"ద్వాదశేష్వపి మాసేషు, శ్రావణః శివరూపకః"

 ⚜️🕉️🚩 ఓం శ్రీ లక్ష్మీనారాయణ స్వామినే నమః🌹🙏

🏵️🌼🏵️🌼🏵️


💥అధిక మాసం.. అనంత ఫలం!


"ద్వాదశేష్వపి మాసేషు, శ్రావణః శివరూపకః"

అంటే ‘పన్నెండు నెలల్లో శ్రావణ మాసం శివరూపం, సాక్షాత్తు నేనే శ్రావణ మాసం’ అని సనత్కుమారుడికి చెబుతాడు పరమేశ్వరుడు.

అలాంటి పవిత్ర శ్రావణ మాసం ఈ ఏడాది రెండుసార్లు వస్తున్నది. 


అధిక మాసంలో చేసే దానాలు, జపాలు అధిక ఫలాన్ని ఇస్తాయని పెద్దల మాట.


🌹 #అధికమాసం అంటే...


రెండు అమావాస్యల మధ్య రవి సంక్రమణం జరగని నెలను అధిక మాసంగా పరిగణిస్తారు.

చాంద్రమాన సంవత్సరానికి, సౌరమాన సంవత్సరానికీ ఉన్న కాల భేదాన్ని సరిచేయడానికి అధిక మాసం ఏర్పడుతూ ఉంటుంది.

చాంద్రమానంలో ఒక నెలను అధికంగా కలిపి అధిక మాసంగా పరిగణిస్తారు.


చాంద్రమానంలో ఒక నెల అంటే సుమారు 29.53 రోజులకు సమానం.

దీని ప్రకారం సంవత్సరానికి సుమారు 354 రోజులు వస్తాయి.

ఈ ప్రకారం చాంద్రమాన సంవత్సరంలో సౌరమాన సంవత్సరం కన్నా 11 రోజుల, 1 గంటా 31 నిమిషాల 12 సెకండ్లు తక్కువగా ఉంటాయి.

అంటే ప్రతి 32.5 నెలల్లో చాంద్రమాన సంవత్సరం, సౌరసంవత్సరం కంటే 30 రోజుల పాటు వెనక బడుతుంది.

ఈ ముప్పయి రోజులను సవరించి చాంద్రమాన సంవత్సరాన్ని సౌర సంవత్సరంతో సమానం చేసేందుకు ఆ సంవత్సరంలో ఒక నెలను అధికంగా కలుపుతారు.

ఈ నెలనే "అధికమాసం" అంటారు.

అంటే అధికమాసం సుమారుగా ప్రతి 32 నెలలకు ఒకసారి వస్తుంది.


అధిక మాసం ముందు వచ్చి ఆ తర్వాత నిజ మాసం వస్తుంది.

ధర్మ సింధువు ప్రకారం అధిక మాసంలో ఉపాకర్మ, ఉపనయనం, వివాహం, వాస్తుకర్మ, గృహప్రవేశం, దేవతా ప్రతిష్ఠ, యజ్ఞం, సన్యాసాశ్రమ స్వీకారం, రాజాభిషేకం, అన్న ప్రాశనం, నామకరణం మొదలైన కార్యక్రమాలు చేయకూడదు.


ముహూర్తాలతో ప్రమేయం లేకుండా నిత్యం చేసే పూజలు యథావిధిగా కొనసాగించవచ్చు.

అదే సమయంలో అధిక మాసంలో జపతపాదులూ, దానాలూ, నదీస్నానాలూ, తీర్థయాత్రలూ సాధ్యమైనంత ఎక్కువగా చెయ్యాలని శాస్ర్తాలు చెబుతున్నాయి.


మరణ సంబంధమైన క్రతువులు (మాసికం, ఆబ్దికం మొదలైనవి) అధిక, నిజమాసాలు రెండింటిలో చేయాల్సి ఉంటుంది.


శ్రావణ మాసం అధికంగా రావడం వల్ల వ్రతాలు, నోములూ రెండుసార్లు చేయాలా అనే సందేహం కలగవచ్చు. అధిక మాసంలో ఇవి చేయకూడదు. 


శుక్రవార పూజలు, మంగళగౌరీ వ్రతాలు అన్నీ నిజ మాసంలోనే చేసుకోవాలి.

నిత్య దేవతార్చన విశేషంగా చేసుకోవాలి.


🌹#పుణ్యప్రదం:


శ్రీమహా విష్ణువుకు అధికమాసం అంటే ఎంతో ప్రీతి.

అందుకనే అధికమాసానికి "#పురుషోత్తమ_మాసం" అనే పేరు ఏర్పడింది.


స్వయంగా ఆయనే శ్రీమహాలక్ష్మికి ఓ సందర్భంలో పురుషోత్తమ మాస విశిష్టతను వివరిస్తూ...

"ఎవరైతే ఈ మాసంలో పుణ్య నదీస్నానాలు, జప హోమాలు, దానాలు ఆచరిస్తారో వారికి సాధారణ మాసాల కన్నా అనేక రెట్ల ఫలితాలు లభిస్తాయి.

అధిక మాసం శుక్ల పక్షంలో కానీ, కృష్ణ పక్షంలో కానీ అష్టమి, నవమి, ఏకాదశి, ద్వాదశి, చతుర్దశి, అలాగే పౌర్ణమి నాడైనా పుణ్యకార్యాలు చేయాలి.

దానివల్ల వారికి అపారమైన ఫలితం లభిస్తుంది" అని వివరించాడని పురాణ కథనం.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు