💥 అక్షర శరీరుడైన శివుని స్వరూపము 💥

 🕉️🔱🚩 💥 ఓం నమః శివాయ 🌹🙏

⚜️🌸⚜️🌸⚜️🌸⚜️🌸⚜️


నమో గౌరీశాయ స్ఫటిక దవళాజ్గాయచ నమో,

నమో లోకేశాయ స్తుతవిబుధలోకాయ చ నమః |

నమః శ్రీ కంఠాయ క్షపితపురదైత్యాయ చ నమః

నమః పాలక్షాయ స్మరమదవినాశాయ చ నమః ||


🍁గౌరీశ్వరునికి నమస్కారం. స్ఫటికంలా శుద్ధ ధవళ కాంతులతో దీపించే లోకేశునికి, దేవతాసమూహంచే స్తుతింపబడే వానికి, శ్రీ (విషం) కంఠంలో ధరించినవానికి, త్రిపురాసురులను నిర్మూలనం చేసిన వానికి, పాలభాగాన నేత్రం గల జ్ఞానమూర్తికి, మన్మథుని మదాన్ని వినాశనం చేసిన శివునికి నమస్మృతులు🙏.


     💥 అక్షర శరీరుడైన శివుని స్వరూపము 💥 


🍁అక్షర శరీరుడైన శివుని స్వరూపము ఈ విధంగా ఉన్నది:

అకారము పరమేశ్వరుని శిరస్సు.

ఆకారము లలాటము.

ఇకారము కుడి కన్ను.

ఈకారము ఎడమకన్ను.

ఉకారము కుడి చెవి.

ఊకారము ఎడమ చెవి.

ఋకారము ఆ పరమేశ్వరుని కుడి చెక్కిలి.

ౠకారము ఎడమచెక్కిలి.

అలు, అలూ కారములు రెండు ముక్కుపుటములు.

ఏకారము పై పెదవి.

ఐకారము ఈశ్వరుని క్రింది పెదవి.

ఓకారము పై పళ్ళవరుస.

దేవదేవుడగు శివునికి "అం అః" అనునవుతాలు (దవడలు) స్థానములాయెను.

వీటికి "ప్రాణాక్షరములు" అని పేరు.


🍁క వర్గలోని ఐదు అక్షరములు(క ఖ గ ఘ జ్ఞ) ఐదు కుడిచేతులు కాగా,

చ వర్గలోని ఐదు అక్షరములు ఐదు ఎడమ చేతులాయెను.

ట వర్గలో ఐదు, త వర్గలో ఐదు వెరసి పది అక్షరములు పాదముల వ్రేళ్ళు ఆయెను.

"ప"కారము ఉదరము కాగా, "ఫ"కారము కుడి పార్శ్వము ఆయెను.

"బ"కారము ఎడమ పార్శ్వము కాగా "భ"కారము స్కందమాయెను.

యోగీశ్వరుడు, మహాదేవుడగు శంభువునకు హృదయము "మ"కారము.


🍁సర్వ వ్యాపియగు శివునకు "య"కారము మొదలుగ "స"కారము వరకు గల ఏడు అక్షరములు ఏడు ధాతువులు (చర్మము, రక్తము, మాంసము, అస్తి, కొవ్వు, మజ్జ, శక్రం) ఆయెను.

"హ"కారము నాభి అనియు,

"క్ష"కారము ఘ్రాణే౦ద్రియము అనియు చెప్పబడెను.

వీటికి "ప్రాణ్యక్షరములు" అని పేరు.


🍁మంత్రము ద్వారా ఉత్పన్నమయ్యే చైతన్యమే దేవత. సర్వదేవతలూ మంత్రాధీనులు. సర్వ మంత్రములూ అక్షరాధీనములు. సర్వ అక్షరములు ఓంకార స్వరూపములు.

ఓంకారమే శివుడు, సర్వ దేవతామయుడు, మంత్రమయుడు, అక్షరమయుడు.

సేకరణ... 💐🙏




Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు