💥శ్రీ విఘ్నేశ్వర షోడశనామ స్తోత్రమ్💥

 ⚜️🕉️🚩ఓం విఘ్నరాజాయ నమః🌹🙏

🏵️🌼🏵️🌼🏵️


🌹🌹జై గణేశ జై జై గణేశా!!!🌹🌹


💥ఏ పూజ అయినా, ఏ కార్యక్రమము అయినా తొలుత  ఆచరించేది శ్రీ వినాయక పూజ.

ఆ గణనాధుడికి  పూజ చేసి ప్రారంభము చేస్తే ఎటువంటి విఘ్నాలు  లేకుండా విజయము లభిస్తుంది అని నమ్మకం.

విద్యారంభములోను , గృహ ప్రవేశము నందు, వివాహము నందు విఘ్నేశ్వర పూజ చేస్తే విఘ్నాలు లేకుండా ఉంటాయి.

స్వామి భక్తులకు నీలాపనిందలు, విఘ్నాలు తొలగించి విజయాన్ని ప్రసాదిస్తారు.

వినాయకుడు కూడా  పదహారు గుణాలు కలిగిన స్వామి కనుక ఆ స్వామిని  షోడశ నామాల  స్తోత్రముతో  పూజ ప్రారంభిస్తారు.


💥శ్రీ విఘ్నేశ్వర షోడశనామ స్తోత్రమ్💥


సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః |

లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః || 1 ||


ధూమ్ర కేతుః గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః |

వక్రతుండ శ్శూర్పకర్ణో హేరంబః స్కందపూర్వజః || 2 ||


షోడశైతాని నామాని యః పఠేత్ శృణు యాదపి |

విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా |

సంగ్రామే సర్వ కార్యేషు విఘ్నస్తస్య న జాయతే || 3 ||


💥శ్రీ విఘ్నేశ్వర షోడశ నామావళిః - వివరణ💥


🍁ఓం సుముఖాయ నమః:


వినాయకుడు నర ముఖముతోనే  జన్మించారు. కానీ గజాసురుడు అనే రాక్షసుడుకి, ముఖ భాగము గజము క్రింది భాగము నరుడు అయిన రూపము కల వాని  చేతి లోనే మరణించాలని వరము ఉండడముతో ఈశ్వరుడు, నర ముఖము  తొలగించి గజ ముఖముతో ప్రాణ  ప్రతిష్ట చేసారుట. ఆ తరువాత వినాయకుడు ఆ రాక్షసుడిని సంహరించారుట. లోకకల్యాణము కొరకు తన తలను తీసివేసి, ఏనుగు తలను ధరించారు కనుక  "సుముఖము" అన్నారు.


ఏ ముఖము  ప్రసన్నముగా, సంతోషముగా, లోక హితము కోరుతుందో, ప్రేమగా ఉంటుందో ఆ ముఖము “సుముఖము” అని, కావున ఉదయాన్నే నిద్ర లేవగానే వినాయకుని ముఖమును చూసి నమస్కరిస్తే లక్ష్మీ కటాక్షము సిద్ధిస్తుంది అని అంటారు.


🍁ఓం ఏకదంతాయ నమః


వినాయకుని కి కుడి వైపు దంతము ఉండదు. అందుకే “ఏక దంత” అంటారు. వ్యాసమహా భారత రచన చేసేటప్పుడు ఎక్కడా ఆగకుండా, వేగముగా అర్థము చేసుకుంటూ రాయాలి. అందుచే వినాయకుడు తన కుడి దంతమును ఉపయోగించి రాశారుట.

ఇది ఇలా ఉండగా గజాసురుడిని తన కుడి దంతమును ప్రయోగించి సంహరించారని, కనుక  ఏక దంతుడు అనియు ఇంకొక కధనము.


🍁ఓం కపిలాయ నమః


గజ ముఖాసురుడిని  వధించినప్పుడు ఆయన ముఖముపై పడిన ఎర్రటి నెత్తురు, ఆయన తెల్లదనముతో కలిసి కపిల వర్ణములో కనిపించారుట అందువలన  స్వామిని “కపిల”  అని అంటారు.


🍁ఓం గజకర్ణకాయ నమః


కప్ప బడని చెవులు ఉన్నవాడు వినాయకుడు. ఏ దేవతా స్వరూపానికైనా చెవులు కప్పబడి ఉంటాయి.

ఒక్క  వినాయకుడికి మాత్రమే పెద్ద చెవులు ఉంటాయి . మన  విన్నపాలను విని కోరికలు త్వరగా సిద్ధింప చేస్తారు కనుక “గజ కర్ణ” అని అంటారు.


🍁ఓం లంబోదరాయ నమః


వృత్తాకారములో వ్రేలాడుతున్న కడుపు ఉన్నవాడు లంబోదరుడు. మోదకాలు, ఉండ్రాళ్ళుఆయనకు ప్రీతి. దేవతలు అందరు ప్రసాదాలను చూసి పవిత్రతను ఆస్వాదిస్తారు. కానీ ఒక్క వినాయకుడు మాత్రము స్వీకరించి చేతిలో  పెట్టుకుంటారు.

మోదకము మధ్యలో తీపి ఉంటుంది. అలాగే తమ భక్తుల మీద వున్న అమ్మ మనసు లాంటి తియ్యనైన అపారమైన ప్రేమను ఆయన కడుపులో ఉంచుకొంటారు కనుక “లంబోదర” అని అంటారు.


🍁ఓం వికటాయ నమః


హాస్య స్ఫూరకముగా  ఉండే పనులు చేస్తారు కనుక వికట అని అంటారు. భక్తుల  మీద  కోపము పెట్టుకోకుండా,  చేసిన దోషానికి శిక్షించి, వెంటనే అనుగ్రహించేస్తారు స్వామి.


కర్మ ఫలితముగా ఏదైనా ఆపదలో వుంటే, ఆయన కాళ్ళకు మొక్కితే చాలు ఆ ప్రభావాన్ని తొలగించేస్తారు. శాశ్వత సుఖాన్ని ఇస్తారు.


🍁ఓం విఘ్నరాజాయ నమః


ఒకే ప్రాంగణములో ఇద్దరు వినాయకులు వుంటే  ఒకరు విఘ్న కారకుడు, ఒకరు విఘ్న నాశకుడు అంటారు. చెడ్డపనులు చేసేవారికి ఆ పనులు జరుగకుండా విఘ్నాలను కల్పించే  వారు, ఒక పని మీదకు వెళుతున్నప్పుడు  అక్కడ ఏదైనా ఆపద ఉన్నప్పుడు , అక్కడికి వెళ్ళకుండా విఘ్నమును కల్పించి రక్షించేవారు విఘ్నరాజు. ఏ మంచి కార్యక్రమముకైనా విఘ్నాలు జరుగకుండా చూసేవారు వినాయకుడు.


🍁ఓం గణాధిపాయ నమః


గణాలకు నాయకుడు "గణాధిపతి"

సత్త్వ రజ తమో గుణాలే అసలు గణాలు. ఇవే కార్యాలకు అడ్డు తగిలి ఫలసిద్ధి లేకుండా చేస్తాయి. గణపతిని ఆరాధిస్తే రజో, తమో గుణాల్ని అణచి, సత్త్వ గుణాల్నిచ్చి, ఆపైన గుణాతీతునిగా ఆశీర్వదిస్తాడు.


🍁ఓం ధూమ్రకేతవే నమః


ధూమాసురుడు అనే రాక్షసుడు విష వాయువులను ప్రయోగించినప్పుడు, ఆ వాయువులను తిరిగి  అతని మీదే ప్రయోగించి సంహరించి నందున  "ధూమ్రకేతు” అని  అంటారు.


🍁ఓం గణాధ్యక్షాయ నమః


గణాలకు అధిపతి అయినందున “గణాధ్యక్ష” అని అంటారు.

‘గ’ అంటే బుద్ధి, ‘ణ’ అంటే జ్ఞానం. గణాధిపతి అయిన విఘ్నేశ్వరుడు బుద్ధిని ప్రసాదిస్తే, సిద్ధి ప్రాప్తిస్తుంది.


🍁ఓం ఫాలచంద్రాయ నమః


చంద్రునికి  షోడశ  గుణాలు ఉన్నాయి. అలాగ  వినాయకుడు కూడా షోడశ గుణాలతో, శివుని శిరము నందు ఉన్న చంద్రుని వంటి స్వరూపము కలవారు కనుక  “ఫాల చంద్ర” అని అంటారు.


🍁ఓం గజాననాయ నమః


ఏనుగు ముఖము కలవాడు, సులభుడు, మ్రొక్కిన వెంటనే వరాలు ఇచ్చు వాడు అయినందున “గజానన” అంటారు.


🍁ఓం వక్రతుండాయ నమః


తొండము కుడి ప్రక్కకు తిరిగి ప్రణవాకృతిని  కలిగిన వాడు కనుక “వక్రతుండ” అని అంటారు


🍁ఓం శూర్పకర్ణాయ నమః


చేటలంత పెద్ద చెవులున్నవాడు, కోరిన  కోరికలలో చెడుని చాటలా ఏరి వేసి మంచిని  మాత్రమే అనుగ్రహిస్తారు. కనుక “శూర్పకర్ణ” అని అంటారు.


🍁ఓం హేరంబాయ నమః


పంచాస్యము (సింహము / పంచాస్యుడు, పంచ ముఖములు కలవాడు శివుడు) చేత పూజింపబడినవాడు.

పరమ శివుడు త్రిపురాసుర సంహారానికి వెళ్ళే ముందు గణపతిని పూజించుట మర్చిపోయరుట.

అప్పుడు విఘ్నాలు ఎదురైతే, వెంటనే వినాయక పూజ చేసి యుద్ధము లో విజయము పొందారుట.

అలా పంచాస్యముచే పూజించబడిన వారు కనుక “హేరంభ” అనియు అంటారు.


🍁ఓం స్కందపూర్వజాయ నమః


స్కందుడు (కుమార స్వామి) ఉన్నతిని చూసినవారు, తమ్ముడి ఉన్నతికి కారణము అయిన వారు కనుక “స్కంద పూర్వజ” అని అంటారు.

అలా  పిలిస్తే కుమార స్వామి కూడా సంతోషిస్తారుట.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥ఏకవింశతి పత్రపూజ💥

💥ఆషాఢమాస విశిష్టత:

💥ఆషాఢ శుద్ధ పౌర్ణమి.. 'గురుపౌర్ణమి'.. 'వ్యాసపౌర్ణమి