💥శ్రీదత్త స్తవం💥
⚜️🕉️🚩 ఓం శ్రీ గురు దత్తాయ నమః 🌹🙏
💥శ్రీదత్త స్తవం💥
దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలమ్ ।
ప్రపన్నార్తిహరం వందే స్మర్తృగామి సనోవతు ॥ 1 ॥
🌹తాత్పర్యం:
భక్తుల యందు పుత్రప్రేమను కలిగి అపార ప్రేమతో వరములు ఇచ్చి, పరబ్రహ్మ స్వరూపం అయి, తలచిన వెంటనే ప్రత్యక్షమయ్యే శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు.
దీనబంధుం కృపాసింధుం సర్వకారణకారణమ్ ।
సర్వరక్షాకరం వందే స్మర్తృగామి సనోవతు ॥ 2 ॥
🌹తాత్పర్యం:
దీనుల, ఆర్తుల యందు బంధువు, కరుణాసముద్రుడు, అందరినీ రక్షించే దయ తత్వం కలిగి, తలచిన వెంటనే ప్రత్యక్షమయ్యే శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు.
శరణాగతదీనార్త పరిత్రాణపరాయణమ్ ।
నారాయణం విభుం వందే స్మర్తృగామి సనోవతు ॥ 3 ॥
🌹తాత్పర్యం:
శరణాగతి చెందిన దీనులకు కల్పవృక్షం, సర్వవ్యాప్తుడు అయిన నారాయణుడు, ఆప్త పరాదీనుడు అయి తలచిన వెంటనే ప్రత్యక్షమయ్యే శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు.
సర్వానర్థహరం దేవం సర్వమంగళ మంగళమ్ ।
సర్వక్లేశహరం వందే స్మర్తృగామి సనోవతు ॥ 4 ॥
🌹తాత్పర్యం:
అన్ని జ్ఞాన సంబంధ అనర్దాలు తొలగించి, శుభములు ప్రసాదించి, కష్టాలు తొలగించి, ఐహిక ఫలం కోసం ఉపాసన చేసినా, పారమార్ధిక ఫలం ప్రసాదించి తలచిన వెంటనే ప్రత్యక్షమయ్యే శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు.
బ్రహ్మణ్యం ధర్మతత్త్వజ్ఞం భక్తకీర్తివివర్ధనమ్ ।
భక్తాఽభీష్టప్రదం వందే స్మర్తృగామి సనోవతు ॥ 5 ॥
🌹తాత్పర్యం:
బహ్మజ్ఞానం వృద్ది చేసేవాడు, ధర్మ తత్వం, జ్ఞాన తత్వం, ధర్మ జ్ఞానం, తపస్సు వృద్ది చేసి భక్తుల కోరిన వెంటనే ప్రత్యక్షమయ్యే శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు.
శోషణం పాపపంకస్య దీపనం జ్ఞానతేజసః ।
తాపప్రశమనం వందే స్మర్తృగామి సనోవతు ॥ 6 ॥
🌹తాత్పర్యం:
పాపములను శమింప చేసి జ్ఞాన తపస్సు అనే జ్యోతిని వెలిగించి ఆద్యాత్మిక, ఆది భౌతిక, దైవిక తాపాలు జ్ఞాన దీప్తితో తొలగించి, తలచిన వెంటనే ప్రత్యక్షమయ్యే శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు.
సర్వరోగప్రశమనం సర్వపీడానివారణమ్ ।
విపదుద్ధరణం వందే స్మర్తృగామి సనోవతు ॥ 7 ॥
🌹తాత్పర్యం:
సుఖ ప్రాప్తి, దుఖ పరిహారం అనే సర్వ రోగములను నివారించి, సర్వ ఆద్యాత్మిక, లౌకిక పీడలు నివారించి, జన్మ, సంసార బంధములను తొలగించి, తలచిన వెంటనే ప్రత్యక్షమయ్యే శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు.
జన్మసంసారబంధఘ్నం స్వరూపానందదాయకమ్ ।
నిశ్శ్రేయసపదం వందే స్మర్తృగామి సనోవతు ॥ 8 ॥
🌹తాత్పర్యం:
సంసార బంధం నుంచి రక్షించి, జన్మ పరంపరలను హరించి, మానవ జీవిత అంతిమలక్ష్యమును అనుగ్రహించి, తలచిన వెంటనే ప్రత్యక్షమయ్యే శ్రీ దత్తాత్రేయ స్వామి నన్ను రక్షించు.
జయ లాభ యశః కామ దాతుర్దత్తస్య యః స్తవమ్ ।
భోగమోక్షప్రదస్యేమం ప్రపఠేత్ సుకృతీ భవేత్ ॥ 9 ॥
🌹తాత్పర్యం:
శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి విరచిత దత్తాత్రేయ స్తవం పారాయణం చేసినవారికి జయం, లాభము, సంపద, కోరికలు, భోగములు, మోక్షము దత్తాత్రేయ కృపతో శీఘ్రంగా లభిస్తాయి.
ఇతి శ్రీ దత్తస్తవమ్ ।
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment