హర హర మహాదేవ శంభో శంకర🔱
⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏
🔱 హర హర మహాదేవ శంభో శంకర🔱
🏵️🌼🏵️🌼🏵️
💥ఆదిభిక్షువు.. అతి దయాళువు💥
మూడు మూర్తులకును మూడు లోకములకు
మూడు కాలములకు మూలమగుచు
భేదమగుచు తుదికభేదమై యొప్పారు
బ్రహ్మమనగ నీవె ఫాలనయన
🌹త్రిమూర్తులకు, ముల్లోకాలకు భూత వర్తమాన భవిష్యత్ కాలాలకు ఆధారమవుతూ, వాటిలో లీనమవుతూ, చివరికి నీలోనే ఐక్యం చేసుకునే ఏకైక అణుస్వరూపుడవు ఫాలలోచనుడా/ శివుడు అని కీర్తించాడు పోతనామాత్యుడు.
💥#ఆపద్బాంధవుడు..
ఆపద సయయంలో ఆదుకునేవాడే ఆత్మబంధువు,
ఆపద్బాంధవుడు. ఆయనే పరమశివుడు.
'తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు...’
అని శతకకర్త మానవ నైజాన్ని వివరించినట్లు..
క్షీరసాగర మథన వేళ ఉద్భవించిన హాలాహలం స్వీకరణకు ఎవరు ముందుకు రాకపోయినా భువన రక్షణకు పార్వతీపతి చొరవ చూపాడు.
పతి శక్తి సామర్థ్యాలు, లోక రక్షణ తత్పరత ఎరిగిన జగన్మాత ఆయన సంకల్పాన్ని బలపరిచింది.
సేవించిన గరళాన్ని కంఠానికే పరిమిత చేసి ‘గరళ కంఠుడు’ అయి, జగతిని అమృతోపమానం చేశాడు.
అది ధీరత్వానికి ప్రతీక.
లోకాన్ని భస్మం చేయగల హాలాహలాన్ని గ్రహించి, దానిని కంఠంలోనే నియంత్రించడం వెనుక 'ఎలాంటి దుర్భర పరిస్థితి లోనైనా, ఎంతటి ప్రళయాన్నయినా ఎదుర్కొని, నిలబడగలగాలనే ఆత్మవిశ్వాసం, ఆత్మశక్తి, ఆత్మ స్థయిర్యం, జీవితాన్ని విజయ సోపానంగా మార్చు కోవాల’న్న హితవు దాగి ఉందంటారు.
గంగమ్మను సతీదేవికి సవతిగా చేశాడని..
‘తిరపెమునకు ఇద్దరాండ్ర’ అనే నిందాస్తుతులు, వ్యంగ్యోక్తులు ఎన్ని ఉన్నా,
దివిజ గంగ భువికి దిగేవేళ ఆమె వేగ ఉధృతిని నియత్రించ గలిగిన ధీరుడుగా శివుడే కనిపించాడు, కనికరించాడు. ఆమెను ధరించగలిగాడు.
💥స్కాంద పురాణం శివుడిని జ్ఞానప్రదాతగా ప్రస్తుతించింది. జ్ఞానులు ఆయనను సత్యం (సత్య స్వరూపుడు), మంగళకారుడు (శివం), సుందర రూపుడు (సుందరం) అని వర్ణించారు.
సత్యం శివం సుందరాత్మకమైన జ్ఞానం ఒక ఆకారం దాల్చితే అది శివాకృతి అవుతుంది.
సమస్త దుఃఖాలను హరించి శాశ్వతానందం కలిగించే జ్ఞానం కోసమే సామాన్యుల నుంచి యోగులు, మునులు నిరంతరం అన్వేషిస్తూ ఉంటారు.
శివారాధకులు జ్ఞానప్రాప్తిని, కైవల్యాన్ని పొందగలుగుతారట.
‘అశాశ్వతమైన ఐహిక భోగాల కోసం మనిషి కర్మలను ఆచరిస్తున్నాడు. సర్వం దుఃఖమయమైన ఈ భౌతిక ప్రపంచంలో ముక్తి ఒక్కటే శాశ్వత ఆనందం కలిగిస్తుంది. శివాశ్రయంతో అది సులభతరం / అవుతుంది’ అని పెద్దలు చెబుతారు.
శివేతి చ శివం నామ యస్య వాచి ప్రవర్తతే
కోటి జన్మార్జితం పాపం తస్యనశ్యతి నిశ్చితమ్!!
శివ అనే మంగళకర నామాన్ని ఉచ్ఛరించేవారి కోటి జన్మాల పాపాలు నశించి తీరతాయి.. అని బ్రహ్మవైవర్త పురాణం చెబుతోంది.
సేకరణ... 💐🙏
Comments
Post a Comment