⚜️🕉️🚩గురు రాఘవేంద్ర నమోస్తుతే!🌹🙏

 ⚜️🕉️🚩గురు రాఘవేంద్ర నమోస్తుతే!🌹🙏

🏵️🌼🏵️🌼🏵️


💥భారతీయ ఆధ్యాత్మిక సంపదను పరిపుష్టం చేసిన యోగులు ఎందరో! తమ జీవితాలను త్యాగం చేసి, సత్యధర్మాలను పునఃప్రతిష్ఠచేశారు.

అలాంటి మహనీయుల్లో ఒకరు యతీంద్రుడు రాఘవేంద్రస్వామి.


మధ్వ సంప్రదాయానికి మణిహారంగా, మదినే మంత్రాలయంగా మార్చిన గురుదేవుడు.

తుంగా జలాల సేవతో.. తులసీదళాల పూజతో..

తనను ఆరాధిస్తున్న వారిని సదా అనుగ్రహిస్తూనే ఉన్నాడు. 


పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయచ

భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే॥


🌹సకల ప్రదాత రాఘవేంద్రుడు. ఆయన కరుణా సముద్రుడు. సత్యధర్మాలను ఆశ్రయించిన భక్తులకు కల్పవృక్షంతోనూ, కామధేనువుతోనూ సమంగా వరాలు కురిపిస్తాడు. మనసులో స్వామిని నిలుపుకొన్న వారికి ఐశ్వర్యం, యశస్సును అందిస్తారని రాఘవేంద్ర స్తోత్రం చెబుతుంది.

🍁🍁🍁🍁🍁


గురు రాఘవేంద్రుడు మధ్వ సంప్రదాయంలో ప్రభవించినా.. అందరివేల్పు.

స్వామి ప్రహ్లాదుడి అంశగా జన్మించాడని విశ్వసిస్తారు. 


రాఘవేంద్రుల పూర్వాశ్రమ నామం.. వేంకటనాథుడు. తమిళదేశంలోని భువనగిరి జన్మస్థలం.

తిమ్మణ్ణభట్టు, గోపాంబ దంపతులకు ఫాల్గుణ శుద్ధ సప్తమినాడు జన్మించాడు.

కాంచీపురంలో వేదాధ్యయనం చేశాడు.

వీణావాదనంలోనూ ప్రతిభ కనబరిచేవాడు. వీణవేంకటభట్టుగా పిలిచేవారంతా.


శ్రీ సుధీంద్ర తీర్థుల దగ్గర సకల శాస్ర్తాలు అధ్యయనం చేశాడు వేంకటనాథుడు.

తన పాండిత్య ప్రతిభతో ఎందరినో ఓడించి మహాభాష్యాచార్య, మహాభట్టాచార్య బిరుదులు పొందాడు.


సరస్వతీ కృప అనంతమైనా, లక్ష్మీ కటాక్షం అస్సలు లభించలేదు. దుర్భర దారిద్య్రాన్ని అనుభవించాడు. కన్నబిడ్డకు కాసిన్ని ఆవుపాలు సమకూర్చలేని పరిస్థితి. ఆ ఐహిక కష్టాలను చిరునవ్వుతో తట్టుకొన్నాడు.

అంతా హరి చిత్తమని తలచాడు.


వేంకటనాథుడు కారణ జన్ముడని ఆయన గురువు సుధీంద్రతీర్థులు గుర్తించాడు.

సన్యాసాశ్రమం స్వీకరించమని ఆదేశించాడు.


గురువు ఆజ్ఞ ప్రకారం.. ఫాల్గుణ మాసం శుక్ల విదియ నాడు రాఘవేంద్రతీర్థులుగా ఆశ్రమనామాన్ని స్వీకరించాడు వేంకటనాథుడు.


నాటినుంచి దేశ సంచారం చేస్తూ.. భక్తి, జ్ఞాన, వైరాగ్యాలను ప్రబోధించాడు.

అనుభాష్యం, బ్రహ్మసూత్ర భాష్యం, ఉపనిషత్తులకు భాష్యం, రామచరిత మంజరి, కృష్ణచరిత మంజరి వంటి 48 గ్రంథాలను రచించాడు.

దాస సాహిత్యాన్ని ప్రోత్సహించాడు.

తమిళనాడులో పుట్టి, కర్ణాటకలో పెరిగి, ఆంధ్రదేశంలో స్థిరపడ్డాడు.


హంసనామక పరమాత్మతో ప్రారంభమైన గురు పరంపరలో 32వ పీఠాధిపతిగా బాధ్యతలు స్వీకరించాడు.


ఆసేతు హిమాచలం మూడుసార్లు కాలినడకన పర్యటించాడు.

ఈ క్రమంలో మధ్వాచార్యుల ద్వైత సిద్ధాంతానికి ప్రచారం కల్పించాడు.


‘జీవుడు వేరు, బ్రహ్మ వేరు. జీవుడు మిథ్య కాదు.

జడ జగత్తు కూడా మిథ్య కాదు. పరమాత్మ ఎంత సత్యమో, జీవ జగత్తు కూడా అంతే సత్యం’ అన్న పరమ సత్యాన్ని ప్రపంచానికి ప్రబోధించాడు.


‘సర్వోత్తముడైన హరిని ఆశ్రయిస్తే భవ సాగరాన్ని సునాయాసంగా దాటేయవచ్చు. వైకుంఠధామాన్ని చేరుకోవచ్చు’ అని చాటి చెప్పాడు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు