‘అమ్మ’కు బోనాలు.. జగతికి భాగ్యాలు..
⚜️🕉️🚩 ‘అమ్మ’కు బోనాలు.. జగతికి భాగ్యాలు...
🏵️🌼🏵️🌼🏵️
💥నిండు మనసుతో బోనం సమర్పిస్తే మెండు మనసుతో అనుగ్రహించే మహంకాళి!🌹🙏
🌿🌺 ప్రకృతికి జరిగే పూజ 🌺🌿
ప్రకృతిని శక్తిస్వరూపిణిగా, జగన్మాతగా కొలవడం భారతీయ సంప్రదాయం.
ప్రకృతిశక్తుల విభిన్న కళలే గ్రామదేవతలని దేవీ భాగవతంలో ఉంది.
ప్రకృతి తల్లిలాంటిది. ఆ తల్లి ఒడిలో సేద తీరాలంటే ఆమెను పూజించాలి.
అంటే ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవాలి.
మానవ మనుగడకు అదే శ్రీరామరక్ష.
అందుకు భిన్నంగా వ్యహరించినప్పుడు, ప్రకృతి ప్రకోపిస్తే విపత్కర పరిణామాలు ఎదురుకాక తప్పదు.
వాటిని అధిగమించేందుకు మారుతున్న రుతువులు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వివిధ రూపాలు, పేర్లతో కొలువైన గ్రామదేవతలను వేడుకుంటూ జరుపుకునే పండుగే బోనాలు.
ప్రధాన ఆలయాలతో పాటు వాడవాడలా కొలువై ఉన్న గ్రామదేవతలను కాళీమాత రూపాలుగా పూజిస్తూ బోనాలు సమర్పించుకుంటారు.
ఆషాడంలో ఆడబిడ్డ ఇంటికి వచ్చినట్లు భావించి పసుపు కుంకుమలు, చీరసారెలు, భోజన నైవేద్యాలతో మొక్కులు చెల్లించుకుంటారు.
ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, ముత్యాలమ్మ... ఇలా శక్తి స్వరూపమైన అమ్మవార్ల వద్ద తమను చల్లగా చూడమని వేడుకుంటారు.
లోక కల్యాణం, సకల జన సంక్షేమం ఆషాడ బోనాల అంతరార్థం.
🌿🌺బోనమంటే...🌺🌿
అమ్మవారికి భక్తితో సమర్పించే పప్పు అన్నాన్ని బోనం అంటారు. ఇది భోజనం అనే మాట నుంచి వచ్చింది.
‘భోజనం’ ప్రకృతి కాగా, ‘బోనం’ వికృతి అని చెబుతారు.
వేకువజామునే తలస్నానం చేసి పరిశుభ్రమైన దుస్తులు ధరించి కొత్తకుండలో బియ్యం, పాలు, నెయ్యి, చక్కెర కలిపి నైవేద్యం తయారు చేస్తారు.
మట్టి లేక రాగి పాత్రలో వండుతారు. ఈ పదార్థాలతో కూడిన నైవేద్యంతో పాటు భక్తులు తమ మొక్కుబడులకు అనుగుణంగా కూడా ప్రసాదాలు తయారు చేస్తారు.
పలానా పదార్థాలతో నైవేద్యం పెడతామని మొక్కుకుంటే వాటితోనే చేస్తారు.
నైవేద్యం ఏదైనా దానితో పాటు ‘సాకర’ (చెట్టుకొమ్మ)ను సమర్పిస్తారు.
కొత్త కుండకు సున్నం రాసి, చుట్టూ పసుపు, కుంకుమతో అలంకరించి, దానిపై దీపం (గండ దీపం) ఉంచి, తలపై పెట్టుకుని డప్పు చప్పుళ్లతో ఆలయానికి వెళతారు. అక్కడ ఏడు ప్రదక్షిణలు చేసి బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తారు.
కొంత ప్రసాదాన్ని ఇళ్లకు తెచ్చుకొని ఇరుగుపొరుగులకు పంచుకుంటారు.
🌿🌺శరీరం బోనపుకుండకు ప్రతీక...🌺🌿
శ్రీమాత సకల జగత్తును తన ఉదరమనే అమృత భాండంలో నిక్షిప్తం చేసుకుందని, అందుకు సంకేతంగా అన్న పదార్థాలను మట్టి కుండలలో వండి ‘బోనాలు’ గా సమర్పిస్తారని చెబుతారు.
'మన శరీరం బోనపు కుండకు ప్రతీక అనుకుంటే కుండలోని అన్నం జీవశక్తికి సంకేతం.
కుండపై వెలిగే దీపం ఆత్మజ్యోతి.
ఈ ఆత్మజ్యోతిని పరంజ్యోతితో మమేకం చేయాలన్నది బోనాలు సంబరాల ఆంతర్యం’ అని ఆధ్యాత్మికవాదులు చెబుతారు.
ప్రకృతిశక్తి ప్రసాదితాలైన సస్యాలు, ధాన్యాది శాకాలను ఆమెకే సమర్పించి కృతజ్ఞతను చాటుకోవడమే బోనాలు పరమార్థమనీ చెబుతారు.
అమ్మవారికి నిండు మనసుతో బోనం సమర్పిస్తే మెండు మనసుతో అనుగ్రహం కురిపిస్తుందని భక్తుల విశ్వాసం.
సేకరణ... 💐🙏

Comments
Post a Comment