💥భాద్రపద శుద్ధ ఏకాదశి.. పరివర్తనఏకాదశి (వామన ఏకాదశి)

 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ🌹🙏


💥భాద్రపద శుద్ధ ఏకాదశి.. పరివర్తనఏకాదశి (వామన ఏకాదశి)


శ్రీమన్నారాయణుడు భక్తవత్సలుడు. లోక కల్యాణం కోసం అనేక అవతారాలను ధరించడం.. తన భక్తులకు ఇచ్చిన మాటకు కట్టుబడి అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించడం ఇందుకు నిదర్శనంగా కనిపిస్తూ ఉంటుంది.


శ్రీమన్నారాయణుడిని ‘ఏకాదశి’ రోజున పూజించడం వలన విశేషమైన ఫలితాలు కలుగుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.


💥పరివర్తన ఏకాదశి💥


తొలి ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున శేష శయ్యపై యోగ నిద్రలోకి జారుకున్న శ్రీమహావిష్ణువు, భాద్రపద శుద్ధ ఏకాదశి రోజున ఒక వైపు నుంచి మరో వైపుకి ఒత్తిగిల్లుతాడట.


ఈ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువు శయన భంగిమలో ఒకవైపు నుంచి మరోవైపుకి తిరుగుతాడు కనుక, దీనిని "పరివర్తన ఏకాదశి"గా పిలుస్తుంటారు.


ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి..  పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి.. ఉపవాస దీక్షను చేపట్టి.. జాగరణకి సిద్ధపడి శ్రీమహావిష్ణువును పూజించవలసి వుంటుంది. 


ఓం వాసుదేవ జగన్నాథ ప్రాప్తేయం ద్వాదశీ తవ

పార్శ్వేన పరివర్తస్య సుఖం స్వపిహి మాధవ


-అంటూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ స్వామిని యధాశక్తి

పూజించడం వలన, అనంతమైన పుణ్యఫలాలు కలుగుతాయని చెప్పబడుతోంది.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు