Posts

Showing posts from September, 2025

💥💥శ్రీ నృసింహ ద్వాదశనామ స్తోత్రం💥💥

Image
 ⚜️🕉️🚩 ఓం నారసింహాయ నమః🌹🙏 నృసింహ స్వామి వారి "ద్వాదశ నామ స్తోత్రం" మహా మహిమాన్వితం, శక్తివంతం. ఈ స్తోత్రాన్ని భక్తిగా పఠిస్తే స్వామి వారు మనకు రక్షా కవచంలా ఉండి కాపాడతారు. బుధవారం పూట ద్వాదశ నామ స్తోత్రాన్ని పఠిస్తే.. అతి భయంకర వ్యాధులు రుగ్మతులు నశిస్తాయి, భయం తొలగుతుంది. 💥💥శ్రీ నృసింహ ద్వాదశనామ స్తోత్రం💥💥 అస్య శ్రీనృసింహ ద్వాదశనామస్తోత్ర మహామంత్రస్య వేదవ్యాసో భగవాన్ ఋషిః అనుష్టుప్ఛందః లక్ష్మీనృసింహో దేవతా శ్రీనృసింహ ప్రీత్యర్థే వినియోగః | #ధ్యానం స్వభక్త పక్షపాతేన తద్విపక్ష విదారణమ్ | నృసింహమద్భుతం వందే పరమానంద విగ్రహమ్ || #స్తోత్రం  ప్రథమం తు మహాజ్వాలో ద్వితీయం తూగ్రకేసరీ | తృతీయం వజ్రదంష్ట్రశ్చ చతుర్థం తు విశారదః || 1 || పంచమం నారసింహశ్చ షష్ఠః కశ్యపమర్దనః | సప్తమో యాతుహన్తా చ అష్టమో దేవవల్లభః || 2 || నవ ప్రహ్లాదవరదో దశమోఽనంతహస్తకః | ఏకాదశో మహారుద్రో ద్వాదశో దారుణస్తథా || 3 || ద్వాదశైతాని నామాని నృసింహస్య మహాత్మనః | మన్త్రరాజేతి విఖ్యాతం సర్వపాపవినాశనమ్ || 4 || క్షయాపస్మారకుష్ఠాది తాపజ్వరనివారణమ్ | రాజద్వారే మహాఘోరే సంగ్రామే చ జలాంతరే || 5 || గిరిగహ్వార ఆరణ్యే వ్యా...

కార్యసిద్ధిని పొందేందుకు.. కష్టాలను తొలగించే.. శ్రీకృష్ణుడు రచించిన గొప్ప స్తోత్రం "శ్రీ గణపతి మంగళ మాలికా స్తోత్రం"

Image
 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏 💥కార్యసిద్ధిని పొందేందుకు.. కష్టాలను తొలగించే.. శ్రీకృష్ణుడు రచించిన గొప్ప స్తోత్రం "శ్రీ గణపతి మంగళ మాలికా స్తోత్రం" ప్రారంభించిన పని కావడం లేదని బాధ పడేవారు, ఏ పని ప్రారంభించినా ఆటంకాలు ఎదురవుతున్నవారు, ఋణ బాధలనుండి బయట పడలేని వారు, భవసాగరంలో ఈతరాక కొట్టుకునే వారూ  ఈ స్తోత్రాన్ని ప్రతి బుధవారం (వీలయితే ప్రతి రోజూ), సంకష్ట చతుర్థి రోజూ తప్పక చదువుకోవడం మంచిది. 💥శ్రీ గణపతి మంగళ మాలికా స్తోత్రం💥   శ్రీ కంఠ ప్రేమ పుత్రాయ గౌరీ వామాంగ వాసినే ద్వాత్రింశద్రూప యుక్తాయ శ్రీ గణేశాయ మంగళం! ఆది పూజ్యాయ దేవాయ దంత మోదక ధారిణే వల్లభా ప్రాణ కాంతాయ శ్రీ గణేశాయ మంగళం! లంబోదరాయ శాంతాయ చంద్ర గర్వాప హారిణే గజాననాయ ప్రభవే శ్రీ గణేశాయ మంగళం! పంచ హస్తాయ వంద్యాయ పాశాంకుశ ధరాయ చ శ్రీమతే గజ కర్ణాయ శ్రీ గణేశాయ మంగళం! ద్వైమాతురాయ బాలాయ హేరాంబాయ మహాత్మనే వికటాయాఖు వాహాయ శ్రీ గణేశాయ మంగళం! పృష్ణి శృంగాయాజితాయ క్షిప్రాభీష్టార్థ దాయినే సిద్ధి బుద్ధి ప్రమోదాయ శ్రీ గణేశాయ మంగళం! విలంబి యజ్ఞ సూత్రాయ సర్వ విఘ్న నివారిణే దూర్వాదల సుపూజ్యాయ శ్రీ గణేశాయ మంగళం! మహాకాయాయ భీమాయ మ...

💥శ్రీ కార్తికేయునికి గల 28 నామములు:

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః 🌹🙏 💥శ్రీ కార్తికేయునికి గల 28 నామములు: 1) యోగీశ్వరః – యోగీశ్వరులకు అధిపతి 2) మహాసేనః – దేవసైన్యానికి అధిపతి, దేవసేనాపతి 3) కార్తికేయః – ఆరు కృత్తికా నక్షత్రములచే పోషింపబడిన వాడు 4) అగ్నినన్దనః – పరమశివుని జ్ఞానాగ్ని నుంచి ఉద్భవించినవాడు మరియు పరమశివుని తేజస్సు కొంత సేపు భరించినందువల్ల, అగ్ని దేవునికి కూడా తనయుడిగా పిలువబడినవాడు. 5) స్కందః – పరమశివుని తేజస్సు నుండి జన్మించినవాడు 6) కుమారః – కుమార అన్న నామం కేవలం సుబ్రహ్మణ్యునికే చెందినది. ఎందుకంటే, జగత్తుకి మాతా పితలు అయిన పార్వతీ పరమేశ్వరుల అన్యోన్యతకి ఫలం మన బుజ్జి సుబ్రహ్మణ్యుడు. 7) సేనానీః – దేవసేనలకు అధిపతి, దేవసేనాధ్యుక్షుడు. 8) స్వామీ శంకరసంభవః – శంకరుని దివ్యమైన తేజస్సు నుండి పుట్టినవాడు. 9) గాంగేయః – పరమశివుని తేజస్సు అగ్నిదేవుడు భరించలేక, గంగా మాతకి ఇచ్చేస్తే, గంగా మాత కొంత సేపు శివుని తేజస్సును భరిస్తుంది. అందువల్ల, గంగా మాతకి కూడా పుత్రునిగా పిలబడ్డవాడు కాబట్టి గాంగేయ అనే నామం వచ్చింది. 10) తామ్రచూడః – కుక్కుటమును అధిరోహించిన వాడు. 11) బ్రహ్మచారీ – ఎల్...

⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏

Image
 ⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏 శ్రీమద్భాగవతంలో తెలిపిన నవవిధ భక్తి మార్గాల్లో దాస్యభక్తికి ప్రతీకగా హనుమంతుడిని చెప్పుకొంటారు.  అయితే, ‘వానరుడిగా జన్మించిన హనుమ ఇంతటి పరిపూర్ణతను ఎలా సాధించగలిగాడు?’ అన్న ప్రశ్నకు ప్రభుపాదుల వారు సహేతుకమైన వివరణ ఇచ్చారు.  ‘హనుమంతుడు చేసిందల్లా ఒక దాసునిగా తనకు అప్పజెప్పిన పనిని నిర్వర్తించడమే. అది ఎంతటి దుస్సాధ్యమైన కార్యమే గాని, రామచంద్రుడు చెప్పాడంటే అంతే! మరో ఆలోచన లేకుండా ఆచరించడమే హనుమ వంతు. తన అపారమైన దేహబలాన్ని ప్రభుసేవలో వినియోగించడమే. లక్ష్మణుడు మూర్ఛిల్లినప్పుడు అవసరమైన ఔషధాన్ని మాత్రమే తెమ్మని అక్కడివారు చెప్పారు. కానీ, ఆ ఔషధం ఎలా ఉంటుందో తెలియదు. రివ్వున ఎగిరిపోయాడు. సంజీవని గిరిపై ఔషధాన్ని గుర్తించలేకపోయాడు. స్వామికార్యం నిర్వర్తించే క్రమంలో ఏకంగా ఆ పర్వతాన్నే పెళ్లగించి తీసుకుపోయాడు. లక్ష్మణుడి ప్రాణాలు నిలిపాడు. అంతేకాదు, యుద్ధ సమయంలో లంకా నగరాన్నంతా చెట్లు, గుట్టలు, మురికి కుప్పలతో ముంచేసి, శత్రుసేనలు కదిలేందుకు వీల్లేకుండా చేశాడు. ఇలా వానరుడిగా జన్మించినా, రామచంద్ర ప్రభువును సేవించాలన్న దృఢ సంకల్పం వాయునందనుడిని భక్తాగ్రేసరుడి...

💥శివమహాపురాణం - శాక్తేయ_నాయనారు.

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 విశ్వేశ్వరాయ దేవాయ శివ శ్శంభో భవాయ చ / కపర్దినే కరాళాయ మహాదేవాయ తే నమః // 💥శివమహాపురాణం - శాక్తేయ_నాయనారు. "పెరియపురాణం" అని ఒక గ్రంథం ఉంది. అది మనకి "నాయనార్ల చరిత్ర"ను తెలియజేస్తుంది. అందులో ‘శాక్తేయ నాయనారు’ అని ఒక నాయనారు ఉన్నారు. ఆయన గొప్ప శివభక్తితత్పరుడు. కాని ఆయన ఉన్న రోజులలో శివుడి గురించి మాట్లాడడం కాని, ‘శివ’ అన్న నామం పలకడం కాని, శివార్చన చెయ్యడం కాని కుదరని భయంకర పరిస్థితులు ప్రబలి వున్నాయి. కానీ ఆయనకు లోపల శివారాధన చెయ్యాలన్న పరమ భక్తి భావన ఉండేది. ఆయన కాంచీపురంలో ఉండేవారు. ఆ రోజుల్లో శివలింగము నొకదానిని తీసుకువచ్చి రోడ్డు మీద పెట్టారు. ఒక్కసారి ఆ శివలింగం దగ్గరకు వెళ్లి శివ నామములు జపిస్తూ ఆ శివలింగం మీద పూవులు వెయ్యాలని ఆయన కోరిక. ఆ రోజుల్లో పరిస్థితులు శివలింగం మీద ఎవరయినా పువ్వులు వేసినా, నమస్కరించినా వారిని చాలా అవమానములకు గురి చేసేవారు. అపుడు ఆయన ఒక మార్గమును ఎంచుకున్నారు. శివార్చన చెయ్యని వాడిలా కనపడాలి పైకి. లోపల శివార్చన చెయ్యాలన్న ఆయన కోర్కె తీరాలి.  అందుకని ఆయన అటుగా వెళుతూ కళ్ళమ్మట నీళ్ళు పెట్టుకొని "శివా, న...

⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 నవీనమేఘమండలీ నిరుద్ధదుర్ధరస్ఫురత్- కుహూనిశీథినీతమః ప్రబంధబంధుకంధరః | నిలింపనిర్ఝరీధరస్తనోతు కృత్తిసింధురః కళానిధానబంధురః శ్రియం జగద్ధురంధరః ||  తాత్పర్యము: సర్వ జగత్తు యొక్క భారాన్ని తనపై ఉంచుకున్నవాడు, చంద్రుని ధరించి శోభించేవాడు, సురగంగను తనయందు కలవాడు, కారు మబ్బులు చెలరేగి చుట్టుముట్టిన – అమావాస్య నాటి అర్ధరాత్రియందలి చిమ్మ చీకట్లను ముద్దగా చేసి ఇక్కడ బంధించినారా అన్నట్టున్న నల్లని కంఠం కలవాడు అయిన మహాదేవుడు మాకు సకల సిరులను కరుణించుగాక! ⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

💥"భూతభృత్" అంటే చాలు.....

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥"భూతభృత్" అంటే చాలు..... శ్రీరామానుజచార్యుల వారి కాలంలో జరిగిన సంఘటన: శ్రీరంగం శ్రీరంగనాథస్వామి దేవాలయంలో ప్రసాదం కొరకు భక్తులు బారులు తీరి వేచి చూసేవారు. ఒక పేద వైష్ణవుడు రోజు వరుసలో అందరికంటే ముందు నిలబడే వాడు. అయన తన కోసమే కాక, తన ఆరుగురు కొడుకుల కొరకు కూడా ప్రసాదం ఇవ్వమని పట్టు పట్టేవాడు. ఇలా రోజు ఆలయ అధికారులకి, అతనికి వాదులాట జరిగేది. ప్రసాదం అంతా నీకే ఇచ్చేస్తే ఇతరులకు కొంచెమే ప్రసాదం లభిస్తుంది అని ఆలయ అధికారులు మందలించేవారు. నా ఆరుగురు కొడుకులు బ్రక్క చిక్కిపోయారు, కనుక ఆలయ ప్రసాదం ఇవ్వకపోతే వారు నాకు దక్కరు అని ఆ పేద వైష్ణవుడు వాదించేవాడు. ఇంతలో ఒకరోజు రామానుజుల వారు అక్కడ గలాటా చూసి ఏమి జరిగిందని వాకబు చేస్తారు. ఆలయ అధికారులు ఆ పేద వైష్ణవుణ్ణి చూపి, రోజూ అధిక ప్రసాదం కొరకు ఆయన గలాటా చేస్తున్నాడని తెలియచేస్తారు. రామానుజులు ఆ వైష్ణవుణ్ణి చూసి, నాయనా నీవు ఆలయములో కొన్ని కైంకర్యములు చేసి ఎక్కువ ప్రసాదాన్ని పొందవచ్చు కదా అని ప్రశ్నిస్తారు. స్వామి, నా బక్క చిక్కిన కొడుకులని మీరే చూడండి, రోజంతా వారికీ సేవలు చేయడములోనే నాకు సమయం సరిపోతుంది. ...

💥గురువాయూరప్పన్ మహిమలు:

Image
 ⚜️🕉️🚩 ఓం నమో భగవతే వాసుదేవాయ నమః 🌹🙏 💥గురువాయూరప్పన్ మహిమలు: భక్తురాలు.. మంజుల కథ  మంజుల గురువాయూరప్పన్‌కు గొప్ప భక్తురాలు. ప్రతి రోజూ ఆమె పువ్వులు సేకరించి అందమైన దండను తయారు చేసి గుడికి వెళ్లేది. పూజారి గురువాయూరప్పన్‌కు ఆ పూలమాలను అలంకరిస్తారు. భగవంతుని దర్శనం చేసుకుని, ఆయన మహిమలు పాడిన తర్వాత ఆమె ఇంటికి తిరిగి వచ్చేది. ఇది గురువాయూరప్పన్‌కు  ఆమె నిత్య మాలా కైంకర్యం . అయితే ఒకరోజు ఆలస్యమై ఆమె పూలదండతో గుడికి చేరుకునే సరికి ఆరోజు గుడి మూతపడింది. ఆ మాల స్వామికి సమర్పించ లేక పోయినందుకు చాలా బాధ పడింది. మెల్లగా గుడి దగ్గరున్న మర్రిచెట్టు దగ్గరకు వెళ్ళి కూర్చుంది. కళ్లలో నీళ్లతో శ్రీకృష్ణుని మహిమలు పాడటం మొదలుపెట్టింది. భగవంతుని దర్శనం కోసం వచ్చిన శ్రీగురువాయూరప్పన్ యొక్క మరొక గొప్ప భక్తుడు పూంథానం ఇంటికి తిరిగి వెళ్తున్నాడు. భగవంతుని పాట విని మంజుల ఏడుపు చూసి అక్కడికి వచ్చాడు. విషయమేమిటని ఆమెను అడిగాడు.  భగవంతునికి రోజూ చేసే మాల-సేవ గురించి ఆమె అతనికి చెప్పింది. ఆ రోజు ఆలస్యమవడం వల్ల గుడి మూసేయడంతో స్వామికి మాల సమర్పించలేక పోయింది. మంజుల యొక్క హృదయ పూర్వక భక్తిని...

💥అగస్త్య కృత శ్రీ లక్ష్మీ స్తోత్రం..

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏 💥అగస్త్య కృత శ్రీ లక్ష్మీ స్తోత్రం.. జయ పద్మపలాశాక్షి జయ త్వం శ్రీపతిప్రియే । జయ మాతర్మహాలక్ష్మి సంసారార్ణవతారిణి ॥ 1 ॥ మహాలక్ష్మి నమస్తుభ్యం నమస్తుభ్యం సురేశ్వరి । హరిప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే ॥ 2 ॥ పద్మాలయే నమస్తుభ్యం నమస్తుభ్యం చ సర్వదే । సర్వభూతహితార్థాయ వసువృష్టిం సదా కురు ॥ 3 ॥ జగన్మాతర్నమస్తుభ్యం నమస్తుభ్యం దయానిధే । దయావతి నమస్తుభ్యం విశ్వేశ్వరి నమోఽస్తు తే ॥ 4 ॥ నమః క్షీరార్ణవసుతే నమస్త్రైలోక్యధారిణి । వసువృష్టే నమస్తుభ్యం రక్ష మాం శరణాగతమ్ ॥ 5 ॥ రక్ష త్వం దేవదేవేశి దేవదేవస్య వల్లభే । దారిద్ర్యాత్త్రాహి మాం లక్ష్మి కృపాం కురు మమోపరి ॥ 6 ॥ నమస్త్రైలోక్యజనని నమస్త్రైలోక్యపావని । బ్రహ్మాదయో నమంతి త్వాం జగదానందదాయిని ॥ 7 ॥ విష్ణుప్రియే నమస్తుభ్యం నమస్తుభ్యం జగద్ధితే । ఆర్తిహంత్రి నమస్తుభ్యం సమృద్ధిం కురు మే సదా ॥ 8 ॥ అబ్జవాసే నమస్తుభ్యం చపలాయై నమో నమః । చంచలాయై నమస్తుభ్యం లలితాయై నమో నమః ॥ 9 ॥ నమః ప్రద్యుమ్నజనని మాతస్తుభ్యం నమో నమః । పరిపాలయ మాం మాతః మాం తుభ్యం శరణాగతమ్ ॥ 10 ॥ శరణ్యే త్వాం ప్రపన్నోఽస్మి కమలే కమలాలయే । త్ర...

💥దత్తప్రభువు దినచర్య:

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీదత్తాయ నమః🌹🙏 💥దత్తప్రభువు దినచర్య: దిగంబరుడూ, శరీమంతా భస్మం పులుముకొన్నవాడు, ఆత్మ ఙ్ఞానం కలిగించ గలవాడు, సర్వమతాల్లోనూ తన ప్రస్తావన ఏదో ఒక రూపంలో కలవాడు, ఏ అవతారం లోనూ లేని గురుదేవ అన్న విశేషణం కలవాడూ, సదా బ్రహ్మనిష్ట కలవాడూ, ప్రసన్నుడు, నిర్మానసుడు ఐన దత్త ప్రభువుల వారు - ప్రతిరోజూ కాశీలో గంగాస్నానము, మాహురపురములో ధ్యానము, కొల్హాపురిలో (కరవీరపురం) భిక్ష, నిర్మలమైన, స్వచ్ఛమైన తుంగభద్రా నీటితో దాహం తీర్చుకుని, సహ్యాద్రి పర్వతములో నిద్ర చేస్తారు. సహ్యాద్రి కల్పవృక్షము కింద మణిపీఠం ఉంది, దానిపై దత్త ప్రభువు ఆసీనుడై ఉంటాడు. మెడలో మణిహారం, మొలలో బంగారు మొలత్రాడు, వామాంకమున యోగలక్ష్మి మధుమతీదేవి, వెనుక కామధేనువు, నలుదిక్కులా నాలుగు వేదాలూ నాలుగు కుక్కలుగా ఆయన పరివేష్టితుడై ఉండగా - ఆయన ముందు సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులూ, నవనాధుల ఆదిగా గల మహ్మాతులు ఆయన్ను స్తుతిస్తూ వుంటారు. కేవలం భిక్షాన్నం మాత్రమే గ్రహించే ఈ ప్రభువుకి అష్టసిద్ధులు, నవనిధులు దాస్యం చేస్తూ ఉంటాయి.  ఎడమ చేతిలో త్రిశూలం, శంఖం, కమండలం ధరించి కుడి చేతిలో ఢమరుకం, చక్రం, జపమాల ధరించి ఉండగా గంధర్వుల ...

💥ముక్తినిచ్చే యోగ నరసింహుడు..

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ లక్ష్మీ నృసింహస్వామినే నమః 🌹🙏 💥ముక్తినిచ్చే యోగ నరసింహుడు.. దుష్ట శిక్షణ చేసిన శ్రీ నారసింహుడు ఉగ్రరూపాన్ని ఉపసంహరించి, యోగ ముద్రలో దర్శనమిచ్చిన చోటుగా ప్రసిద్ధి చెందిన క్షేత్రం షోలింగర్‌. మానసిక సమస్యల నుంచి విముక్తి కలిగించే దైవంగా ఇక్కడి యోగ నరసింహుడు పూజలు అందుకుంటున్నాడు.  పురాణ గాథల ప్రకారం హిరణ్యకశిపుణ్ణి నరసింహావతారంలో మహా విష్ణువు వధించిన సందర్భంలో... ఆ భీకరాకృతిని చూసి ప్రహ్లాదుడు భయపడ్డాడు. ప్రహ్లాదుడి ప్రార్థన మేరకు ఉగ్రరూపాన్ని ఉపసంహరించుకొని, యోగముద్రలో దర్శనమిచ్చిన నృసింహ స్వామి ఇక్కడ కొలువయ్యాడు. సప్త ఋషులు తనను సేవించుకోగా ముక్తిని అనుగ్రహించాడు. ఈ యోగ నరసింహుణ్ణి సేవించి విశ్వామిత్రుడు బ్రహ్మర్షిత్వాన్ని పొందాడనీ, ఈ ఆలయంలో 24 నిమిషాలు ఉన్నట్టయితే జనన మరణ చక్రం నుంచి విముక్తులవుతారనీ స్థలపురాణం చెబుతోంది. అందుకే ఈ ప్రదేశాన్ని ‘#తిరుక్కడిగై’ అని కూడా పిలుస్తారు. అంటే "ఇరవై నాలుగు నిమిషాలు దర్శనమిచ్చే" నరసింహుడని అర్థం. ఈ ఆలయానికి కార్తీక మాసంలోని శుక్ర, ఆదివారాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. చక్ర తీర్థంలో స్నానం చేసి, స్వామిని దర్శించుక...

💥జ్యేష్ట శుద్ధ పౌర్ణమి.. ఏరువాకపౌర్ణమి.

Image
 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏 💥జ్యేష్ట శుద్ధ పౌర్ణమి.. ఏరువాకపౌర్ణమి. హిందూ సంప్రదాయంలో ప్రతి తెలుగు మాసమునకు కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంది. ప్రతి నెలలో సైతం పండగలు ఉన్నాయి. అయితే.. ప్రస్తుతం జ్యేష్టమాసం నడుస్తుంది. మనం ఈసారి ఏరువాక పౌర్ణమిని జూన్ మాసం11 వ తేదీన జరుపుకోబోతున్నాం. దీన్ని "జ్యేష్టపౌర్ణమి" అని కూడా పిలుస్తారు.  ఏరువాక పౌర్ణమి వేడుక అనాదిగా వస్తోంది. వేదకాలం నుంచి ఈ వేడుక ఉన్నట్టు పురాణాలు చెబుతున్నాయి. అధర్వణ వేదంతో పాటు, విష్ణుపురాణంలో దీని ప్రస్తావన ఉంది. విష్ణుపురాణంలో ఏరువాక పౌర్ణమిని "#సీతాయజ్ఞం"గా పేర్కొన్నారు.   సీత అంటే నాగలి అనే అర్థం ఉందని, నాగలి యజ్ఞం అంటే వ్యవసాయ యజ్ఞం ఆరంభించే రోజు అని పండితులు సూచిస్తున్నారు.    రోళ్లు పగిలే రోహిణి కార్తె వెళ్లి, తొలకరి చినుకులను తెచ్చే మృగశిర కార్తె రాకను స్వాగతిస్తూ జరుపుకునేదే ఏరువాక పౌర్ణమి. వర్ష ఋతువు ప్రారంభంలో వచ్చే ఏరువాక పౌర్ణమి రోజు రైతులు ఎద్దులను, నాగలిని పూజించి దుక్కి దున్నడం ప్రారంభించేవారని ఈ పండుగ గురించి ఋగ్వేదంలో వివరించారు. ఏరువాక పౌర్ణమి సహజంగా కర్షకుల పండుగ. భూదేవిని నమ్ముకొన...

💥సుబ్రహ్మణ్య భుజంగ_స్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩ఓం వల్లీదేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః🌹🙏 💥సుబ్రహ్మణ్య భుజంగ_స్తోత్రం💥 సదా బాలరూపాఽపి విఘ్నాద్రిహంత్రీ మహాదంతివక్త్రాఽపి పంచాస్యమాన్యా । విధీంద్రాదిమృగ్యా గణేశాభిధా మే విధత్తాం శ్రియం కాఽపి కళ్యాణమూర్తిః ॥ 1 ॥ న జానామి శబ్దం న జానామి చార్థం న జానామి పద్యం న జానామి గద్యమ్ । చిదేకా షడాస్యా హృది ద్యోతతే మే ముఖాన్నిఃసరంతే గిరశ్చాపి చిత్రమ్ ॥ 2 ॥ మయూరాధిరూఢం మహావాక్యగూఢం మనోహారిదేహం మహచ్చిత్తగేహమ్ । మహీదేవదేవం మహావేదభావం మహాదేవబాలం భజే లోకపాలమ్ ॥ 3 ॥ యదా సంనిధానం గతా మానవా మే భవాంభోధిపారం గతాస్తే తదైవ । ఇతి వ్యంజయన్సింధుతీరే య ఆస్తే తమీడే పవిత్రం పరాశక్తిపుత్రమ్ ॥ 4 ॥ యథాబ్ధేస్తరంగా లయం యాంతి తుంగా- స్తథైవాపదః సంనిధౌ సేవతాం మే । ఇతీవోర్మిపంక్తీర్నృణాం దర్శయంతం సదా భావయే హృత్సరోజే గుహం తమ్ ॥ 5 ॥ గిరౌ మన్నివాసే నరా యేఽధిరూఢా- స్తదా పర్వతే రాజతే తేఽధిరూఢాః । ఇతీవ బ్రువన్గంధశైలాధిరూఢః స దేవో ముదే మే సదా షణ్ముఖోఽస్తు ॥ 6 ॥ మహాంభోధితీరే మహాపాపచోరే మునీంద్రానుకూలే సుగంధాఖ్యశైలే । గుహాయాం వసంతం స్వభాసా లసంతం జనార్తిం హరంతం శ్రయామో గుహం తమ్ ॥ 7 ॥ లసత్స్వర్ణగేహే నృణాం కామదో...

⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏

Image
 ⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏 ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం! తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహమ్!! ఈ శ్లోకంలో హనుమంతుని మహిమను, తత్వాన్ని, పరమాత్మ స్వరూపాన్ని వివరించబడింది. ఇది హనుమాన్ భక్తులు ప్రదక్షిణ సమయంలో పఠించే పవిత్ర శ్లోకాల్లో ఒకటి. ఈ శ్లోకంలోని ప్రతి పదానికి ఒక గొప్ప అర్థం, లోతైన సందేశం ఉంది. తాత్పర్యం: అంజనాదేవి కుమారుడైన హనుమంతుడు అపారమైన బలంతో, శౌర్యంతో, అపరిమితమైన ధైర్యంతో కూడిన మహావీరుడు. ఆయన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల తత్వాన్ని కలిగి ఉన్న దివ్యమూర్తి. ఉదయించే సూర్యునిలా ప్రకాశిస్తూ భక్తులకు మహాశక్తిమంతుడిగా నిలుస్తాడు. హనుమంతుడు కేవలం బలప్రదాత మాత్రమే కాదు, అపారమైన శాంత స్వరూపుడుగా కూడా భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ఆయన భక్తి, సేవా తత్వం, నిస్వార్థ సమర్పణ మనకు ఆదర్శంగా నిలుస్తాయి. అటువంటి పవిత్రమైన అంజనేయస్వామిని నేను నమస్కరిస్తున్నాను. 💥హనుమంతుడు సంకట మోచనుడు. భక్తికి, అంకిత భావానికి ప్రతీక ఆంజనేయడు. తన భక్తులను కష్టాల నుంచి గట్టెక్కిస్తాడని నమ్మకం. పవన పుత్ర హనుమాన్ ను పూజించేందుకు సింధూరాన్ని వాడతారు.  జ్యోతిషంలో హనుమతుండికి చేసే సింధూర పూజకు...

⚜️🕉️🚩 శ్రీరామ జయ రామ జయజయ రామ🌹🙏

Image
 ⚜️🕉️🚩 శ్రీరామ జయ రామ జయజయ రామ🌹🙏 జీవితం త్రిగుణాత్మకమైంది. అవే సత్త్వ రజ స్తమో గుణాలు. సత్వగుణం దేవతల్ని, రజోగుణం యక్ష, రాక్షసుల్ని, తమోగుణం భూత, ప్రేత, పిశాచాల్ని ఆశ్రయించి ఉంటుందని భగవద్గీత చెబుతోంది. ఇక్కడ భూతాల్లో తమోగుణం ఉంటుందని కాక, తమో గుణం ఉన్న మనుషులు వాటిలా ప్రవర్తిస్తారని అర్థం చేసుకోవాలి. అలాగే రజోగుణం యక్ష, రాక్షసుల్లా.. సత్వగుణం దేవతల్లా ప్రవర్తింపజేస్తుంది. అంటే మనుషులుగా సహజ స్వభావంతో ఉన్న మనం సాధనతో మాధవత్వానికి ఎదగనూవచ్చు, పిశాచ స్థాయికి దిగజారనూవచ్చు. ఆ విషయాన్నే వాల్మీకి అనేక సన్నివేశాల్లో రాముడి పాత్ర ద్వారా, ప్రత్యేకించి స్త్రీలపట్ల ఆయన ప్రవర్తించే విధానం ద్వారా చాటిచెప్పాడు. 💥బాలకాండలో విశ్వామిత్ర మహర్షి యాగ రక్షణార్థం రామలక్ష్మణుల్ని తన ఆశ్రమానికి తీసుకెళ్లే ప్రధాన ఘట్టాల్లో కొన్ని- తాటకా సంహారం, అహల్యా శాపవిమోచనం, సీతాస్వయంవరం. శ్రీరాముడికి తారసపడిన స్త్రీలలో వీరు ముఖ్యులు. గురువు విశ్వామిత్రుడితో కలిసి యాగరక్షణార్థం వెళ్లి, దారిలో ఆయన ఆజ్ఞతో తాటకను సంహరించాడు.  అలానే గౌతమ ముని ఆశ్రమంలో శిలాసదృశంగా ఉన్న అహల్యకు తన పాదధూళితో శాపవిమోచనం కలిగించాడు....

💥సూర్య మండల స్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః🌹🙏 💥సూర్య మండల స్తోత్రం💥 నమోఽస్తు సూర్యాయ సహస్రరశ్మయే సహస్రశాఖాన్విత సంభవాత్మనే । సహస్రయోగోద్భవ భావభాగినే సహస్రసంఖ్యాయుధధారిణే నమః ॥ 1 ॥ యన్మండలం దీప్తికరం విశాలం రత్నప్రభం తీవ్రమనాదిరూపమ్ । దారిద్ర్యదుఃఖక్షయకారణం చ పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ 2 ॥ యన్మండలం దేవగణైః సుపూజితం విప్రైః స్తుతం భావనముక్తికోవిదమ్ । తం దేవదేవం ప్రణమామి సూర్యం పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ 3 ॥ యన్మండలం జ్ఞానఘనంత్వగమ్యం త్రైలోక్యపూజ్యం త్రిగుణాత్మరూపమ్ । సమస్తతేజోమయదివ్యరూపం పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ 4 ॥ యన్మండలం గూఢమతిప్రబోధం ధర్మస్య వృద్ధిం కురుతే జనానామ్ । యత్సర్వపాపక్షయకారణం చ పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ 5 ॥ యన్మండలం వ్యాధివినాశదక్షం యదృగ్యజుః సామసు సంప్రగీతమ్ । ప్రకాశితం యేన చ భూర్భువః స్వః పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ 6 ॥ యన్మండలం వేదవిదో వదంతి గాయంతి యచ్చారణసిద్ధసంఘాః । యద్యోగినో యోగజుషాం చ సంఘాః పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ 7 ॥ యన్మండలం సర్వజనైశ్చ పూజితం జ్యోతిశ్చ కుర్యాదిహ మర్త్యలోకే । యత్కాలకాలాద్యమనాదిరూపం పునాతు మాం తత్సవితుర్వరేణ్...

💥షట్పదీ స్తోత్రం.. శ్రీ ఆది శంకరాచార్య విరచితం.

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ🌹🙏 💥షట్పదీ స్తోత్రం.. శ్రీ ఆది శంకరాచార్య విరచితం. ఆరు కాళ్ళు ఉండే తుమ్మేదను "షట్పదీ" అంటారు. ఆరు శ్లోకాలున్న ఈ స్తోత్రాన్ని "షట్పదీ స్తోత్రం" అని అంటారు. షట్పదీ స్తోత్రంలో సాధకుడు విష్ణువును ఏమి కోరుతూ ప్రార్థించాలో సూచించారు. ఈ శ్లోకంలో ఆరు చిన్న శ్లోకాలు (ఏడో శ్లోకం ముక్తాయింపు) ఉన్నాయి. అవినయం అపనయ, విష్ణో దమయ మన:శమయ విషయ మృగ తృష్ణామ్, భూత దయం విస్తారయ తారయ సంసార సాగరత: || 1 || 🌹"విష్ణుమూర్తి! అహంకారాన్ని తొలగించు. నా మనసును నియంత్రించు. విషయ సుఖాల మృగతృష్ణలు శమింపజేయి. నాలో భూతదయను విస్తరింపజేయి. సంసారసాగరం నుంచి దాటించు" మోక్ష సాధనకు మొదటి శత్రువు అవినయం, అహంకారం. మరో శత్రువు మనోనిగ్రహం లేకపోవటం. ఈ రెండు శత్రువులనూ భగవత్కృప వల్ల జయింపవచ్చు అని ఆచార్యుల అభిమతం. రెండో శ్లోకంతో, సాధకుడు శ్రీహరి పాదారవిందాలకు నమస్కరిస్తాడు దివ్యధునీ మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే శ్రీపతి పదారవిందే భవభయఖేదచ్చిదే వందే || 2 || 🌹భవ భయం వల్ల కలిగిన భేదాన్ని ఛేదించేందుకు, నేను శ్రీహరి పాదారవిందాలకు నమస్కరిస్తున్నాను. అవి ఆకాశగంగా మకరందానికి జన్మస్...

💥బ్రహ్మ కడిగిన పాదము...

Image
 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ🌹🙏 💥బ్రహ్మ కడిగిన పాదము... అన్నమాచార్య విరచితమైన "బ్రహ్మ కడిగిన పాదమూ" సంకీర్తన లోని, ‘బ్రహ్మ కడిగిన పాదమూ' వెనుక ఒక అసక్తికరమైన పురాణోదంతం ఉంది. హిమవంతుని కుమార్తె గంగ. ఆమెను బ్రహ్మదేవుడు దత్త పుత్రికగా స్వీకరించి శివునికిచ్చి వివాహం జరిపిస్తాడు. శివుని వెంట వెళ్తున్న గంగను చూసి, బ్రహ్మ పుత్రికా వాత్సల్యంతో దు:ఖితుడైనాడు. తండ్రిని ఓదార్చిన గంగ.. జల రూపంలో బ్రహ్మ కమండలం లోపలికి, స్త్రీ రూపంలో శివుని వెంట వెళ్ళింది. కొంత కాలం తర్వాత శ్రీమన్నారాయణుడు వామనునిగా అవతరించాడు. బలి దగ్గర మూడడుగుల నేలను దానమడిగి, ముల్లోకాలను అక్రమించి, ఒక పాదంతో సత్యలోకాన్ని ఆక్రమించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీహరి పాదాన్ని భక్తి పారవశ్యంతో తన కమండలంలోని గంగాజలంతో కడిగాడు. అలా పరమ పావన విష్ణుపాదాన్ని చేరుకున్నది గంగ.  అందుకే గంగను ‘#విష్ణుపాదోద్భవామని' అన్నారు ఈ ఉదంతాన్నే అన్నమయ్య ‘బ్రహ్మ కడిగిన పాదమూ' అనే సంకీర్తనంలో ఉదహరించారు. రాత్రి శ్రీవారి పంచబేరాలలో ఒక్కటైన భోగ శ్రీనివాసమూర్తికి అర్చకులు పవళింపు సేవను నిర్వహిస్తారు. అదే సమయంలో శ్రీవారి మూలవిరాట్టు ముందు ...

💥హయగ్రీవుడు💥

Image
 ⚜️🕉️🚩 ఓం హయగ్రీవాయ నమః🌹🙏 💥హయగ్రీవుడు💥 భగవంతుడే అందరికీ ఆది గురువు. ఒక్కో దేవతకూ ఒక్కో గురు స్వరూపం ఉంది. పరమేశ్వరుడిని గురువుగా భావిస్తే దక్షిణామూర్తిగా అనుగ్రహిస్తాడు. అమ్మవారిని గురువుగా కొలిస్తే శారదగా జ్ఞానం ప్రసాదిస్తుంది. విష్ణుమూర్తిని గురువుగా పూజిస్తే.. హయగ్రీవుడుగా కరుణిస్తాడు. నారాయణుడు ధరించిన అనేక అవతారాల్లో.. గురు స్వరూపం హయగ్రీవుడు. గుర్రం ముఖం, నర శరీరంతో ఉంటాడు.  హయగ్రీవుడి ఉత్పత్తి గురించి పురాణాల్లో అనేక కథలు ఉన్నాయి. సృష్టి ఆదిలో మహా విష్ణువు నుంచి బ్రహ్మదేవుడు, ఆయన నుంచి దేవతలు ఉద్భవించారు. దేవతలంతా తమ కర్తవ్యం ఏమిటని బ్రహ్మను అడిగారట. అదే విషయాన్ని బ్రహ్మదేవుడు.. విష్ణుమూర్తిని అడిగాడట. అప్పుడు మహావిష్ణువు యజ్ఞం చేయాలని వారికి సూచించాడట. అయితే యజ్ఞం ఆచరించడానికి తగిన జ్ఞానం ప్రసాదించమని కోరాడట బ్రహ్మ. అప్పుడు నారాయణుడు హయగ్రీవ రూపంలో ప్రకటితమై.. "ప్రపంచాన్ని సృష్టించి, నడపగలిగే జ్ఞానం, యజ్ఞ విజ్ఞానాన్ని ఇస్తున్నాన’’ని వేదాలను బ్రహ్మ దేవుడికి అనుగ్రహించాడట. ఈ వేదాలను మధుకైటభులు అనే రాక్షసులు అపహరించగా.. హయగ్రీవుడు వాటిని సంరంక్షించి మళ్లీ బ్రహ్మకు అ...

💥జ్ఞానం, ఆరోగ్యం, ఐశ్వర్యం అందించే- త్రిమూర్తుల అంశ దత్తాత్రేయుడు.

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీదత్తాయ నమః🌹🙏 💥జ్ఞానం, ఆరోగ్యం, ఐశ్వర్యం అందించే- త్రిమూర్తుల అంశ దత్తాత్రేయుడు. త్రిమూర్తి స్వరూపమైన శ్రీ దత్తాత్రేయ స్వామి పిలిచిన వెంటనే ప్రత్యక్షమై అనుగ్రహించే దైవం. దత్తుడు ఎంతటి దయామయుడో అంతటి పరీక్షమూర్తి. తన భక్తులకు కఠినమైన పరీక్షలు పెట్టి బంగారానికి అంటుకున్న మలినాన్ని వదలగొట్టినట్లుగా వారి పాపాలను తొలగించే దయామయుడు దత్తుడు.  🌹దత్త జననం అత్రిమహర్షి ధర్మపత్ని అనసూయ పాతివ్రత్యాన్ని గుర్తించిన లక్ష్మి, సరస్వతి, పార్వతి అసూయతో ఆమె పాతివ్రత్యాన్ని భగ్నం చేయమని తమ భర్తలైన త్రిమూర్తులను అత్రి మహర్షి ఆశ్రమానికి పంపుతారు.  సన్యాసుల రూపంలో ఆశ్రమానికి వచ్చి మహర్షి దంపతుల ఆతిధ్యాన్ని స్వీకరించడానికి విచిత్రమైన షరతు పెడతారు త్రిమూర్తులు. తన పాతివ్రత్యంతో త్రిమూర్తులను పసిపాపలుగా మార్చి వేస్తుంది అనసూయ. జరిగింది తెలుసుకొని క్షమించి పతిభిక్ష పెట్టమని ప్రార్ధించిన లక్ష్మి సరస్వతి పార్వతిల విన్నపం మేరకు త్రిమూర్తులకు నిజస్వరూపం వస్తుంది. అత్రిఅనసూయ దంపతుల కోరిక మేరకు త్రిమూర్తుల అంశతో వారికి జన్మించిన వరపుత్రుడే దత్తాత్రేయుడు. 🌹బాల్యంలోనే వైరాగ్యం దత్తుడు చిన్...

💥గంగావతరణం💥

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీ గంగా దేవ్యై నమః🌹🙏 💥జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్ష దశమి.. ‘దశ పాపహర దశమి’ గంగావతరణం 💥గంగావతరణం💥 సగరుని తండ్రి బాహుకుడు. అతనిని శత్రురాజులు ఓడించి అడవులపాలు చేశారు. ఆయన అక్కడే కాలధర్మం చెందాడు. ఆయన పెద్ద ఇల్లాలు అప్పటికే నిండు చూలాలు. మగని మరణం ఆమెకు అశనిపాతమయింది. భర్తతో సహగమనానికి పూనుకొన్న ఆమెను ఔర్వముని, అది ఇహపర సాధనం కాదని వారించాడు. ఆమె సవతులు అసూయతో ఆమెకు విష ప్రయోగం చేశారు. ముని కరుణించడం వలన ఆమెకు ఎలాంటి హాని కలగలేదు సరికదా, చక్కని తనయుని కని తనిసింది ఆ తల్లి! గరళాన్ని- విషాన్ని జీర్ణించుకొని జన్మించాడు కాన అతనికి ‘సగరః’- సగరుడనే సార్థక నామం. గరమన్నా, గరళమన్నా సంస్కృతంలో విషమనే అర్థం. పెద్దవాడైన సగరుడు ప్రయోజకుడై చక్రవర్తిగా ప్రఖ్యాతి వహించాడు.  ఔర్వ మహర్షి అనుగ్రహంతో సార్వభౌముడు సగరుడు తొంభై తొమ్మిది అశ్వమేధ యాగాలు జయప్రదంగా నిర్వహించాడు. వందవ యాగంలో అసూయతో ఇంద్రుడు అశ్వాన్ని అపహరించి నాగలోకంలో తపోనిరతుడైన కపిల మహర్షి ఆశ్రమంలో ఒక మూలన బంధించి వెళ్లాడు. సగరునికి సుమతి, కేశిని అను ఇద్దరు భార్యలు. వారిలో సుమతి కుమారులు అరవైవేల మందిని సగరుడు అశ్వాన్ని వె...