💥మహా గణపతిం మనసా స్మరామి💥
⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏
🏵️🌼🏵️🌼🏵️
గణానామ్ త్వా గణపతిగ్‍ం హవామహే కవిమ్ కవీనా ముపమశ్రవస్తవమ్
జ్యేష్ఠ రాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆన శ్శృణ్వ న్నూతిభి స్సీద సాదనమ్
🌹తాత్పర్యం:
భూత గణములకు అధిపతివి, విద్వాంసులలో విద్వాంసుడవు, పోల్చదగిన కీర్తి శ్రేష్టులకు కూడా నీవే పోలికవు, బ్రహ్మణ్యులలో బ్రహ్మణ్యుడవు, సర్వ జగత్తుకు అధిపతివి (రాజాధి రాజువు), అయిన నిన్ను మా కోర్కెలు తీర్చుటకు, మా ప్రార్థన ఆలకించి ఈ పూజా సమయము నందు ఈ స్థానమును లేక ఆసనమును అలంకరించుము.
🍁🍁🍁🍁🍁
💥మహా గణపతిం మనసా స్మరామి💥
"వినయతి శిక్షయతి దుష్టాన్ విఘ్నాంశ్రేతి వినాయకః"
దుష్టులను విఘ్నములను శిక్షించేవాడు వినాయకుడు.
"విగతో నాయకః ప్రభుః ఇస్య"
ఆయనకు ఎవరూ నాయకుడు లేడు, కాలేడు. కనుక స్వతంత్రుడగు నాయకుడు - వినాయకుడు.
"విశిష్టః నాయకః"
ఒకానొక చక్కని విశేషము గల నాయకుడు, నాయకులందరి లోను విశిష్ఠుడు. మహా మహిమలు గల సమర్థుడైన నాయకుడు - వినాయకుడు.
కనుకనే, నిత్య జీవితంలో ప్రతి పనికీ వినాయకునికి నమస్కరించి -
"ఆదౌ నిర్విఘ్న పరి సమాప్త్యర్థం గణపతి పూజాం కరిష్యే"
అని చెపుతూ
విఘ్నాలను తొలగించమని కార్యసిద్ధి కోసం
"ఆదౌ పూజ్యో గణాధిపః"
అని గణపతిని మొదటిగా ఆరాధించటం అనాదిగా వస్తోంది. ఆ గణపతే విఘ్నేశ్వరుడు, ఆయనే వినాయకుడు.
ఆది అంతం లేని ఆనందమయ తత్త్వమూర్తి.
అకుంఠిత దీక్షతో భక్తి ప్రపత్తులతో కొలిచే వారి కోరికలను, సకల సౌభాగ్యాలను ప్రసాదించే ‘హేరంభుడు’
💥తలచితినే గణనాథుని
తలచితినే విఘ్నపతిని దలచిన పనిగా
దలచితినే హేరంబుని
దలచిన నా విఘ్నములను తొలగుట కొరకున్
అని ప్రాచీన కాలం నుండి నేటి వరకు అనగా నాటికీ నేటికీ ఏనాటికీ ప్రతి పనికీ ముందు వినాయకుడికి నమస్కరించి పూజిస్తారు.
ప్రకృతి శక్తులే ప్రమధ గణాలు.
వాటిని విచ్చలవిడిగా తిరగకుండా సాధకులను బాధించకుండా వాటిని అదుపులో పెట్టుకొని ఆధిపత్యం వహించే మహాశక్తి ఏది ఉందో అది ‘గణపతి’
గణాల కధిపతి కనుక సత్కార్యాలకు ఎప్పుడూ అంతరాయం కలుగదు, కలుగనివ్వదు.
అందుకే ఆయన విఘ్నేశుడు.
సత్త్వ రజ తమో గుణాలే అసలు గణాలు.
ఇవే కార్యాలకు అడ్డు తగిలి ఫలసిద్ధి లేకుండా చేస్తాయి. గణపతిని ఆరాధిస్తే రజో, తమో గుణాల్ని అణచి, సత్త్వ గుణాల్నిచ్చి, ఆపైన గుణాతీతునిగా ఆశీర్వదిస్తాడు.
💥గణపతి ఆవిర్భావం: ఆధ్యాత్మిక విశేషాలు💥
‘గ’ అంటే బుద్ధి, ‘ణ’ అంటే జ్ఞానం.
గణాధిపతి అయిన విఘ్నేశ్వరుడు బుద్ధిని ప్రసాదిస్తే, సిద్ధి ప్రాప్తిస్తుంది.
భాద్రపద శుక్ల చవితినాడు వినాయకుడు ఆవిర్భవించాడు.
భద్రమైన పదం - భాద్రపదం.
శ్రేయస్కరమైన స్థానం. ఏమిటది? జీవిత గమ్యమైన మోక్షం. శుక్లమైన తేజో రూపం.
చతుర్థి అనగా చవితి. జాగృత్, స్వప్న, సుషుప్తులనే మూడవస్థలను దాటిన తరువాతది నాల్గవది. తురీయావస్థ - నిర్వికల్ప సమాధి.
ఆయన నక్షత్రం - హస్త.
హస్తా నక్షత్రం కన్యారాశిలో ఉంటుంది.
కన్యారాశికి అధిపతి బుధుడు, విజ్ఞాన ప్రదాత.
మేషరాశి మొదటి రాశి. మేష రాశి నుంచి ఆరవ రాశి కన్యారాశి. ఈ షష్టమ (ఆరవ) భావం - శతృ రుణ రణ రోగములను తెలియజేస్తుంది.
మనిషి ఆధ్యాత్మిక ప్రగతికి, లౌకిక ప్రగతికి ఏర్పడే విఘ్నాలను విశదపరుస్తుందీ భావం.
అటువంటి షష్ట భావంలో (హస్తా నక్షత్రం, కన్యారాశి) చంద్రుడుండగా ఆవిర్భవించిన విఘ్నేశ్వరుడు, చవితినాడు పుట్టిన వినాయకుడు, ఈ నాలుగు విధములైన విఘ్నాలను తొలగిస్తానని అభయమిస్తున్నాడు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment