💥శ్రీ దత్త మాలా మంత్రం💥
🕉️⚜️🚩ఓం నమో భగవతే దత్తాత్రేయాయ 🌹🙏
💥🌷💥🌷💥🌷💥🌷💥
🍁అత్రి, అనసూయల తపస్సునకు మెచ్చి "దత్తాత్రేయుడు" త్రిమూర్తుల అంశతో రూపుదిద్దుకున్నాడు.
అత్రి వరదునిది దైవ, గురు స్వరూపాల కలయిక.
అందుకే దత్తాత్రేయుడు ఆదిగురువయ్యాడు.
🍁మాయా ప్రభావంతో దారితప్పుతున్న మానవులకు జ్ఞానబోధలకు, ఆచార వ్యవహారాల అనుసరణకు, ధర్మాధర్మ విచక్షణకు, శిష్టరక్షణతోబాటు, మానవాళి విధ్యుక్త ధర్మాల ప్రబోధకే ప్రాధాన్యతనిచ్చాడు.
ఇదే ఆయన గురుతత్త్వం.
🍁జ్ఞానజ్యోతులు వెలిగించి, ప్రజల అజ్ఞానపు చీకట్లు తొలగించేందుకు వెలసిన దత్తస్వామి రూపం నయన మనోహరం, భద్రపదం, భవ బంధ నాశనం, భవసాగరతారకం.
🍁సంసారంలో ఉంటూనే, స్వధర్మపాలన చేసుకుంటూ తరించవచ్చని, ముక్తిని సాధించవచ్చు అన్నదే "దత్తసాంప్రదాయం"
🍁దత్తాత్రేయుని స్వభావంలో మూడు ముఖ్య లక్షణాలు గోచరిస్తాయి.
🔹మెుదటిది ఆయన తమ నామ స్మరణతో సంతుష్ఠులై స్మరించగానే కదలి వస్తారు. అందుకే ఆయనను స్మర్తృగామిగా కీర్తిస్తారు.
🔹రెండవది వారు భక్తులకు ఇహ పర సౌఖ్యాలను ఇస్తూ, యోగశక్తిని ప్రసాదించి, జీవన్ముక్తులుగా చేస్తారు.
🔹మూడవ లక్షణం... భక్తుల వెన్నంటే ఉంటూ, వారి మంచి చెడ్డలు చూస్తూ, వారికి దత్తమౌతాడు.
ఈ మూడు లక్షణాలు వారిలోని దైవ, గురు లక్షణాలను సూచిస్తాయి.
🍁🍁🍁🍁🍁🍁
💥శ్రీ దత్త మాలా మంత్రం💥
ఓం నమో భగవతే దత్తాత్రేయాయ,
స్మరణమాత్రసన్తుష్టాయ,
మహాభయనివారణాయ మహాజ్ఞానప్రదాయ,
చిదానన్దాత్మనే,
బాలోన్మత్తపిశాచవేషాయ,
మహాయోగినే, అవధూతాయ,
అనసూయానన్దవర్ధనాయ, అత్రిపుత్రాయ,
ఓం భవబన్ధవిమోచనాయ,
ఆం అసాధ్యసాధనాయ,
హ్రీం సర్వవిభూతిదాయ,
క్రౌం అసాధ్యాకర్షణాయ,
ఐం వాక్ప్రదాయ,
క్లీం జగత్రయవశీకరణాయ,
సౌః సర్వమనఃక్షోభణాయ,
శ్రీం మహాసమ్పత్ప్రదాయ,
గ్లౌం భూమండలాధిపత్యప్రదాయ,
ద్రాం చిరంజీవినే,
వషట్వశీకురు వశీకురు,
వౌషట్ ఆకర్షయ ఆకర్షయ,
హుం విద్వేషయ విద్వేషయ,
ఫట్ ఉచ్చాటయ ఉచ్చాటయ,
ఠః ఠః స్తంభయ స్తంభయ,
ఖేం ఖేం మారయ మారయ,
నమః సమ్పన్నయ సమ్పన్నయ,
స్వాహా పోషయ పోషయ,
పరమన్త్రపరయన్త్రపరతన్త్రాణి ఛింధి ఛింధి,
గ్రహాన్నివారయ నివారయ,
వ్యాధీన్ వినాశయ వినాశయ,
దుఃఖం హర హర,
దారిద్ర్యం విద్రావయ విద్రావయ,
దేహం పోషయ పోషయ,
చిత్తం తోషయ తోషయ,
సర్వమన్త్రస్వరూపాయ,
సర్వయన్త్రస్వరూపాయ,
సర్వతన్త్రస్వరూపాయ,
సర్వపల్లవస్వరూపాయ,
ఓం నమో మహాసిద్ధాయ స్వాహా |
సేకరణ... 💐🙏
🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼

Comments
Post a Comment