💥దత్తప్రభువు దినచర్య:
⚜️🕉️🚩ఓం శ్రీదత్తాయ నమః🌹🙏
💥దత్తప్రభువు దినచర్య:
దిగంబరుడూ, శరీమంతా భస్మం పులుముకొన్నవాడు, ఆత్మ ఙ్ఞానం కలిగించ గలవాడు, సర్వమతాల్లోనూ తన ప్రస్తావన ఏదో ఒక రూపంలో కలవాడు, ఏ అవతారం లోనూ లేని గురుదేవ అన్న విశేషణం కలవాడూ, సదా బ్రహ్మనిష్ట కలవాడూ, ప్రసన్నుడు, నిర్మానసుడు ఐన దత్త ప్రభువుల వారు -
ప్రతిరోజూ కాశీలో గంగాస్నానము, మాహురపురములో ధ్యానము, కొల్హాపురిలో (కరవీరపురం) భిక్ష, నిర్మలమైన, స్వచ్ఛమైన తుంగభద్రా నీటితో దాహం తీర్చుకుని, సహ్యాద్రి పర్వతములో నిద్ర చేస్తారు.
సహ్యాద్రి కల్పవృక్షము కింద మణిపీఠం ఉంది, దానిపై దత్త ప్రభువు ఆసీనుడై ఉంటాడు. మెడలో మణిహారం, మొలలో బంగారు మొలత్రాడు, వామాంకమున యోగలక్ష్మి మధుమతీదేవి, వెనుక కామధేనువు, నలుదిక్కులా నాలుగు వేదాలూ నాలుగు కుక్కలుగా ఆయన పరివేష్టితుడై ఉండగా -
ఆయన ముందు సనక, సనందన, సనత్కుమార, సనత్సుజాతులూ, నవనాధుల ఆదిగా గల మహ్మాతులు ఆయన్ను స్తుతిస్తూ వుంటారు.
కేవలం భిక్షాన్నం మాత్రమే గ్రహించే ఈ ప్రభువుకి అష్టసిద్ధులు, నవనిధులు దాస్యం చేస్తూ ఉంటాయి.
ఎడమ చేతిలో త్రిశూలం, శంఖం, కమండలం ధరించి కుడి చేతిలో ఢమరుకం, చక్రం, జపమాల ధరించి ఉండగా గంధర్వుల గానం చేస్తూంటే, అప్సరసలు నృత్యం చేస్తూండగా దత్తప్రభువులు ప్రతిదినమూ దర్బార్ నిర్వహిస్తూవుంటారు. అట్టి ప్రభువు తనను దర్శించి, స్మరించినంత మాత్రానే ఇహ, పర సౌఖ్యాలు కలుగజేస్తుంటాడు.
శ్రీ దత్తుల వారికి "#అవధూత" అనే బిరుదువున్నది - అవదూతోపనిషత్తు ప్రకారం ఆ పదానికి అర్ధం...
శ్లో II అక్షరద్వాద్వరేణ్యత్వాద్ధూత సంసార బంధనాత్
తత్వమస్యాది లక్ష్యత్వదవదూత ఇతీర్యతే II
తా II నాశరాహిత్యమూ, శ్రేష్టత్వమూ, విదిలించి వేయబడిన సంసారబంధము తత్త్వమసి అనే మహావాక్యానికి లక్షమవ్వడం వలన, అట్టి వారిని అవధూత అని చెబుతారు.
దత్తం దత్తం పునర్దత్తం యోవదేత్ భక్తి సంయుతః !
తస్య పాపాని సర్వాణి క్షయం యాంతి న సంశయః !!
ఎవరైతే శ్రీ దత్తాత్రేయుని భక్తితో స్మరిస్తారో వారి సమస్త పాపములు నశిస్తాయి. దీనిలో సందేహం లేదని "దత్త హృదయం" నందు చెప్పబడినది.
శ్రీ దత్తాత్రేయుడు కేవలం స్మరణ మాత్ర్ర సంతుష్టుడు. తీవ్రమైన పూజాదికాలు చేయకపోయినా “అన్యధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ” అనే పవిత్ర భావనతో, భక్తితో దత్త, దత్త అని స్మరిస్తే చాలు ఏదో ఒక రూపంలో వచ్చి, రక్షించి కోరిన కోరికలు తీర్చు దయామయుడు శ్రీదత్తాత్రేయుడు.
స్వామి స్మరణ రోగాలను పటాపంచలు చేస్తుంది. భూత, ప్రేత, పిశాచ, గ్రహబాధలను దూరం చేస్తుంది. పీడకలలు దరిరావు. సర్ప, వృశ్చికాది జనిత విష బాధలు, కుష్టు మొదలైన వ్యాధులు నశిస్తాయి. త్రికరణశుద్ధి కలుగుతుంది. కోరిన కోర్కెలు నెరవేరి జీవితము ధన్యమవుతుంది.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment