💥బ్రహ్మ కడిగిన పాదము...
⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ🌹🙏
💥బ్రహ్మ కడిగిన పాదము...
అన్నమాచార్య విరచితమైన "బ్రహ్మ కడిగిన పాదమూ" సంకీర్తన లోని, ‘బ్రహ్మ కడిగిన పాదమూ' వెనుక ఒక అసక్తికరమైన పురాణోదంతం ఉంది.
హిమవంతుని కుమార్తె గంగ. ఆమెను బ్రహ్మదేవుడు దత్త పుత్రికగా స్వీకరించి శివునికిచ్చి వివాహం జరిపిస్తాడు.
శివుని వెంట వెళ్తున్న గంగను చూసి, బ్రహ్మ పుత్రికా వాత్సల్యంతో దు:ఖితుడైనాడు.
తండ్రిని ఓదార్చిన గంగ.. జల రూపంలో బ్రహ్మ కమండలం లోపలికి, స్త్రీ రూపంలో శివుని వెంట వెళ్ళింది.
కొంత కాలం తర్వాత శ్రీమన్నారాయణుడు వామనునిగా అవతరించాడు. బలి దగ్గర మూడడుగుల నేలను దానమడిగి, ముల్లోకాలను అక్రమించి, ఒక పాదంతో సత్యలోకాన్ని ఆక్రమించాడు.
అప్పుడు బ్రహ్మదేవుడు శ్రీహరి పాదాన్ని భక్తి పారవశ్యంతో తన కమండలంలోని గంగాజలంతో కడిగాడు. అలా పరమ పావన విష్ణుపాదాన్ని చేరుకున్నది గంగ. అందుకే గంగను ‘#విష్ణుపాదోద్భవామని' అన్నారు
ఈ ఉదంతాన్నే అన్నమయ్య ‘బ్రహ్మ కడిగిన పాదమూ' అనే సంకీర్తనంలో ఉదహరించారు.
రాత్రి శ్రీవారి పంచబేరాలలో ఒక్కటైన భోగ శ్రీనివాసమూర్తికి అర్చకులు పవళింపు సేవను నిర్వహిస్తారు.
అదే సమయంలో శ్రీవారి మూలవిరాట్టు ముందు పంచపాత్రలలో బ్రహ్మదేవుడు స్వామివారికి పూజలు చేసేందుకు వీలుగా ఆకాశగంగ నీటిని అర్చకులు వుంచుతారు. తిరిగి ఆ నీటిని ఉదయం సుప్రభాత సేవ సమయంలో పక్కనపెడతారు అర్చకులు.
బ్రహ్మదేవుడు స్వామివారికి పూజలు నిర్వహించినందుకు సాక్ష్యంగా పంచపాత్రలో వున్న నీరు తగ్గి వుండడమే కాకుండా ఆ ప్రాంతంలో తడిగా కూడా వుంటుంది అంటారు అర్చకులు.
ఇలా స్వామివారికి సాక్షాత్తూ బ్రహ్మదేవుడు ప్రతి నిత్యం పూజా కైంకర్యాలు నిర్వహించి నివేదన సమర్పిస్తారు.
సుప్రభాత సేవకు వెళ్ళిన భక్తులకు మాత్రం స్వామివారికి బ్రహ్మదేవుడు సమర్పించిన తీర్థాన్ని భక్తులకు బ్రహ్మ తీర్థంగా అర్చకులు అందిస్తారు. బ్రహ్మ తీర్థాన్ని స్వీకరించిన భక్తులకు సకలపాప హరణం జరుగుతుంది.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment