Posts

Showing posts from September, 2024

💥చంద్రశేఖరాష్టకం💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥చంద్రశేఖరాష్టకం💥 చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ । చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ (2) రత్నసాను శరాసనం రజతాద్రి శృంగ నికేతనం శింజినీకృత పన్నగేశ్వర మచ్యుతానల సాయకమ్ । క్షిప్రదగ్ద పురత్రయం త్రిదశాలయై-రభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః ॥ 1 ॥ పంచపాదప పుష్పగంధ పదాంబుజ ద్వయశోభితం ఫాలలోచన జాతపావక దగ్ధ మన్మధ విగ్రహమ్ । భస్మదిగ్ధ కళేబరం భవనాశనం భవ మవ్యయం చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ 2 ॥ మత్తవారణ ముఖ్యచర్మ కృతోత్తరీయ మనోహరం పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహమ్ । దేవ సింధు తరంగ శ్రీకర సిక్త శుభ్ర జటాధరం చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ ॥ 3 ॥ యక్ష రాజసఖం భగాక్ష హరం భుజంగ విభూషణం శైలరాజ సుతా పరిష్కృత చారువామ కళేబరమ్ । క్షేళ నీలగళం పరశ్వధ ధారిణం మృగధారిణం చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహిమామ్ ॥ 4 ॥ కుండలీకృత కుండలీశ్వర కుండలం వృషవాహనం నారదాది మునీశ్వర స్తుతవైభవం భువనేశ్వరమ్ । అంధకాంతక మాశ్రితామర పాదపం శమనాంతకం చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్షమామ్ ॥ 5 ॥ భేషజం భవరోగిణా మఖిలాపదా మపహారిణం దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మక...

⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 మన పూర్వీకులు గుడికి వెళ్లినప్పుడు దర్శనం అయ్యాక గుడి నుండి బయటకు వచ్చే ముందు కొంతసేపు గుడి మండపంలో కానీ ప్రాకారం లోపల కానీ కొంతసేపు కూర్చుని ఒక చిన్న ప్రార్ధన చేసేవారు. అది ఏమిటంటే..! అనాయాసేన మరణం వినా ధైన్యేన జీవనం దేహాంతే తవ సాన్నిధ్యం దేహిమే పరమేశ్వరం మీరు గుడి లోనికి వెళ్లినప్పుడు దేవుని ముందు నిల్చుని మీ రెండు చేతులను జోడించి, కళ్ళు తెరిచి ప్రశాంతమైన మనసుతో దర్శనం చేసుకోండి. దర్శనం అయ్యి గుడి బయటకు వచ్చాక గుడి మండపంలో కూర్చుని కళ్ళు మూసుకుని అప్పుడు మళ్లీ భగవంతుని రూపాన్ని గుర్తుకు తెచ్చుకుని ఆయనను ఈ క్రింది విధముగా అడగండి. "అనాయాసేన మరణం" ******* నాకు నొప్పి లేక బాధ కానీ లేని మరణాన్ని ప్రసాదించు. "వినా ధైన్యేన జీవనం" ******* నాకు ఎవరి మీదా ఆధారపడకుండా, నేను జీవితంలో ఎవరి ముందూ తలవంచకుండా, ఎవరినీ నొప్పించకుండా, నేను ఎవరి వద్దా చులకన కాకుండా ఉండే జీవితాన్ని ప్రసాదించు. "దేహాంతే తవ సాన్నిధ్యం" ******* మృత్యువు నావద్దకు వచ్చినప్పుడు నేను నిన్ను దర్శించుకునే విధంగా దీవించు.  దేహిమే పరమేశ్వరా ******* ఓ పరమేశ్వరా నాకు ఈ మూడు వరమ...

⚜️🕉️🚩ఓం నమో నారాయణాయ 🌹🙏

Image
 ⚜️🕉️🚩ఓం నమో నారాయణాయ 🌹🙏

💥సూర్య మండల స్తోత్రం💥

Image
 🕉️⚜️🚩 ఓం ఆదిత్యాయ నమః 🌹🙏 💥రోజు చదవలేక పోయినా వారంలో ఒకరోజు "ఆదివారం" నాడు చదివినా సమస్త పాపాల్ని హరించి పుణ్య ఫలం పెంచే స్తోత్రం. 💥 సూర్య మండల స్తోత్రం💥 నమోఽస్తు సూర్యాయ సహస్రరశ్మయే సహస్రశాఖాన్విత సంభవాత్మనే । సహస్రయోగోద్భవ భావభాగినే సహస్రసంఖ్యాయుధధారిణే నమః ॥ 1 ॥ యన్మండలం దీప్తికరం విశాలం రత్నప్రభం తీవ్రమనాదిరూపమ్ । దారిద్ర్యదుఃఖక్షయకారణం చ పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ 2 ॥ యన్మండలం దేవగణైః సుపూజితం విప్రైః స్తుతం భావనముక్తికోవిదమ్ । తం దేవదేవం ప్రణమామి సూర్యం పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ 3 ॥ యన్మండలం జ్ఞానఘనంత్వగమ్యం త్రైలోక్యపూజ్యం త్రిగుణాత్మరూపమ్ । సమస్తతేజోమయదివ్యరూపం పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ 4 ॥ యన్మండలం గూఢమతిప్రబోధం ధర్మస్య వృద్ధిం కురుతే జనానామ్ । యత్సర్వపాపక్షయకారణం చ పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ 5 ॥ యన్మండలం వ్యాధివినాశదక్షం యదృగ్యజుః సామసు సంప్రగీతమ్ । ప్రకాశితం యేన చ భూర్భువః స్వః పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ 6 ॥ యన్మండలం వేదవిదో వదంతి గాయంతి యచ్చారణసిద్ధసంఘాః । యద్యోగినో యోగజుషాం చ సంఘాః పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ 7 ॥ యన్మండలం సర్...

🌼గోవింద నామ మహిమ🌼

Image
 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ🌹🙏 💥అనాథరక్షక గోవిందా ఆపద్భాందవ గోవిందా💥 🌼గోవింద నామ మహిమ🌼 'గోవింద’ అనే మూడక్షరాల నామం శ్రీమన్నారాయణుని అనుగ్రహాన్ని సులభంగా, నిశ్చయంగా సిద్ధింపజేసే ఒక మహామంత్రం. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆపద్బాంధవుడు, ఆశ్రిత రక్షకుడైన శ్రీహరికి వేలనామాలు ఉన్నాయి. ‘నారాయణ’ వంటి అద్భుత నామాలు ఎన్ని ఉన్నా, శరణు కోరేవారికి కొండంత అండగా, భక్తులను ఆపదల నుంచి సులభంగా గట్టెక్కించే సరళతరమైన విష్ణునామం ‘గోవింద’ మాత్రమే. మూడక్షరాల గోవిందనామం చేతనే ‘క్షత్రబంధువు’ అనే అతను ఏకంగా మోక్షాన్ని పొందాడు. ‘విప్రనారాయణులు’ ‘తిరుమాలై’ అనే ద్రావిడ ప్రబంధంలో పేర్కొన్న ఆయన కథ ఆసక్తికరం. 💥సూర్యవంశంలో పుట్టిన రాజకుమారుడే ‘క్షత్రబంధువు’గా ప్రసిద్ధి పొందాడు. ఇతడు బాల్యం నుంచే హింసా ప్రవృత్తిని కలిగి మూగజీవాలను, చిన్నపిల్లలను చంపేవాడు. దీంతో ఇతణ్ణి మహారాజు ‘రాజ్య బహిష్కారం’ చేసి సైనికుల ద్వారా అరణ్యానికి పంపాడు. అక్కడ కూడా ‘క్షత్రబంధువు’ మహర్షులను హింసిస్తూ, జంతువులను వధిస్తూ ఆఖరికి నరమాంసాన్నీ తినేవాడు. ఒకనాడు ఒక మునీశ్వరుడు ఓ సరస్సులోకి దప్పికతో దిగబోయి కాలు జారి నీటిలో పడ్డాడు. క్షత్రబం...

💥శ్రీ దుర్గా పంచరత్న స్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏 💥"దుర్గా పంచరత్నం" దుర్గాదేవిని స్తుతిస్తూ చేసిన మహాద్భుతమైన స్తోత్రం. కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురు శంకరాచార్య "శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి" మహాస్వామి విరచితం. ప్రతిరోజు దీన్ని చదివిన వారికి మోక్షం తథ్యం. 💥శ్రీ దుర్గా పంచరత్న స్తోత్రం💥 తే ధ్యాన యోగానుగత అపశ్యన్ త్వామేవ దేవీం స్వగుణైర్ని గూఢామ్ త్వమేవ శక్తిఃపరమేశ్వరస్య మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి ॥ 1 దేవాత్మశక్తిఃశ్రుతి వాక్య గీతా మహర్షి లోకస్యపురః ప్రసన్నా గుహాపరం వ్యోమ సతఃప్రతిష్ఠా మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి ॥ 2 పరాస్య శక్తిర్వివిధైవ శ్రూయసే శ్రేతాశవ వాక్యోదిత దేవి దుర్గే స్వాభావికీ జ్ఞాన బలక్రియాతే మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి॥ 3 దేవాత్మ శబ్దేన శివాత్మ భూతా యాత్కూర్మ వాయువ్యవచో వివృత్త్యా త్వం పాశ విచ్ఛేదకరీ ప్రసిద్ధా మాం పాహి సర్శ్వేరి మోక్షదాత్రి ॥ 4 త్వం బ్రహ్మపుచ్ఛ ఆ వివిధా మయూరీ బ్రహ్మ ప్రతిష్ఠాస్యుపదిష్ట గీతా జ్ఞాన స్వరూపాత్మ దయాఖిలానాం మాం పాహి సర్వేశ్వరి మోక్షదాత్రి ॥ 5 ఇతి పరమపూజ్య శ్రీ చంద్రశేఖరేంద్రసరస్వతి స్వామి కృతం దుర్గా పంచరత్నం సంపూర్ణ...

భాద్రపద బహుళ తదియ - స్త్రీ సౌభాగ్యాన్ని.. సద్గతులు పొందడానికి ఆచరించే "ఉండ్రాళ్ళతద్ది" నోము.

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏 💥 భాద్రపద బహుళ తదియ - స్త్రీ సౌభాగ్యాన్ని.. సద్గతులు పొందడానికి ఆచరించే "ఉండ్రాళ్ళతద్ది" నోము. ఈ నోముకు "మోదక తృతీయ" అని కూడా పేరు. ఉండ్రాళ్ళ నివేదన కలిగిన నోము కావడంతో ఉండ్రాళ్ళ తద్దెగా పిలవబడుతుంది. ఇది రెండు రోజుల పండుగ. ఈ వ్రతం గురించి సాక్షాత్తు పరమ శివుడు పార్వతి దేవికి వివరించాడు అని పురాణాలూ చెబుతున్నాయి. 🌹ముందురోజు: ఐదుగురు ముత్తైదువులకి గోరింటాకు, ముద్దపసుపు కుంకుమలు, కుంకుడు కాయలు, నువ్వులనూనె ఇచ్చి మాయింటికి తాంబూలము తీసుకోవటానికి రమ్మని ఆహ్వానించాలి. ముత్తైదువులు, నోము ఆచరించే వారు గోరింటాకు పెట్టుకొనవలెను. 🌹#రెండవరోజు: భాద్రపద తృతీయ నాడు ఉదయాన్నే 4 గంటలకు లేచి గోంగూర పచ్చడితో భోజనము చేయవలెను.    తెల్లవారినాక అభ్యంగన స్నానమాచరించి 3 ఇళ్ళలో ఉయ్యాల ఊగవలెను. సాయంత్రం వరకు ఎటువంటి పదార్థాలు తినకుండా ఉపవాసం చేయాలి. బియ్యపు పిండితో చేసిన ఉండ్రాళ్ళను చేసి వాటిని వండి గౌరీ దేవికి, మరో ఐదు ఉండ్రాళ్ళను ఐదుగురు ముతైదువులకు వాయనమివ్వాలి. ఇలా ఐదు సంవత్సరాల వరకు ఈ నోమును నోచుకుంటే మంచి భర్త లభిస్తాడని పెద్దలు చెబుతారు.  ...

💥దక్షిణామూర్తి స్వరూపులు సద్గురువులు

Image
 ⚜️🕉️🚩 ఓం గురు దక్షిణామూర్తయే నమః 🌹🙏 💥దక్షిణామూర్తి స్వరూపులు సద్గురువులు వాత్సల్యంతో చేరదీసి, మంచి మార్గాన్ని చూపి, మార్గదర్శకత్వాన్ని నెరపుతూ, అవసరమైనప్పుడు తన చేయూతను అందించేవాడే సద్గురువు. కొందరు గురువులు అత్యంత ప్రసన్నులై శిష్యులకు మార్గ దర్శనం చేస్తే, మరికొందరు అడుగడుగునా శిష్యులను పరీక్షలకు గురి చేస్తూ జ్ఞానమార్గంలోకి నడుపుతూ ఉంటారు. ఎవరి బోధనా విధానం వారిది. ఒక్క సారి ప్రియశిష్యునిగా స్వీకరించాక ఎటువంటి పరిస్థితులలోనూ అతనిని వదలక తనంతవానిగా తీర్చిదిద్దడానికి సద్గురువు అహరహమూ శ్రమిస్తూ ఉంటాడు. అందుకు ఉదాహరణ ఋభ, నిదాఘుల వృత్తాంతం. 💥ఋభుడు బ్రహ్మ మానస పుత్రుడు. పుట్టుకతోనే బ్రహ్మజ్ఞాన సంపన్నుడతడు. అతనికి పులస్త్య ప్రజాపతి కొడుకైన నిదాఘుడు అనే ప్రియశిష్యుడు ఉండేవాడు.  గురుకృపతో నిదాఘుడు అశేషమైన విజ్ఞానాన్ని సంపాదించాడు. విద్యాభ్యాసం పూర్తి చేసుకొని తన తండ్రి పులస్త్య బ్రహ్మచే నిర్మితమైన సుందర, సుసంపన్నమైన వీరనగరం అనే పట్టణంలో గృహస్థ జీవితం గడుపుతూ, ధార్మిక ప్రవృత్తితో జీవించసాగాడు. ఇది కృత యుగం నాటి మాట ఆ కాలంలో మానవులు వేల సంవత్సరాలు జీవించేవారట. అలా ఒక వెయ్యి సంవత్స...

⚜️🕉️🚩 ఓం శ్రీ దత్తాయ నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ దత్తాయ నమః 🌹🙏

💥॥ శ్రీఅహోబల నృసింహస్తోత్రం ॥💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామినే నమః 🌹🙏 💥॥ శ్రీఅహోబల నృసింహస్తోత్రం ॥💥 లక్ష్మీకటాక్షసరసీరుహరాజహంసం పక్షీంద్రశైలభవనం భవనాశమీశం | గోక్షీరసార ఘనసారపటీరవర్ణం వందే కృపానిధిమహోబలనారసింహం || ౧ || ఆద్యంతశూన్యమజమవ్యయమప్రమేయం ఆదిత్యచంద్రశిఖిలోచనమాదిదేవం | అబ్జాముఖాబ్జమదలోలుపమత్తభృంగం వందే కృపానిధిమహోబలనారసింహం || ౨ || కోటీరకోటిఘటితోజ్జ్వలకాంతికాంతం కేయూరహారమణికుండలమండితాంగం | చూడాగ్రరంజితసుధాకరపూర్ణబింబం వందే కృపానిధిమహోబలనారసింహం || ౩ || వరాహవామననృసింహసుభాగ్యమీశం క్రీడావిలోలహృదయం విబుధేంద్రవంద్యం | హంసాత్మకం పరమహంసమనోవిహారం వందే కృపానిధిమహోబలనారసింహం || ౪ || మందాకినీజననహేతుపదారవిందం బృందారకాలయవినోదనముజ్జ్వలాంగం | మందారపుష్పతులసీరచితాంఘ్రిపద్మం వందే కృపానిధిమహోబలనారసింహం || ౫ || తారుణ్యకృష్ణతులసీదళధామరమ్యం ధాత్రీరమాభిరమణం మహనీయరూపం | మంత్రాధిరాజమథదానవమానభృంగం వందే కృపానిధిమహోబలనారసింహం || ౬ || ఇతి అహోబలనృసింహ స్తోతం || సేకరణ... 💐🙏 ⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

భాద్రపద మాస కృష్ణపక్షం.. మహాలయపక్షం (పితృపక్షం)

Image
 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏 భాద్రపద మాస కృష్ణపక్షం.. మహాలయపక్షం (పితృపక్షం)  కుర్తుం మహాలయ శ్రాద్ధం యదిశక్తిర్నవిద్యతే యాచిత్వాపి నరః కుర్యాత్‌ పితూృణాం తన్మహాలయం "విశిష్టమైన మహాలయ పక్షంలో పెద్దల కోసం శ్రార్థ కర్మలు తప్పనిసరిగా చేయాలి. అందరికీ అలా చేయగలిగే స్థోమత ఆర్థికంగా లేకపోవచ్చు. అటువంటి పరిస్థితి తలెత్తినప్పుడు... యాచించయినా ఆ విధిని నిర్వర్తించి, పితృదేవతల ఋణం తీర్చుకోవాలి’’ అని పూర్వీకులు పేర్కొన్నారు. ఏమిటీ #మహాలయం? ఈ సమస్త సృష్టికీ కారణం ఆ భగవంతుడు. ఇహ, పర లోకాలలో మనం జీవితాలను ఏ విధంగా గడపాలి, ఎలాంటి కర్మలు ఆచరించాలి అనే మార్గ దర్శకత్వం చేసినవారు పూర్వ ఋషులు. అలాగే ఈ లోకం లోకి మనను ఆహ్వానించి, పెంచి, పెద్దచేసి, విద్యాబుద్ధులు నేర్పించి, మనకు ఒక అస్తిత్వాన్ని ప్రసాదించినవారు తల్లితండ్రులు, మన ముందు తరాలవారు. తన సృష్టిలో ఆయన మనల్ని భాగంగా చేసినందుకు దేవుడి ఋణాన్ని, విజ్ఞానప్రదాతలైన ఋషుల ఋణాన్ని, మన ఉనికికి కారకులైన మన పూర్వీకుల ఋణాన్ని తీర్చుకోవడం మానవులుగా మన ధర్మం. వీటన్నిటికీ అనువైన మాసంగా భాద్రపదాన్ని నిర్దేశించారు పెద్దలు. తొలి పూజ అందుకొనే దేవుడైన గణపతిని ఆరా...

💥సుబ్రహ్మణ్య తత్వం💥

Image
 ⚜️🕉️🚩ఓం సుబ్రహ్మణ్యాయ నమః🌹🙏 💥సుబ్రహ్మణ్య తత్వం💥 షడాననం చందన లేపితాంగం మహారసం దివ్య మయూర వాహనం! రుదస్య నూనుం సురలోకనాథం శ్రీ సుబ్రహ్మణ్యం శరణం ప్రపథ్యే!! మనకు ‘షణ్మతము’లను ఆరు మతములు ఉన్నవి. అందులో ఆరు దేవతా స్వరూపాలను పరబ్రహ్మ స్వరూపాలుగా పూజిస్తాము. అవి, గాణాపత్యము - గణపతి; సౌరము - సూర్యుడు; శాక్తము - పార్వతి (శక్తి); శైవము - శివుడు; వైష్ణవము - విష్ణువు; కౌమారము - సుబ్రహ్మణ్యుడు. వీరిని పూజించే పద్ధతినే "పంచాయతన పూజ" అంటారు. కౌమారము అనే శాఖ ‘కుమార’ అన్న శబ్దము నుండే వచ్చింది. ఇచ్ఛా జ్ఞాన క్రియా రూప మహాశక్త్ధిరం భజే! శివశక్తి జ్ఞానయోగం జ్ఞానశక్తి స్వరూపకం!! - అని శివపురాణ వచనం. వైదిక మతంలో శివ శక్త్యాత్మకుడైన సుబ్రహ్మణ్యోపాసన గురించి చెప్పబడింది. షణ్మతాలలో- సౌర, శాక్త, గాణాపత్య, వైష్ణవ, శివమతాలతో పాటు కుమారోపాసన గురించి చెప్పినప్పటికీ, పంచ దేవతారాధనలో స్థానం కల్పించలేదు. సుబ్రహ్మణ్యునికి ‘‘అగ్నిగర్భుడ’’ని నామం ఉంది. అయితే, సుబ్రహ్మణ్యారాధన అగ్ని ఉపాసనతోనే ప్రారంభం అవుతుందని తత్త్వజ్ఞుల అభిప్రాయం. ఏ పూజ మొదలెట్టినా దీపారాధనతోనే ప్రారంభం కావడం తెలియంది కాదు. ‘దీపారాధన’ అ...

⚜️🕉️🚩శ్రీ ఆంజనేయం 🌹🙏

Image
 ⚜️🕉️🚩శ్రీ ఆంజనేయం 🌹🙏

భాద్రపద శుక్ల చతుర్దశి.. అనంత పద్మనాభ చతుర్దశి

Image
 ⚜️🕉️🚩 ఓం పద్మనాభాయ నమః🌹🙏 💥 భాద్రపద శుక్ల చతుర్దశి.. అనంత పద్మనాభ చతుర్దశి పాల కడలిలో శేషశయ్య మీద పవళించి ఉండి బొడ్డు పద్మంలో బ్రహ్మదేవుడు కూర్చొని లక్ష్మీదేవి పాదాలొత్తుతున్న ఆ దివ్య స్వరూపమే "#అనంతపద్మనాభుడు" పాండవులు వనవాసం సమయంలో కష్టాలను అనుభవిస్తున్న ధర్మరాజు.. శ్రీకృష్ణుడిని వాటి నుంచి గట్టెక్కేందుకు ఏదైనా వ్రతం ఉంటే చెప్పమన్నాడు. అప్పుడు కృష్ణుడు అనంతపద్మనాభ వ్రతాన్ని భాద్రపద శుక్లచతుర్దశినాడు చేయమని చెప్పాడట. కష్టాలలో మునిగి ఉన్నప్పుడు బయటపడటానికి ఓ ఉత్తమ సాధనంగా ఈ వ్రతాన్ని భావించటం తరతరాలుగా వస్తోంది. 💥#అనంతపద్మనాభ_వ్రతం: ఈ వ్రతంలో భూభారాన్ని వహిస్తున్న అనంతుడిని, ఆ ఆదిశేషుడిని శయ్యగా చేసుకొని పవళించి ఉన్న శ్రీమహావిష్ణువును పూజించటం కనిపిస్తుంది. 💥#వ్రతవిధానము: వ్రతం విధివిధానాలు భవిష్యోత్తర పురాణంలో వివరించారు. శుచిగా స్నానమాచరించి, గృహాన్ని, పూజామందిరాన్ని శుభ్రపరుచుకోవాలి. పూజామందిరము నందు అష్టదళ పద్మాన్ని తీర్చిదిద్దాలి. ఆ పద్మం చుట్టూ రంగవల్లికలతో అలంకరించుకోవాలి. దానికి దక్షణ భాగంలో నీరు నింపిన కలశం ఉంచాలి. ముందుగా ఓ మండపాన్ని ఏర్పాటుచేసుకోవాలి . అందుల...

💥బిల్వాష్టకం.. తాత్పర్య సహితం.

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ🌹🙏 💥బిల్వాష్టకం.. తాత్పర్య సహితం. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మపాపసంహారం ఏకబిల్వం శివార్పణం ☘️తాత్పర్యము: మూడు దళాలు కలిగిన, మూడు గుణాలకు ప్రతీకగా, మూడు కన్నులవలె, మూడు ఆయుధాలుగా, మూడు జన్మాల పాపాన్ని నాశనం చేసే ఒక బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః శివపూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం ☘️తాత్పర్యము: మూడు శాఖలు కలిగి, రంధ్రములు లేని, కోమలంగా, శుభము కలిగించే బిల్వపత్రంతో శివునికి పూజ చేస్తున్నాను. అఖండ బిల్వ పత్రేణ పూజితే నందికేశ్వరే శుద్ధ్యంతి సర్వపాపేభ్యో ఏకబిల్వం శివార్పణం ☘️తాత్పర్యము: ఛిద్రం కాని ఒక్క పత్రాన్ని నందికి సమర్పిస్తే సర్వ పాపాలను కడిగి వేసే బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. సాలిగ్రామ శిలామేకాం విప్రాణాం జాతు చార్పయేత్ సోమయజ్ఞ మహాపుణ్యం ఏకబిల్వం శివార్పణం ☘️తాత్పర్యము: సాలగ్రామాన్ని బ్రాహ్మణునికి దానం చేస్తే, సోమ యాగం చేస్తే వచ్చే ఫలాన్ని ఇచ్చే బిల్వ పత్రాన్ని శివునికి సమర్పిస్తున్నాను. దంతికోటి సహస్రాణి వాజపేయ శతాని చ కోటికన్యా మహాదానం ఏకబిల్వం శివార్పణం ...

⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏

💥ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి?

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 నీ పాద కమల సేవయు నీ పాదార్చకుల తోడి నెయ్యమును నితాం తాపార భూతదయయును తాపస మందార! నాకు దయసేయగదే! 💥 ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు? అనేవి ఈ చిన్న పద్యం తెలియజేస్తుంది. "అధికారం" కోరలేదు. దానివల్ల అహంకారం పెరుగుతుంది కాబట్టి. అది రజోగుణ లక్షణం. అది చివరికి దుఃఖదాయకం అవుతుంది. ధనం కోరుకోలేదు. ‘ధనమెచ్చిన మదమెచ్చును’ అనేది ఉండనే ఉన్నది. 💥ముచ్చటైన మూడు కోర్కెలు.. 1) "నీ పాద కమల సేవయు" భగవంతుడు సేవ్యుడు (సేవించదగిన వాడు). భక్తుడు సేవకుడు. భగవానుడి పాదసేవ వల్ల అహంకారం పరిహారం అవుతుంది. అది సత్వ గుణ లక్షణం. కాబట్టి క్రమంగా దివ్యానంద ప్రదమైన భగవత్‌ సన్నిధానానికి దారితీస్తుంది. 2) "నీ పాదార్చకుల తోడి నెయ్యము" అంటే ‘నీ పాదాలను అర్చించేవారితో స్నేహం ప్రసాదించమ’ని అడిగాడు. భగవదర్చన వల్ల క్రమంగా అహంకారం మాయమవుతుంది. అహంకారం లేనివాడు అలాంటివారితోనే స్నేహం చేయాలి కానీ, అహంకారులతో కాదు. చేసినా అది కలకాలం నిలువదు.  3) "నితాంతాపారభూతదయ" ఎల్లప్పుడూ అపారమైన భూతదయ ఉండాలని కోరుకున్నాడు. ప్రాణులపట్ల దయ ఏ ఒక్కసందర్భం లోనో కా...

💥 శ్రీ వామన స్తోత్రం 💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 శ్రీ వామన స్తోత్రం 💥 అదితిరువాచ | యజ్ఞేశ యజ్ఞపురుషాచ్యుత తీర్థపాద తీర్థశ్రవశ్రవణ మంగళనామధేయ | ఆపన్నలోకవృజినోపశమోదా ద్య శం నః కృధీశ భగవన్నసి దీననాథః || 1 || విశ్వాయ విశ్వభవనస్థితి సంయమాయ స్వైరం గృహీతపురుశక్తిగుణాయ భూమ్నే | స్వస్థాయ శశ్వదుపబృంహితవూర్ణబోధ- వ్యాపాదితాత్మతమసే హరయే నమస్తే || 2 || ఆయుః పరం వపురభీష్టమతుల్యలక్ష్మీ- ద్యౌభూరసాస్సకలయోగగుణాస్త్రివర్గః | జ్ఞానం చ కేవలమనంత భవంతి తుష్టా- త్త్వత్తో నృణాం కిము సపత్నజయాదిరాశీః || 3 || ఇతి శ్రీమద్భాగవతే శ్రీవామనస్తోత్రం!! ⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

💥భాద్రపద శుద్ధ ద్వాదశి – వామన_జయంతి💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥భాద్రపద శుద్ధ ద్వాదశి – వామన_జయంతి💥 శ్రీ మహావిష్ణువు “వామన మూర్తి” గా ఈ భువిపై అవతరించిన రోజు “వామన ద్వాదశి” లేదా “వామన జయంతి” అని అంటారు.  బలి చక్రవర్తి ప్రహ్లాదుని మనుమడు. (ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు, విరోచనుడి కుమారుడే ఈ బలి చక్రవర్తి), గొప్ప దానవ వీరుడు మరియు అపర దానశీలి. దానవ వంశములో జన్మించినా ఎన్నో దాన ధర్మాలు, అశ్వమేధ యాగాలు చేసాడు మరియు ధర్మ బద్ధంగా రాజ్య పాలన చేసాడు. ఒకనాడు బలి చక్రవర్తి తన కులగురువైన శుక్రాచార్యులు తనకై చేసిన ”విశ్వజిత్ యాగ” ఫలితంగా దివ్య ధనస్సు , అక్షయాలైన అమ్ముల పొది, బంగారు రథం, దివ్య కవచం పొంది దానవ సైన్యంతో ఇంద్రలోకం మీద దండయాత్ర చేసి ఇంద్రున్ని జయించి ఆ లోకాన్ని కైవసం చేసుకుంటాడు. రాక్షసుల ధాటికి దేవతలు భయపడి పోయి చెల్లాచెదురై పోయారు. ఇంద్రుడిరాజధానిని బలి చక్రవర్తి ఆక్రమించాడు. "శుక్రాచార్యుడు విశ్వజిత్తనే యాగం జరిపించి రాక్షసులకు ఎంతో శక్తిని సంపాదించి పెట్టాడు. వాళ్ళనిప్పుడు జయించడం చాలా కష్టం. మంచి రోజులు వచ్చేంత వరకు మీరెక్కడైనా తలదాచుకొని కాలం గడపండి” అని హితవు చెప్పాడు దేవతల గురువైన బృహస్పతి. తన బిడ్...

⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏

💥భాద్రపద శుద్ధ ఏకాదశి.. పరివర్తనఏకాదశి (వామన ఏకాదశి)

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ🌹🙏 💥 భాద్రపద శుద్ధ ఏకాదశి.. పరివర్తనఏకాదశి (వామన ఏకాదశి) శ్రీమన్నారాయణుడు భక్తవత్సలుడు. లోక కల్యాణం కోసం అనేక అవతారాలను ధరించడం.. తన భక్తులకు ఇచ్చిన మాటకు కట్టుబడి అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించడం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తూ ఉంటుంది. శ్రీమన్నారాయణుడిని ‘ఏకాదశి’ రోజున పూజించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. 💥పరివర్తన ఏకాదశి💥 తొలి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున శేష శయ్యపై యోగ నిద్రలోకి జారుకున్న శ్రీమహావిష్ణువు, భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున ఒక వైపు నుంచి మరో వైపుకి ఒత్తిగిల్లుతాడట. ఈ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు శయన భంగిమలో ఒకవైపు నుంచి మరోవైపుకి తిరుగుతాడు కనుక, దీనిని "పరివర్తన ఏకాదశి"గా పిలుస్తుంటారు. ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి..  పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి.. ఉపవాస దీక్షను చేపట్టి.. జాగరణకి సిద్ధపడి శ్రీమహావిష్ణువును పూజించవలసి వుంటుంది.  ఓం వాసుదేవ జగన్నాథ ప్రాప్తేయం ద్వాదశీ తవ పార్శ్వేన పరివర్తస్య సుఖం స్వపిహి మాధవ -అంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ స్వామిని యధాశక్తి పూజించడం వలన, అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయని చెప్పబ...

⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏

⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏 లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం తాత్పర్యం: లక్ష్మీ దేవీ! పాల సముద్రపు రాజు కూతురువై, శ్రీరంగధామమునకు అధిపతివై, దాస దాసీ జనులను, సమస్త దేవతా స్త్రీలను, లోకములన్నింటిని ప్రకాశింప జేయు దీప జ్యోతివి నీవు. బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు మొదలయిన వారు కూడ శ్రీమంతురాలగు నీ చల్లని చూపులచే వైభవమును పొందిరి. ముల్లోకములు నీ కుటుంబమే. పద్మములో పుట్టిన, విష్ణువుకు ఇష్ట సఖివైన ఓ! లక్ష్మీ దేవీ, నీకు నమస్కారములు. మహాలక్ష్మీ సర్వమంగళకారిణి, ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమష్టి రూపమే మహాలక్ష్మీ దేవి. సృష్ట్యాదిలో దేవి... సృష్టిని పాలించడానికి విష్ణువుకు తోడుగా ఉండమని లక్ష్మీ దేవిని ప్రసాదించిందని దేవీభాగవతంలో ఉంది. ఒకసారి లక్ష్మీదేవి విష్ణువు నుండి వేరు కావడంతో విష్ణువు శక్తి హనుడయ్యాడు. భృగు మహర్షి భార్య ఖ్యాతి. ఆమె పుత్రికా సంతానానికై తపస్సు చేస్తే ఆదిపరాశక్తి అంశతో ఆమె భార్గవిగా జన్మించింది. ...

⚜️🕉️🚩 ఓం గురు దక్షిణామూర్తయే నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం గురు దక్షిణామూర్తయే నమః 🌹🙏

💥శ్రీ దత్త తత్త్వం💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ దత్తాయ నమః🌹🙏 దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తి హరంవందే స్మర్తృగామీ సనోవతు॥ మహా తపస్సంపన్నుడు అత్రి మహర్షికీ, పతివ్రతా శిరోమణి అనసూయాదేవికి కలిగిన పుణ్య సంతానమే దత్తాత్రేయ స్వామి. సత్వ, రజో, తమో గుణాలు లేనివాడు అ‘త్రి’ మహర్షి. న+ అసూయ అసూయా గుణం లేని, మరోవిధంగా చెబితే మాయను వదిలిన తత్వం గలది అనసూయా మాత. అందుకే త్రిగుణాతీతుడై మాయారహితుడైన అవధూత స్వరూపంగా దత్తాత్రేయుడు ఉద్భవించాడు. అత్రి తనయుడు కనుక ఆత్రేయుడు, తనకు తానుగా దత్తమయినాడు (తల్లిదండ్రులకు ఇవ్వబడినాడు) కాబట్టి దత్తుడు. వెరసి దత్తాత్రేయుడు అయ్యాడు. "గురుదత్తా! జగత్తును అంధకారం నుంచి కాంతిమార్గంలోకి నడిపించడానికి అవతరించిన జగద్గురువు నువ్వు" అని తల్లిదండ్రుల నుంచి ఆశీఃపూర్వక అభినందనలు పొందిన దత్తుడు. దత్తాత్రేయునిది జ్ఞానావతారం. విష్ణుమూర్తి ఏకవింశతి (21) అవతారాలలో ఆరోది దత్తరూపం. ఆయన కరుణా సముద్రుడు. ఒక్కోసారి భక్తులను కఠిన పరీక్షలకు గురిచేస్తాడు. ఆయన కనబరిచే ప్రతి లీలా ఓ సత్యాన్ని ఆవిష్కరిస్తుంది. ఓ తత్వాన్ని బోధిస్తుంది. అవతార లక్ష్యం పూర్తికాగానే విష్ణుమూర్తి ఆ అవతారం చాలించడం కనిప...

💥శ్రీ నృసింహ పంచామృత స్తోత్రం (శ్రీరామ కృతం)

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏 త్రేతాయుగమున శ్రీరాముల వారు దండకారణ్యమున సీతాన్వేషణకై వెళ్ళినప్పుడు అహోబిల నరసింహస్వామిని దర్శించి "నృసింహ పంచామృత స్తోత్రం"తో ఆరాధించినట్లు పురాణం చెబుతుంది. శ్రీరాముడు అహోబిలంలోని నరసింహుని ఆలయాన్ని సందర్శించినప్పుడు ఈ ప్రార్థనను రచించాడు. ప్రతి చరణం అమృతం లాంటిది కనుక దానిని "పంచామృతం" అంటారు. 💥శ్రీ నృసింహ పంచామృత స్తోత్రం (శ్రీరామ కృతం) అహోబిలం నారసింహం గత్వా రామః ప్రతాపవాన్ | నమస్కృత్వా శ్రీనృసింహం అస్తాషీత్ కమలాపతిమ్ || 1 || గోవింద కేశవ జనార్ధన వాసుదేవ విశ్వేశ విశ్వ మధుసూదన విశ్వరూప | శ్రీపద్మనాభ పురుషోత్తమ పుష్కరాక్ష నారాయణాచ్యుత నృసింహ నమో నమస్తే || 2 || దేవాః సమస్తాః ఖలు యోగిముఖ్యాః గంధర్వ విద్యాధర కిన్నరాశ్చ | యత్పాదమూలం సతతం నమంతి తం నారసింహం శరణం గతోస్మి || 3 || వేదాన్ సమస్తాన్ ఖలు శాస్త్రగర్భాన్ విద్యాబలే కీర్తిమతీం చ లక్ష్మీమ్ | యస్య ప్రసాదాత్ సతతం లభంతే తం నారసింహం శరణం గతోస్మి || 4 || బ్రహ్మా శివస్త్వం పురుషోత్తమశ్చ నారాయణో సౌ మరుతాం పతిశ్చ | చంద్రార్క వాయ్వగ్ని మరుద్గణాశ్చ త్వమేవ తం త్వాం సతతం నతోస్మ...

💥పురాణాలలో గణపతి💥

Image
 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏 💥పురాణాలలో గణపతి💥 గణేశుని పుట్టుకకు సంబంధించి ఎన్నో పురాణ గాధలు ఉన్నాయి. వేదవ్యాసుడు వ్రాసిన 18 పురాణాలు ఒక్కొక్క రకమైన ఉత్పత్తి క్రమాన్ని వివరిస్తున్నాయి. అయితే, ఈ కథనాలను పరస్పర విరుద్ధాలైనవిగా కాకుండా, ఒక్కొక్క కల్పంలో జరిగిన వాటిగానే అర్థం చేసుకోవాలి. ఆవిధంగా ఇప్పుడు వినాయకుని ఆవిర్భావ ఘట్టాలు కొన్నింటిని చూద్దాం! "పినాకి భార్యా తనుజ మృద్భవ" అన్న విధంగా గౌరీదేవి దేహ వ్యర్థం నుండి గణేశుడు జన్మించాడనే స్కాందపురాణంలోని కథ బహుప్రసిద్ధిని పొందింది.  బ్రహ్మవైవర్త పురాణంలో పుత్రభిక్షకై పార్వతి, శ్రీమన్నారాయణుడిని ప్రార్థించగా, వైకుంఠవాసుని వరం వల్ల గణపతి ఆవిర్భావం జరిగిందని తెలుస్తోంది. పురాణ కథ ఏదైనా, విఘ్నేశ్వరుని ఆవిర్భావం పరమశివుని సంకల్పానికి అనుగుణంగానే జరిగింది. పురాణాలలో మహాగణపతి వైభవం అనేక విధాలుగా వర్ణించాడు వేదవ్యాసుడు. మహాశివుని వైభవాన్ని వివరించడానికై ఆవిర్భవించిన లింగపురాణం గణేశుణ్ణి వేనోళ్ళా కొనియాడింది. "తవావతారో దైత్యానాం వినాశాయ మమాత్మజ దేవానాం – ఉపకారార్థం ద్విజానాం బ్రహ్మవాదినాం" - అంటూ సదాశివుడు తన పుత్రుణ్ణి ఆశీర్వ...

💥దారిద్ర్య దహన శివస్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩ఓం నమః శివాయ🌹🙏 💥దారిద్ర్య దహన శివస్తోత్రం💥 విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ । కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 1 ॥ గౌరీప్రియాయ రజనీశ కళాధరాయ కాలాంతకాయ భుజగాధిప కంకణాయ । గంగాధరాయ గజరాజ విమర్ధనాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 2 ॥ భక్తప్రియాయ భవరోగ భయాపహాయ ఉగ్రాయ దుఃఖ భవసాగర తారణాయ । జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 3 ॥ చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ ఫాలేక్షణాయ మణికుండల మండితాయ । మంజీరపాదయుగళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 4 ॥ పంచాననాయ ఫణిరాజ విభూషణాయ హేమాంకుశాయ భువనత్రయ మండితాయ ఆనంద భూమి వరదాయ తమోపయాయ । దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 5 ॥ భానుప్రియాయ భవసాగర తారణాయ కాలాంతకాయ కమలాసన పూజితాయ । నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 6 ॥ రామప్రియాయ రఘునాథ వరప్రదాయ నాగప్రియాయ నరకార్ణవ తారణాయ । పుణ్యాయ పుణ్యభరితాయ సురార్చితాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 7 ॥ ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ గీతాప్రియాయ వృషభేశ్వర వాహనాయ । మాతంగచర్మ వసనాయ మహేశ్వరాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శి...

💥ద్వాదశ జ్యోతిర్లింగాలు💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥ద్వాదశ జ్యోతిర్లింగాలు💥 జ్యోతి స్వరూపుడైన మహేశ్వరుడు, ఈ పవిత్ర భారతావనిలో పన్నెండు చోట్ల, జ్యోతిర్లింగ స్వరూపంలో వెలసి భక్తులను కరుణిస్తున్నాడు. భారతదేశంలోని నాలుగు దిక్కులలో పన్నెండు జ్యోతిర్లింగాలున్నాయి. 💥సముద్రపు ఒడ్డున రెండు..  బంగాళాఖాత తీరంలో రామేశ్వర లింగం, అరేబియా సముద్ర తీరాన సోమనాథ లింగం. 💥పర్వతశిఖరాలలో నాలుగు.. శ్రీశైలంలో మల్లికార్జునుడు, హిమాలయాలలో కేదారేశ్వరుడు, సహ్యాద్రి పర్వతాలలో భీమశంకరుడు, మేరుపర్వతాలపై వైద్యనాథ లింగం. 💥మైదాన ప్రదేశాలలో మూడు.. దారుకా వనంలో నాగేశ్వర లింగం, ఔరంగాబాద్ వద్ద ఘృష్టేశ్వర లింగం, ఉజ్జయినీ నగరంలో మహాకాళేశ్వర లింగం, 💥నదుల ఒడ్డున మూడు.. గోదావరీ తీరాన త్ర్యంబకేశ్వర లింగం, నర్మదా తీరాన ఓంకారేశ్వరుడు, గంగానదీ తీరాన విశ్వేశ్వరుడు. ఇలా, మొత్తం పన్నెండు జ్యోతిర్లింగ రూపాలలోనున్న ఈ లింగాలు పరమశివుని తేజస్సులు. ఇవి ద్వాదశాదిత్యులకు ప్రతీకలు. పదమూడవ లింగం కాల లింగం. తురీయావస్థను పొందిన జీవుడే కాల లింగము. 💥తైత్తీరీయో పనిషత్తును అనుసరించి, 1. బ్రహ్మ 2. మాయ 3. జీవుడు 4. మనస్సు 5. బుద్ధి 6. చిత్తము 7. అహంకారము 8. పృ...

భాద్రపద శుద్ధ పంచమి.. ఋషిపంచమి.

Image
 ⚜️🕉️🚩 సప్తఋషిభ్యో నమః🌹🙏 భాద్రపద శుద్ధ పంచమి.. ఋషిపంచమి. కశ్యపత్రి ర్భరద్వాజో విశ్వా మిత్రోథ గౌతమః| వసిష్ఠో జమదగ్నిశ్చ సప్తయతే ఋషయస్తథా|| కశ్యపుడూ, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వసిష్ఠుడు, జమదగ్ని ఈ ఏడుగురు సప్తఋషులు. ఋషి పంచమి రోజున అత్రి, కశ్యప, భరద్వాజ, గౌతమ, వశిష్ట, విశ్వామిత్ర మహర్షుల గురించి ఒక్కసారైనా తలచుకోవాలని చెబుతారు పెద్దలు. అరణ్యవాసంలో సీతారాములకు అభయమిచ్చినవాడు అత్రి మహర్షి. సాక్షాత్తూ శ్రీహరినే పుత్రునిగా పొందిన మహానుభావుడు. సీతారాములకు చిత్రకూటానికి దారి చూపినవాడు భరద్వాజ మహర్షి. తన భార్య అహల్య ద్వారా రామునికి తన తప:ఫలాన్ని అందింపజేసిన మహారుషి గౌతముడు. రాముని గురువు విశ్వామిత్రుడు. కులగురువు వశిష్టుడు. విష్ణువు అంశావతారమైన పరశురాముని కన్న తండ్రి జమదగ్ని మహర్షి. దశావతారాల్లో ఒకటైన వామనుడి జనకుడు కశ్యపమహర్షి. ఋషిపంచమినాడు రామాయణం చదివితే ఈ మహర్షులందరినీ తలుచుకున్నట్టే. 💥సప్తఋషి ధ్యాన శ్లోకములు💥 కశ్యప ఋషి: కశ్యపస్సర్వ లోకాఢ్యః సర్వ శాస్త్రార్థ కోవిదః| ఆత్మయోగ బలేనైవ సృష్టి స్థిత్యంత కారకః|| ఓం అదితి సహిత కశ్యపాయ నమః|| అత్రి ఋషి: అగ్నిహోత్రరతం శాంతం...

💥సంకట నాశన గణేశ స్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏 💥సంకట నాశన గణేశ స్తోత్రం💥 నారద ఉవాచ । ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకమ్ । భక్తావాసం స్మరేన్నిత్యమాయుష్కామార్థసిద్ధయే ॥ 1 ॥ ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకమ్ । తృతీయం కృష్ణపింగాక్షం గజవక్త్రం చతుర్థకమ్ ॥ 2 ॥ లంబోదరం పంచమం చ షష్ఠం వికటమేవ చ । సప్తమం విఘ్నరాజం చ ధూమ్రవర్ణం తథాష్టమమ్ ॥ 3 ॥ నవమం భాలచంద్రం చ దశమం తు వినాయకమ్ । ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననమ్ ॥ 4 ॥ ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః । న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధికరం పరమ్ ॥ 5 ॥ విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ లభతే ధనమ్ । పుత్రార్థీ లభతే పుత్రాన్మోక్షార్థీ లభతే గతిమ్ ॥ 6 ॥ జపేద్గణపతిస్తోత్రం షడ్భిర్మాసైః ఫలం లభేత్ । సంవత్సరేణ సిద్ధిం చ లభతే నాత్ర సంశయః ॥ 7 ॥ అష్టభ్యో బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వా యః సమర్పయేత్ । తస్య విద్యా భవేత్సర్వా గణేశస్య ప్రసాదతః ॥ 8 ॥ ఇతి శ్రీనారదపురాణే సంకష్టనాశనం నామ గణేశ స్తోత్రమ్ ।

💥భాద్రపదమాసం శుక్ల చతుర్థి.. వినాయకచవితి

Image
 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః🌹🙏 💥భాద్రపదమాసం శుక్ల చతుర్థి.. వినాయకచవితి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ! నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా!! వక్రతుండుడైన గజాననుడు కోటి సూర్యులతో సమానమైన కాంతితో ప్రకాశిస్తూ... భక్తుల ప్రార్థనలను మన్నించే మహితాత్ముడు. భక్తితో ఆయనను కొలిచిన వారికి ఏ విఘ్నం కలుగదనేది విశ్వాసం. 💥💥సూత మహాముని శౌనకాది మహా మునులకు విఘ్నేశ్వరుని కథ ఇలా చెప్పాడు. 💥విఘ్నేశ్వరుని కథ: "పూర్వం గజ రూపం కల రాక్షసుడొకడు పరమ శివుని కొరకు ఘోరమైన తపస్సు చేసాడు. అతని తపస్సుకు మెచ్చి భక్త సులభుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై 'భక్తా! నీ కోరికేమి?' అని అడుగగా, ఆ రాక్షసుడు, స్వామీ! నీవు ఎల్లప్పుడూ నా ఉదరం నందే నివసించాలి' అని కోరాడు. శివుడు అతని కోరికను మన్నించి, గజాసురుని కడుపులో ప్రవేశించి నివసించసాగాడు. కొద్ది రోజులకు పార్వతీ దేవికి ఈ విషయం తెలిసి చాలా విచారించి, మహా విష్ణువును ప్రార్థించి, 'ఓ దేవదేవా! ఇంతకు ముందు కూడా మీరే నా భర్తను యుక్తితో భస్మాసురుని బారి నుంచి కాపాడారు. ఇప్పుడు కూడా మీరే ఏదైనా ఉపాయంతో, మహా శివుని కాపాడవలసింది'  అని వేడుకుంది. శ్రీహరి ఆమ...

💥ఏకవింశతి పత్రపూజ💥

Image
 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏 💥ఏకవింశతి పత్రపూజ💥 "ఏకవింశతి పత్రపూజ" అనేది "ఏకవింశతి" అనగా 21 విధముల పత్రములతో చేయు పూజ. వినాయక వ్రతకల్పము లో ఈ పూజ ప్రధానమైనది. ఈ పత్రాలన్నింటిలో అనేక ఔషధగుణాలు కలిగి వుంటాయి. ఆయా కాలాలలో వచ్చే రోగాలను కాలానుగుణంగా నయం చేయడం ఈ పత్రాల ప్రత్యేకత. గణనాథుని పూజించే నెపంతో మన పూర్వికులు 21 రకాల పత్రాలలోని ఔషధ గుణాలను మనకు సూచించారు. 💥ఏకవింశతి పత్రములు💥 మాచి పత్రము బృహతి పత్రము బిల్వపత్రము దూర్వ పత్రము దత్తూర పత్రము బదరి పత్రము ఆపామార్గ పత్రము తులసి పత్రము చూత పత్రము కరవీర పత్రము విష్ణుక్రాంత పత్రము దాడిమ పత్రము దేవదారు పత్రము మరుతక పత్రము సింధువార పత్రము జాజి పత్రము గలడలి పత్రము శమి పత్రము అస్వత్థ పత్రము అర్జున పత్రము అర్క పత్రములు 💥వినాయకుని ఏకవింశతి పత్రపూజ💥 సుముఖాయనమః - మాచీపత్రం పూజయామి। గణాధిపాయ నమః - బృహతీపత్రం పూజయామి। ఉమాపుత్రాయ నమః - బిల్వపత్రం పూజయామి। గజాననాయ నమః - దుర్వాయుగ్మం పూజయామి హరసూనవేనమః - దత్తూరపత్రం పూజయామి। లంబోదరాయనమః - బదరీపత్రం పూజయామి। గుహాగ్రజాయనమః - అపామార్గపత్రం పూజయామి। గజకర్ణాయనమః - తులసీపత్రం పూజయామి...