"యాదేవీ సర్వ భూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా
⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏
🏵️🌼🏵️🌼🏵️
💥మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి. ఐశ్వర్య ప్రదాయిని. అష్టలక్ష్ముల సమిష్ఠి రూపమే మహాలక్ష్మి.
కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ, గజరాజు సేవిస్తుండగా శ్రీమన్మహాలక్ష్మీ రూపములో అమ్మ దర్శనమిస్తుంది.
డోలాసురుడనే రాక్షసుడును సంహరించిన దేవత.
శక్తి త్రయములో అమ్మ మధ్య శక్తి.
ఈ దేవిని ఉపాసిస్తే ఫలితాలు శీఘ్రముగా కలుగుతాయని పురాణములు చెబుతున్నాయి.
లక్ష్మీం క్షీరసముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీభూతసమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం |
శ్రీమన్మంద కటాక్ష లబ్ధ విభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం ||
🍁🍁🍁🍁🍁
💥"యాదేవీ సర్వ భూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా”
-అంటే అన్ని జీవులలోనూ ఉండే లక్ష్మీ స్వరూపము దుర్గాదేవి అని చండీస్తుతి చెబుతుంది.
పూర్వకాలమున అమృతము కొరకు దేవతలు, రాక్షసులు పాలసముద్రమును చిలుకు సమయమున ముందుగా లక్మిదేవి పాలసముద్రము నుండి ఉద్భవించినది.
అందుకే ఆమె "క్షీరసముద్రరాజతనయ" అని పిలవబడుతున్నది.
తరువాత కామధేనువు, కల్పవృక్షము హాలాహలము, చివరిగా అమృతము లభించినవి.
ఈ విధంగా ఉద్భవించిన శ్రీమహలక్ష్మిని మనసారా పూజించిన సకల జనులకు ఈ జన్మమున సర్వ సుఖములు పరమందు మోక్ష సిద్ధి కలుగుతాయి.
కరుణావీక్షణము చేతనే సకల సౌఖ్యములు సమకూర్చగల శ్రీలక్ష్మి వైకుంఠమున శ్రీమహావిష్ణువు పై కినుక వహించి, భూలోకమున అవతరించినది.
నీవు తప్ప నాకేవ్వరు దిక్కని స్తుతించిన వారికి అన్నిటా ఆ లక్ష్మిదేవి తోడై అండగా నిలుస్తుంది.
భాగ్యం కోసం ఆ తల్లిని ఆరాధించిన వారికి ఆ మాత భోగ భాగ్యములను ప్రసాదించే సకల వరప్రదాయిని భాగ్యలక్ష్మి అవుతుంది.
నిస్సంతులు పుజించినచో సంతానలక్ష్మిగా తన అనురాగమును సంతానమును కలిగించును.
విజయము కొరకు ప్రార్ధించిన జయలక్ష్మి అయి విజయాన్ని కలిగిస్తుంది.
పాండిత్యము కొరకు పూజించిన వారికి విద్యాలక్ష్మిగా సర్వశాస్త్ర పారంగతులను చేసే తల్లి.
ధనము కొరకు పూజించే వారికి ధనలక్ష్మి కోరికలు నెరవేర్చే కరుణామూర్తి.
పంటలు లేక బాధపడేవారు పూజించిన, ధాన్యమునిచ్చు ధాన్యలక్ష్మి.
పిరికితనము పొగొట్టు ధైర్యలక్ష్మి.
నిత్య జీవితావసరాలను ఆశించి పూజించు వారికి అండగా నిలిచి కాపాడే ఆదిలక్ష్మి.
ఆ తల్లి యెక్క అష్టరూపాలను ఎవరైతే భక్తిగా, శ్రద్ధగా నియమములతో పూజిస్తారో వారికి తప్పకుండా ఆ తల్లి యెక్క అనుగ్రహము లభిస్తూందనుటలో సంశయము లేదు.
🔸🔹🔸🔹🔸
ధిమిధిమి ధింధిమి ధింధిమి-దింధిమి, దుంధుభి నాద సుపూర్ణమయే
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ, శంఖ నినాద సువాద్యనుతే ।
వేద పూరాణేతిహాస సుపూజిత, వైదిక మార్గ ప్రదర్శయుతే
జయ జయహే మధుసూదన కామిని, ధనలక్ష్మి రూపేణా పాలయ మామ్ ॥
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment