💥శ్రీరామ నామం:
⚜️🕉️🚩 శ్రీ రామ జయ రామ జయజయ రామ 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రేమయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపమ్! ఆజానుబాహుమరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి!! - అంటూ శ్రీరాముడిని స్తుతించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురాణాలు చెబుతున్నాయి. 💥 శ్రీరామ నామం: శ్రీరామ నామం తారకనామం. దుఃఖాలను, దురితాలను దూరం చేసేది. అతి సులభంగా ఏ కష్టం లేకుండా కష్టాలను దూరం చేసుకోవడానికి వర్ణాశ్రమ భేదాలకతీతంగా ఎల్లరు ఉచ్చరింపగలిగిన మంత్రం రామ మంత్రమే. రామ ఏవ పరంబ్రహ్మ రామ ఏవ పరం తపః రామ ఏవ పరం తత్వం శ్రీరామో బ్రహ్మ తారకమ్ - అని రామ రహస్యోపనిషత్తు అంటుంది. భగవత్ప్రాప్తికి ఉపాయం (సాధనం) రామ నామం కాగా ఉపేయం (గమ్యం) కూడా అదే. సామాన్యంగా ఉపాయం లేనిదే ఉపేయాన్ని పొందుట సాధ్యం కాదు. కాని రాముని ఆరాధిస్తేచాలు.. రాముని తల్చుకుంటే చాలు.. రాముడే ఉపాయం స్ఫురింపచేస్తాడు. ఆ ఉపాయాన్ని పొందేందుకు మార్గం కూడా రాముడే చూపిస్తాడు. 💥శ్రీరాముడు మానవకోటికి ఆరాధ్యదైవం. భారతీయులు ఏదైనా రాయదలిస్తే "శ్రీరామ" అని ఆరంభిస్తారు. పాపకార్యాన్ని విన్నప్పుడు, చేయలేని పనిని చేయాల్సి వచ్చినపుడో ‘రా...