⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏
⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏
ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం!
తరుణార్క ప్రభం శాంతం ఆంజనేయం నమామ్యహమ్!!
ఈ శ్లోకంలో హనుమంతుని మహిమను, తత్వాన్ని,
పరమాత్మ స్వరూపాన్ని వివరించబడింది. ఇది హనుమాన్ భక్తులు ప్రదక్షిణ సమయంలో పఠించే పవిత్ర శ్లోకాల్లో ఒకటి. ఈ శ్లోకంలోని ప్రతి పదానికి ఒక గొప్ప అర్థం, లోతైన సందేశం ఉంది.
తాత్పర్యం:
అంజనాదేవి కుమారుడైన హనుమంతుడు అపారమైన
బలంతో, శౌర్యంతో, అపరిమితమైన ధైర్యంతో కూడిన
మహావీరుడు. ఆయన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల తత్వాన్ని కలిగి ఉన్న దివ్యమూర్తి. ఉదయించే సూర్యునిలా ప్రకాశిస్తూ భక్తులకు మహాశక్తిమంతుడిగా నిలుస్తాడు. హనుమంతుడు కేవలం బలప్రదాత మాత్రమే కాదు, అపారమైన శాంత స్వరూపుడుగా కూడా భక్తులకు అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ఆయన భక్తి, సేవా తత్వం, నిస్వార్థ సమర్పణ మనకు ఆదర్శంగా నిలుస్తాయి. అటువంటి పవిత్రమైన అంజనేయస్వామిని నేను నమస్కరిస్తున్నాను.
💥హనుమంతుడు సంకట మోచనుడు. భక్తికి, అంకిత భావానికి ప్రతీక ఆంజనేయడు. తన భక్తులను కష్టాల నుంచి గట్టెక్కిస్తాడని నమ్మకం. పవన పుత్ర హనుమాన్ ను పూజించేందుకు సింధూరాన్ని వాడతారు.
జ్యోతిషంలో హనుమతుండికి చేసే సింధూర పూజకు చాలా ప్రాశస్థ్యం ఉంది. కేసరి రంగులో ఉండే సింధూరం సమర్పించడం ద్వారా సకల కోరికలు నెరవేరుతాయని శాస్త్రం చెబుతోంది. సింధూరంతో హనుమంతుని ఆరాధించిన వారికి తప్పక ఫ్రతిఫలం దక్కుతుందని నమ్మకం. సిందూరంతో చేసిన హనుమాన్ పూజ ఆయనను ప్రసన్నుడను చేస్తుంది. ఇలా సింధూరానికి హనుమంతుడికి విడదీయలేని సంబంధం ఉంది.
సింధూర ధారణతో హనుమంతుడు కరుణిస్తాడు. కోరిన కోరికలు తీరుస్తాడు. ముఖ్యంగా మంగళ వారం నాడు ఆంజనేయుడికి సింధూర పూజ చేస్తే ఇంట్లోకి సౌభాగ్యం వస్తుంది. సుఖ శాంతులు వెల్లివిరుస్తాయి. రామభక్త హనుమంతుడికి సింధూరం సమర్పించడం వెనుక ఒక పౌరాణిక కథ ప్రాచూర్యంలో ఉంది.
హనుమంతుడికి సింధూరం అంత ప్రియం ఎందుకు?
హనుమంతుడు సీతను వెతుకుతూ లంకకు వెళ్లిన సందర్భంలో అశోక వనంలో సీతను కనిపెట్టిన తర్వాత దూరం నుంచే సీతాదేవిని చాలా సమయం పాటు గమనిస్తూ ఉంటాడు. ఆమె ప్రతిరోజూ, అనునిత్యం తన పాపిటలో సింధూరం ధరించడాన్ని గమనిస్తాడు.
రావణుడు రావడం సీతను బెదిరించడం వంటి అన్ని ఘట్టాల తర్వాత తనను తాను రామబంటుగా సీతకు పరిచయం చేసుకుంటాడు హనుమంతుడు. ఆ సందర్భంలో సీతాదేవిని సింధూరం గురించి అడుగుతాడు.
అప్పుడు ఆమె శ్రీరామచంద్రుడి దీర్ఘాయువు కోసం తాను ఈ సింధూరాన్ని తన నుదుటన ధరిస్తానని, అంతే కాదు ఇది ఆయనకు చాలా ఇష్టమని, దీన్ని ధరించిన తన ముఖాన్ని చూసిన శ్రీరాముడి ముఖంలో ప్రసన్నతను తాను గమనించగలుగుతానని అందుకే.. ఆయనకు నచ్చే విధంగా ఉండేందుకు గాను తాను సింధూరాన్ని ప్రతి నిత్యం ధరిస్తానని సమాధానం చెప్పిందట.
కాస్త సింధూరం రాముడికి దీర్ఘాయువును ఇస్తే తాను తనువంతా సింధూరం ధరిస్తే రాముడికి మృత్యువే ఉండదు. చిటికెడు సింధూరం నుదుటన ధరించిన సీతనే అంత శ్రీరాముడు అంత ప్రేమిస్తే, తనను ఇంకెంత ప్రేమిస్తాడో కదా అని అప్పటి నుంచి హనుమంతుడు ఒళ్లంతా సింధూరం ధరిస్తాడని ఒక కథ ప్రాచూర్యంలో ఉంది.
హనుమంతుడికి సింధూర సేవను ఆలయాల్లో ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ఆయనకు ఎంతో ఇష్టమైన సింధూరం సమర్పణలో పాలుపంచుకున్న వారి సకల అభీష్టాలు నెరవేరుతాయట.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment