💥శ్రీసుబ్రహ్మణ్య పంచరత్నం💥 తాత్పర్య సహితము..
⚜️🕉️🚩 ఓం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః 🌹🙏
🏵️🌼🏵️🌼🏵️
శరవణభవ శరవణభవ శరవణభవ పాహిమాం
శరవణభవ శరవణభవ శరవణభవ రక్షమాం
🍁🍁🍁🍁🍁
💥శ్రీసుబ్రహ్మణ్య పంచరత్నం💥 తాత్పర్య సహితము..
షడాననం చందన లేపితాంగం – మహోరసం దివ్యమయూరవాహనమ్ |
రుద్రస్యసూనుం సురలోకనాథం – బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే ||
🌹 తాత్పర్యం:
ఆరు ముఖములుకలవాడు, శరీరముపై చందనమును ధరించువాడు, రసస్వరూపుడు, నెమలి వాహనముకలవాడు, శివుని తనయుడు, దేవలోకాలకు అధిపతియైన పరబ్రహ్మ స్వరూపునకు ప్రణమిల్లుతూ శరణు వేడుతున్నాను.
జాజ్వల్యమానం సురవృన్దవంద్యం – కుమారధారాతట మందిరస్థమ్ |
కందర్పరూపం కమనీయగాత్రం – బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే ||
🌹 తాత్పర్యం:
దేదీప్యమానంగా భాసిల్లువాడు, సురులచే కొలవబడువాడు, కుమారధార నదీతీరమున ఆలయంలో వెలసినవాడు, ఆకర్షణీయమైన రూపముకలవాడు అయిన పరబ్రహ్మ స్వరూపునకు ప్రణమిల్లుతూ శరణు వేడుతున్నాను.
ద్విషడ్భుజం ద్వాదశదివ్యనేత్రం త్రయీతనుం శూలమశిందధానమ్ |
శేషావతారం కమనీయరూపం – బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే ||
🌹 తాత్పర్యం:
ఆరుజతల చేతులు కలవాడు, ద్వాదశ పవిత్ర నేత్రాలు కలవాడు, త్రినేత్రుని తనయుడు, శూలమును ఆయుధముగా ధరించువాడు, శేషుని అవతారం, చూడముచ్చటైన రూపం కల పరబ్రహ్మ స్వరూపునకు ప్రణమిల్లుతూ శరణు వేడుతున్నాను.
సురారిఘోరాహవ శోభమానం – సురోత్తమం శక్తిధరం కుమారమ్ |
సుధార శక్త్యాయుధ శోభిహస్తం – బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే ||
🌹 తాత్పర్యం:
సురారి, దేవతల శత్రువులకు భయము కలిగించే తేజస్సుకలవాడు. దేవతలలో ఉత్తముడు, పార్వతీదేవి తనయుడు, చేతిలోని శక్తితో తేజరిల్లు పరబ్రహ్మ స్వరూపునకు ప్రణమిల్లుతూ శరణు వేడుతున్నాను.
ఇష్టార్థసిద్ధిప్రద మీశపుత్రం – ఇష్టాన్నదం భూసురకామధేనుమ్ |
గంగోద్భవం సర్వజనానుకూలం – బ్రహ్మణ్యదేవం శరణం ప్రపద్యే ||
🌹 తాత్పర్యం:
అడిగిన వరములిచ్చు శివుని కుమారుడు, విప్రులకు అన్ని కోరికలు తీర్చుకామధేనువు, గంగనుండి ఆవిర్భవించి అందరికీ చేయూతనిచ్చే పరబ్రహ్మ స్వరూపునకు ప్రణమిల్లుతూ శరణు వేడుతున్నాను.
ఫలశ్రుతి:
యః శ్లోక పంచమిదం పఠతీహ భక్త్యా – బ్రహ్మణ్యదేవ వినివేశిత మానసః సన్ |
ప్రాప్నోతి భోగమఖిలం భువి యద్యదిష్టమ్ – అంతే స గచ్ఛతి ముదా గుహ సామ్యమేవ ||
🌹 తాత్పర్యం:
ఈ ఐదు చరణములు భక్తితో పఠించువారు, తాను పరబ్రహ్మ స్వరూపం అన్న సత్యాన్ని తెలుసుకొన్నవారు తమ అవనీ సంచారంలో అన్ని సుఖములను అనుభవిస్తారు. కడకు సుబ్రహ్మణ్యస్వామి దివ్య పాదములను చేరుకొంటారు.
💥సర్వం శ్రీవల్లీదేవసేనాసమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరార్పణమస్తు 🌹🙏
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment