భాద్రపద బహుళ తదియ - స్త్రీ సౌభాగ్యాన్ని.. సద్గతులు పొందడానికి ఆచరించే "ఉండ్రాళ్ళతద్ది" నోము.
⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏
💥భాద్రపద బహుళ తదియ - స్త్రీ సౌభాగ్యాన్ని.. సద్గతులు పొందడానికి ఆచరించే "ఉండ్రాళ్ళతద్ది" నోము.
ఈ నోముకు "మోదక తృతీయ" అని కూడా పేరు. ఉండ్రాళ్ళ నివేదన కలిగిన నోము కావడంతో ఉండ్రాళ్ళ తద్దెగా పిలవబడుతుంది. ఇది రెండు రోజుల పండుగ.
ఈ వ్రతం గురించి సాక్షాత్తు పరమ శివుడు పార్వతి దేవికి వివరించాడు అని పురాణాలూ చెబుతున్నాయి.
🌹ముందురోజు:
ఐదుగురు ముత్తైదువులకి గోరింటాకు, ముద్దపసుపు కుంకుమలు, కుంకుడు కాయలు, నువ్వులనూనె ఇచ్చి మాయింటికి తాంబూలము తీసుకోవటానికి రమ్మని ఆహ్వానించాలి. ముత్తైదువులు, నోము ఆచరించే వారు గోరింటాకు పెట్టుకొనవలెను.
🌹#రెండవరోజు:
భాద్రపద తృతీయ నాడు ఉదయాన్నే 4 గంటలకు లేచి గోంగూర పచ్చడితో భోజనము చేయవలెను.
తెల్లవారినాక అభ్యంగన స్నానమాచరించి 3 ఇళ్ళలో ఉయ్యాల ఊగవలెను. సాయంత్రం వరకు ఎటువంటి పదార్థాలు తినకుండా ఉపవాసం చేయాలి.
బియ్యపు పిండితో చేసిన ఉండ్రాళ్ళను చేసి వాటిని వండి గౌరీ దేవికి, మరో ఐదు ఉండ్రాళ్ళను ఐదుగురు ముతైదువులకు వాయనమివ్వాలి. ఇలా ఐదు సంవత్సరాల వరకు ఈ నోమును నోచుకుంటే మంచి భర్త లభిస్తాడని పెద్దలు చెబుతారు.
🌹#గౌరీపూజ:
సమస్త శుభాలను చేకూరాలని కోరుతూ మధ్యాహ్నం గౌరీ పూజను చేయాలి.
ఐదు దారపు పోగులు పోసి, ఐదు ముడులు వేసి, ఏడు తోరాలను అమ్మవారి పక్కనే వుంచి పూజించాలి.
ఒక తోరం అమ్మవారికి, ఒకటి నోముకున్నవారికి, మిగితా ఐదు, ఐదుగురు ముత్తైదువులకు కట్టాలి.
బియ్యపు పిండిలో బెల్లము కలిపి, పచ్చి చలిమిడి చేసి, ఐదు ఉండ్రాళ్ళను చేసి నైవేద్యం పెట్టాలి.
పూజ తరువాత చేతిలో అక్షింతలనుంచుకొని కథ చెప్పుకోవాలి.
🌹#వ్రతకథ:
పూర్వం ఓ వేశ్య తన సౌందర్యంతో ఆ దేశపు రాజుగారిని వశపరుచుకుంది. ఒక ఉండ్రాళ్ళతద్దె నాడు రాజుగారు ఆమెను నోము నోచుకోమని కోరారు. ఆమె అహంకారముతో దైవ నింద చేసి నోము నోచుకోలేదు.
ఫలితంగా దొంగలు ఆమె సంపదనంతా దోచుకెళ్తారు. అంతేగాక ఆమె మహా వ్యాధి బారిన పడుతుంది. తరువాత రాజ పురోహితుడి సలహాతో ఉండ్రాల తద్దె నోము నోచుకొని, తన సంపదని తిరిగి పొంది, ఆరోగ్యస్తురాలై శేష జీవితాన్ని ఆధ్యాత్మికంగా గడిపి, మరణానంతరం గౌరీ లోకానికి వెళ్ళింది.
గర్విష్టికే ఈ నోము వలన ఇంతటి సద్గతి లభించింది కదా ! సత్ప్రవర్తనతో ఉండి నోచినవారికి ఇంక ఎంత ఉన్నతమైన ఫలితముంటుందో ఊహించుకోమని ఈ కథలోని నీతి.
🌹#నైవేద్యము:
చలిమిడి, పానకం, వడపప్పు, మినపట్లు, ఉండ్రాళ్ళుతో పాటు తమకు వీలు అయిన మధుర పదార్ధాలు తయారు చేసుకుంటారు.
సాయంకాలం భక్తి శ్రద్ధలతో పసుపు వినాయుకుని, పసుపు గౌరమ్మను చేసుకుని ఆరోగ్యాన్ని సౌభాగ్యాన్ని ఇవ్వమని షోడశోపచార పూజలు చేసి, అన్ని నివేదనలు చేసి గౌరమ్మ మీద అనేక పాటలు పాడుకుని, ముత్తైదువులకు పసుపు కుంకుమలతో పాటు ఉండ్రాళ్ళు కూడా వాయనం ఇస్తారు. రాత్రి చంద్రుడిని చూసి ఉపవాస దీక్ష విరమిస్తారు.
గౌరిదేవి వద్ద పెట్టిన ప్లేటులోని తోరము చేతికి కట్టుకుని 5 గురికి భోజనము వడ్డించినాక ఒక్కొక్కరికి ఒక వాయనము ఇవ్వవలెను.
🌹#వాయనము ఇచ్చునప్పుడు...
ఇస్తి వాయనము పుచ్చుకొంటి వాయనము
ఇస్తి వాయనము పుచ్చుకొంటి వాయనము
ముమ్మాటికి ఇస్తి వాయనము ముమ్మాటికి పుచ్చుకొంటి వాయనము
వాయనము తీసుకున్నది ఎవరు.. నేనే పార్వతిని
ఇలా 5గురికి ఇవ్వవలెను.
అందరికి #తోరములు చేతికి చుట్టవలెను. ముడివేయకూడదు.
బియ్యం పిండి ముద్దతో కుందిలాగ చేసి, దానిలో ఆవునేతితో తడిపిన కుంభవత్తి పెట్టి, 5గురి విస్తరాకుల ముందు వెలిగించవలెను.
అవి ఆరినాక జ్యోతితో సహా చలిమిడిని తినవలెను. నోము చెల్లించుకునే ముత్తైదువు నెయ్యి వడ్డించినాక భోజనము చేయుదురు.
5 పోగులకు పసుపు రాసి, 3 చోట్ల పూలు ముడివేసి, 2 చోట్ల ఉత్త ముడి వేయవచ్చును. తోరము రెడీ అయినట్లు. ఈ నోము పట్టుకొనుట, పుట్టింటిలో కాని అత్తగారింటిలో కాని పట్టుకొనవచ్చును.
ఉండ్రాళ్ళ తద్ది.. భాద్రపద మాసంలో బహుళ తదియ నాడు, సరిగ్గా ఒక మాసం తర్వాత అనగా ఆశ్వీయజ మాస బహుళ తదియ నాడు అనగా విజయదశమి తర్వాత వచ్చే తదియ నాడు "అట్ల తద్ది" జరుపుకుంటారు.
ఈ రెండు పండగలు జరుపుకునే విధానం, ప్రాశస్త్యము ఒకటే కావడమే కాకుండా ఉండ్రాళ్ళ తద్ది అట్ల తద్ది కి శిక్షణ గా కూడా భావించబడేది.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment