💥ప్రజ్ఞావివర్ధన కార్తికేయస్తోత్రమ్💥

 💥⚜️🕉️🚩 ఓం శ్రీ వల్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః 🌹🙏

🏵️🌼🏵️🌼🏵️


హర హర హర హర సుబ్రహ్మణ్యం!!

శివ శివ శివ శివ సుబ్రహ్మణ్యం!!


💥కార్తికేయుడే స్వయంగా "కార్తికేయ స్తోత్రము" పఠించడం వలన కలిగే ఫలశృతిని చెప్పి ఉన్నారు.


“ఈ ప్రజ్ఞావివర్ధన కార్తికేయ స్తోత్రము" రుద్రయమల తంత్రములోనిది. ఎవరైతే ఈ 28 నామములు ప్రతీ దినం ప్రాతః కాలం భక్తి శ్రద్ధలతో చదువుతారో, వారు సరస్వతీ అనుగ్రహం పొంది, చక్కని తెలివితేటలు, మంచి వాక్కు మరియు జ్ఞానమును పొందుతారు.


💥ప్రజ్ఞావివర్ధన కార్తికేయస్తోత్రమ్💥


శ్రీ గణేశాయ నమః

II స్కంద ఉవాచ II


యోగీశ్వరో మహాసేనః కార్తికేయోಽగ్నినన్దనః I

స్కందః కుమారః సేనానీః స్వామీ శఙ్కరసమ్భవః II 1 II


గాంగేయస్తామ్రచూడశ్చ బ్రహ్మచారీ శిఖిధ్వజః I

తారకారిః ఉమాపుత్రః క్రౌంచారిశ్చ షడాననః II 2 II


శబ్దబ్రహ్మసముద్రశ్చ సిద్ధః సారస్వతో గుహః I

సనత్కుమారో భగవాన్ భోగమోక్షఫలప్రదః II 3 II


శరజన్మా గణాధీశః పూర్వజో ముక్తిమార్గకృత్ I

సర్వాగమప్రణేతా చ వాంఛితార్థప్రదర్శనః II 4 II


అష్టావింశతినామాని మదీయానీతి యః పఠేత్ I

ప్రత్యూషే శ్రద్ధయా యుక్తో వాచస్పతిర్భవేత్ II 5 II


మహామన్త్ర మయానీతి మమ నామానుకీర్తనమ్ I

మహాప్రజ్ఞామవాప్నోతి నాత్ర కారా విచారణా II 6 II


II ఇతి శ్రీరుద్రయమలే ప్రజ్ఞావివర్ధన శ్రీకార్తికేయస్తోత్రం సంపూర్ణం II


💥స్కందుని ఈ  28 నామాలకీ ప్రజ్ఞావివర్ధక నామాలని పేరు...


1. యోగీశ్వరః – యోగీశ్వరులకు అధిపతి అయినవారు 

2. మహాసేనః – దేవసైన్యానికి అధిపతి, దేవసేనాపతి

3. కార్తికేయః – ఆరు కృత్తికా నక్షత్రములచే పోషింపబడిన వాడు

4. అగ్నినందనః  – పరమశివుని జ్ఞానాగ్ని నుంచి ఉద్భవించినవాడు మరియు పరమశివుని తేజస్సు కొంత సేపు భరించినందువల్ల, అగ్ని దేవునికి కూడా తనయుడిగా పిలువబడినవాడు.

5. స్కందః – పరమశివుని తేజస్సు నుండి జన్మించినవాడు

6. కుమారః – కుమార అన్న నామం కేవలం సుబ్రహ్మణ్యునికే సొంతమైనది . ఎందుకంటే, జగత్తుకి మాతా పితలు ఆదిదంపతుల అన్యోన్యతా  ప్రతిరూపం కేవలం స్కంద కుమారుడు మాత్రమే.

7. సేనానీః – దేవసేనలకు అధిపతి, దేవసేనాధ్యుక్షుడు.

8. స్వామీ శంకరసంభవః – శంకరుని దివ్యమైన తేజస్సు నుండి పుట్టినవాడు.

9. గాంగేయః – పరమశివుని తేజస్సు అగ్నిదేవుడు భరించలేక, గంగా మాతకి ఇచ్చేస్తే, గంగా మాత కొంత సేపు శివుని తేజస్సును భరిస్తుంది. అందువల్ల, గంగా మాతకి కూడా పుత్రునిగా పిలబడ్డవాడు కాబట్టి గాంగేయ అనే నామం వచ్చింది.

10. తామ్రచూడః – కుక్కుటమును అధిరోహించిన వాడు.

11. బ్రహ్మచారీ – ఎల్లప్పుడూ బ్రహ్మనందు రమించువాడు.

12. శిఖిధ్వజః – అగ్ని ధ్వజముగా కలవాడు

13. తారకారిః – తారకాసురడనే రాక్షస సంహారము చేయుటకు అవతారం దాల్చిన వాడు, తారకాసురుడిని, ఇతర రాక్షస గణములను సంహరించి దేవతలను రక్షించినవాడు.

14. ఉమాపుత్రః – ఉమాదేవి, అంటే పార్వతీ అమ్మ వారి ముద్దుల తనయుడు. అందుకే సుబ్రహ్మణ్య స్వామి వారు అచ్చం అమ్మవారి లానే ఉంటారు.

15. క్రౌంచారిః – పర్వత రూపములో ఉన్న క్రౌంచ అనే రాక్షసుడిని సంహరించినవాడు.

16. షడాననః – ఆరు ముఖములు గలవాడు.

17. శబ్దబ్రహ్మసముద్రః – జ్ఞాన స్వరూపుడు, అంటే వేదములు ఏ పరబ్రహ్మ స్వరూపమును గురించి ఘోషిస్తున్నాయో, ఆ వేద శబ్దములచే ప్రతిపాదించబడిన వాడు.

18. సిద్ధః – పరిపూర్ణ సిద్ధ స్వరూపుడు

19. సారస్వతః – సరస్వతీ స్వరూపము, అంటే జ్ఞాన స్వరూపము.

20. గుహః – సకలజీవుల హృదయ గుహలో కొలువై ఉన్నవాడు.

21. భగవాన్ సనత్కుమారః –  బ్రహ్మ గారి నలుగురు మానస పుత్రులలో ఒకరైన సనత్కుమారుడే సుబ్రహ్మణ్యుడిగావచ్చారని,  శ్రీవిద్యా రహస్యంలో మాహాత్మ్యఖండంలో వివరించబడినదని, శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు నిర్ధారించారు.

22. భోగమోక్షఫలప్రదః – ఈ భూమి మీద మనం సుఖంగా జీవించడానికి అవసరమైన సంపదతో పాటు అంత్యమునందు మోక్షమును కూడా ఇవ్వగలిగినవాడు.

23. శరజన్మా – శరవణతటాకము (రెల్లు పొదల) నుండి జన్మించినవాడు.

24. గణాధీశః – సకల దేవతలకు, గణములకు అధిపతి అయిన వాడు.

25. పూర్వజః – అందరికన్నా ముందున్నవాడు, అంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారు, కేవలం ఒక అవతారం మాత్రమే కాదు, ఎప్పుడూ ఉండే పరబ్రహ్మ స్వరూపం. ఆయన ఎప్పుడూ ఉన్నవాడు, పుట్టుక లేనివాడు.

26. ముక్తిమార్గకృత్ – ముక్తి మార్గమును బోధించే గురు స్వరూపం. అంత్యమున ముక్తిని ప్రసాదించి, తనలో కలుపుకునే స్వామి.

27. సర్వాగమప్రణేతా – సకల ఆగమములకు మూలము.

28. వాంచితార్ధప్రదర్శనః – అభీష్టములను నెరవేర్చే తండ్రి.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥ఏకవింశతి పత్రపూజ💥

💥ఆషాఢమాస విశిష్టత:

💥ఆషాఢ శుద్ధ పౌర్ణమి.. 'గురుపౌర్ణమి'.. 'వ్యాసపౌర్ణమి