుండా సరేనన్నాడు చంద్రుడు. దక్షుని 27మంది కుమార్తెలతో చంద్రుని వివాహం అంగరంగవైభవంగా జరిగిపోయింది. ఒకో రోజు ఒకో భార్య వద్ద ఉండసాగాడు చంద్రడు. అలా పంచాంగంలో 27 నక్షత్రాలు ఏర్పడ్డాయి. అయితే రోజులు గడిచేకొద్...

💥॥ శ్రీ సూర్య స్తోత్రం ॥💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్య నారాయణ స్వామినే నమః 🌹🙏 సూర్య భగవానుడిని ఆరాధిస్తూ పండితులు ప్రత్యేకంగా ఒక స్తోత్రాన్ని భావితరాలకు అందించారు. ఆ స్తోత్రాన్ని చెప్తూ సూర్యదేవున్ని ఆరాధిస్తే.. పూజిస్తే వారిని అన్నీ శుభాలే జరుగుతాయి. ఉదయాన్నే కొందరికి సూర్య నమస్కారం చేయడం అలవాటు. అలాంటి వారు సూర్యుడిని దర్శించి నమస్కరించే సమయంలో ఈ స్తోత్రాన్ని స్మరిస్తే సూర్యదేవుని ఆశిస్సులు మీకు ఎల్లవేళలా ఉంటాయి. 💥॥ శ్రీ సూర్య స్తోత్రం ॥💥 #ధ్యానం: ధ్యాయేత్సూర్యమనంతకోటికిరణం తేజోమయం భాస్కరం భక్తానామభయప్రదం దినకరం జ్యోతిర్మయం శంకరమ్ | ఆదిత్యం జగదీశమచ్యుతమజం త్రైలోక్యచూడామణిం భక్తాభీష్టవరప్రదం దినమణిం మార్తాండమాద్యం శుభమ్ || ౧ || కాలాత్మా సర్వభూతాత్మా వేదాత్మా విశ్వతోముఖః | జన్మమృత్యుజరావ్యాధిసంసారభయనాశనః || ౨ || బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నే తు మహేశ్వరః | అస్తకాలే స్వయం విష్ణుః త్రయీమూర్తిర్దివాకరః || ౩ || ఏకచక్రరథో యస్య దివ్యః కనకభూషితః | సోఽయం భవతు నః ప్రీతః పద్మహస్తో దివాకరః || ౪ || పద్మహస్తః పరంజ్యోతిః పరేశాయ నమో నమః | అండయోనిర్మహాసాక్షీ ఆదిత్యాయ నమో నమః || ౫ || కమలాసన దేవేశ భానుమూర్తే నమో నమః | ధర్మమూర్తిర...

వైశాఖపురాణం 30వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 వైశాఖపురాణం - 30 30వ అధ్యాయము - పుష్కరిణి - ఫలశ్రుతి నారదమహర్షి రాజర్షియగు అంబరీష మహరాజునకు వైశాఖమహాత్మ్యమును వివరించుచు నిట్లనెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజునకు వైశాఖవ్రత మహిమను వివరించుచు నిట్లనెను. శ్రుతదేవమహారాజా వైశాఖ శుక్లపక్షమున చివర వచ్చు మూడు తిధులును త్రయోదశి, చతుర్దశి, పూర్ణిమ అను నీ మూడు తిధులును 'పుష్కరిణీ యను పేరుతో ప్రసిద్దములు. పుష్కరిణియనునది సర్వపాపములను పోగొట్టి సర్వశుభములను కలిగించును. ఈ మూడు తిధులలోను స్నానాదులను చేయలేనివారు యీ మూడిటిలో నేతిధియందు వైశాఖస్నానాదులను చేసినను వారికి మూడు తిధులయందును స్నానాదికమును చేసిన పుణ్యఫలము సిద్దించును. త్రయోదశినాడు సర్వదేవతలును జలముల నావహించి యుందురు. ఆ తిధియందు సంపూర్ణముగ వసింతురు. పూర్ణిమ యందు శ్రీమహావిష్ణు ఆవహించి యుండును. చతుర్దశియందు సర్వయజ్ఞములును ఆ తిధియందు ఆవహించి యుండును. చతుర్దశియందు సర్వయజ్ఞములును ఆ తిధియందు ఆవహించియుండు పై కారణమున నీ మూడు తిధులును ప్రశస్తములైనవి సుమా. బ్రహ్మహత్య సురపానము మున్నగు పాపములను చేసినవారిని గూడ నీ తిధులు పవిత్రులను చేసి పుణ్య ఫలముల నిచ్చును. దేవాసురు...

వైశాఖ అమావాస్య శని జయంతి.

Image
 🕉️⚜️🚩 ఓం శనైశ్చరాయ నమః🌹 🙏 నీలాంజన సమాభాసం రవిపుత్ర యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం వైశాఖ అమావాస్య నాడు " శని జయంతి " జరుపుతారు. శనైశ్చరునికి సంబంధించిన ఈ తిధిని "శని అమావాస్య" అని కూడా అంటారు. పురాణాల ప్రకారం.. సూర్యుడికి ఛాయాదేవి వల్ల కలిగిన సంతానం శని. సూర్యుడి తాపం భరించలేక ఆయన భార్య అయిన సంజ్ఞాదేవి తనకు ప్రతిగా ఛాయను సృష్టిస్తుంది. ఆమె తండ్రి అయిన త్వష్ట ప్రజాపతి దగ్గరికి వెళ్లిపోతుంది. ఆ సమయంలో ఛాయకు, సూర్యుడికి పుట్టిన కుమారుడే శని. కొంతకాలానికి సంజ్ఞాదేవి పుట్టింటి నుంచి తిరిగివస్తుంది. సవతి కుమారుడు కావటంతో శనిని ఆమె సరిగ్గా చూడదు. ఇందుకు కోపించిన శని ఆమెను కాలితో తన్నుతాడు. దీనికి ప్రతిగా సంజ్ఞ, శనిని ‘మందగమనంతో సంచరిస్తావ’ని శపిస్తుంది. అప్పటినుంచి శనికి మందుడనే పేరు ఏర్పడింది. సూర్యుడి చుట్టూ శని నెమ్మదిగా పరిభ్రమించడానికి కారణం కూడా ఇదే. శనికి శనైశ్చర, అసిత, సప్తార్చి, క్రూరదృక్‌, క్రూరలోచనుడు, పంగుడు, గృధ్రవాహనుడు మొదలైన పేర్లుకూడా ఉన్నాయి. కృతయుగం నాటి సందర్భం ఇది. కైలాసానికి వచ్చిన నారదుడు నవగ్రహాల్లో శని చాలా ప్రభావం కలిగినవాడంటూ...

వైశాఖపురాణం 29వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 వైశాఖపురాణం - 29. 29వ అధ్యాయము - సత్యశీలునీ మోక్షప్రాప్తి నారదుడు అంబరీషునితో వైశాఖమహిమనిట్లు వివరింపసాగెను. శ్రుతదేవుడు శ్రుతకీర్తి మహారాజుతో నిట్లు పలికెను. మహారాజా! అన్ని తిధులలో వైశాఖమాసమున శ్లుక్లపక్షమున వచ్చు ద్వాదశీ తిధి సర్వపాపములను పోగొట్టును. ఇట్టి ద్వాదశినాడు శ్రీహరిని సేవింపనిచో దానములు, తపములు, ఉపవాసములు, వ్రతములు, యాగములు చేయుట, చెరువు మున్నగువానిని త్రవ్వించుట అన్నియును వ్యర్థములే. ఈనాడు ప్రాతఃకాల స్నానము చేసినచో గ్రహణకాలమున గంగాతీరమున వేయిగోవుల నిచ్చిన పుణ్యము వచ్చును. ఈనాడు చేసిన అన్నదానము విశిష్టఫలము కలుగును. ఈనాడు యముని పితృదేవతలను, గురువులను, దేవతలను, విష్ణువును అర్చించి జలకలశమును దధ్యన్నమును యిచ్చిన వచ్చు ఫలము మాటలకందనిది. అనగా చెప్పలేనంత పుణ్యమును కలిగించునని భావము. ఈనాడు సాలగ్రామదానము, శ్రీహరిని పాలతో అభిషేకించుట పంచామృతముతో నభిషేకించుట, పానకము నిచ్చుట, దోసపండ్ల రసమును, చెరకుగడను, మామిడిపండును, ద్రాక్షాఫలములను దానము చేయుట ప్రశస్తము. సర్వోత్తమ ఫలదాయకము. ఇట్టి ద్వాదశీ మహిమను వెల్లడించు కథను వినుము. పూర్వము కాశ్మీరదేశమున దేవవ్రతు...

⚜️🕉️🚩ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః 🌹🙏

Image
 ⚜️🕉️ 🚩ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః 🌹 🙏 విష్ణుపత్నీం, ప్రసన్నాక్షీం, నారాయణ సమాశ్రితామ్ | దారిద్ర్య ధ్వంసినీం, దేవీం, సర్వోపద్రవ వారిణీమ్ ||  నవదుర్గాం, మహాకాళీం, బ్రహ్మ విష్ణు శివాత్మికామ్ | త్రికాలఙ్ఞాన సంపన్నాం, నమామి భువనేశ్వరీమ్ || మహాలక్ష్మిగా మనకు కనిపించే దేవి చతుర్భుజాలతో పూర్ణవికసిత పద్మంపై ఆశీనురాలై ఉంటుంది. ఆమె హస్తంలో ఒక పద్మం మొగ్గ రూపంలో ఉంటుంది. సౌందర్యానికి, వినిర్మలతకు సంకేతం అది. పద్మం బురద నుంచి పుడుతుంది. మనలో ఏ వాతావరణ పరిస్థితులల్లోనైనా వికసించే అపరిమితశక్తికి ఈ పంకం సంకేతం. మహాలక్ష్మి చుట్టూ నీరు ఆవరించి ఉంటుంది. ఈ నీరు జీవానికి సంకేతం. ఈ నీరు నిత్యప్రవాహశీలమై ఉంటుంది. అలా ప్రవహించకపోతే అది నిల్వఉండి పాడైపోతుంది. ధనం కూడా ప్రవహిస్తూ చలామణీ అవుతుండాలి. ఈ ధన ప్రవాహాన్ని ఆపి, ధనాన్ని కూడబెట్టేవారు ధనం, జీవితం అంటే ఏమిటో అర్థం చేసుకోలేరు. ఆమె చతుర్భుజాలు చతుర్విధ పురుషార్థాలకు సంకేతాలు. అవి "ధర్మార్థకామమోక్షాలు" జనన మరణాల చక్రంనుంచి మనిషిని విముక్తం చేసి ఆమె మహా సత్యంవైపు నడుపుతుంది. ఆ పురుషార్థాలు మన జీవనస్తంభాలు. వేదోపనిషత్తులకు పునాదులు. మహాలక్ష్మి...

వైశాఖపురాణం 28వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 వైశాఖపురాణం - 28. 28వ అధ్యాయము - కలిధర్మములు - పితృముక్తి నారదమహర్షి అంబరీష మహారాజునకు వైశాఖమహిమనిట్లు వివరించుచున్నాడు. శ్రుతదేవుని మాటలను విన్న శ్రుతకీర్తి 'మహామునీ! యీ వైశాఖమాసముననుత్తమమలగు తిధులేవి? దానములలో నుత్తమ దానములేవి? వీనిని నెవరు లోకమున వ్యాపింపజేసిరి? దయయుంచి నాకు వివరముగ జెప్పగోరుదునని యడిగెను. అప్పుడు శ్రుతదేవుడు శ్రుతకీర్తిమహారాజా! సూర్యుడు మేషరాశియందుండగా వైశాఖమాసమున వచ్చు ముప్పది తిధులును ఉత్తమములే. కాని యేకాదశినాడు చేసిన పుణ్యకార్యము కోట్లకొలది రెట్టింపుల పుణ్యమునిచ్చును. అన్ని దానములందును పుణ్యప్రదమైన దానమును చేయుటవలని ఫలితము, అన్ని తీర్థములయందును స్నానమాడుటవలన వచ్చు పుణ్యము వీనినన్నిటిని వైశాఖ ఏకాదశినాడు స్నానము చేయుటవలన పొందుచున్నాడు. ఆనాడు చేసిన స్నానము, దానము, తపము, హోమము, దేవతార్చన, సత్ర్కియలు, హరికథాశ్రవణము యివన్నియును సద్యోముక్తి దాయకములు సుమా. రోగము దరిద్రము వీనికి లోబడి స్నానాదికమును చేయలేనివాడు శ్రీహరి కథను వినిన సర్వపుణ్య కార్యములను చేసినంత ఫలమునందును. పవిత్రమగు వైశాఖమందలి దినములను జలాశయములు దగ్గరగానుండి శరీరము బాగున్...

ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ గురు దక్షిణామూర్తయే నమః 🌹🙏 గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం | నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః || 💥శివ స్వరూపాలలో విశేషమైంది ధ్యానమూర్తి "దక్షిణామూర్తి" రూపం. దక్షిణ ముఖంగా ప్రతిష్ఠితమయ్యే శివరూపం ఇది.  దక్షిణ శబ్దానికి ‘కుడివైపు’, ‘సమర్థత’ అనే అర్థాలున్నాయి. సమర్థుని ప్రవర్తనలో అధికమైన వ్యక్తీకరణలు ఉండవు. కేవలం విధి నిర్వహణలు మాత్రమే ఉంటాయి. అందుకే, దక్షిణామూర్తి తత్త్వంలో ఈ ప్రత్యేకతలు కనిపిస్తుంటాయి. ఈ శివమూర్తి ప్రత్యేకతల్లో మౌనమే ప్రధానం. మౌనం పరావాక్కు స్వరూపం. పరావాక్కు మూలశక్తికి సంకేతం. అందుకే, దక్షిణామూర్తి స్వరూపమూ మూలశక్తి విధానాన్ని తెలియజేస్తుంది. ఈ శక్తి దగ్గరగా ఉన్నవారికి ఎలాంటి లోపాలూ వుండవు. అన్ని విషయాల అవగాహన చెప్పకనే తెలుస్తుంది. కనుకే, సమర్థుడైన దక్షిణామూర్తి తత్త్వం అర్థం చేసుకుంటే అధ్యాత్మిక జీవితం సాఫల్యమవుతుంది.  భౌతిక దేహాన్ని అధిగమించి మనోదేహంపై నిగ్రహం సాధించి, ఆత్మసాధనకోసం ప్రయత్నించడానికి దక్షిణామూర్తి ఉపాసన తప్పనిసరి. మేధోవికాసం కలుగాలంటే ఈ స్వామి ఉపాసన అనివార్యం. ఆధ్యాత్మిక విద్యలలో పురోగతిని సాధించడానికి ఈ మూర్త...

వైశాఖపురాణం 27వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 వైశాఖపురాణం - 27. 27వ అధ్యాయము - వాల్మీకి జన్మ నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహిమనిట్లు చెప్ప నారంభించెను. శ్రుతదేవముని శ్రుతకీర్తిమహారాజునకు శంఖ వ్యాధుల సంవాదమును చెప్పుచు నిట్లనెను. తమయెదురుగ నున్న మఱ్ఱిచెట్టు కూలుట దాని తొఱ్ఱనుండి వచ్చిన భయంకరసర్పము దివ్యరూపమును ధరించి తలవంచి నమస్కరించి నిలుచుటను చూచి శంఖవ్యాధులిద్దరును మిక్కిలి యాశ్చర్యపడిరి. శంఖుడును ఆ దివ్యపురుషుని జూచి 'ఓయీ! నీవెవరవు? నీకిట్టి దశయేల వచ్చినది. విముక్తియేల కలిగినది? నీ వృత్తాంతమునంతయు వివరముగ జెప్పుమని యడిగెను. శంఖుడిట్లడుగగనే ఆ దివ్యపురుషుడు సాష్టాంగ నమస్కారమును చేసి యిట్లు చెప్ప నారంభించెను. ఆర్యా! నేను ప్రయాగ క్షేత్రముననుండు బ్రాహ్మణుడను. కుసీదుడను ముని యొక్క పుత్రుడను. మాటకారిని. రూపయౌవనములు విద్యా, సంపదలు కలవని గర్వించువాడను. చాలమంది పుత్రులు అహంకారము కలవాడను నాపేరు రోచనుడు. ఇట్టి నాకు ఆసనము కూర్చొనుట, శయనము పడుకొనుట స్త్రీసుఖము, నిద్ర, జూదము, పనికిమాలిన ప్రసంగములను చేయుట, వడ్డీవ్యాపారము చేయుట నిత్యకృత్యములు. జనులాక్షేపింతురని సంధ్యావందనాదికమును చేసినట్లు నటించెడివాడ...

ఓం గం గణపతయే నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏 అగజానన పద్మార్కం గజానన మహర్నిశం  అనేక దం తం భక్తానాం ఏకదంత ముపాస్మహే  తాత్పర్యం: గజ ముఖుడైన వినాయకుని పగలు రాత్రి చూస్తున్న పార్వతీ దేవి ముఖము... సూర్యుని చూసిన పద్మము వలె వికసించినది. అన్ని వరములను తన భక్తులకు ఒసగే ఆ ఏకదంతుని ప్రార్థించెదను.  💥విఘ్నదేవుని ప్రతి అవయవము, గమనము, రూపము, ఆయన వాహనమైన ఎలుక- అన్నిటిలోను ఒక ఉదాత్త భావము, చక్కని సందేశము ఉన్నాయి. ప్రణవాక్షరమైన "ఓం" వినాయక స్వరూపానికి ఒక సంకేతం. శక్తి అనేదానికి ఆదికారకాలయిన బీజాక్షరాలలో మొదటిది ఓం. సమస్త సృష్టి (విశ్వం) అందులోంచే పుట్టింది. అందులోనే ఇమిడి ఉంటుంది. అదే గణపతి లంబోదరం. కుడివైపు తిరిగి ఉండే కొమ్ము.. బిందు సహిత ఓంకార ధ్వనిని సూచిస్తుంది. అది వక్ర (వంకర తిరిగిన) తుండమునకు సంకేతం.  దాని పైన కనిపించే అరసున్న వినాయకుని ఏక దంతానికి చిహ్నం. ఆపైన ఉండే చుక్క ఆ స్వామి యొక్క నుదుటన ఉండే బొట్టుకు గుర్తు. శూర్పకర్ణుడు: (చేటలంత చెవులు) ఇక్కడ అంత పెద్ద చెవుల గురించి మనకు తెలియాల్సింది ఏమిటంటే... గణేశుడు శ్రవణాభిరుచి చాలా ఎక్కువగా కలవాడు; ఆ వినటంలో కూడా మంచిని గ్రహించి, ఆ మంచిన...

వైశాఖపురాణం 26వ అధ్యాయము

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 వైశాఖపురాణం - 26 26వ అధ్యాయము - భాగవత ధర్మములు నారదుడు అంబరీషమహారాజుతో నిట్లు చెప్పుచున్నాడు. శ్రుతదేవముని శ్రుతకీర్తిమహారాజుతో శంఖవ్యాధ సంవాదమును వివరించుచు నిట్లనెను. స్వామీ! బ్రహ్మజ్ఞానీ! ప్రభువగు శ్రీహరిచే సృష్టింపబడిన కోట్ల కొలదిగా వేలకొలదిగానున్న జీవులు విభిన్నకర్మలు బహుమార్గములు కలవై విభిన్న స్వభావములు కలిగి మిక్కిలి విభిన్నులై యున్నారు. దీనికి కారణమేమి? నాకు దీనిని వివరింపుడని యడిగెను. అప్పుడు శంఖుడిట్లనెను. కిరాతా వినుము. సత్వరజస్తమో గుణత్రయముననుసరించి జీవులు యేర్పడిరి. రాజసులు రాజసకర్మలను, తామసులు తామసకర్మలను, సాత్వికులు సాత్వికకర్మలను చేయుచుందురు. ఈ జీవులు తమ జీవనమున చేసిన కర్మలనుబట్టి సత్వరజస్తమో గుణముల పాళ్లు యెక్కువ తక్కువలగుచుండును. అందువలన వారు యెక్కువ కర్మకు యెక్కువ ఫలమును తక్కువ కర్మకు తక్కువ ఫలమును పుణ్యపాపముల రూపమున సుఖదుఃఖముల నందుచుందురు. ఈ జీవులు తాము చేసిన కర్మలననుసరించి ఒకప్పుడు దుఃఖమును మరొకప్పుడు సుఖమును యింకొకప్పుడు భయమును అగు ఫలములను పొందుచున్నారు. వీరు మాయకులోబడి యీ మూడు గుణములకును బద్దులై తాము చేసిన గుణకర్మలకు తగిన ఫలము...