💥ఏకవింశతి పత్రపూజ💥

 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏


💥ఏకవింశతి పత్రపూజ💥


"ఏకవింశతి పత్రపూజ" అనేది "ఏకవింశతి" అనగా 21 విధముల పత్రములతో చేయు పూజ. వినాయక వ్రతకల్పము లో ఈ పూజ ప్రధానమైనది.


ఈ పత్రాలన్నింటిలో అనేక ఔషధగుణాలు కలిగి వుంటాయి. ఆయా కాలాలలో వచ్చే రోగాలను కాలానుగుణంగా నయం చేయడం ఈ పత్రాల ప్రత్యేకత. గణనాథుని పూజించే నెపంతో మన పూర్వికులు 21 రకాల పత్రాలలోని ఔషధ గుణాలను మనకు సూచించారు.


💥ఏకవింశతి పత్రములు💥


మాచి పత్రము

బృహతి పత్రము

బిల్వపత్రము

దూర్వ పత్రము

దత్తూర పత్రము

బదరి పత్రము

ఆపామార్గ పత్రము

తులసి పత్రము

చూత పత్రము

కరవీర పత్రము

విష్ణుక్రాంత పత్రము

దాడిమ పత్రము

దేవదారు పత్రము

మరుతక పత్రము

సింధువార పత్రము

జాజి పత్రము

గలడలి పత్రము

శమి పత్రము

అస్వత్థ పత్రము

అర్జున పత్రము

అర్క పత్రములు


💥వినాయకుని ఏకవింశతి పత్రపూజ💥


సుముఖాయనమః - మాచీపత్రం పూజయామి।

గణాధిపాయ నమః - బృహతీపత్రం పూజయామి।

ఉమాపుత్రాయ నమః - బిల్వపత్రం పూజయామి।

గజాననాయ నమః - దుర్వాయుగ్మం పూజయామి

హరసూనవేనమః - దత్తూరపత్రం పూజయామి।

లంబోదరాయనమః - బదరీపత్రం పూజయామి।

గుహాగ్రజాయనమః - అపామార్గపత్రం పూజయామి।

గజకర్ణాయనమః - తులసీపత్రం పూజయామి,

ఏకదంతాయ నమః - చూతపత్రం పూజయామి,

వికటాయ నమః - కరవీరపత్రం పూజయామి।

భిన్నదంతాయ నమః - విష్ణుక్రాంతపత్రం పూజయామి,

వటవేనమః - దాడిమీపత్రం పూజయామి,

సర్వేశ్వరాయనమః - దేవదారుపత్రం పూజయామి,

ఫాలచంద్రాయ నమః - మరువకపత్రం పూజయామి,

హేరంబాయనమః - సింధువారపత్రం పూజయామి

శూర్పకర్ణాయనమః - జాజీపత్రం పూజయామి,

సురాగ్రజాయనమః - గండకీపత్రం పూజయామి,

ఇభవక్త్రాయనమః - శమీపత్రం పూజయామి,

వినాయకాయ నమః - అశ్వత్థపత్రం పూజయామి,

సురసేవితాయ నమః - అర్జునపత్రం పూజయామి।

కపిలాయ నమః - అర్కపత్రం పూజయామి।

శ్రీ గణేశ్వరాయనమః - ఏకవింశతి పత్రాణి పూజయామి.


వినాయ‌కుడిని వినాయక చవితి రోజు ప‌త్రి పెట్టి పూజిస్తే కోరిన కోరిక‌లు నెర‌వేరుతాయ‌ని భ‌క్తుల నమ్మకం.

సేకరణ... 💐🙏

























Comments

Popular posts from this blog

💥ఆషాఢమాస విశిష్టత:

💥ఆషాఢ శుద్ధ పౌర్ణమి.. 'గురుపౌర్ణమి'.. 'వ్యాసపౌర్ణమి