💥కార్తీకం.. పవిత్ర ఆధ్యాత్మిక మాసం💥
⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥కార్తీకం.. పవిత్ర ఆధ్యాత్మిక మాసం💥 ఎంతో పవిత్రంగా భావించే "కార్తీక మాసం" ప్రారంభమైంది. ఉత్తరాయణంలో మాఘ మాసం, దక్షిణాయనంలో కార్తీక మాసానికి ఎంతో విశిష్టత ఉంది. పౌర్ణమి నాటి చంద్రుడు కృత్తికా నక్షత్రం సమీపంలో ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసంగా పేరు వచ్చింది. శివకేశవ ప్రియం.. కార్తీకం..! ఆధ్మాత్మిక వెల్లివిరిసే నెల. కార్తీక మాసాన్ని విష్ణు మాసం అని కూడా అంటారు. కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు. శ్రీమహావిష్ణువుకు సమానదేవుడు లేడు. వేదంతో సమానమైన శాస్త్రం లేదు. గంగతో సమానమైన తీర్థము లేదు.. అని పురాణ వచనం. పురాణాల ప్రకారం, విష్ణువు ఈ మాసంలో నారాయణ రూపంలో నీటిలో ఉంటాడు. ఇది పుణ్యస్నానాలకు, వివిధ వ్రతములకు అత్యంత శుభప్రదమైనది. ఈ నెలలో ఒంటిపూట భోజనం, సాయంత్రం వేళ తులసి వద్ద దీపాలు వెలిగించటం ఎంతో పుణ్యప్రదమని, అలా దీపాలు వెలిగించలేని వారు.. ఆరిన దీపాలు వెలిగించినా, దీపాలు ఆరిపోకుండా చేతి అడ్డుగా పెట్టినా మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ మాసమంతా సూర్యోదయానికి పూర్వమే నదీస్నానం లేదా ఏదైనా జలాశయంలో స్నానం, బిల్వపత్రాలతో శివుని అర్చన, అభిషేక...