త్రిమూర్తి స్వరూపుడు ఆదిత్యుడు..
⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్య నారాయణాయ నమః 🌹🙏
🏵️🌼🏵️🌼🏵️
ఉదయగిరి ముపేతం భాస్కరం పద్మహస్తాం ||
సకల భువన నేత్రం నూ త్నరత్నోపధేయం
తిమిరకరి మృగేంద్రం బోధకం పద్మినీ నాం
సురవరమభి వంద్యం, సుందరం, విశ్వరూపం ||
💥త్రిమూర్తి స్వరూపుడు ఆదిత్యుడు...
సూర్యభగవానుడు కర్మసాక్షి.
సకల లోకాలకు ఆత్మస్వరూపుడు.
‘సర్వం సూర్యమయం జగత్’ అన్నట్లు సకల జగత్తు ఆయన తేజస్సుతో చైతన్యం పొందుతోంది.
సమస్త ప్రాణకోటి ఆయనపైనే ఆధారపడి ఉంది.
సకల చరాచరసృష్టికి, జీవరాశి మనుగడకు సూర్యశక్తి అనివార్యం. ఆయన కాలస్వరూపుడు.
సూర్యగమనాన్ని అనుసరించే సంవత్సర కాలాన్ని ఉత్తర దక్షిణాయనాలుగా విభజించారని తెలిసిందే.
సమస్త జీవరాశికి ఆధారభూతుడు కనుకనే వేదాలు ఆయనను త్రిమూర్తి స్వరూపుడిగా, సర్వదేవతా సమాహారమని అభివర్ణించాయి.
"నమస్కార ప్రియోభానుః" అని ఆర్యోక్తి.
కేవలం వందనంతోనే ప్రసన్నుడై ఆరోగ్య విజ్ఞానాలను ప్రసాదించే ప్రత్యక్ష భగవానుడు దివాకరుడు.
ఉదయాస్తమయ వేళల్లోని సూర్యకిరణాలు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది.
సూర్య నమస్కారాల వల్ల జ్ఞానం, సద్గుణం, వర్చస్సు, బలం, ధనం, సంతానం, పాపనాశనం, సకల రోగ నివారణ, ఆయుర్వుద్ధి కలుగుతాయని రుగ్వేద వచనం. అందుకే ఆయన పుట్టినతిథి ‘రథ సప్తమి’ని ‘ఆరోగ్య సప్తమి’ అనీ అంటారు.
ఆదివారాలలో సూర్య నమస్కారాలు చేసి పాలను నివేదిస్తే సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం.
🍁🍁🍁🍁🍁
💥#సూర్యాష్టకం💥
ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మభాస్కర
దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే
సప్తాశ్వ రధ మారూఢం ప్రచండం కశ్యపాత్మజం
శ్వేత పద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
లోహితం రధమారూఢం సర్వ లోక పితామహం
మహాపాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
త్రైగుణ్యం చ మహాశూరం బ్రహ్మ విష్ణు మహేశ్వరం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
బృంహితం తేజసాం పుంజం వాయు మాకాశ మేవచ
ప్రభుంచ సర్వ లోకానాం తం సూర్యం ప్రణమామ్యహం
బంధూక పుష్ప సంకాశం హార కుండల భూషితం
ఏక చక్రధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
విశ్వేశం విశ్వ కర్తారం మహా తేజః ప్రదీపనం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
తం సూర్యం జగతాం నాధం జ్నాన విజ్నాన మోక్షదం
మహా పాప హరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం
సూర్యాష్టకం పఠేన్నిత్యం గ్రహపీడా ప్రణాశనం
అపుత్రో లభతే పుత్రం దరిద్రో ధనవాన్ భవేత్
ఆమిషం మధుపానం చ యః కరోతి రవేర్ధినే
సప్త జన్మ భవేద్రోగీ జన్మ కర్మ దరిద్రతా
స్త్రీ తైల మధు మాంసాని హస్త్యజేత్తు రవేర్ధినే
న వ్యాధి శోక దారిద్ర్యం సూర్య లోకం స గచ్ఛతి
ఇతి శ్రీ శివప్రోక్తం శ్రీ సూర్యాష్టకం సంపూర్ణం ||
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment