💥విశేష ఫలప్రదం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన
⚜️🕉️🚩ఓం షణ్ముఖాయ నమః🌹🙏
🏵️🌼🏵️🌼🏵️
శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహన షడాననం |
దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుటధ్వజమ్ ||
💥విశేష ఫలప్రదం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన!💥
"సుబ్రహ్మణ్య" అనే పదానికి సంస్కృత భాష లో బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్న ఉత్తముడు అని అర్థం.
ఈయనను స్కందుడు, క్రౌంచధారణుడు, కుమారస్వామి, కార్తికేయుడు, శరవణభవుడు మొదలైన నామాలతో కొలుస్తారు.
శతాబ్దాలుగా కొనసాగుతున్న భారతదేశంలోని అనేక సంస్కృతుల కలయికతో ఏర్పడినదే సుబ్రహ్మణ్యారాధన.
ఈయనలో శైవ - వైష్ణవ మతాలు మనకు కనిపిస్తా యి. శైవ మత పురాణాల ప్రకారం స్కందుడు శివుని పుత్రుడు. కనుక ఈయన శైవ మతానికి చెందినవాడు.
భగవద్గీతలోని విభూతి యోగములో శ్రీ కృష్ణుడు
"సేనానీ నామ హం స్కన్ద” అనగా
"సేనానులలో స్కందుడను నేనే” అని చెప్పడం ద్వారా ఈయన విష్ణాంశ సంభూతుని గాను, వైష్ణవ మతానికి చెందినవాడు గాను పేర్కొనవచ్చును.
శివ కేశవులకు బేధం లేదని చెప్పటానికి సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్ష నిదర్శనం.
స్కాంద పురాణములో కార్తికేయుని వర్ణించటం జరిగింది.
శ్రీ పరమేశ్వర తేజస్సు షట్‌కృత్తికల గర్భంలో ప్రవేశింపగా, వారు దానిని భరింపలేక గంగా తీరాన విడువగా ఆరు ముఖాలతో, అమితమైన తేజస్సుతో సుబ్రహ్మణ్యుడు ఉద్భవిస్తాడు.
అందువలన ఈయనను షణ్ముఖుడు అని వ్యవహరిస్తారు.
పరమేశ్వరుడు, పార్వతీదేవి తమ తమ శక్తివంతమైన ఆయుధాలను ఈయనకు ప్రసాదిస్తారు.
వాటి ప్రభావంతో తారకాసురుని సంహరించి లోకాలను కాపాడతాడు.
దేవతల కోరిక మేరకు స్కందుని దేవతల సేనానిగా పరమేశ్వరుడు నియమిస్తాడు.
ఈ శుభ సందర్భంలో దేవేంద్రుడు తన కుమార్తె అయిన దేవసేనతో అతి వైభవంగా వివాహం జరిపిస్తాడు. సుబ్రహ్మణ్యుడు తాను వలచిన వల్లిదేవిని కూడా వివాహం చేసుకుంటాడు.
వల్లిదేవి ఇచ్ఛాశక్తిగాను, దేవసేన క్రియశక్తిగాను వ్యవహరింపబడతారు.
వివాహ సమస్యలకు, సంతానప్రాప్తికి, అనారోగ్య సమస్యలకు, జాతకంలోని కుజ, కాలసర్పదోషా లకు సుబ్రహ్మణ్యారాధన విశేష ఫలవంతమైనది.
నాగప్రతిష్ట చేయటం ద్వారా సంతానప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం.
తమ తమ కోరికలు తీరిన భక్తులు స్వామి వారికి కావడి రూపంలో మ్రొక్కులు చెల్లించుకుంటారు.
సుబ్రహ్మణ్యస్వామిలో జ్ఞాన, వైరాగ్య, బల, కీర్తి, సంపద, దైవశక్తి అనే ఆరు లక్షణాలు కనబడతాయి.
స్వామి వారి ధ్వజమైన కోడిపుంజు (కుక్కుటము) ఉదయించే జ్ఞానాన్ని, ప్రకాశాన్ని సూచిస్తుంది.
తామస లక్షణాలైన అహంకారం, గర్వం, డాంబికం మొదలైన లక్షణాలకు ప్రతీకయైన నెమలిని అధిరోహంచటం ద్వారా, వాటిని అదుపు చేసే శక్తి సమన్వితుడుగా కొలువబడుతున్నాడు.
పరమేశ్వర వాహనమైన నందీశ్వరుడు అగస్త్య మహర్షికి ప్రసాదించిన స్కందకుమార అష్టోత్తరాన్ని భక్తి, శ్రద్ధలతో పఠించిన వారి సమస్యలన్నీ తొలగిపోతాయని స్కాంద పురాణము మనకు వివరిస్తుంది.
శ్రీశంకరాచార్యులవారు రచించిన "సుబ్రహ్మణ్య భుజంగం" మానవాళికి మహత్తరమైన వరము.
అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీ శంకరాచార్యులవారు తిరుచందూర్ క్షేత్రములో స్వామివారిని దర్శించి, తన్మయత్వం చెంది తన శారీరిక బాధలను సైతం మరచి "సుబ్రహ్మణ్య భుజంగం” అనే స్తోత్రాన్ని ఆశువుగా పఠిస్తారు. తక్షణమే ఆయనకు అనారోగ్యంనుంచి ఉపశ మనం కలుగుతుంది.
కార్తికేయుని మనస్ఫూర్తి గా, భక్తి శ్రద్ధలతో కొలిచే వారి కొంగుబంగారమై, ఏదో ఒక రూపంలో వచ్చి సమస్యలను పరిష్కరిస్తాడు.
నిండు మనస్సుతో అయిదు మంగళవారములు సుబ్రహ్మణ్యస్వామిని మందారపూవులతో అర్చిస్తే మంచి సంతానం కలుగుతుందని శాస్త్రవచనం.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️
Comments
Post a Comment