💥కార్తీకం.. పవిత్ర ఆధ్యాత్మిక మాసం💥

 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏


💥కార్తీకం.. పవిత్ర ఆధ్యాత్మిక మాసం💥


ఎంతో పవిత్రంగా భావించే "కార్తీక మాసం" ప్రారంభమైంది.

ఉత్తరాయణంలో మాఘ మాసం, దక్షిణాయనంలో కార్తీక మాసానికి ఎంతో విశిష్టత ఉంది.


పౌర్ణమి నాటి చంద్రుడు కృత్తికా నక్షత్రం సమీపంలో ఉండటం వల్ల ఈ మాసానికి కార్తీక మాసంగా పేరు వచ్చింది.


శివకేశవ ప్రియం.. కార్తీకం..!

ఆధ్మాత్మిక వెల్లివిరిసే నెల.

కార్తీక మాసాన్ని విష్ణు మాసం అని కూడా అంటారు.


కార్తీక మాసానికి సమానమైన మాసం లేదు. 

శ్రీమహావిష్ణువుకు సమానదేవుడు లేడు.

వేదంతో సమానమైన శాస్త్రం లేదు.

గంగతో సమానమైన తీర్థము లేదు.. అని పురాణ వచనం.


పురాణాల ప్రకారం, విష్ణువు ఈ మాసంలో నారాయణ రూపంలో నీటిలో ఉంటాడు. ఇది పుణ్యస్నానాలకు, వివిధ వ్రతములకు అత్యంత శుభప్రదమైనది.


ఈ నెలలో ఒంటిపూట భోజనం, సాయంత్రం వేళ తులసి వద్ద దీపాలు వెలిగించటం ఎంతో పుణ్యప్రదమని, అలా దీపాలు వెలిగించలేని వారు.. ఆరిన దీపాలు వెలిగించినా, దీపాలు ఆరిపోకుండా చేతి అడ్డుగా పెట్టినా మోక్షం సిద్ధిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.


ఈ మాసమంతా సూర్యోదయానికి పూర్వమే నదీస్నానం లేదా ఏదైనా జలాశయంలో స్నానం, బిల్వపత్రాలతో శివుని అర్చన, అభిషేకం, సాయంత్రం దీపారాధన చేస్తారు.


అలాగే ఈ మాసంలో ‘కార్తీక పురాణాన్ని' రోజుకో అధ్యాయం చొప్పున పారాయణం చేయటం విశేష ఫలితాన్నిస్తుంది.


కార్తీక మాసం తొలి రోజు సాయంత్రం నుంచే దేవాలయాల్లో ఆకాశదీపాన్ని వెలిగిస్తారు. ఆ దీపానికి నమస్కరించి, శివాలయంలో దీపారాధన చేసినవారికి మరుజన్మ ఉండదని శాస్త్రవచనం.


శ్రావణమాసంలో శుక్రవారానికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో కార్తీక మాసంలో సోమవారాలకు అంతటి విశిష్టత ఉంది.


#కార్తీకశుద్ధపాడ్యమి:

అంటే కార్తీక మాసం ప్రారంభం రోజు. పాడ్యమి దీపాలు పెట్టుకునే తొలిరోజు తెల్లవారు జామునే లేచి తలారా స్నానం చేసి..దేవాలయానికి వెళ్లి కార్తీక వ్రతం ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగేలా చేయమని ప్రార్థించి సంకల్పం చెప్పుకోవాలి.


కార్తీకమాసంలో రెండవ రోజు విదియ.. తోడబుట్టిన సోదరి ఇంటికి వెళ్ళి ఆమె చేతి భోజనం చేసి, కానుకలు ఇచ్చి వచ్చిన వారికి యమగండం వాటిల్లదని పురాణాలు చెబుతున్నాయి. దీనినే "#భగినీహస్తభోజనం" అంటారు.


#నాగులచవితి:

సుబ్రహ్మణ్యేశ్వరుని పూజ చేయాలి. నాగుల పుట్టకు వెళ్లి పూజ చేసి పాలు పోస్తారు.


#పంచమి:

పంచమిని "జ్ఞానపంచమి" అని అని కూడా అంటారు. పంచమి తిథి రోజున సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం కోసం ఆర్చనలు చేయించుకున్న వారికి జ్ఞానవృద్ధి కలుగుతుందంటారు.


#అష్టమి:

కార్తీకమాసంలో వచ్చే అష్టమిని #గోపాష్టమి అంటారు. ఈరోజు గోపూజ చేస్తే చక్కటి ఫలితాలు కలుగతాయట..


#ద్వాదశి:

కార్తీకంలో వచ్చే ఈ ద్వాదశిని #క్షీరాబ్దిద్వాదశి అంటారు. సాయంకాలం ఉసిరి మొక్క, తులసి మొక్కల వద్ద దామోదరుని ఉంచి పూజ చేసి, దీపాలు వెలిగించడం సర్వపాపాలనూ నశిస్తాయి.


#కార్తీకపూర్ణిమ:

ఈమాసంలో అత్యంత పవిత్రమైన రోజు.. శివాలయం వద్ద జ్వాలాతోరణ దర్శనం చేసుకోవడం వల్ల సర్వ పాపాలూ ప్రక్షాళనమవుతాయి.


కార్తీక మాసంలో అన్ని రోజులు కుదరక పోయినా కనీసం ఈ మాసంలో అత్యంత పుణ్య రోజులైన ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాలలో నిమయ నిష్టలతో పూజ చేస్తే అనంత కోటి పుణ్యఫలితాలు దక్కుతాయి.  


మాసంలో ఒక్క సోమవారం అయినా నియమ నిష్టలతో ఉపవాసం చేసి దేవాలయంలో దీపం వెలిగించి ఆకాశ దీపాన్ని చూస్తే కోటి పుణ్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు.


ఏడాదికి సరిపడా ఒకేసారి మట్టి ప్రమిదలో ఆవునెయ్యితో 365 వత్తులు శివాలయంలో  వెలిగిస్తే సమస్త పాపాలూ పటాపంచలవుతాయి. జీవించి ఉన్నంతకాలం సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. చనిపోయాక స్వర్గ ప్రాప్తి లభిస్తుంది. ఇలా కార్తీక మాసం అంతా ప్రతీరోజు విశేషం. ప్రతీ ఘడియ విశిష్టమైనదే.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు