💥ద్వాదశ జ్యోతిర్లింగాలు💥
⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏
💥ద్వాదశ జ్యోతిర్లింగాలు💥
జ్యోతి స్వరూపుడైన మహేశ్వరుడు, ఈ పవిత్ర భారతావనిలో పన్నెండు చోట్ల, జ్యోతిర్లింగ స్వరూపంలో వెలసి భక్తులను కరుణిస్తున్నాడు.
భారతదేశంలోని నాలుగు దిక్కులలో పన్నెండు జ్యోతిర్లింగాలున్నాయి.
💥సముద్రపు ఒడ్డున రెండు..
బంగాళాఖాత తీరంలో రామేశ్వర లింగం,
అరేబియా సముద్ర తీరాన సోమనాథ లింగం.
💥పర్వతశిఖరాలలో నాలుగు..
శ్రీశైలంలో మల్లికార్జునుడు,
హిమాలయాలలో కేదారేశ్వరుడు,
సహ్యాద్రి పర్వతాలలో భీమశంకరుడు,
మేరుపర్వతాలపై వైద్యనాథ లింగం.
💥మైదాన ప్రదేశాలలో మూడు..
దారుకా వనంలో నాగేశ్వర లింగం,
ఔరంగాబాద్ వద్ద ఘృష్టేశ్వర లింగం,
ఉజ్జయినీ నగరంలో మహాకాళేశ్వర లింగం,
💥నదుల ఒడ్డున మూడు..
గోదావరీ తీరాన త్ర్యంబకేశ్వర లింగం,
నర్మదా తీరాన ఓంకారేశ్వరుడు,
గంగానదీ తీరాన విశ్వేశ్వరుడు.
ఇలా, మొత్తం పన్నెండు జ్యోతిర్లింగ రూపాలలోనున్న ఈ లింగాలు పరమశివుని తేజస్సులు. ఇవి ద్వాదశాదిత్యులకు ప్రతీకలు.
పదమూడవ లింగం కాల లింగం. తురీయావస్థను పొందిన జీవుడే కాల లింగము.
💥తైత్తీరీయో పనిషత్తును అనుసరించి,
1. బ్రహ్మ 2. మాయ 3. జీవుడు 4. మనస్సు
5. బుద్ధి 6. చిత్తము 7. అహంకారము 8. పృథ్వి
9. జలము 10.తేజస్సు 11. వాయువు 12. ఆకాశం
ఈ పన్నెండు తత్త్వాలే, పన్నెండు జ్యోతిర్లింగాలు. ఇవన్నీ ప్రతీకాత్మకంగా మన శరీరంలో ఉన్నాయి.
ఖాట్మండులోని, పశుపతినాథ లింగం ఈపన్నెండు జ్యోతిర్లింగాలకు శిరస్సు వంటిది.
ఈ జ్యోతిర్లింగాలలొ, ఒక్కొక్క జ్యోతిర్లింగానికి, ఒక్కొక్క మహిమఉంది. ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించినా, స్పృశించినా, అనేక మహిమలు మన జీవితాలలొ ప్రస్ఫుటమవుతుంటాయి.
పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకోలేనివారు, కనీసం ఒక్క లింగాన్నైనా దర్శించగలిగితే అనంత కోటి పుణ్యం లభిస్తుందనేది పెద్దల వాక్కు.
🍁🍁🍁🍁🍁
💥#ద్వాదశజ్యోతిర్లింగ_స్తోత్రం💥
💥లఘు స్తోత్రం:
సౌరాష్ట్రే సోమనాధంచ శ్రీశైలే మల్లికార్జునమ్ ।
ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారేత్వమామలేశ్వరమ్ ॥
పర్ల్యాం వైద్యనాధంచ ఢాకిన్యాం భీమ శంకరమ్ ।
సేతుబంధేతు రామేశం నాగేశం దారుకావనే ॥
వారణాశ్యాంతు విశ్వేశం త్రయంబకం గౌతమీతటే ।
హిమాలయేతు కేదారం ఘృష్ణేశంతు విశాలకే ॥
ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః ।
సప్త జన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ॥
💥#సంపూర్ణ_స్తోత్రం:
సౌరాష్ట్రదేశే విశదేఽతిరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసమ్ ।
భక్తప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే ॥ 1 ॥
శ్రీశైలశృంగే వివిధప్రసంగే శేషాద్రిశృంగేఽపి సదా వసంతమ్ ।
తమర్జునం మల్లికపూర్వమేనం నమామి సంసారసముద్రసేతుమ్ ॥ 2 ॥
అవంతికాయాం విహితావతారం ముక్తిప్రదానాయ చ సజ్జనానామ్ ।
అకాలమృత్యోః పరిరక్షణార్థం వందే మహాకాలమహాసురేశమ్ ॥ 3 ॥
కావేరికానర్మదయోః పవిత్రే సమాగమే సజ్జనతారణాయ ।
సదైవ మాంధాతృపురే వసంతం ఓంకారమీశం శివమేకమీడే ॥ 4 ॥
పూర్వోత్తరే ప్రజ్వలికానిధానే సదా వసం తం గిరిజాసమేతమ్ ।
సురాసురారాధితపాదపద్మం శ్రీవైద్యనాథం తమహం నమామి ॥ 5 ॥
యం డాకినిశాకినికాసమాజే నిషేవ్యమాణం పిశితాశనైశ్చ ।
సదైవ భీమాదిపదప్రసిద్ధం తం శంకరం భక్తహితం నమామి ॥ 6 ॥
శ్రీతామ్రపర్ణీజలరాశియోగే నిబధ్య సేతుం విశిఖైరసంఖ్యైః ।
శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి ॥ 7 ॥
యామ్యే సదంగే నగరేఽతిరమ్యే విభూషితాంగం వివిధైశ్చ భోగైః ।
సద్భక్తిముక్తిప్రదమీశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే ॥ 8 ॥
సానందమానందవనే వసంతం ఆనందకందం హతపాపబృందమ్ ।
వారాణసీనాథమనాథనాథం శ్రీవిశ్వనాథం శరణం ప్రపద్యే ॥ 9 ॥
సహ్యాద్రిశీర్షే విమలే వసంతం గోదావరితీరపవిత్రదేశే ।
యద్దర్శనాత్ పాతకం పాశు నాశం ప్రయాతి తం త్ర్యంబకమీశమీడే ॥ 10 ॥
మహాద్రిపార్శ్వే చ తటే రమంతం సంపూజ్యమానం సతతం మునీంద్రైః ।
సురాసురైర్యక్ష మహోరగాఢ్యైః కేదారమీశం శివమేకమీడే ॥ 11 ॥
ఇలాపురే రమ్యవిశాలకేఽస్మిన్ సముల్లసంతం చ జగద్వరేణ్యమ్ ।
వందే మహోదారతరస్వభావం ఘృష్ణేశ్వరాఖ్యం శరణం ప్రపద్యే ॥ 12 ॥
జ్యోతిర్మయద్వాదశలింగకానాం శివాత్మనాం ప్రోక్తమిదం క్రమేణ ।
స్తోత్రం పఠిత్వా మనుజోఽతిభక్త్యా ఫలం తదాలోక్య నిజం భజేచ్చ ॥
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment