💥శ్రీరామ నామం:

 ⚜️🕉️🚩 శ్రీ రామ జయ రామ జయజయ రామ 🌹🙏

🏵️🌼🏵️🌼🏵️


శ్రీ రాఘవం దశరథాత్మజ మప్రేమయం

సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపమ్!

ఆజానుబాహుమరవింద దళాయతాక్షం

రామం నిశాచర వినాశకరం నమామి!!


- అంటూ శ్రీరాముడిని స్తుతించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పురాణాలు చెబుతున్నాయి.


💥శ్రీరామ నామం:


శ్రీరామ నామం తారకనామం.

దుఃఖాలను, దురితాలను దూరం చేసేది.

అతి సులభంగా ఏ కష్టం లేకుండా కష్టాలను దూరం చేసుకోవడానికి వర్ణాశ్రమ భేదాలకతీతంగా ఎల్లరు ఉచ్చరింపగలిగిన మంత్రం రామ మంత్రమే. 


రామ ఏవ పరంబ్రహ్మ రామ ఏవ పరం తపః

రామ ఏవ పరం తత్వం శ్రీరామో బ్రహ్మ తారకమ్


- అని రామ రహస్యోపనిషత్తు అంటుంది.


భగవత్ప్రాప్తికి ఉపాయం (సాధనం) రామ నామం కాగా ఉపేయం (గమ్యం) కూడా అదే.


సామాన్యంగా ఉపాయం లేనిదే ఉపేయాన్ని పొందుట సాధ్యం కాదు. కాని రాముని ఆరాధిస్తేచాలు.. రాముని తల్చుకుంటే చాలు.. రాముడే ఉపాయం స్ఫురింపచేస్తాడు.

ఆ ఉపాయాన్ని పొందేందుకు మార్గం కూడా రాముడే చూపిస్తాడు.


💥శ్రీరాముడు మానవకోటికి ఆరాధ్యదైవం. భారతీయులు ఏదైనా రాయదలిస్తే "శ్రీరామ" అని ఆరంభిస్తారు.


పాపకార్యాన్ని విన్నప్పుడు, చేయలేని పనిని చేయాల్సి వచ్చినపుడో ‘రామ రామ’ అని తమ బాధను చెప్పుకుంటారు.

సుఖదుఃఖాలల్లో ఉచ్చరించగలిగిన నామం "శ్రీరామ" నామమొక్కటే.


రాముడు అరవింద దళాయతాక్షుడు.

ఆజానుబాహుడు. నీలమేఘ శరీర ఛాయతో గూడిన వర్చస్సున్నవాడు.

చంద్రబింబాలకే చంద్రబింబం ఆయనవదనం.


రాముడు సదా శాంతచిత్తుడు. ఎల్లవేళలా ప్రియభాషణమే చేస్తాడు.

సీతా మనోహరుడైన ఆ పురుషోత్తముడు నిగ్రహానుగ్రహ సమర్థుడు. భక్తజన సంరక్షకుడు. సకలార్థసిద్ధి సహితుడు.

రామ అన్న పిలుపుకే పలికే భక్తవత్సలుడు.


💥రామ నామ జపాన్ని మహేశ్వరుడే అహర్నిశమూ చేస్తుంటాడన్నది పురాణ వాక్కు.

సంసార క్లేశాలనుండి జరామరణ దుఃఖాలనుండి తరింపచేసేదే రామనామ తారక మంత్రమే అనేది ఎందరో అనుభవజ్ఞుల మాట.


అందుకే శ్రీరామపదం కేవలం ఒక భౌతిక రూపాన్ని బోధించే పదం మాత్రమేకాదు. ఉపేయమైన భగవత్ప్రాప్తిని బోధించే పదం.


నామస్మరణాదన్యోపాయం

నహి పశ్యామో భవ తరణే!


- భవసాగరాన్ని దాటడానికి నామస్మరణ కంటె వేరొక ఉపాయం లేదు.


లోపల వెలుపల అన్నిచోట్ల నారాయణుడే నిండి ఉన్నాడనెడి భావనతో ప్రహ్లాదుని వలె దృఢ విశ్వాసముతో ప్రవర్తించే జప సాధకుడు తన్మయ స్థితిని పొందుతున్నాడు. అమరుడగుచున్నాడు.


బాధితులు కానీ జిజ్ఞాసులు కానీ ధనార్థులు కానీ మోక్షార్థులు కానీ ఎవరైనా సరే! దృఢవ్రతులై నామాన్ని అనుస్మరిస్తూ సర్వత్రా భగవంతుని దర్శింపగల మహాత్ములు అమృతత్వాన్ని తప్పక పొందుతారు.


💥శ్రీరాముడు ధర్మావతారం. ఆదర్శమూర్తి.

సమస్త కల్యాణ గుణాభిరాముడు.

అన్నింటికీ కారణభూతుడైన శ్రీరాముణ్ణి మనసా వాచా కర్మణా తలచినవారికి వారు కోరుకున్నవి సిద్ధిస్తాయి.


శ్రీరాముడు ఆదర్శ రాజు, ఆదర్శ సోదరుడు, ఆదర్శ పతి, ఆదర్శ పురుషుడు.

భారతీయతే ఆయనగా అవతరించిందంటే అది సనాతన సత్యం.


భారతీయులకే కాదు మానవ ధర్మమైన సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రతి వ్యక్తికీ..

"అంతా రామమయం, జగమంతా రామమయం"

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

వైశాఖ అమావాస్య శని జయంతి.

💥సింహాచల చందనోత్సవం💥