💥శ్రీరామ నామం సర్వ జగద్రక్షా కవచం..
⚜️🕉️🚩 శ్రీరామ జయ రామ జయ జయ రామ 🌹🙏
🏵️🌼🏵️🌼🏵️
ఆపదామప హర్తారం దాతారం సర్వ సంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్ ||
తాత్పర్యం:
ఆపదలను పోగొట్టువాడు, అన్ని సంపదలను ఇచ్చువాడు, లోకములో అతి సుందరమైన వాడైనట్టి శ్రీ రామచంద్రునికి మాటి మాటికి నమస్కరిస్తున్నాను.
🍁🍁🍁🍁🍁
💥శ్రీరామ నామం సర్వ జగద్రక్షా కవచం..
తారక మంత్రమైన "శ్రీరామ" నామము వైభవాన్ని గూర్చి వాల్మీకి నుండి నేటి వరకు ఎందరో ఋషులు, మహా కవులు ప్రశంసించి కీర్తించడం జరిగింది.
"రామా" అనే నామంలో ఎంతో పరమార్థముందని పండితులు పేర్కొన్నారు.
రామా (ర ఆ మా) నామంలో ర అక్షరం రుద్రుని, అ అక్షరం బ్రహ్మను, మ అక్షరం విష్ణువునీ సూచిస్తుందని, అనగా రామ నామం త్రిమూర్త్యాత్మకమైన పరబ్రహ్మ స్వరూపమని మహర్షులు పేర్కొన్నారు.
శ్రీరామ నామ జపమే సమస్త తాపాలను నివృత్తి చేసే ఏకైక ఔషదం.
హరునకు నవ్విభీషణునక ద్రిజకుం దిరుమంత్ర రాజమై
కరికి నహల్యకుం ద్రుపదకన్యకు నార్తిహరించుచుట్టమై
పరగినయట్టి నీపతిత పావననామము జిహ్వపై నిరం
తరము నటింపజేయుమిక దాశరథీ కరుణాపయోనిధీ.
🌹శివుడికీ, పార్వతికీ, విభీషణుడికీ, శుభకరమగు మంత్రమై, గజేంద్రుడికీ, అహల్యకూ, ద్రౌపదికీ కష్టాలు పోగొట్టిన చుట్టమై అలరారి, పాపాత్ములను పాప విముక్తులను చేసే గొప్ప మహిమాన్విత మంత్రం- రామ నామమని, ఆ రామ నామం తన నాలుకపై నటింప జేయుమని భక్త రామదాసు శ్రీరామచంద్రున్ని కోరుతూ ఆ రామ నామ మహిమ వైభవాన్ని ఎంతో మహనీయంగా కొనియాడాడు.
💥శ్రీ రామ నామం - లోక కళ్యాణ ప్రదం
శ్రీ రామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే!!
"శ్రీమన్నారాయణ స్వరూపుడు, అష్టాదశ పురాణకర్త అయిన వేదవ్యాస మహర్షి తన ఆధ్యాత్మ రామాయణంలో మనసారా శ్రీరామ నామాన్ని మూడుసార్లు ధ్యానించిన వారికి విష్ణు సహస్రనామ పారాయణ ఫలం దక్కుతుంది" అని చెప్తూ పై రీతిగా శ్రీరామ నామ విశిష్టతను పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించుట జరిగింది.
💥"ఓం నమోనారాయణాయ" అనే అష్టాక్షరి మంత్రంలో "రా" అనేది జీవాక్షరం. ఎందుకంటే ఈ మంత్రం లోంచి 'రా' తొలగిస్తే ఓం నమో నాయణాయ అన్నది అర్ధం లేనిదవుతుంది.
"ఓం నమః శివాయ" అనే పంచాక్షరి మంత్రంలో "మ" అనేది జీవాక్షరం. ఎందుకంటే ఈ మంత్రంలో 'మ' తొలగిస్తే నశ్శివాయ అవుతుంది. అంటే శివుడే లేడని అర్ధం.
ఈ రెండు జీవాక్షరాల సమాహారమే "రామ"
శివ కేశవుల సంఘటిత శక్తియే 'రామ'మంత్రం.
అందుకే రామ మంత్రం సర్వ శక్తివంతమైన, శ్రేష్టమైన ముక్తిప్రసాద మంత్రంగా చెబుతారు.
ఈ తారకమంత్రాన్నే తారుమారుగా ”మరామరా” అని పలికినా తుదకు ”రామా” నామ ధ్యాన తత్పరుడైన ఆ బోయవాడే ”ఆది కవి - వాల్మీకి” యై ”శ్రీ మద్రామాయణ” మహా కావ్య రచన చేసి, తాను తరించుటేకాక, సమస్త లోక వాసులను యుగయుగాలుగా తరింపజేసాడు.
💥"రామ" నామ మహిమ..
'రా' కలుషంబులెల్ల బయలంబడద్రోచిన 'మా'క వాటమై
డీకొనిప్రోవుచునిక్క మనిధీయుతులెన్నఁదదీయ వర్ణముల్
గైకొని భక్తి చే నుడువఁగానరు గాక విపత్పరంపరల్
దాకొనునే జగజ్జనుల దాశరథీ కరుణాపయోనిధీ.
🌹”రామా” అనే నామంలోని "రా” అనే అక్షరాన్ని ఉచ్చరిస్తే అది దేహంలోని పాపాలన్నింటినీ (నాలుక ద్వారా) బయటకు నెట్టి వేయగా..
'మ’ అనే అక్షరాన్ని ఉచ్ఛరించగానే అది నోటిలో కవాటం వలె అడ్డుపడి బయట ఉన్న పాపాలను తిరిగి లోపలికి ప్రవేశించకుండా నిరోధిస్తుందని భక్త రామదాసు తన ”దాశరథీ శతకం”లో ఎంతో రమణీయంగా పారమార్థికంగా పేర్కొన్నాడు.
భక్త జనులందరూ సర్వకాల సర్వావస్థలలో తమను రక్షించమని కోరుతూ
ఆపదామపహార్తారం - దాతారం సర్వ సంపదామ్
లోకాభిరాం శ్రీ రామం భూయోభూయో నమామ్యహం!!
-అని శ్రీరామ ధ్యాన శ్లోకాన్ని పలుమార్లు పఠిస్తూ, శ్రీరామాను గ్రహాన్ని సదా పొందుతూ, సకల భీష్టా సిద్ధి పొందుతూ ధన్యులౌతున్నారు.
సప్త కోటి మహా మంత్రాలలో మహోత్కృష్టమైనది రెండు అక్షరాల "రామ" నామమని మన మహర్షులు కొనియాడటం విశేషం.
మన తల్లులు కూడా పసిపిల్లలకు స్నానం చేయిస్తూ చివరిలో ‘శ్రీరామ రక్ష’ అని స్మరించి, దీవించటం కూడా గొప్ప విశేషం.
అట్టి దివ్య మహిమాన్వితమైనట్టి శ్రీ రామ నామాన్ని సదా ధ్యానించి తరించుదాం!!
సేకరణ... 💐🙏
Comments
Post a Comment