Posts

Showing posts from August, 2023

💥జ్యోతిర్మయ స్వరూపమే శివుడు:

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 🔱 హర హర మహాదేవ శంభో శంకర 🔱 🏵️🌼🏵️🌼🏵️ వందే పంచముఖాంబుజం త్రినయనం వందే లలాటేక్షణం వందే వ్యోమగతం జటాసుముకుటం చంద్రార్ధ గంగాధరమ్! వందే భస్మకృత త్రిపుండ్ర నిటలం వందే ష్టమూర్త్యాత్మకం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరమ్!! 💥శివుడు సకల జగాలకు పాలకుడు. లోకాలకు శోకాలను తొలగించి శుభాలనిచ్చే దేవుడు. ఈ చరాచర జగత్తును లయం చేసేవాడు. జఢమైన జగతికి చైతన్యాన్ని ప్రసాదించే 'లయ'కారకుడు.  శివుడు భక్త సులభుడు. భోళా శంకరుడు. అభిషేక ప్రియునిగా భక్తులచే పూజలందేవాడు. పరమేష్ఠిగా పూజలందే శంకరుడు స్థిరుడు, అద్వితీయుడు. సర్వమయుడు, సర్వసృష్టికి ఆదియైనవాడు. జగతికి అది గురువు దక్షిణామూర్తిగా జ్ఞాన బోధ చేసిన అఖండ విజ్ఞానస్వరూపుడు, మోక్షకారకుడు. వేదమయుడు, వేదవిభుడు, ఇంద్రాద్రి దేవతలచే సైతం తెలుసుకోలేని అనంత తత్వమయుడు. 'శివా' అని భక్తితో అన్నంతనే భక్తులను బ్రోచే శంకరుడు భక్తవశంకరుడు. తనువును పులకింపచేసేది, మానవకోటికి మోక్ష మార్గదర్శిని అయినది 'శివ పంచాక్షరి' పరమ మంత్రమైన 'ఓం నమశ్శివాయ' అనే చిన్న జపంతో, నిరంతర తపంతో సాధ్యం కాని మహాకార్యాలు సైతం మన...

నేటి తరం శ్రీరాముని వద్ద నేర్చుకోవలసిన అతి గొప్ప లక్షణం "స్థితప్రఙ్ఞత్వం"

Image
 ⚜️🕉️🚩 శ్రీ రామ జయ రామ జయజయ రామ 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ యావత్ స్థాశ్యంతి గిరయః సరితశ్చ మహీతలే! తావద్రామాయణ కథా లోకేషు ప్రచరిష్యతే!! పర్వతాలు, నదులు ఈ భూమిపై ఉన్నంత కాలం రామ కథ నిలిచి ఉంటుంది అని బ్రహ్మ అంటారు. మానవ సంబంధాలు గతి తప్పి, వికృత, విశృంఖల ప్రవర్తన వెర్రితలలు వేస్తున్న ఈ రోజుల్లో మనిషి మనిషిలా ఎలా జీవించాలన్న విషయాన్ని తెలుసుకోవడానికి శ్రీరాముని జీవితాన్ని అధ్యయనం చేయవలిసిన అవసరం మునుపటి కంటే చాలా ఎక్కువగా ఉంది ఈరోజుల్లోనే.  రామ కథా శ్రవణం, రాముని గుణగణాల అధ్యయనం, రాముని అనుసరించే ప్రయత్నం చేయడం ఎక్కువ అవసరం. రాముడిని దేవుడిగా ఆరాధిస్తూనే, రాముడి జీవితం నుంచీ మనం ఎలా జీవించాలి అన్న అంశాన్ని నేర్చుకోవడం అంత కంటే ముఖ్యం. 💥లీలా నాటక సూత్రధారి, జగదానందకారకుడైన శ్రీ మహావిష్ణువు ధర్మ సంరక్షణార్థము, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థము అనేక అవతారాలు ధరించాడు. రావణ కుంభకర్ణుల వధానంతరం కూడా సుదీర్ఘకాలం పృథ్వి పైన జీవించి మానవాళికి జీవన మార్గాన్నీ, ఆదర్శ జీవన విధానాన్ని తన జీవితమే ఉదాహరణంగా దర్శింపజేసిన అవతారం శ్రీరామావతారం. అద్భుతమైన, ఆదర్శవంతమైన గుణాలు కల రాముడు ఎక్కడా తాను భగవంతుడ...

'ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్‌’ అని సూక్తి.

Image
 ⚜️🕉️🚩ఓం ఆదిత్యాయ నమః🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥అనేక లోకాలున్నప్పటికీ మనసుకు సంతోషాన్ని కలిగించేది, తొందరగా కర్మఫల సిద్ధిని ఇచ్చేది, పరమేశ్వర సాక్షాత్కారం కలిగించేది భూలోకమే. అందులోనూ జంబూద్వీపం ప్రశస్తమైది. దానిలో భారతదేశం అత్యంత పవిత్రమైనది. వేదోక్త కర్మల అనుష్ఠానానికి, వాటి ఫలితాలు పొందడానికి భారతదేశమే తలమానికం అని స్కాంద పురాణం చెప్తున్నది. 'కుర్వన్నే వేహ కర్మాణి జిజీవిషేత్‌ శతగుం సమాః’ ఈ లోకంలో కర్మలను ఆచరిస్తూనే నూరేండ్లు జీవించి ఉండాలని కోరుకోవాలని ఈశావాస్య ఉపనిషత్తు చెప్తున్నది. మానవులకు కనిపించని సత్యధర్మాలను బోధిస్తూ, అత్యంత సుఖాన్ని కలిగించేవి పరమ ప్రమాణాలైన వేదోక్త కర్మలే! కష్టతరమైన, అవ్యక్తమైన జ్ఞాననిష్ఠ కన్నా, దేహాభిమానం కలిగిన మానవులకు కర్మానుష్ఠానమే అంటే నామ రూపాత్మకమైన సగుణోపాసనే సులభమైనది. అందరికీ ఆమోదయోగ్యమైనది కూడా. 💥అఖండమైన, అద్వితీయమైన పరబ్రహ్మం తేజోమయ అంశమే మనకు కనబడుతున్న సూర్య భగవానుడు. ఇతనే సర్వేశ్వరుడు, ప్రత్యక్ష దైవం కూడా.  చరాచరాత్మకమైన విశ్వమంతటికీ సూర్య భగవానుడే ఆత్మగా ఉన్నాడు. 'సూర్య ఆత్మా జగస్తస్థుషశ్చ’ అని శ్రుతివాక్యం. లోకాల మనుగడకు, పోషణకు, సర్...

💥గోవింద నామావళి💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ వేంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన! వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి!! 🌹బ్రహ్మాండంలో వేంకటాద్రికి సమానమైన పుణ్యక్షేత్రం లేదు. అలాగే శ్రీనివాసుడికి సాటి రాగల దేవుడు ఇటు భూతకాలంలో కానీ.. అటు భవిష్యత్తులో కానీ మరెవరూ ఉండరు... ఇదీ శ్లోకానికి అర్థం. 🍁🍁🍁🍁🍁 💥గోవింద నామావళి💥 శ్రీ శ్రీనివాసా గోవిందా శ్రీ వేంకటేశా గోవిందా భక్తవత్సలా గోవిందా భాగవతప్రియ గోవిందా నిత్యనిర్మలా గోవిందా నీలమేఘశ్యామ గోవిందా పురాణపురుషా గోవిందా పుండరీకాక్ష గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా నందనందనా గోవిందా నవనీతచోరా గోవిందా పశుపాలక శ్రీ గోవిందా పాపవిమోచన గోవిందా దుష్టసంహార గోవిందా దురితనివారణ గోవిందా శిష్టపరిపాలక గోవిందా కష్టనివారణ గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా వజ్రమకుటధర గోవిందా వరాహమూర్తివి గోవిందా గోపీజనలోల గోవిందా గోవర్ధనోద్ధార గోవిందా దశరథనందన గోవిందా దశముఖమర్దన గోవిందా పక్షివాహనా గోవిందా పాండవప్రియ గోవిందా గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా మత్స్యకూర్మ గోవిందా మధుసూధన హరి గోవిందా వరాహ నరసింహ గోవిందా వామన భృగురామ గోవి...

💥శ్రీ దుర్గా అష్టోత్తరశతనామ స్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥శ్రీ దుర్గా అష్టోత్తరశతనామ స్తోత్రం💥 దుర్గా శివా మహాలక్ష్మీ-ర్మహాగౌరీ చ చండికా । సర్వజ్ఞా సర్వలోకేశీ సర్వకర్మఫలప్రదా ॥ 1 ॥ సర్వతీర్థమయీ పుణ్యా దేవయోని-రయోనిజా । భూమిజా నిర్గుణాఽఽధారశక్తి శ్చానీశ్వరీ తథా ॥ 2 ॥ నిర్గుణా నిరహంకారా సర్వగర్వవిమర్దినీ । సర్వలోకప్రియా వాణీ సర్వవిద్యాధిదేవతా ॥ 3 ॥ పార్వతీ దేవమాతా చ వనీశా వింధ్యవాసినీ । తేజోవతీ మహామాతా కోటిసూర్యసమప్రభా ॥ 4 ॥ దేవతా వహ్నిరూపా చ సతేజా వర్ణరూపిణీ । గుణాశ్రయా గుణమధ్యా గుణత్రయవివర్జితా ॥ 5 ॥ కర్మజ్ఞానప్రదా కాంతా సర్వసంహారకారిణీ । ధర్మజ్ఞా ధర్మనిష్ఠా చ సర్వకర్మవివర్జితా ॥ 6 ॥ కామాక్షీ కామసంహర్త్రీ కామక్రోధవివర్జితా । శాంకరీ శాంభవీ శాంతా చంద్రసూర్యాగ్నిలోచనా ॥ 7 ॥ సుజయా జయభూమిష్ఠా జాహ్నవీ జనపూజితా । శాస్త్రీ శాస్త్రమయీ నిత్యా శుభా చంద్రార్ధమస్తకా ॥ 8 ॥ భారతీ భ్రామరీ కల్పా కరాళీ కృష్ణపింగళా । బ్రాహ్మీ నారాయణీ రౌద్రీ చంద్రామృతపరిస్రుతా ॥ 9 ॥ జ్యేష్ఠేందిరా మహామాయా జగత్సృష్ట్యధికారిణీ । బ్రహ్మాండకోటిసంస్థానా కామినీ కమలాలయా ॥ 10 ॥ కాత్యాయనీ కలాతీతా కాలసంహారకారిణీ । యోగనిష్ఠా యోగిగమ్యా యో...

💥సిరిసంపదల శ్రావణం...

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥సిరిసంపదల శ్రావణం... "వర్షం స్థానం విదుం ప్రాజ్ఞం ఇమం లోకం చ భారత" అన్నాడు మహాకవి భారవి. సకాల వర్షాలతో, పండితులతో మన దేశం మహోన్నతంగా ఉందనేది ఆయన నిర్వచనం. ఆ ఐశ్వర్యాలతోపాటు ఆరోగ్య వైభవాలను, శుభ కర్మ ఫలాలను ప్రసాదిస్తుంది "శ్రావణం" శ్రావణలక్ష్మిని ఆహ్వానించడానికే అన్నట్లు పుడమి పీఠాన్ని కడిగి శుభ్రం చేస్తుంది వర్షమాత. సస్య సంపదలివ్వమంటూ స్వాగతం పలుకుతుంది మహీతలం. వరాలిచ్చే తల్లి వరలక్ష్మి ఆవిర్భవించిన శ్రావణం గడప గడపకూ పండగే. శ్రావణ సోమవారం, రక్షపౌర్ణమి, నాగుల పంచమి, దామోదర ద్వాదశి, కృష్ణాష్టమి వంటి ఎన్నెన్నో పండగలు. పూజలు, పేరంటాలు, వాయన దానాలతో సాంప్రదాయ కళను మోసుకొస్తుంది. మూలాల్లోకి వెళ్తే పూర్వ గాథలేవైనా ముల్లోకాలకు సంచరించి, బ్రహ్మ, ఈశ్వరులకు వారి వారి మనఃస్థితులను బట్టి శాపమిచ్చి వైకుంఠానికి వెళ్తాడు భృగుమహర్షి. లక్ష్మి కొంగు విడవక క్రీడాసక్తుడై ఉన్న శేషశాయి, భృగు రాకను గమనించి సగౌరవంగా ఆహ్వానించేలోపే విష్ణు వక్షస్థలంపై ఎడమకాలితో తన్ని మరీ తన కోపాన్ని ప్రకటిస్తాడు ఋషి. తన తప్పిదాన్ని మన్నించమంటూ వేడుక...

💥దత్తాత్రేయ అవతారంలోని ఆంతర్యం ఏమిటి?

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీ దత్తాయ నమః🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ దత్తం దత్తం పునర్దత్తం యోవదేత్ భక్తి సంయుతః తస్య పాపాని సర్వాణి క్షయం యాంతి న సంశయః 💥దత్తాత్రేయ అవతారంలోని ఆంతర్యం ఏమిటి? మనం భగవంతుడి అవతారాలన్నీ నిశితంగా పరిశీలిస్తే దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ లక్ష్యాలుగా ఉంటాయి. ఆ ప్రత్యేకమైన విధి నిర్వహణ తర్వాత ఆ అవతారాలు పరిసమాప్తి అవుతాయి. కానీ దత్తాత్రేయ అవతారం అలాకాదు. ఆయన ఆవిర్భావం వెనక ఒక నిగూఢమైన, నిరంతరాయమైన కార్యక్రమం ఉంది. మనుషుల్లో జ్ఞాన, వైరాగ్య, ఆధ్యాత్మికోన్నతి కలిగించడం అనే ముక్కోణ ప్రణాళిక ఉంది. అందుకే భాగవత మహాపురాణం మహావిష్ణువు ధరించిన 21 అవతారాల్లో దత్తాత్రేయ అవతారాన్ని గురించి ప్రత్యేకంగా వివరించింది.   సత్త్వ, రజో, తమో గుణాలను జయించిన మహా తపశ్శాలి అత్రి మహాముని. అసూయ లేని సాధ్వీమణి అనసూయ. ఈ దంపతులిద్దరి తపో ఫలితంగా త్రిమూర్తుల అంశతో మార్గశిర పూర్ణిమనాడు దత్రాత్రేయుడు జన్మించాడు.  దత్తుడు జ్ఞానానికి ప్రతీక. ఇతర దైవాల తీరులో ఆయన రాక్షస సంహారం చేయలేదు. ఆయన దృష్టిలో మనిషిలో ఉండే అజ్ఞానం, అహంకార‌ మమకారాలే రాక్షసులు. మనిషిలోని దుర్గుణాలే అతడిని రాక్షసుడిని చేస్తాయి. అందు...

💥శ్రీ విఘ్నేశ్వర షోడశనామ స్తోత్రమ్💥

Image
 ⚜️🕉️🚩ఓం విఘ్నరాజాయ నమః🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 🌹🌹జై గణేశ జై జై గణేశా!!!🌹🌹 💥ఏ పూజ అయినా, ఏ కార్యక్రమము అయినా తొలుత  ఆచరించేది శ్రీ వినాయక పూజ. ఆ గణనాధుడికి  పూజ చేసి ప్రారంభము చేస్తే ఎటువంటి విఘ్నాలు  లేకుండా విజయము లభిస్తుంది అని నమ్మకం. విద్యారంభములోను , గృహ ప్రవేశము నందు, వివాహము నందు విఘ్నేశ్వర పూజ చేస్తే విఘ్నాలు లేకుండా ఉంటాయి. స్వామి భక్తులకు నీలాపనిందలు, విఘ్నాలు తొలగించి విజయాన్ని ప్రసాదిస్తారు. వినాయకుడు కూడా  పదహారు గుణాలు కలిగిన స్వామి కనుక ఆ స్వామిని  షోడశ నామాల  స్తోత్రముతో  పూజ ప్రారంభిస్తారు. 💥శ్రీ విఘ్నేశ్వర షోడశనామ స్తోత్రమ్💥 సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః | లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః || 1 || ధూమ్ర కేతుః గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః | వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః || 2 || షోడశైతాని నామాని యః పఠేత్ శృణు యాదపి | విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా | సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్య న జాయతే || 3 || 💥శ్రీ విఘ్నేశ్వర షోడశ నామావళిః - వివరణ💥 🍁ఓం సుముఖాయ నమః: వినాయకుడు నర ముఖముతోనే  జన్మించారు. కానీ గజ...

💥విశేష ఫలప్రదం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన

Image
 ⚜️🕉️🚩ఓం షణ్ముఖాయ నమః🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహన షడాననం | దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుటధ్వజమ్ || 💥విశేష ఫలప్రదం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన!💥 "సుబ్రహ్మణ్య" అనే పదానికి సంస్కృత భాష లో బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్న ఉత్తముడు అని అర్థం.  ఈయనను స్కందుడు, క్రౌంచధారణుడు, కుమారస్వామి, కార్తికేయుడు, శరవణభవుడు మొదలైన నామాలతో కొలుస్తారు. శతాబ్దాలుగా కొనసాగుతున్న భారతదేశంలోని అనేక సంస్కృతుల కలయికతో ఏర్పడినదే సుబ్రహ్మణ్యారాధన.  ఈయనలో శైవ - వైష్ణవ మతాలు మనకు కనిపిస్తా యి. శైవ మత పురాణాల ప్రకారం స్కందుడు శివుని పుత్రుడు. కనుక ఈయన శైవ మతానికి చెందినవాడు.  భగవద్గీతలోని విభూతి యోగములో శ్రీ కృష్ణుడు "సేనానీ నామ హం స్కన్ద” అనగా "సేనానులలో స్కందుడను నేనే” అని చెప్పడం ద్వారా ఈయన విష్ణాంశ సంభూతుని గాను, వైష్ణవ మతానికి చెందినవాడు గాను పేర్కొనవచ్చును. శివ కేశవులకు బేధం లేదని చెప్పటానికి సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్ష నిదర్శనం. స్కాంద పురాణములో కార్తికేయుని వర్ణించటం జరిగింది. శ్రీ పరమేశ్వర తేజస్సు షట్‌కృత్తికల గర్భంలో ప్రవేశింపగా, వారు దానిని భరింపలేక గంగా తీరాన వి...

💥హనుమ నామస్మరణం...సర్వపాప నివారణం💥

Image
 ⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥హనుమ నామస్మరణం...సర్వపాప నివారణం💥 మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానర యూధ ముఖ్యం శ్రీరామ దూతం శిరసానమామి 🌹వాయువేగ మనో వేగాలతో ప్రయాణించ గలవాడు, ఇంద్రియాలను జయించినవాడు, బుద్ధిమంతుడు, అందరిలోకి ఉన్నతుడు, వాయుదేవుని పుత్రుడు, వానర యోధులలోకెల్లా ముఖ్యుడు, శ్రీరామ దూత అయిన ఆంజనేయునికి నమస్కరిస్తున్నాను అని దీని అర్థం. ఈ శ్లోకాన్ని నిత్యం పఠిస్తే సకల భయాలు పోతాయి. భక్తి, శ్రద్ధలతో ఆంజనేయస్వామి ఆరాధన అన్ని రకాల శుభాలను ఇస్తుంది. భయాలను పోగొడుతుంది. 🍁🍁🍁🍁🍁 🌹🌹మంత్రాత్మక శ్రీ మారుతి స్తోత్రం🌹🌹🙏 ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ ధీమతే | నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే || ౧ || మోహశోకవినాశాయ సీతాశోకవినాశినే | భగ్నాశోకవనాయాస్తు దగ్ధలంకాయ వాగ్మినే || ౨ || గతి నిర్జితవాతాయ లక్ష్మణప్రాణదాయ చ | వనౌకసాం వరిష్ఠాయ వశినే వనవాసినే || ౩ || తత్త్వజ్ఞాన సుధాసింధు నిమగ్నాయ మహీయసే | ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయ తే || ౪ || జన్మమృత్యుభయఘ్నాయ సర్వక్లేశహరాయ చ | నేదిష్ఠాయ ప్రేతభూత పిశాచభయహారిణే || ౫ || యాతనా నాశనాయాస్తు నమో మర్కటర...

💥దారిద్ర్య దహన శివస్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩ఓం నమః శివాయ🌹🙏 🔱 హర హర మహాదేవ శంభో శంకర🔱 🏵️🌼🏵️🌼🏵️ 💥దారిద్ర్య దహన శివస్తోత్రం💥 విశ్వేశ్వరాయ నరకార్ణవ తారణాయ కర్ణామృతాయ శశిశేఖర ధారణాయ । కర్పూరకాంతి ధవళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 1 ॥ గౌరీప్రియాయ రజనీశ కళాధరాయ కాలాంతకాయ భుజగాధిప కంకణాయ । గంగాధరాయ గజరాజ విమర్ధనాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 2 ॥ భక్తప్రియాయ భవరోగ భయాపహాయ ఉగ్రాయ దుఃఖ భవసాగర తారణాయ । జ్యోతిర్మయాయ గుణనామ సునృత్యకాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 3 ॥ చర్మాంబరాయ శవభస్మ విలేపనాయ ఫాలేక్షణాయ మణికుండల మండితాయ । మంజీరపాదయుగళాయ జటాధరాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 4 ॥ పంచాననాయ ఫణిరాజ విభూషణాయ హేమాంకుశాయ భువనత్రయ మండితాయ ఆనంద భూమి వరదాయ తమోపయాయ । దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 5 ॥ భానుప్రియాయ భవసాగర తారణాయ కాలాంతకాయ కమలాసన పూజితాయ । నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 6 ॥ రామప్రియాయ రఘునాథ వరప్రదాయ నాగప్రియాయ నరకార్ణవ తారణాయ । పుణ్యాయ పుణ్యభరితాయ సురార్చితాయ దారిద్ర్యదుఃఖ దహనాయ నమశ్శివాయ ॥ 7 ॥ ముక్తేశ్వరాయ ఫలదాయ గణేశ్వరాయ గీతాప్రియాయ వృషభేశ్వర వాహనాయ । మాతంగచర్మ ...

🔱 హర హర మహాదేవ శంభో శంకర🔱🙏

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 🔱 హర హర మహాదేవ శంభో శంకర🔱🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥అనగనగా ఓ ఇంటాయన... ఇంటావిడ. ఆయనేమో మహా భోళా... ఆవిడేమో ఆయన అడుగు జాడ... దేవతలు వచ్చి విషం చేతికిచ్చి... 'అయ్యా! ఇది మమ్మల్ని దహించి వేస్తోంది. లోకం సర్వనాశనమవుతోంది. మీరే ఆదుకోగల సమర్ధులు. జన సంరక్షణలో మీదే మొదటి స్థానం' అని పొగిడారు. ఆయన అంత కాలకూటాన్నీ నేరేడు పండులా అరచేతిలోకి తీసుకున్నాడు. ఒక్కసారి భార్య ముఖంలోకి చూశాడు. ఆ తల్లి వద్దనలేదు. 'ప్రజల క్షేమం కోసమే కదా. ఫర్వాలేదు. మింగెయ్యి...' అందావిడ మంగళసూత్రాన్ని ఓసారి కళ్లకద్దుకుని. ఈ సన్నివేశానికి అద్భుతమైన పద్యరూపాన్నిచ్చాడు మహాకవి పోతన. మ్రింగెడివాడు విభుండని మ్రింగెడిదియు గరళమనియు మేలని ప్రజకున్ మ్రింగుమనె సర్వమంగళ మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో! ఆమెను సర్వ మంగళ అనడంలో ఉంది ఆయువుపట్టు. పుస్తెలతాడు మీద ఆమెకు ఎంత నమ్మకమో... అనేది పైకి కనిపించే అర్థం. కానీ సూత్రం అనే మాటకు సిద్ధాంతం అనే అర్థం కూడా ఉంది. లోకాలన్నీ సురక్షితంగా ఉండాలన్నది ఆమె సూత్రం. మంగళకరమైన ఆమె భావనల కారణంగానే ఆమె సర్వమంగళ అయింది. ఇదీ పార్వతీపరమేశ్వరుల త్యాగసంసిద్ధత. ఇంత త్యాగం ...

💥శ్రీరామ నామం సర్వ జగద్రక్షా కవచం..

Image
 ⚜️🕉️🚩 శ్రీరామ జయ రామ జయ జయ రామ 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ ఆపదామప హర్తారం దాతారం సర్వ సంపదామ్  లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ || తాత్పర్యం: ఆపదలను పోగొట్టువాడు, అన్ని సంపదలను ఇచ్చువాడు, లోకములో అతి సుందరమైన వాడైనట్టి శ్రీ రామచంద్రునికి మాటి మాటికి నమస్కరిస్తున్నాను. 🍁🍁🍁🍁🍁 💥శ్రీరామ నామం సర్వ జగద్రక్షా కవచం.. తారక మంత్రమైన "శ్రీరామ" నామము వైభవాన్ని గూర్చి వాల్మీకి నుండి నేటి వరకు ఎందరో ఋషులు, మహా కవులు ప్రశంసించి కీర్తించడం జరిగింది. "రామా" అనే నామంలో ఎంతో పరమార్థముందని పండితులు పేర్కొన్నారు. రామా (ర ఆ మా) నామంలో ర అక్షరం రుద్రుని, అ అక్షరం బ్రహ్మను, మ అక్షరం విష్ణువునీ సూచిస్తుందని, అనగా రామ నామం త్రిమూర్త్యాత్మకమైన పరబ్రహ్మ స్వరూపమని మహర్షులు పేర్కొన్నారు. శ్రీరామ నామ జపమే సమస్త తాపాలను నివృత్తి చేసే ఏకైక ఔషదం. హరునకు నవ్విభీషణునక ద్రిజకుం దిరుమంత్ర రాజమై కరికి నహల్యకుం ద్రుపదకన్యకు నార్తిహరించుచుట్టమై పరగినయట్టి నీపతిత పావననామము జిహ్వపై నిరం తరము నటింపజేయుమిక దాశరథీ కరుణాపయోనిధీ. 🌹శివుడికీ, పార్వతికీ, విభీషణుడికీ, శుభకరమగు మంత్రమై, గజేంద్రుడికీ, అహల్యకూ, ...

💥సూర్య మండల స్తోత్రం💥

Image
 🕉️⚜️🚩 ఓం ఆదిత్యాయ నమః 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥రోజు చదవలేక పోయినా వారంలో ఒకరోజు "ఆదివారం" నాడు చదివినా సమస్త పాపాల్ని హరించి పుణ్య ఫలం పెంచే స్తోత్రం. 💥సూర్య మండల స్తోత్రం💥 నమోఽస్తు సూర్యాయ సహస్రరశ్మయే సహస్రశాఖాన్విత సంభవాత్మనే । సహస్రయోగోద్భవ భావభాగినే సహస్రసంఖ్యాయుధధారిణే నమః ॥ 1 ॥ యన్మండలం దీప్తికరం విశాలం రత్నప్రభం తీవ్రమనాదిరూపమ్ । దారిద్ర్యదుఃఖక్షయకారణం చ పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ 2 ॥ యన్మండలం దేవగణైః సుపూజితం విప్రైః స్తుతం భావనముక్తికోవిదమ్ । తం దేవదేవం ప్రణమామి సూర్యం పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ 3 ॥ యన్మండలం జ్ఞానఘనంత్వగమ్యం త్రైలోక్యపూజ్యం త్రిగుణాత్మరూపమ్ । సమస్తతేజోమయదివ్యరూపం పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ 4 ॥ యన్మండలం గూఢమతిప్రబోధం ధర్మస్య వృద్ధిం కురుతే జనానామ్ । యత్సర్వపాపక్షయకారణం చ పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ 5 ॥ యన్మండలం వ్యాధివినాశదక్షం యదృగ్యజుః సామసు సంప్రగీతమ్ । ప్రకాశితం యేన చ భూర్భువః స్వః పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ 6 ॥ యన్మండలం వేదవిదో వదంతి గాయంతి యచ్చారణసిద్ధసంఘాః । యద్యోగినో యోగజుషాం చ సంఘాః పునాతు మాం తత్సవితుర్వరేణ్యమ్ ॥ 7 ॥...

🌹🌹భజగోవిందం - తాత్పర్య సహితం🌹🌹

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥అనాథరక్షక గోవిందా || ఆపధ్భాందవ గోవిందా💥 ఓం స్థాపకయ చ ధర్మస్య సర్వ ధర్మ స్వరూపిణే | అవతర వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమ: ||🌹🙏 🌹🌹భజగోవిందం - తాత్పర్య సహితం🌹🌹 భజగోవిందం భజగోవిందం  గోవిందం భజమూఢమతే | సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుకృఞ్కరణే || తాత్పర్యం: గోవిందుని భజించు, గోవిందుని భజించు, గోవిందుని భజించు. ఓ మూర్ఖా! మరణమాసన్నమైనప్పుడు నిను ఏ డుకృణ్ వ్యాకరణమూ రక్షించదు. మూఢ జహీహి ధనాగమతృష్ణాం కురు సద్బుద్ధిం మనసి వితృష్ణం | యల్లభసే నిజకర్మోపాత్తం విత్తం తేన వినోదయ చిత్తం || తాత్పర్యం: ఓ మూర్ఖుడా! ధనమును ఆర్జింపవలెనను పేరాశను విడువుము. తృష్ణారాహిత్యమను సద్బుద్ధిని అలవరుచుకొనుము. నీవు చేసిన కృషి వలన నీకు న్యాయముగా ఏది లభించునో దానితో నీ మనస్సును తృప్తి పరుచుకొనుము. నారీస్తనభర నాభీదేశం  దృష్ట్వా మాగామోహావేశం | ఏతన్మాంసవసాది వికారం మనసి విచింతయ వారం వారం || తాత్పర్యం: స్త్రీల యొక్క వక్షోజములు, నడుము భాగాన్ని చూచి మోహావేశమును పొందకుము. అది అంతయు మాంసము, క్రొవ్వు మొదలగు పదార్థముల వికారమేనని మనస్సునందు మాటిమాటికి బాగుగా తలపో...

🍀🍀శ్రీ తులసీ స్తోత్రం🍀🍀

Image
 ⚜️🕉️🚩ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥నమస్తులసి కల్యాణి నమో విష్ణుప్రియే శుభే!!🌹🙏 🍀🍀శ్రీ తులసీ స్తోత్రం🍀🍀 జగద్దాత్రి నమస్తుభ్యం విష్ణోశ్చ ప్రియవల్లభే, యతో బ్రహ్మోదయో దేవాః సృష్టిస్థిత్యన్తకారిణః. నమస్తులసి కల్యాణి నమో విష్ణుప్రియే శుభే, నమో మోక్షప్రదే దేవి నమః సమ్పత్పృదాయి కే. తులసీ పాతు మాం నిత్యం సర్వాపద్భ్యోపి సర్వదా, కీర్తితా వా స్మృతా వాపి పవిత్రయతి మానవమ్. నమామి శిరసా దేవీం తులసీం విలసత్తమామ్, యాం దృష్ట్వా పాపినో మర్త్యాః ముచ్యన్తే సర్వకిల్బిషాత్. తులస్యా రక్షితం సర్వం జగదేతచ్చరాచరమ్, యా వినిర్హన్తి పాపాని దృష్ట్వావా పాపిభిర్న రైః సమస్తులస్యతితరాం యస్యై బద్ధ్వాంజలిం కలౌ, కలయన్తిసుఖం సర్వం స్త్రియో వైశ్యాస్తథాపరే. తులస్యా నాపరం కించిద్దైవతం జగతీతలే, యయా పవిత్రతో లోకో విష్ణుసంగేన వైష్ణవః. తులస్యాః పల్లవం విష్ణోః శిరస్యారోపితం కలౌ, ఆరోపయతి సర్వాణి శ్రేయంసి వరమస్తకే. తులస్యాం సకలా దేవా వసన్తి సతతం యతః, అతస్తా మర్చయేల్లోకే సర్వాన్దేవాన్సమర్చయన్. నమస్తులసి సర్వజ్ఞే పురుషొత్తమవల్లభే, పాహి మాం సర్వపాపేభ్యః సర్వసమ్పత్పృదాయికే. ఇతి స్తోత్రం పురా గీతం పుండరీకేణ ధీమతా, వి...

🌹🌹మహాలక్ష్మీస్తోత్రం: (ఇంద్ర రచితం)🌹🌹

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥ఇంద్రునికి దేవేంద్ర ఆధిపత్యం కలుగజేసిన మహాలక్ష్మీ మంత్ర స్తోత్రంతో అమ్మవారి పూజ చేయడం వలన ఎన్నో జన్మలనుంచీ అనుభవిస్తున్న అలక్ష్మీ దోషాలన్నీ తొలగి ఆ ఇంట లక్ష్మీదేవి శాశ్వతంగా కొలువుంటుంది. శ్రీలక్ష్మీ మహామంత్ర స్తోత్రం పారాయణ చేయడం వలన సకల శుభాలు కలుగుతాయి. ఇది ఇంద్రుడికి దేవేంద్ర ఆధిపత్యం ఇచ్చిన మహాలక్ష్మి మంత్ర స్తోత్రం.. 🌹🌹మహాలక్ష్మీస్తోత్రం: (ఇంద్ర రచితం)🌹🌹 నమః కమలవాసిన్యై నారాయణ్యై నమో నమః | కృష్ణప్రియాయై సతతం మహాలక్ష్మై నమో నమః  || పద్మపత్రేక్షణాయై చ పద్మాస్యాయై నమో నమః | పద్మాసనాయై పద్మిన్యై వైష్ణవ్యై చ నమో నమః || సర్వసంపత్స్వరూపిణ్యై సర్వారాధ్యై నమో నమః | హరిభక్తిప్రదాత్ర్యై చ హర్షదాత్ర్యై నమో నమః || కృష్ణవక్షఃస్థితాయై చ కృష్ణేశాయై నమో నమః | చంద్రశోభాస్వరూపాయై రత్నపద్మే చ శోభనే || సంపత్యధిష్ఠాతృదేవ్యై మహాదేవ్యై నమో నమః | నమో వృద్ధిస్వరూపాయై వృద్ధిదాయై నమో నమః || వైకుంఠే యా మహాలక్ష్మీః యా లక్ష్మీః క్షీరసాగరే | స్వర్గలక్ష్మీరింద్రగేహే రాజలక్ష్మీః నృపాలయే || గృహలక్ష్మీశ్చ గృహిణాం గేహే చ గృహదేవతా | సురభిస్సాగరే...

శివుని యొక్క జ్ఞానావతారమే దక్షిణామూర్తి

Image
 ⚜️🕉️🚩ఓం నమో భగవతే దక్షిణామూర్తయే🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం! నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః!! భావం: సర్వలోకాలకు గురువు, భవరోగులకు (సంసార బంధాలలో చిక్కుకుపోయిన వాళ్ళకు) వైద్యుడు, సకల విద్యలకు నెలవు (నివాసం) అయిన దక్షిణామూర్తికి నమస్కారములు. 💥దక్షిణామూర్తి అవతారం: శివుడు లయ కారకుడు. అంటే సృష్టిని విలీనం చేసుకొని కొత్త సృష్టికి మార్గాన్ని కల్పిస్తాడు. జ్ఞానంపై ఆసక్తి లేనివాళ్లను మళ్లీ జన్మ ఉండేటట్లుగా లయం చేయడం, జ్ఞానం కోరేవాడికి జ్ఞానాన్ని ప్రసాదించి మళ్లీ జన్మ లేకుండా భగవంతుని స్వరూపంలో కలపడం అనే రెండు రకాలుగా శివుడు లయం చేస్తాడు.  శివుని యొక్క జ్ఞానావతారమే దక్షిణామూర్తి. దక్షిణామూర్తి పరమశివుని జ్ఞానగురువు అవతారం. ఇతర గురువులు మాటలతో శిష్యులకు బోధిస్తారు. కానీ దక్షిణామూర్తి మౌనం గానే ఉండి శిష్యులకు కలిగే సందేహాలు నివారిస్తాడు. బ్రహ్మదేవుడు తన సృష్టిని ప్రారంభించినప్పుడు మొదట సనక, సనందన, సనత్సుజాత మరియు సనత్కుమారులను సృష్టించాడు. వారిని తన సృష్టిని కొనసాగించమన్నాడు. కాని వారికి ఇష్టం లేక మేము బ్రహ్మజ్ఞానం పొందాలి, అందువలన మేము మీకు సాయపడలేము...

💥॥ శ్రీ అహోబల నృసింహ స్తోత్రం ॥💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ లక్ష్మి నృసింహ స్వామినే నమః 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ జయజయ నృసింహ సర్వేశ | భయహర వీర ప్రహ్లాద వరద || 🌹🌹అహోబిలేశ్వరా! నమో నమః🌹🌹 అహో వీర్యం అహో శౌర్యం అహో బాహు పరాక్రమంః | నారసింహం పరందైవం అహోబలం అహోబలం || 🍁🍁🍁🍁🍁 💥॥ శ్రీ అహోబల నృసింహ స్తోత్రం ॥💥 లక్ష్మీకటాక్షసరసీరుహరాజహంసం పక్షీంద్రశైలభవనం భవనాశమీశం | గోక్షీరసార ఘనసారపటీరవర్ణం వందే కృపానిధిమహోబలనారసింహం || ౧ || ఆద్యంతశూన్యమజమవ్యయమప్రమేయం ఆదిత్యచంద్రశిఖిలోచనమాదిదేవం | అబ్జాముఖాబ్జమదలోలుపమత్తభృంగం వందే కృపానిధిమహోబలనారసింహం || ౨ || కోటీరకోటిఘటితోజ్జ్వలకాంతికాంతం కేయూరహారమణికుండలమండితాంగం | చూడాగ్రరంజితసుధాకరపూర్ణబింబం వందే కృపానిధిమహోబలనారసింహం || ౩ || వరాహవామననృసింహసుభాగ్యమీశం క్రీడావిలోలహృదయం విబుధేంద్రవంద్యం | హంసాత్మకం పరమహంసమనోవిహారం వందే కృపానిధిమహోబలనారసింహం || ౪ || మందాకినీజననహేతుపదారవిందం బృందారకాలయవినోదనముజ్జ్వలాంగం | మందారపుష్పతులసీరచితాంఘ్రిపద్మం వందే కృపానిధిమహోబలనారసింహం || ౫ || తారుణ్యకృష్ణతులసీదళధామరమ్యం ధాత్రీరమాభిరమణం మహనీయరూపం | మంత్రాధిరాజమథదానవమానభృంగం వందే కృపానిధిమహోబలనారసింహం || ౬ || ఇతి అహోబల...

💥శ్రీ పుత్ర గణపతి స్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥‘‘సాక్షాత్‌ రుద్ర ఇవాపరః’’ అన్నట్లుగా జగదంబ అనుగ్రహముతో జన్మించి రుద్రానుగ్రహముతో సకల విఘ్నములకు అధిపతి అయిన గణపతిని శివుడు శిరస్సు ఖండన చేసి మరలా గజముఖము పెట్టినప్పుడు...  జగదంబ పార్వతీ దేవిని ఆనందింపజేయుటకు పరమేశ్వరుడితో సహా దేవతలందరూ పార్వతీ ఒడిలో ఉన్న వినాయకుని స్తుతించిన స్తుతిని విన్న అమ్మ వారు...  "ఎవరైతే ఈస్తుతిని గౌరీ సమేత గణపతిని ఫాల్గుణ శుద్ధ చవితి యందు పఠించి బెల్లము నివేదన చేసి ప్రసాదముగా స్వీకరిస్తారో అట్టి భక్తులందరికీ నాకేవిధముగా అయితే పుత్ర శోకము తొలగి పుత్ర వృద్ధి కలిగినదో అదే విధముగా అందరికీ పుత్రోత్పత్తి కలిగి వంశ వృద్ధి జరుగునని" జగదంబ పార్వతి వరమిచ్చెను.  అట్టి జగదంబ సమేత పుత్ర గణపతి అనుగ్రహము పొందుటకు ఈ పుత్రగణపతి స్తోత్రం (పరమేశ్వరాదిగా దేవతలందరూ స్తుతించిన స్తుతి) పారాయణము చేయడం వలన వంశ దోషములు తొలగి శక్తియుక్తులు కలిగిన పుత్రులు జన్మించునని వరాహపురాణ వచనము.  మొదట ఈస్తోత్రముతో డుంఢి రాజు అను కాశీరాజు పుత్రగణపతిని ఆరాధించి సత్ఫలితములను పొందెను.  అత్యంత అధ్భుతమైన ఈ స్తోత్రమును ఫాల్గుణ శుద...

💥ప్రజ్ఞావివర్ధన కార్తికేయస్తోత్రమ్💥

Image
 💥⚜️🕉️🚩 ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ హర హర హర హర సుబ్రహ్మణ్యం!! శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం!! 💥కార్తికేయుడే స్వయంగా "కార్తికేయ స్తోత్రము" పఠించడం వలన కలిగే ఫలశృతిని చెప్పి ఉన్నారు. “ఈ ప్రజ్ఞావివర్ధన కార్తికేయ స్తోత్రము" రుద్రయమల తంత్రములోనిది. ఎవరైతే ఈ 28 నామములు ప్రతీ దినం ప్రాతః కాలం భక్తి శ్రద్ధలతో చదువుతారో, వారు సరస్వతీ అనుగ్రహం పొంది, చక్కని తెలివితేటలు, మంచి వాక్కు మరియు జ్ఞానమును పొందుతారు. 💥ప్రజ్ఞావివర్ధన కార్తికేయస్తోత్రమ్💥 శ్రీ గణేశాయ నమః II స్కంద ఉవాచ II యోగీశ్వరో మహాసేనః కార్తికేయోಽగ్నినన్దనః I స్కందః కుమారః సేనానీః స్వామీ శఙ్కరసమ్భవః II 1 II గాంగేయస్తామ్రచూడశ్చ బ్రహ్మచారీ శిఖిధ్వజః I తారకారిః ఉమాపుత్రః క్రౌంచారిశ్చ షడాననః II 2 II శబ్దబ్రహ్మసముద్రశ్చ సిద్ధః సారస్వతో గుహః I సనత్కుమారో భగవాన్ భోగమోక్షఫలప్రదః II 3 II శరజన్మా గణాధీశః పూర్వజో ముక్తిమార్గకృత్ I సర్వాగమప్రణేతా చ వాంఛితార్థప్రదర్శనః II 4 II అష్టావింశతినామాని మదీయానీతి యః పఠేత్ I ప్రత్యూషే శ్రద్ధయా యుక్తో వాచస్పతిర్భవేత్ II 5 II మహామన్త్ర మయానీతి మ...

ఎంతటి కష్టాన్ని అయినా పోగొట్టే "హనుమాన్ లాంగూల స్తోత్రమ్

Image
 ⚜️🕉️🚩శ్రీ ఆంజనేయం 🌹🙏 జయ హనుమంత జ్ణానగుణవందిత జయపండిత త్రిలోక పూజిత!! 🏵️🌼🏵️🌼🏵️ ఎంతటి కష్టాన్ని అయినా పోగొట్టే "హనుమాన్ లాంగూల స్తోత్రమ్" 💥హనుమ లాంగూల స్తోత్రం💥 శ్రీమంతం హనుమంత మాత్త రిపుభి ర్భూభృత్తరు భ్రాజితం| చాల్ప ద్వాలధిబధ్ధ వైరినిచయం చామీకరాది ప్రభం| రోషా ద్రక్త పిశంగ నేత్ర నలినం భ్రూభంగ మంగస్ఫుర| త్ర్పోద్య చ్చండమయూఖ మాండల ముఖం దుఃఖాపహం దుంఖినాం|| కౌపీనం కటిసూత్ర మౌంజ్యజినయు గ్దేహం విదేహాత్మాజా| ప్రాణాధీశ పదారవింద నిహిత స్వాం తం కృతాంతం ద్విషాం| ధ్యాత్వైవం సమరాంగణ స్థిత మథానీయ స్వహృత్పంకజే| సంపూజ్యాఖిల పూజనోక్తవిధినా సంప్రార్ధయే త్ర్పార్ధితమ్|| హనుమన్నంజనీసూనో మహాబలపరాక్రమ | లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || మర్కటాధిప మార్తండమండలగ్రాసకారక | లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || అక్షక్షపణ పింగాక్ష దితిజాసుక్షయంకర | లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || రుద్రావతార సంసారదుఃఖభారాపహారక | లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || శ్రీరామచరణాంభోజమధుపాయితమానస | లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || వాలిప్రమథక్లాంతసుగ్రీవోన్మోచనప్రభో | లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || సీతావిర...

💥భక్తవశంకరుడు! భోళా శంకరుడు!!💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 🔱 హర హర మహదేవ శంభో శంకర 🔱 🏵️🌼🏵️🌼🏵️ 💥భక్తవశంకరుడు! భోళా శంకరుడు!!💥 ఓం అనినంతనే ఓ అని పలికేవాడు, నమ: అనినంతనే కరుణించేవాడు!.. శివాయ! అనినంతనే శుభాలిచ్చే చల్లని.. మంచుగుండెలవాడు బోళాశంకరుడు గుప్పెడు మారేడు దళాల.. అర్చనకే గంపెడు వరాలు నొసగు గంగాధరుండు: చెంబెడు.. జలాభిషేకానికే ... సంబరపడు పార్వతీ మనోహరుడు శ్రీ ప్రణవమూర్తి!! మూగజీవులకే ముక్తినిచ్చి, భక్త కన్నప్పను.. కరుణించినట్టి కాళహస్తీశ్వరుడు!! పంచముఖ దివ్య జ్యోతి స్వరూపుడు !.. అమర.. దక్ష..కుమార.. సోమ.. క్షీరారామేశ్వరుడు!! జాలిచూపుల స్వామి.. శ్రీశైల మల్లన్న! అపర కైలాసమైన.. పట్టిసీమ వీరభద్రుడు!! భక్తజన మందారుడు.. కీసగుట్ట రామేశ్వరుడు!! కోటి వరాలిచ్చే.. బంగారు కోటప్పకొండ శివుడు!! మహా జ్యోతిర్లింగమూర్తియై.. భువిన వెలసిన ద్వాదశ జ్యోతిర్లింగ.. పరమేశ్వరుడు భక్తవశంకరుడు.. భోళా శంకరుడు.. శ్రీలు కూర్చి.. సకలజనుల రక్షించుగాక!!                   – కల్యాణశ్రీ జంధ్యాల వేంకటరామశాస్త్రి. (సేకరణ) ⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

హర హర మహాదేవ శంభో శంకర🔱

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 🔱 హర హర మహాదేవ శంభో శంకర🔱 🏵️🌼🏵️🌼🏵️ 💥ఆదిభిక్షువు.. అతి దయాళువు💥 మూడు మూర్తులకును మూడు లోకములకు మూడు కాలములకు మూలమగుచు భేదమగుచు తుదికభేదమై యొప్పారు బ్రహ్మమనగ నీవె ఫాలనయన 🌹త్రిమూర్తులకు, ముల్లోకాలకు భూత వర్తమాన భవిష్యత్‌ ‌కాలాలకు ఆధారమవుతూ, వాటిలో లీనమవుతూ, చివరికి నీలోనే ఐక్యం చేసుకునే ఏకైక అణుస్వరూపుడవు ఫాలలోచనుడా/ శివుడు అని కీర్తించాడు పోతనామాత్యుడు. 💥#ఆపద్బాంధవుడు.. ఆపద సయయంలో ఆదుకునేవాడే ఆత్మబంధువు, ఆపద్బాంధవుడు. ఆయనే పరమశివుడు. 'తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు...’ అని శతకకర్త మానవ నైజాన్ని వివరించినట్లు.. క్షీరసాగర మథన వేళ ఉద్భవించిన హాలాహలం స్వీకరణకు ఎవరు ముందుకు రాకపోయినా భువన రక్షణకు పార్వతీపతి చొరవ చూపాడు. పతి శక్తి సామర్థ్యాలు, లోక రక్షణ తత్పరత ఎరిగిన జగన్మాత ఆయన సంకల్పాన్ని బలపరిచింది. సేవించిన గరళాన్ని కంఠానికే పరిమిత చేసి ‘గరళ కంఠుడు’ అయి, జగతిని అమృతోపమానం చేశాడు. అది ధీరత్వానికి ప్రతీక. లోకాన్ని భస్మం చేయగల హాలాహలాన్ని గ్రహించి, దానిని కంఠంలోనే నియంత్రించడం వెనుక 'ఎలాంటి దుర్భర పరిస్థితి లోనైనా, ఎంతటి ప్రళయాన్నయినా...