ఆశ్వయుజ శుద్ధ దశమి.. విజయదశమి,

 ⚜️🕉️🚩 ఓం దుర్గాయై నమః🌹🙏


💥#శరన్నవరాత్రి_ఉత్సవాలు💥


శరన్నవరాత్రి మహోత్సవాలు 11వ రోజు: అక్టోబర్ 2: గురువారం, ఆశ్వయుజ శుద్ధ దశమి.. విజయదశమి, విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు "శ్రీ రాజరాజేశ్వరి దేవి"గా దర్శనమిస్తారు.


మంత్రం: ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవ్యై నమ:


నైవేద్యం: పులిహోర, గారెలు ప్రసాదం


చీర: పచ్చ రంగు చీరతో అమ్మవారిని అలంకరిస్తారు.


దసరా ఉత్సవాల చివరి రోజు అందరికీ అనందింప చేసే అపరాజితాదేవిగా, చల్లని తల్లిగా దుర్గమ్మ రాజరాజేశ్వరిదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇస్తుంది. అమ్మను ఈ అలంకారంలో సేవించడం వల్ల సకల శుభాలు, విజయాలు లభిస్తాయని భక్తుల భావిస్తారు.


💥#రాజరాజేశ్వరీదేవి


రాజరాజేశ్వరీదేవి భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుంది.

"అపరాజితాదేవి"గా భక్తులు ఆరాధిస్తారు.


పరమేశ్వరుడి అంకం ఆసనంగా.. ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను భక్తులకు అనుగ్రహిస్తుందీ తల్లి. 


యోగమూర్తిగా.. మాయామోహిత మానవ చైతన్యాన్ని ఉద్దీపనం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి ఈ తల్లి అధిష్టాన దేవత.


ఈ అవతారంలో అమ్మ ఒక చేతిలో చెరకుగడ, ఇంకో చేతిలో అభయముద్రతో భక్తులను అనుగ్రహిస్తూ దర్శనం ఇస్తుంది.

చెరకు రసం అత్మజ్ఞానాన్ని సూచిస్తుంది.


దుష్టులను, దురహంకారులను, శిక్షించుటకు అంకుశం, పాశం ధరించి ఉంటుంది.

ఆమె ప్రశాంతమైన చిరునవ్వు, చల్లని చూపు భక్తులను అనుగ్రహిస్తాయి.


సమున్నతమైన దైవికశక్తికి ఈమె ప్రతీక.

చేపట్టిన ప్రతి పనిలో విజయాన్ని సాధించే నేర్పు కలిగిఉండటం, ఉన్నతమైన భావనల్ని వ్యాప్తి చేయడం రాజరాజేశ్వరి అవతారం నుంచి అందుకోవాల్సిన స్ఫూర్తి. 


లలితా సహస్రనామ పారాయణం చేసి అమ్మవారికి కుంకుమార్చన చేయాలి.


అంబా రౌద్రిణి భద్రకాళీ బగలా జ్వాలాముఖీ వైష్ణవీ

బ్రహ్మాణీ త్రిపురాంతకీ సురసుతా దేదీప్యమానోజ్జ్వలా

చాముండా శ్రితరక్షపోషజననీ దాక్షాయణీ పల్లవీ

చిద్రూపీ పరదేవతా భగవతీ శ్రీ రాజరాజేశ్వరీ!!

-శ్లోకం పఠించాలి.


నైవేద్యంగా సేమ్యా పాయసం, కొబ్బరి పాయసం, కొబ్బరన్నం, పరమాన్నం సమర్పిస్తారు.


💥జై భ‌వానీ.. జైజై జ‌గ‌జ్జ‌న‌నీ...!


ప‌ర‌మ దుర్మార్గుడైన మ‌హిషాసురుడి బారినుంచి దేవ‌త‌ల‌నూ మ‌నుషుల‌నూ ర‌క్షించేందుకు ఘోర యుద్ధం చేసి అత‌డిని వ‌ధించింది దుర్గాదేవి.


ఆ స‌మ‌యంలో మ‌హోగ్రంగా క‌నిపిస్తున్న ఆ త‌ల్లిని చూసిన దేవ‌త‌లంద‌రూ.. "అమ్మా నీవు లోకాల‌ను ర‌క్షించే త‌ల్లివి.. ఇంత‌టి ఉగ్ర రూపం మ‌హిషాసురుని వంటి రాక్ష‌స‌వ‌ధ‌కే గానీ మేమెట్లు భ‌రించ‌గ‌లం, శాంత రూపిణివై లోకాల‌ను కాపాడ‌మ‌ని" వేడుకున్నారు.


అప్పుడా త‌ల్లి క‌రుణార‌స సంపూర్ణ అయిన రాజ రాజేశ్వ‌రీ దేవిగా అవ‌త‌రించింది.


నాటి నుంచి ప్ర‌తి సంవ‌త్స‌ర‌మూ ఆశ్వ‌యుజ శుద్ధ పాడ్య‌మి మొద‌లు న‌వ‌మి వ‌ర‌కూ జ‌రిగే శ‌ర‌న్న‌వ‌రాత్రోత్స‌వాల‌లో న‌న్ను ఆరాధించిన వారికి ఆయురారోగ్య ఐశ్వ‌ర్యాలూ, సుఖ శాంతులూ క‌లుగుతాయ‌ని వ‌ర‌మిచ్చింది.


అయితే అనంత రూపిణి అయిన అమ్మ‌వారిని ఏ రూపంలో అర్చించాలీ అని మార్క‌డేంయ మ‌హ‌ర్షికి ఓ సందేహం వ‌చ్చింది.


నేరుగా బ్ర‌హ్మ‌దేవుడిని క‌లిశాడు.

దాంతో సాక్షాత్తూ సృష్టిక‌ర్తే "న‌వ‌దుర్గా" రూపాల‌ను వ‌ర్ణించాడు.


జ‌గ‌న్మాత స‌క‌ల చ‌రాచ‌ర జ‌గ‌త్తును సృష్టించేందుకు శ్రీదుర్గ‌, మ‌హాల‌క్ష్మీ, స‌ర‌స్వ‌తి, గాయ‌త్రి, శార‌దాదేవి రూపాల‌ను ధ‌రించింది. 


ఈ పంచ రూపాల‌లో అది ప్ర‌కృతిస్వ‌రూపం క‌నుక దుర్గ‌మ్మ మహిషాసురుణ్ని స‌హ‌రించిన త‌రువాత ప‌విత్ర కృష్ణా తీరంలోని ఇంద్ర‌కీలాద్రిపై స్వ‌యంభువుగా అవ‌త‌రించింది.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు