💥భక్తవశంకరుడు! భోళా శంకరుడు!!💥

 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏

🔱 హర హర మహదేవ శంభో శంకర 🔱

🏵️🌼🏵️🌼🏵️


💥భక్తవశంకరుడు! భోళా శంకరుడు!!💥


ఓం అనినంతనే ఓ అని పలికేవాడు,

నమ: అనినంతనే కరుణించేవాడు!..

శివాయ! అనినంతనే శుభాలిచ్చే చల్లని..

మంచుగుండెలవాడు బోళాశంకరుడు


గుప్పెడు మారేడు దళాల.. అర్చనకే

గంపెడు వరాలు నొసగు గంగాధరుండు:

చెంబెడు.. జలాభిషేకానికే ... సంబరపడు

పార్వతీ మనోహరుడు శ్రీ ప్రణవమూర్తి!!


మూగజీవులకే ముక్తినిచ్చి, భక్త కన్నప్పను..

కరుణించినట్టి కాళహస్తీశ్వరుడు!!

పంచముఖ దివ్య జ్యోతి స్వరూపుడు !..

అమర.. దక్ష..కుమార.. సోమ.. క్షీరారామేశ్వరుడు!!


జాలిచూపుల స్వామి.. శ్రీశైల మల్లన్న!

అపర కైలాసమైన.. పట్టిసీమ వీరభద్రుడు!!

భక్తజన మందారుడు.. కీసగుట్ట రామేశ్వరుడు!!

కోటి వరాలిచ్చే.. బంగారు కోటప్పకొండ శివుడు!!


మహా జ్యోతిర్లింగమూర్తియై.. భువిన వెలసిన

ద్వాదశ జ్యోతిర్లింగ.. పరమేశ్వరుడు

భక్తవశంకరుడు.. భోళా శంకరుడు..

శ్రీలు కూర్చి.. సకలజనుల రక్షించుగాక!!


                  – కల్యాణశ్రీ జంధ్యాల వేంకటరామశాస్త్రి.

(సేకరణ)


⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥ఏకవింశతి పత్రపూజ💥

💥ఆషాఢమాస విశిష్టత:

💥ఆషాఢ శుద్ధ పౌర్ణమి.. 'గురుపౌర్ణమి'.. 'వ్యాసపౌర్ణమి