Posts

Showing posts from July, 2022

"సర్వం సూర్యమయం జగత్‌"

Image
 🕉️⚜️🚩 ఓం సూర్యదేవాయ నమః 🌹🙏 🌹🌼🌸🌹🌼🌸🌹🌼🌸🌹 సప్తలోక ప్రకాశాయ సప్తసప్త రథాయచ సప్త ద్వీప ప్రకాశయ భాస్కరాయ నమోనమః సమస్త లోకాలకు కర్మసాక్షిగా అనంతమైన శక్తి కిరణాలతో వెలుగును, తేజస్సును ప్రసాదిస్తున్న "ఆదిత్యుడు" ఆదితి కశ్యప ప్రజాపతి కుమారుడిగా విశాఖ నక్షత్రంలో ఆవిర్భవించినట్లు బ్రహ్మాండ పురాణ కథనం. సూర్యభగవానుడు నిత్యానుసంధాననీయుడు. ఆదివారాలలో సూర్య నమస్కారాలు చేసి పాలను నివేదిస్తే సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం. "ఆరోగ్యమే మహాభాగ్యం" అన్నట్లు పరమోన్నతమైన ఆరోగ్య భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. సూర్యుడికి "వివస్వతుడు" అని మరో పేరు ఉంది. ఆయన కుమారుడే ఏడవ మనువు వైవస్వతుడు. రథసప్తమి నాడే ఆయన మన్వంతరం ప్రారంభమైందని చెబుతారు. కాలానికి ఆదిత్యుడే కొలమానం. సమస్త జీవరాశికి ఆధారభూతుడు. కాబట్టే వేదాలు ఆయనను త్రిమూర్తి స్వరూపుడిగా ఆభివర్ణించాయి.  "ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్‌" (ఆరోగ్యం కోసం భాస్కరుని ఆరాధించాలి) అంటారు. సూర్యారాధన సర్వ రోగాలను హరించి ఆరోగ్యాన్ని, బలాన్ని, తేజస్సును ప్రసాదిస్తుంది. "సర్వం సూర్యమయం జగత్‌" అన్నట్లు సకల జగత్తు ఆయన తేజస్స...

💥 అక్షర శరీరుడైన శివుని స్వరూపము 💥

Image
 🕉️🔱🚩 💥 ఓం నమః శివాయ 🌹🙏 ⚜️🌸⚜️🌸⚜️🌸⚜️🌸⚜️ నమో గౌరీశాయ స్ఫటిక దవళాజ్గాయచ నమో, నమో లోకేశాయ స్తుతవిబుధలోకాయ చ నమః | నమః శ్రీ కంఠాయ క్షపితపురదైత్యాయ చ నమః నమః పాలక్షాయ స్మరమదవినాశాయ చ నమః || 🍁గౌరీశ్వరునికి నమస్కారం. స్ఫటికంలా శుద్ధ ధవళ కాంతులతో దీపించే లోకేశునికి, దేవతాసమూహంచే స్తుతింపబడే వానికి, శ్రీ (విషం) కంఠంలో ధరించినవానికి, త్రిపురాసురులను నిర్మూలనం చేసిన వానికి, పాలభాగాన నేత్రం గల జ్ఞానమూర్తికి, మన్మథుని మదాన్ని వినాశనం చేసిన శివునికి నమస్మృతులు🙏.      💥 అక్షర శరీరుడైన శివుని స్వరూపము 💥  🍁అక్షర శరీరుడైన శివుని స్వరూపము ఈ విధంగా ఉన్నది: అకారము పరమేశ్వరుని శిరస్సు. ఆకారము లలాటము. ఇకారము కుడి కన్ను. ఈకారము ఎడమకన్ను. ఉకారము కుడి చెవి. ఊకారము ఎడమ చెవి. ఋకారము ఆ పరమేశ్వరుని కుడి చెక్కిలి. ౠకారము ఎడమచెక్కిలి. అలు, అలూ కారములు రెండు ముక్కుపుటములు. ఏకారము పై పెదవి. ఐకారము ఈశ్వరుని క్రింది పెదవి. ఓకారము పై పళ్ళవరుస. దేవదేవుడగు శివునికి "అం అః" అనునవుతాలు (దవడలు) స్థానములాయెను. వీటికి "ప్రాణాక్షరములు" అని పేరు. 🍁క వర్గలోని ఐదు అక్షరములు(క ఖ గ ఘ జ్ఞ) ఐదు కుడ...

💥మహాగౌరి💥

Image
 🕉️🔱🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏 🌷🔱🌷🔱🌷🔱🌷🔱 💥 మహాగౌరి 💥 శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః మహాగౌరీ శుభం దద్యాత్‌ మహాదేవ ప్రమోదదా🌹🙏 🍁మహాగౌరి అనే పేరు (మహ, మహా = గొప్ప; గౌరీ, గౌరీ = తెలుపు) గొప్ప తెలుపు అని అర్ధం. 🍁#పార్వతి అవతారంలో పరమేశ్వరుణ్ణి పతిగా పొందటానికి కఠోరమైన తపస్సును ఆచరించింది. కఠోర తపస్సు కారణాన ఈమె శరీరం పూర్తిగా నలుపెక్కి పోతుంది. ఈమె తపస్సునకు సంతుష్టుడైన శివుడు ప్రసన్నుడై, ఈమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళన గావిస్తారు. తత్ప్రభావంవల్ల ఈమె "శ్వేత"వర్ణశోభిత అయి విద్యుత్కాంతులను విరజిమ్ముతుంటుంది. అప్పటినుండి ఈమె "మహాగౌరి" అని పేరుగాంచింది. 🍁మహాగౌరీదేవి నాలుగు చేతులతో- అభయ, వరముద్రలతో పాటు త్రిశూలం, డమరుకాలను ధరించి ఉంటుంది. 🍁ధవళకాంతితో మెరిసే వృషభాన్ని అధిరోహించి, శ్వేత వర్ణ శోభితయైు, తెల్లని వస్త్రాలను ధరించి, శతకోటి దివ్యకాంతులను ప్రసరింపచేస్తూ అభయప్రదానం చేస్తూ శోభిల్లుతుంది. 🍁ధన, వైభవ శక్తులకు ఈ తల్లి అధిష్ఠాత్రి. సదా శుభాన్ని ప్రసాదించమని గౌరీదేవిని ప్రార్థిస్తే ఆమె కరుణతో ఆశీర్వదిస్తుంది. అష్టమ దుర్గ అయిన గౌరీమాతను తెల్లని పుష్...

💥 శ్రీ స్తోత్రం 💥 (అగ్నిపురాణం)(ఇంద్ర కృతం)🌹🙏

Image
 🕉️🔱🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏 💥 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 💥 🌺🌸🌺🌸🌼🌸🌺🌸🌺 💥 శ్రీ స్తోత్రం 💥 (అగ్నిపురాణం)(ఇంద్ర కృతం)🌹🙏 పుష్కర ఉవాచ రాజలక్ష్మీస్థిరత్వాయ యథేంద్రేణ పురా శ్రియః |  స్తుతిః కృతా తథా రాజన్ జయార్థం స్తుతిమాదరేత్ || 1 ||   ఇంద్ర ఉవాచ-  నమస్తే సర్వలోకానాం జననీమబ్ధిసంభవాం |  శ్రియమున్నిద్రపద్మాక్షీం విష్ణువక్షస్స్థలస్థితామ్ || 2 ||   త్వం సిద్ధిస్త్వం స్వధా స్వాహా సుధా త్వం లోకపావనీ |  సంధ్యా రాత్రిః ప్రభా మూర్తిః మేధా శ్రద్ధా సరస్వతీ || 3 ||   యజ్ఞవిద్యా మహావిద్యా గుహ్యవిద్యా చ శోభనే |  ఆత్మవిద్యా చ దేవి త్వం విముక్తిఫలదాయినీ || 4 ||   ఆన్వీక్షికీ త్రయీ వార్తా దండనీతిస్త్వమేవ చ |  సౌమ్యాసౌమ్యైర్జగద్రూపైస్త్వయైతద్దేవి పూరితమ్ || 5 ||     కా త్వన్యా త్వామృతే దేవి సర్వయజ్ఞమయం వపుః |  అధ్యాస్తే దేవదేవస్య యోగిచింత్యం గదాభృతః || 6 ||   త్వయా దేవి పరిత్యక్తం సకలం భువనత్రయం |  వినష్టప్రాయమభవత్ త్వయేదానీం సమేధితమ్ || 7 ||   దారాః పుత్రాస్తథాగారం సుహృద...

శ్రావణమాసంలో వచ్చే ప్రతి రోజుకూ ఎంతో విశిష్టత ఉంది

Image
 🕉️⚜️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏 💥🌼లక్ష్మీప్రదమైన మాసం శ్రావణం..🌼💥 పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి । పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోస్తుతే ॥ 🔱🌼🏵️🍀🌼🏵️🍀🌼🏵️🍀🔱 🌷పౌర్ణమి రోజున చంద్రుడు శ్రవణ నక్షత్రంలో ఉంటాడు.. కనుక ఈ మాసానికి " శ్రావణమాసం " అని పేరు  వచ్చింది.  లక్ష్మీదేవి భర్త అయిన శ్రీ మహా విష్ణువు జన్మించింది కూడా ఈ శ్రావణ నక్షత్రంలోనే. అందువల్లే ఈ మాసం ఆమెకు ప్రీతికరమైనదని చెబుతారు. 🌷ముక్కంటికి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం. శ్రీనివాసుడి జన్మనక్షత్రం కూడా శ్రవణమే. శ్రీకృష్ణుడు అవతరించింది శ్రావణ మాసంలోనే. బలిచక్రవర్తికి పట్టాభిషేకం జరిగిన మాసం. శ్రవణ నక్షత్రానికి అధిపతి శివుడు ఈ మాసంలో మహా విష్ణువును పూజిస్తాడని ప్రతీతి.  🌷శ్రావణ మాసంలో వచ్చే ప్రతి రోజుకూ ఎంతో విశిష్టత ఉంది. ఈ మాసాంతం స్వామిని, అమ్మవారిని కొలిస్తే సకల పాపాలు తొలుగుతాయని నమ్మకం. 🍁మంగళవారం మంగళగౌరివ్రతం ..  మహిళలు ఈ మాసంలో మంగళవారం రోజున మంగళ గౌరీ వ్రతాన్ని ఆచరిస్తారు. పార్వతి దేవికి మరొక పేరు గౌరీ దేవిని పూజిస్తారు. ముఖ్యంగా కొత్తగా పెళ్ళయిన వధువులు.. తప్పనిసరిగా ఈ వ్రతాన్ని...

💥శ్రీ దత్త మాలా మంత్రం💥

Image
 🕉️⚜️🚩ఓం నమో భగవతే దత్తాత్రేయాయ 🌹🙏 💥🌷💥🌷💥🌷💥🌷💥 🍁అత్రి, అనసూయల తపస్సునకు మెచ్చి "దత్తాత్రేయుడు" త్రిమూర్తుల అంశతో రూపుదిద్దుకున్నాడు. అత్రి వరదునిది దైవ, గురు స్వరూపాల కలయిక. అందుకే దత్తాత్రేయుడు ఆదిగురువయ్యాడు. 🍁మాయా ప్రభావంతో దారితప్పుతున్న మానవులకు జ్ఞానబోధలకు, ఆచార వ్యవహారాల అనుసరణకు, ధర్మాధర్మ విచక్షణకు, శిష్టరక్షణతోబాటు, మానవాళి విధ్యుక్త ధర్మాల ప్రబోధకే ప్రాధాన్యతనిచ్చాడు. ఇదే ఆయన గురుతత్త్వం. 🍁జ్ఞానజ్యోతులు వెలిగించి, ప్రజల అజ్ఞానపు చీకట్లు తొలగించేందుకు వెలసిన దత్తస్వామి రూపం నయన మనోహరం, భద్రపదం, భవ బంధ నాశనం, భవసాగరతారకం. 🍁సంసారంలో ఉంటూనే, స్వధర్మపాలన చేసుకుంటూ తరించవచ్చని, ముక్తిని సాధించవచ్చు అన్నదే "దత్తసాంప్రదాయం" 🍁దత్తాత్రేయుని స్వభావంలో మూడు ముఖ్య లక్షణాలు గోచరిస్తాయి. 🔹మెుదటిది ఆయన తమ నామ స్మరణతో సంతుష్ఠులై స్మరించగానే కదలి వస్తారు. అందుకే ఆయనను స్మర్తృగామిగా కీర్తిస్తారు. 🔹రెండవది వారు భక్తులకు ఇహ పర సౌఖ్యాలను ఇస్తూ, యోగశక్తిని ప్రసాదించి, జీవన్ముక్తులుగా చేస్తారు. 🔹మూడవ లక్షణం... భక్తుల వెన్నంటే ఉంటూ, వారి మంచి చెడ్డలు చూస్తూ, వా...

సుబ్రహ్మణ్యష్టోత్తర శతనామ స్తోత్రం

Image
 🕉️⚜️🚩ఓం శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః🌹🙏 🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼 💥 శరవణభవుడు 💥 🍁ఇచ్ఛా, జ్ఞాన, క్రియా అనే మూడు శక్తులమయమైన శక్తిని ధరించిన కుమారస్వామి... అమోఘమైన శివతేజాన్ని, పృథ్వి, అగ్ని, జలం, ఆరు కృత్తికల శక్తిని (నక్షత్ర శక్తి) ధరించి, శరవణంలోనించి (పార్వతిదేవి) స్వామి జన్మించాడు.  అందుకే స్వామి శరవణభవుడు. 🍁శరవణభవ మంత్రంలో – శ – లక్ష్మీబీజము అధిదేవత శంకరుడు ర – అగ్నిబీజము అధిదేవత అగ్ని వ – అమృతబీజము అధిదేవత బలభద్రుడు ణ – యక్షబీజము అధిదేవత బలభ్రద్రుడు భ – అరుణ బీజము అధిదేవత భద్రకాళీదేవి వ – అమృతబీజము అధిదేవత చంద్రుడు శ – శమింపజేయువాడు ర – రతిపుష్టిని ఇచ్చువాడు వ – వంధ్యత్వం రూపుమాపువాడు ణ – రణమున జయాన్నిచ్చేవాడు భ – భవసాగరాన్ని దాటించేవాడు వ – వందనీయుడు అని ‘శరవణభవ’కు గూఢార్థం. శరవణభవ అనే మంత్రాన్ని పఠిస్తే చాలు సమస్త సన్మంగళాలు నిర్విఘ్నంగా జరుగుతాయి. 💥 సుబ్రహ్మణ్యష్టోత్తర శతనామ స్తోత్రం 💥 శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననమ్ । దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుటధ్వజమ్ ॥ ఇతి ధ్యానం స్కందో గుహః షణ్ముఖశ్చ ఫాలనేత్రసుతః ప్రభుః । పింగళః కృత్తికాసూ...

విఘ్నేశ్వర నమస్కార స్తోత్రమ్💥

Image
 🕉️⚜️🚩 ఓం శ్రీ మహా గణాధిపతయే నమః 🌹🙏 🔱🏵️🔱🏵️🔱🏵️🔱🏵️🔱 "త్వం మూలాధారే స్థితోస్మి నిత్యమ్... త్వం యోగినో ధ్యాయంతి నిత్యమ్" 🍁మానవ శరీరంలోని మూలాధార స్థానంలో ఉండే దైవానివి నీవే... యోగులందరూ ఎప్పుడూ నిన్నే ధ్యానిస్తూ ఉంటారని "గణపతి అధర్వశీర్షం" చెబుతోంది.  🍁"గజ వదనం" "ఓం"కారాన్ని 🕉️ సూచిస్తుంది. 'అ'కారం నుంచి 'క్ష'కారం వరకు ఉన్న అక్షరాలను కంఠం మొదలు చరణాల వరకు వివిధ అంగాలుగా భావించిన మన మహర్షులు 'అక్షర గణపతి'ని ఆవిష్కరించారు. అక్షర స్వరూపమైన గణపతిని ఆరాధించడం అంటే అక్షరాల్ని ఉపాసించటమే అవుతుంది. అక్షరం అంటే "నాశనం కానిది" అని అర్థం. నాశనం లేనిది జ్ఞానం ఒక్కటే. గణపతి ఉపాసన అంటే జ్ఞానాన్ని ఉపాసించటమే అవుతుంది. 🍁మన శరీరంలో సుషుమ్నతో పాటు ఇడ, పింగళ అనే నాడులు ఉంటాయి. వీటిలో 'ఇడ' బుద్ధికి, 'పింగళ' సిద్ధికి సంకేతాలు. సుషుమ్న ఎప్పుడూ ఇడ, పింగళతో కలిసే ఉంటుంది. అంటే, మూలాధార అధిపతి అయిన గణపతి సిద్ధి, బుద్ధితో కలిసి ఉంటాడన్నమాట. గణపతికి సిద్ధి, బుద్ది భార్యలు అనడంలో అంతరార్థం కూడా ఇదే. 🍁మనలో ఉన్న ...

💥శ్రీ హనుమద్భుజంగ ప్రయాత స్తోత్రం💥

Image
 🕉️⚜️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏 🔸🔹🔸🔹🔸🔹🔸🔹 💥శ్రీ హనుమద్భుజంగ ప్రయాత స్తోత్రం 💥 ప్రసన్నాంగరాగం ప్రభాకాంచనాంగం జహద్భీతిశౌర్యం తుషారాద్రిధైర్యం తృణీభూతహేతిం రణోద్యద్విభూతిం భజే వాయుపుత్రం పవిత్రాక్తమిత్రం |1| భజే పామరం భావనీ నిత్యవాసం భజే బాలభాను ప్రభాచారుభాసం భజే చంద్రికా కుందమందారహాసం భజే సంతతం రామ భూపలహాసమ్ |2| భజే లక్ష్మణ ప్రాణ రక్షాతి దక్షం భజే తోషితానేక గౌర్వాణ పక్షం భజే ఘోర సంగ్రామసీమా హతాక్షం భజే రామనామాతి సంప్రాప్తరక్షమ్ |3| కృతాభీలనాదం క్షితిక్షిప్రవాదం ఘనక్రాంత భృంగం కటిస్థోరంగం వియద్వ్యాప్తకేశం భుజాశ్లేషితాశమ్ జయశ్రీ సమేతం భజే రామదూతమ్ |4| చలద్వాలఘాతం భ్రమచ్ఛక్రవాలం కఠోరాట్టహాసం ప్రభిన్నాబ్జజాండం మహాసింహనాధాద్విశీర్ణత్రిలోకం భజేదాంజనేయం ప్రభుం వజ్రకాయమ్ |5| రణేభీషణే భీషణే మేఘనాధే సనాదే సరోషే సమారోపితే మిత్రముఖ్యే ఖగానాం ఘనానాం సురాణాంచమార్గే నటంతం వహంతం హనూమంతమీడే |6| ఘనద్రత్నజంభారి దంభోళిధారం ఘనద్యంతనిర్ధూత కాలోగ్రదంతం పదాఘాత భీతాబ్ధభూతాధివాసం రణోక్షోణిదక్షం భజే పింగళాక్షమ్ |7| మహాగ్రాహపీడాం మహోత్ఫాతపీడాం మహారోగపీడాం మహతీవ్రపీడాం హరత్యాస్తుతే పాదపద్మానురక్తో నమస్తే కపి...

మన పురాణాలలో ‘ఐదు’ కు అత్యంత ప్రాముఖ్యత ఉంది.

Image
 🕉️⚜️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💢 హర హర మహాదేవ శంభో శంకర 💢 💥ఆధ్యాత్మికంగా "ఐదు" ప్రాముఖ్యత💥 మన పురాణాలలో ‘ఐదు’ కు అత్యంత ప్రాముఖ్యత ఉంది. పంచాక్షరీ మంత్రంతో మొదలై పంచభూతాలు, పంచనదులు, పంచయజ్ఞాలు అంటూ ఐదు సంఖ్యతో కూడిన సంగతులు అనేకం! వాటిలో కొన్ని వివరాలు: 🍁పంచామూర్తులు: శ్రీ గణపతి, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, శ్రీ పరమశివుడు, శ్రీ పార్వతీదేవి, శ్రీ చండీకేశ్వరుడు మొదలైన ఐదుగురు మూర్తులను శైవక్షేత్రాలలో "పంచామూర్తులు"గా పూజిస్తుంటారు. 🍁పంచాయతనం: ఒకే పీఠం పై ఐదుగురు దేవతలను ఆవాహన చేసుకుని పూజించడం. 🍁పంచమాతలు: తన తల్లి, గురువు భార్య, రాజు భార్య, తన భార్య తల్లి (అత్త)లను మాతలుగా భావించి పూజిస్తారు. అందుకే వీరిని "పంచమాతలు" అనంటారు. 🍁పంచపితృమూర్తులు: జన్మనిచ్చిన తండ్రి, విద్య బోధించిన వ్యక్తి, మంత్రోపదేశం చేసిన వ్యక్తి, అన్నంపెట్టిన వ్యక్తి, భయాన్ని పోగొట్టిన వ్యక్తులను పంచపితృమూర్తులుగా భావిస్తారు. 🍁పంచప్రతిష్ట: పాంచరాత్రాగమాన్ని అనుసరించి ఐదు రకాలైన ప్రతిష్ఠలు జరుగుతుంటాయి. స్థాపన: నిల్చున్న భంగిమలో చేసే ప్రతిష్ఠ ఆస్థాపన: కూర్చున్న భంగిమలో చేసే ప్రతిష్ఠ మైస్థాప...

గృహస్తుగా జీవిస్తూ, భిక్షు జీవనంలోకి మారే వ్యక్తికి కూడా అలాంటి "నాలుగు భయాలు" ఉంటాయి.

Image
 🕉️⚜️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥నాలుగు భయాలు💥( సేకరించిన కథ)🙏 🌼🌿🏵️🌿🌼🌿🏵️🌿🌼🌿🏵️ 🍁భిక్షువులకు లభించే గౌరవ, మర్యాదలు చూసి తను కూడా భిక్షువుగా మారాలనుకున్నాడు ఒక పేద రైతు. "అలాగైతే కష్టపడకుండా జీవించవచ్చు" అనుకున్నాడు. మరుసటి రోజు ఒక ఆరామానికి వెళ్ళాడు. అక్కడ అతనికి కాషాయ చీవరాలు ఇచ్చారు. చక్కగా స్నానం చేసి, వాటిని ధరించాడు. మట్టి కొట్టుకుపోయిన తన దుస్తుల్ని పారేయకుండా... ఆరామం బయట ఉన్న ఒక చెట్టు తొర్రలో దాచిపెట్టాడు.  🍁మొదటి రెండు రోజులూ అక్కడి కొత్త వాతావరణం వల్ల అంతా బాగానే ఉందనుకున్నాడు. ఆ తరువాత చదువు, ధ్యాన శిక్షణ ప్రారంభమయ్యాయి. మౌనంగా ఏకాంతవాసం గడపవలసి వచ్చింది. చదువు ఎంతో భారంగా అనిపించింది. మౌనం మరింత కష్టమయింది. ఈ శిక్షణ కన్నా తాను గతంలో చేసిన చాకిరీ తేలికగా కనిపించింది. దాంతో అతను అక్కడ ఉండలేక పోయాడు. 🍁ఒక రోజు... ఎవరూ చూడకుండా ఆరామం లోంచి ఉడాయించాడు. తన పాత దుస్తులు దాచుకున్న చెట్టు దగ్గరకు వచ్చాడు. తొర్రలో దాచిన పాత దుస్తులు తీసుకున్నాడు. వాటిని చూడగానే అతనికి తన గత జీవితం గుర్తుకువచ్చింది. 🍁"కష్టపడకుండా గౌరవం దక్కదు" అనుకున్నాడు. వాటిని తొర్...

💥 శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం 💥

Image
 🕉️⚜️🚩 ఓం ఆదిత్యాయ నమో నమః 🌹🙏 💥🌻💥🌻💥🌻💥🌻💥🌻 💥 శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రం 💥 అస్య శ్రీ సూర్య సహస్రనామ స్తోత్రస్య వేదవ్యాస ఋషిః అనుష్టుప్ఛందః సవితా దేవతా సర్వాభీష్ట సిద్ధ్యర్థే జపే వినియోగః | ధ్యానమ్ |  ధ్యేయః సదా సవితృమండలమధ్యవర్తీ నారాయణః సరసిజాసనసన్నివిష్టః | కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ హారీ హిరణ్మయవపుర్ధృతశంఖచక్రః || స్తోత్రమ్ |  ఓం విశ్వవిద్విశ్వజిత్కర్తా విశ్వాత్మా విశ్వతోముఖః | విశ్వేశ్వరో విశ్వయోనిర్నియతాత్మా జితేంద్రియః || 1 || కాలాశ్రయః కాలకర్తా కాలహా కాలనాశనః | మహాయోగీ మహాసిద్ధిర్మహాత్మా సుమహాబలః || 2 || ప్రభుర్విభుర్భూతనాథో భూతాత్మా భువనేశ్వరః | భూతభవ్యో భావితాత్మా భూతాంతఃకరణం శివః || 3 || శరణ్యః కమలానందో నందనో నందవర్ధనః | వరేణ్యో వరదో యోగీ సుసంయుక్తః ప్రకాశకః || 4 || ప్రాప్తయానః పరప్రాణః పూతాత్మా ప్రియతః ప్రియః | [*ప్రయతః*] నయః సహస్రపాత్ సాధుర్దివ్యకుండలమండితః || 5 || అవ్యంగధారీ ధీరాత్మా సవితా వాయువాహనః | సమాహితమతిర్దాతా విధాతా కృతమంగలః || 6 || కపర్దీ కల్పపాద్రుద్రః సుమనా ధర్మవత్సలః | సమాయుక్తో విముక్తాత్మా కృతాత్మా కృతినాం వరః || 7 || అవిచింత్...

"క్షమయా సాధ్యతే సర్వమ్‌’’

Image
 🕉️⚜️🚩 ఓం నమో వేంకటేశాయ 🌹🙏 🏵️🌷🍀🌺🌼🍀🌸🌹 💥 #క్షమ 💥 ధృతి క్షమాదమోస్తేయం శౌచమింద్రియ నిగ్రహం ధీర్విద్యా సత్యమక్రోధో దశకం ధర్మ లక్షణమ్‌ ధైర్యం, క్షమ, మనోనిగ్రహం, అస్తేయము (ఇతరుల సొమ్ముకు ఆశపడకపోవడం), శుచి, ఇంద్రియ నిగ్రహం, ఉచితానుచిత వివేకం, విద్య, సత్యం, క్రోధరాహిత్యం.. ఇవి పది ధర్మ లక్షణాలు అని ఈ శ్లోక భావం. ఈ గుణాలు లేకపోతే ప్రాకృతిక ప్రపంచంలో గానీ, ఆధ్యాత్మిక ప్రపంచంలో గానీ గెలుపు లభించదు. ఈ గుణాలు ఇచ్ఛాశక్తిని పెంచుతాయి. మనోనిలకడ కలగడానికి ఓర్పు, క్షమ అవసరం.  నిందలను మౌనంగా సహిస్తే, ఆ నిందల ఫలితం నిందించిన వారికే చెందుతుంది. పైగా, వారి పుణ్యం సహించిన వానికి చెందుతుంది. అందుకే సాధువులు తమకు జరిగిన అపకారాన్ని సహిస్తారేగానీ పగబూనరు. ప్రతీకారం తీర్చుకోవాలనుకోరు. వెదురు నుండి పుట్టిన అగ్ని వనాన్నే కాల్చినట్టు.. స్పర్థతో జనించే క్రోధం వంశాన్నే నాశనం చేస్తుంది. ఓర్పు కలిగినవాడికి కాలమే తగిన సమయంలో చక్కటి తీర్పునిస్తుంది. ద్వేషాలు దుఃఖాలకు మూలకారణం కాని క్షమాగుణ సాధనలోనే శాంతిని పొందాలి. క్షమాబలమశక్తానాం, శక్తానాం భూషణం క్షమా క్షమా వశీకృతేల్లోకే, క్షమాయాకిం న సిద్ధ్యతి అనగ...

💥 దుర్గా సప్త శ్లోకీ 💥

Image
 🕉️⚜️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏 🍀🏵️🌼🍀🏵️🌼🍀🏵️🌼🍀🏵️🌼 💥దయ గల తల్లి దుర్గమ్మ💥 అమ్మలగన్న అమ్మ- ముగ్గురమ్మల మూలపుటమ్మ’, ఆదిశక్తి "దుర్గామాత" యా దేవీ మధుకైటభ ప్రమథనీ; యాచండ ముండాపహాయా మాయా మహిషాసుర ప్రమథనీ; యా రక్త బీజాపహాయా సా శుంభ నిశుంభ సూదనకరీ; యాదేవ దేవార్చితాసా దేవీ మమపాతు దేహమఖిలం- మాతా సదా చండికా "దుష్టులైన మఽధు-కైటభులను నిర్జించి, చండ-ముండాసురులను వధించి, మహిషాసురుణ్ణి మట్టుపెట్టి, రక్తబీజుని పీచమణచి, శుంభ-నిశుంభులను సంహరించి... సకల లోక రక్షణ, ధర్మరక్షణ చేసి... సకలదేవతా కోటి పూజలందుకున్న సర్వ జగజ్జననీ! చండీమాతా! దుర్గాంబా! మమ్మల్ని సదా రక్షించి, చల్లగా చూడమ్మా!’’ దేవీ ఆరాధన అతి ప్రాచీనమైనదని మన పురాణాలు చెబుతున్నాయి. ప్రాచుర్యంలో ఉన్న రామాయణ, మహాభారతాది ఇతిహాస కథల్లో దుర్గాదేవిని ఆరాధనకు సంబంధించిన కథలు కనిపిస్తాయి. ఆమెను శ్రీరాముడు పూజించి... విజయదశమి రోజున రావణుడిపై విజయం సాధించినట్టు చెబుతారు. అలాగే "మహా భారతం"లోని విరాటపర్వంలోనూ ఈ ప్రస్తావన ఉంది. విరాటరాజు కొలువులో... బృహన్నల రూపంలో ఉన్న పాండవ మధ్యముడు అర్జునుడు... విజయదశమి నాడు అజ్ఞాతవాసాన్న...

💥🔱శ్రీ కనకధారా స్తోత్రం🔱💥

Image
 🕉️⚜️🚩 ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః 🌹🙏 🌷🍀🌷🍀🌷🍀🌷🍀🌷🍀🌷 జగద్గురు "ఆదిశంకరులు" భిక్ష కోసం ఒక పేద బ్రాహ్మణుని ఇంటికి వెళ్ళార‌ట‌. యజమాని ఇంట లేని సమయంలో కటిక దరిద్రంతో బాధపడుతున్న ఆ ఇల్లాలు దిక్కు తోచని స్థితిలో ఇంట్లో వెతికితే ఒక ఉసిరికాయ కనిపించింది. ఆ ఉసిరి కాయను దానం చేసింది ఆ మ‌హాత‌ల్లి. వారి దారిద్ర్యాన్ని తొలగించమని శంకరులు లక్ష్మీ దేవిని ప్రార్థించారు. లక్ష్మి ప్రసన్నమై ఆ ఇంట బంగారు ఉసిరికాయలు ధారగా కురిపించింది.    శంకరుల నోట పలికిన లక్మీ స్తోత్రమే "కనకధారా స్తోత్రం" లక్మీ కటాక్షాన్ని కోరుకునేవారు ప్రతి రోజు కనకధారా స్తోత్రాన్ని పఠిస్తే దారిద్ర్యం ద‌రిచేర‌దు. 💥🔱శ్రీ కనకధారా స్తోత్రం🔱💥 వందే వందారు మందార మందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేః పులకభూషణ మాశ్రయంతీ భృంగాగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాఖిల విభూతి రసాంగలీలా మాంగల్యదాస్తు మమ మంగళదేవతాయాః ముగ్ధా ముహుర్విదధతీ వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలా దృశోర్మధుకరీవ మహోత్సలేయా సా మే శ్రియం దిశతు సాగర సంభవాయాః   విశ్వామరేంద్ర పదవిభ్రమ దాన దక్ష మానందహేతు రధికం మురవిద్...

💥శ్రీ దత్తాత్రేయ ద్వాదశ నామ స్తోత్రం...💥

Image
 🕉️⚜️🚩 ఓం శ్రీదత్తాయ నమః🌹🙏 💥🕉️🌼💥🕉️🌼💥🕉️🌼 💥శ్రీ దత్తాత్రేయ ద్వాదశ నామ స్తోత్రం...💥 జీవితంలో మానవులకు ఎన్నో రకాల సమస్యలు. అన్ని సమస్యలకూ పరిష్కారం ఆధ్యాత్మిక జ్ఞానం. సర్వ కష్టాలను కడతేర్చే శ్రీ దత్తాత్రేయ ద్వాదశ నామ స్తోత్రం..... దీనిని నిత్యం పారాయణం చేయట ద్వారా సర్వాభీష్ట సిద్ది కలుగును... 🍁దత్తాత్రేయ ద్వాదశ నామ స్తోత్రం......🍁 అస్య శ్రీ దత్తాత్రేయ ద్వాదశ నామ స్తోత్ర మహా మంత్రస్య, పరమహంస ఋషిః, దత్త పురుష పరమాత్మా దేవతా, సకల కామనా సిద్ధ్యర్తే పారాయణే జపే వినియోగ: హరిః ఓం... ప్రథమస్తు మహాయోగీ ద్వితీయ ప్రభురీశ్వరః తృతీయశ్చ త్రిమూర్తిశ్చ చతుర్ధ జ్ఞాన సాగరః పంచమో జ్ఞాన విజ్ఞానం షష్ఠస్యాత్ సర్వమంగళమ్ సప్తమః పుండరీకాక్షో అష్టమో దేవ వల్లభః నవమో నందదేవేశ దశమా నందదాయకః ఏకాదశ మహారుద్రో ద్వాదశః కరుణాకరః!! ఏతాని ద్వాదశ నామాని దత్తాత్రేయ మహాత్మనః! మంత్రరాజేతి విఖ్యాతం దత్తాత్రేయో హరఃపరః!! క్షయాపస్మార కుష్ణాది తాపజ్వర నివారణం! రాజద్వారే పతే ఘోరే సంగ్రామేషు జలాంతరే!! గిరేర్గుహాంతరేరణ్యే వ్యాఘ్రచోర భయాదిషు! ఆవర్తన సహస్త్రేషు లభతే వాంఛితం ఫలం!! త్రికాలే యః పఠే నిత్యం మోక్ష సిద్ధిమవాప...

🍁"జగమంతా రామమయం"🍁

Image
 🕉️⚜️🚩 శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🌹🙏 🕉️💥🕉️💥🕉️💥🕉️💥🕉️💥🕉️ 🍁శ్రీరామచంద్రుడు పదహారు కళల మిళితమైన సుగుణధాముడు. గుణవంతుడు; వీరుడు; ధర్మజ్ఞుడు; కృతజ్ఞుడు; సత్యవాక్పరిపాలకుడు, దృఢవ్రతుడు; ఉత్తమ చరిత్ర కలవాడు; సర్వభూత హితము కోరినవాడు; విద్వాంసుడు; సమర్థుడు; ప్రియదర్శనుడు (చూడచక్కని ప్రియమైనవాడు); ఆత్మవంతుడు (ఆత్మజ్ఞాని అనగా తాను దేహం కాదనే సత్యస్పృహ కలవాడు); జితక్రోధుడు (క్రోధమును జయించినవాడు); ద్యుతిమంతుడు (తేజోవంతుడు); అనసూయకుడు (అసూయ లేని వాడు); 🍁ఎవరి క్రోధాన్ని చూసి దేవతాగణమంతా భయపడుతారో అట్టి దేవతామూర్తియే శ్రీరామచంద్రుడు. ఎంతో మహత్తర గుణ సంపద కల్గినవాడు కనుకనే రామచంద్రుని నామజపం చేసినవారి పాపాలన్నీ అగ్నిగుండంలో పడిన గడ్డిపోచలా చప్పున భస్మమైపోతాయి. మహా మహిమాన్వితమైన "రామనామం" త్రిమూర్తులకు ప్రతీకగా నిలిచింది. 🍁ఒకసారి పార్వతీదేవి పరమశివునితో వివిధ విషయాలను గురించి ముచ్చటిస్తూ "స్వామీ! త్రిమూర్తులలో ఒక్కరు; లయకర్త అయిన మీరు నిత్యం రామనామ జపం చేయడానికి గల కారణమేమిటో తెలుసుకోవచ్చా?" అని ప్రశ్నించింది. అందుకు పార్వతీవల్లభుడు చిరునవ్వు చిందించి "దేవీ! రామ...

💥శ్రీ పుత్రగణపతి స్తోత్రం💥

Image
 🕉️⚜️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏 💢🌸💢🌸💢🌸💢🌸💢🌸 🍁"సాక్షాత్‌ రుద్ర ఇవాపరః’’ అన్నట్లుగా జగదంబ అనుగ్రహముతో జన్మించి రుద్రానుగ్రహముతో సకల విఘ్నములకు అధిపతి అయిన గణపతిని శివుడు శిరస్సు ఖండన చేసి మరలా గజముఖము పెట్టినప్పుడు జగదంబ పార్వతీ దేవిని ఆనందింప జేయుటకు పరమేశ్వరుడితో సహా దేవతలందరూ పార్వతీ ఒడిలో ఉన్న వినాయకుని స్తుతించిన స్తుతిని విన్న అమ్మవారు ఎవరైతే ఈస్తుతిని గౌరీ సమేత గణపతిని ఫాల్గుణ శు।।చవితి యందు పఠించి నువ్వులు బెల్లము నివేదన చేసి ప్రసాదముగా స్వీకరిస్తారో అట్టి భక్తులందరికీ నాకేవిధముగా అయితే పుత్రశోకము తొలగి పుత్రవృద్ధి కలిగినదో అదే విధముగా అందరికీ పుత్రోత్పత్తి కలిగి వంశవృద్ధి జరుగునని జగదంబ పార్వతి వరమిచ్చెను. 🍁అట్టి జగదంబ సమేత పుత్రగణపతి అనుగ్రహము పొందుటకు ఈ పుత్రగణపతి స్తోత్రం (పరమేశ్వరాదిగా దేవతలందరూ స్తుతించిన స్తుతి) పారాయణము చేయడం వలన వంశదోషములు తొలగి శక్తియుక్తులు కలిగిన పుత్రులు జన్మించునని వరాహపురాణ వచనము. 🍁మొదట ఈస్తోత్రముతో డుంఢి రాజు అను కాశీరాజు పుత్రగణపతిని ఆరాధించి సత్ఫలితములను పొందెను. అత్యంత అధ్భుతమైన ఈ స్తోత్రమును ఫాల్గుణ శుద్ధ చవితి రోజున 8 సంఖ్యతో ...

🍁అత్యంత అరుదైన శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రం - ఒకే శిలలో ఐదు రూపాలు!

Image
 🕉️⚜️🚩 ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః 🌹🙏 💥🌸💥🌸💥🌸💥🌸💥 🍁అత్యంత అరుదైన శ్రీ సుబ్రహ్మణ్య క్షేత్రం - ఒకే శిలలో ఐదు రూపాలు! ఓంకారానికి అర్థాన్ని చెప్పి శివయ్యకు గురువుగా మారినా... సేనాధిపతుల్లో స్కందుడిని నేనంటూ కృష్ణపరమాత్ముడే కొనియాడినా... అవన్నీ సుబ్రహ్మణ్యస్వామి విశిష్టతలను చాటిచెప్పేవే. అటువంటి స్కందుడు తల్లిదండ్రులతో సోదరుడితో కలిసి వెలసిన క్షేత్రం "పంపనూరు" "సుబ్రహ్మణ్యేశ్వర స్వామి" ఆలయం. ఏక శిల ఏక పడగ సప్త శిరస్సాసన శ్రీచక్రసహిత మయూర గణపతి శివ సుబ్రహ్మణ్యేశ్వర నమః అనే శ్లోకంతో ఆ క్షేత్రంలో పూజలు ప్రారంభమవుతాయి. ఒకే శిలలో ఐదు రూపాలతో దర్శనమిచ్చే ఈ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలోని పంపనూరు గ్రామంలో కొలువై ఉంది. ధన ధాన్యాలనూ, జ్ఞానాన్నీ, ఆరోగ్యాన్నీ అందించే వరప్రదాతగా అక్కడ స్వామి ప్రసిద్ధిచెందాడు. ఈ ఆలయ ప్రాంగణంలోనే మంజునాథ, పార్వతీదేవి విగ్రహాలూ దర్శనమిస్తాయి. సుమారు అయిదు వందల సంవత్సరాల కిందట శ్రీకృష్ణదేవరాయల కాలంలో శ్రీవ్యాసరాయలు సర్ప స్వరూపంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ఠించి, దేవాలయాన్ని నిర్మించాడు. పూర్వం యోగులూ...

సర్వ భయ నివారణ సర్వ జయ శ్రీ మారుతి స్తోత్రం

Image
 🕉️⚜️🚩 శ్రీ ఆంజనేయం 🌹🙏 💥🌺💥🌺💥🌺💥🌺 🍁మొదటి అక్షరాలన్నీ కలిపితే "ఓం నమో భగవతే ఆంజనేయాయ మహా బాలయ స్వాహా" అని రావటం ఇందులో ప్రత్యేకత గమనించండి. సర్వ భయ నివారణ సర్వ జయ శ్రీ మారుతి స్తోత్రం ఓం నమో వాయుపుత్రాయ భీమ రూపాయ ధీమతే నమస్తే రామ దూతాయ కామ రూపాయ శ్రీమతే మోహ శోక వినాశాయ సీతా శోక వినాశినే భాగ్నాశోక వనాయాస్తు దగ్ధ లంకాయ వాజ్మినే గతి నిర్జిత వాతాయ లక్ష్మణ ప్రానదాయచ వనౌకసాం వరిష్టాయ వశినే వన వాసినే తత్త్వ జ్ఞాన సుదాసిందు నిమగ్నాయ మహీయసే ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయచ జన్మ మృత్యు భయఘ్నాయ  సర్వ క్లేశ హరాయచ నే దిస్థాయ భూత ప్రేత పిశాచ భయ హారినే యా తానా నాశానాయాస్తు నమో మర్కట రూపిణే యక్ష రాక్షస శార్దూల సర్ప వృశ్చిక భీహృతే మహా బలాయ వీరాయ చిరంజీవి న వుద్ధ్రుతే హా రినే వజ్ర దేహాయ చోల్లంఘిత మహాబ్దయే బలినా మగ్ర గన్యాయ నమో నమః పాహి మారుతే లాభ దోషిత్వ మేవాశు హనుమాన్ రాక్షసాంతక యశో జయం చ మే దేహి శత్రూన్ నాశయ నాశయ స్వాశ్రితా నా  భయదం య ఏవమ్ స్తౌతి మారుతిం హానిహి కుతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్... ⚜️🌷⚜️🌷⚜️🌷⚜️🌷⚜️

"కర్మ ఫలం అనుభవించక తప్పదు"

Image
 🕉️⚜️🚩 ఓం నమః శివాయ 🌹🙏 🔱💥🔱💥🔱💥🔱💥🔱 బ్రహ్మరాత... తలరాత  అంటూ ఎన్నో  సార్లు  మనమందరం అంటూ ఉంటాం...  ఒకసారి నారదుడు భూలోకంలో సంచరిస్తుంటే, ఆయనకు సముద్ర తీర ప్రాంతంలో ఒక పుర్రె కాలికి తగిలిందట.. దాని "తలరాత" ఆ పుర్రె మీద ఇంకా అలాగే నిలిచి ఉందని చూసి నారదుడు కుతూహలంతో ఆ పుర్రెను చేతిలోకి తీసుకొని ఆ రాతను చదివాడట. జన్మ ప్రభృతి దారిద్య్రం,  దశ వర్షాణి బంధనం,  సముద్ర తీరే మరణం,  కించిత్ భోగం భవిష్యతి... (పుట్టుక నుంచి దరిద్రం, మధ్యలో పదేళ్లు కారాగార వాసం, చివరికి సముద్ర తీరంలో చావు, కొంచెం భోగం కలుగుతుంది) అని ఉంది. నారదుడికి ఆశ్చర్యం వేసింది.. "జన్మంతా దరిద్రం, మధ్యలో కారాగార వాసం, చివరికి అయిన వాళ్లు ఎవరూ దగ్గర లేకుండా ఎక్కడో సముద్ర తీరంలో చావు అని రాసి పెట్టి ఉండగా, ఇక ఆపైన భోగం ఏమిటి..? మా నాన్న గారు పొరబడ్డారా..?" అనుకొని సరాసరి బ్రహ్మ లోకానికి వెళ్లి తండ్రిని ప్రశ్నించాడు.  "ఇతగాడు నిష్ఠ దరిద్రుడే., దిక్కులేకుండా మరణించిన మాటా నిజమే,  కానీ నీలాంటి దేవర్షి తన స్వహస్తాలతో ఇతని కపాలాన్ని ఎత్తి, మోసుకొంటూ సాక్షాత్తూ బ్రహ్మలోకం దాకా ...

💢అంత్యకాలంలో భగవన్నామమే పరమఔషధం💢

Image
 🕉️⚜️🚩 ఓం నమః శివాయ 🌹🙏 💥🕉️💥🕉️💥🕉️💥🕉️💥🕉️ 💢అంత్యకాలంలో భగవన్నామమే పరమఔషధం💢 పూర్వం ఒకప్పుడు మాధవపురం అనే ఊళ్ళో ఒక భక్తుడు నివసిస్తూ ఉండేవాడు. భగవంతుడి పాదారవింద స్మరణతప్ప అన్యమేదీ అతడు ఎరుగడు. అదే తన జీవిత లక్ష్యంగా జీవిస్తున్నాడు. ప్రతిరోజూ పూజా పునస్కారాలు, ధ్యానం, ఆధ్యాత్మిక చింతన ఇంకా ఇతర సాధనానుష్టానాలచేత ముక్తి మార్గాన జీవిస్తుండేవాడు. ఇలా లౌకిక విషయాల్లో పూర్తిగా విముఖుడై ఆధ్యాత్మిక చింతన చేసే అతణ్ణి పలువురు శిష్యులు ఆశ్రయించారు. వారంతా అతడి వద్ద జ్ఞానోపదేశం పొంది, భగవద్భక్తిని పెంపొందించుకొనసాగారు. ఆ శిష్యులకు అతడు మార్గగామియై జ్ఞానగురువుగా మసలుకోసాగాడు. ఆ గురువు తాను తలచినదే చెబుతూ, చెప్పినదే చేస్తూ త్రికరణ శుద్ధిగా, ఆదర్శప్రాయుడై వెలుగొందసాగాడు. ఇలా ఉండగా ఆ భక్తుడికి వృద్ధాప్యం వచ్చింది. తన ఆయుష్షు ఇక పూర్తి అయ్యే తరుణం సమీపించినదని గ్రహించి, తన మరణం కాశీలో జరగాలని కోరుకొన్నాడు. శిష్యులు గురువుగారి కోరికను ఎరిగి ఆయన్ను కాశీ క్షేత్రానికి తీసుకొని పోవడానికి నిశ్చయించుకొన్నారు. గురువుగారి దగ్గరకు వెళ్ళి, “గురువర్యా! మీ ఇషప్రకారం కాశీక్షేత్రానికి మిమ్మల్ని తీసుకొన...