💥మహాగౌరి💥
🕉️🔱🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏
🌷🔱🌷🔱🌷🔱🌷🔱
💥మహాగౌరి💥
శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః
మహాగౌరీ శుభం దద్యాత్ మహాదేవ ప్రమోదదా🌹🙏
🍁మహాగౌరి అనే పేరు (మహ, మహా = గొప్ప; గౌరీ, గౌరీ = తెలుపు) గొప్ప తెలుపు అని అర్ధం.
🍁#పార్వతి అవతారంలో పరమేశ్వరుణ్ణి పతిగా పొందటానికి కఠోరమైన తపస్సును ఆచరించింది.
కఠోర తపస్సు కారణాన ఈమె శరీరం పూర్తిగా నలుపెక్కి పోతుంది.
ఈమె తపస్సునకు సంతుష్టుడైన శివుడు ప్రసన్నుడై, ఈమె శరీరాన్ని గంగాజలంతో ప్రక్షాళన గావిస్తారు.
తత్ప్రభావంవల్ల ఈమె "శ్వేత"వర్ణశోభిత అయి విద్యుత్కాంతులను విరజిమ్ముతుంటుంది.
అప్పటినుండి ఈమె "మహాగౌరి" అని పేరుగాంచింది.
🍁మహాగౌరీదేవి నాలుగు చేతులతో- అభయ, వరముద్రలతో పాటు త్రిశూలం, డమరుకాలను ధరించి ఉంటుంది.
🍁ధవళకాంతితో మెరిసే వృషభాన్ని అధిరోహించి,
శ్వేత వర్ణ శోభితయైు, తెల్లని వస్త్రాలను ధరించి, శతకోటి దివ్యకాంతులను ప్రసరింపచేస్తూ అభయప్రదానం చేస్తూ శోభిల్లుతుంది.
🍁ధన, వైభవ శక్తులకు ఈ తల్లి అధిష్ఠాత్రి.
సదా శుభాన్ని ప్రసాదించమని గౌరీదేవిని ప్రార్థిస్తే ఆమె కరుణతో ఆశీర్వదిస్తుంది.
అష్టమ దుర్గ అయిన గౌరీమాతను తెల్లని పుష్పాలతో అర్చించాలి. ఈ దేవి ఆరాధన వలన పాపాలు తొలగి, సత్వర శుభాలు కలుగుతాయని నమ్మిక.
🍁ఈమెను ఉపాసించిన భక్తుల కల్మషాలన్నీ ప్రక్షాళన చెందుతాయి. వారి పూర్వ సంచిత పాపాలన్నీ పూర్తిగా నశిస్తాయి.
భవిష్యత్తులో కూడా పాప తాపాలు గానీ, దైన్య దుఃఖాలు కానీ వారి దరిజేరవు.
వారు సర్వ విధాలా పునీతులై, అక్షయంగా పుణ్య ఫలాలను పొందుతారు.
🍁మనస్సును ఏకాగ్రచిత్తం చేసి, అనన్య నిష్ఠతో సాధకులు ఈ దేవి పాదారవిందాలను సేవించటంవల్ల వారి కష్టాలు మటుమాయమవుతాయి.
🍁ఈమె ఉపాసన ప్రభావం వల్ల అసంభవాలైన కార్యాలు సైతం సంభవాలవుతాయి.
కనుక సర్వదా ఈమె పాదాలను శరణుజొచ్చటమే కర్తవ్యము.
మనం అనన్య భక్తి ప్రపత్తులతో ఈమెకు శరణాగతులమవటం ఎంతో శుభదాయకం.
సేకరణ... 💐🙏
🌸🌼🌸🌼🌸🌼🌸🌼🌸

Comments
Post a Comment