విఘ్నేశ్వర నమస్కార స్తోత్రమ్💥

 🕉️⚜️🚩 ఓం శ్రీ మహా గణాధిపతయే నమః 🌹🙏

🔱🏵️🔱🏵️🔱🏵️🔱🏵️🔱


"త్వం మూలాధారే స్థితోస్మి నిత్యమ్...

త్వం యోగినో ధ్యాయంతి నిత్యమ్"


🍁మానవ శరీరంలోని మూలాధార స్థానంలో ఉండే దైవానివి నీవే... యోగులందరూ ఎప్పుడూ నిన్నే ధ్యానిస్తూ ఉంటారని

"గణపతి అధర్వశీర్షం" చెబుతోంది. 


🍁"గజ వదనం" "ఓం"కారాన్ని 🕉️ సూచిస్తుంది.

'అ'కారం నుంచి 'క్ష'కారం వరకు ఉన్న అక్షరాలను కంఠం మొదలు చరణాల వరకు వివిధ అంగాలుగా భావించిన

మన మహర్షులు 'అక్షర గణపతి'ని ఆవిష్కరించారు.

అక్షర స్వరూపమైన గణపతిని ఆరాధించడం అంటే అక్షరాల్ని ఉపాసించటమే అవుతుంది.

అక్షరం అంటే "నాశనం కానిది" అని అర్థం.

నాశనం లేనిది జ్ఞానం ఒక్కటే.

గణపతి ఉపాసన అంటే జ్ఞానాన్ని ఉపాసించటమే అవుతుంది.


🍁మన శరీరంలో సుషుమ్నతో పాటు ఇడ, పింగళ అనే నాడులు ఉంటాయి. వీటిలో 'ఇడ' బుద్ధికి, 'పింగళ' సిద్ధికి సంకేతాలు. సుషుమ్న ఎప్పుడూ ఇడ, పింగళతో కలిసే ఉంటుంది.

అంటే, మూలాధార అధిపతి అయిన గణపతి సిద్ధి, బుద్ధితో కలిసి ఉంటాడన్నమాట.

గణపతికి సిద్ధి, బుద్ది భార్యలు అనడంలో అంతరార్థం కూడా ఇదే.


🍁మనలో ఉన్న దురాలోచనలు తొలగితే మంచి బుద్ధి కలుగుతుంది. ఎప్పుడైతే మంచి బుద్ధి కలుగుతుందో అప్పుడు మనసు శాశ్వతమైన ముక్తి స్థానాన్ని

కోరుకుంటుంది.

గణపతి ఆరాధన ద్వారా మంచి బుద్ధి వస్తుంది.

మోక్షం వైపు మనిషి సాధన జరుగుతుంది.

గణపతి ఉపాసన అంతరార్థం, ఆయన తత్త్వం ఇదే. 


🍁మట్టితో ప్రాణ ప్రతిష్ట:

ఆకాశం నుంచి వాయువు, అందులో నుంచి అగ్ని, దాని నుంచి నీరు, నీటి నుంచి భూమి ఏర్పడ్డాయి.

జడ పదార్థమైన భూమి, చైతన్యం కలిగిన నీటితో కలిసి ప్రాణశక్తిని పొందుతుంది.

ఆహారపదార్థాలు, ఓషధులు అందిస్తుంది.

ఇలా ప్రాణ, జడశక్తుల కలయికతో సృష్టి సాగుతుందనడానికి సంకేతంగా గణపతి విగ్రహాన్ని మట్టి, నీరు కలిపి తయారుచేస్తారు. 


🍁గణపతిని త్రిగుణాలకు అతీతుడుగా, త్రికాలాలకు (భూత, భవిష్యత్, వర్తమాన) అందనివాడుగా పంచభూతాలకు ఆత్మగా, సకల దేవతాస్వరూపుడిగా అధర్వణ వేదంలోని "గణపతిఅధర్వశీర్షం" ప్రకటిస్తుంది.

త్రిమూర్తులతో సహా పంచభూతాలూ ఆయన స్వరూపమే అంటోందీ స్తోత్రం.


'ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః

ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శివసుతాయ వరదమూర్తయే నమః" 

సేకరణ... 💐🙏

🔸🔹🔸🔹🔸🔹🔸


        💥విఘ్నేశ్వర నమస్కార స్తోత్రమ్💥🙏


జయ విఘ్నేశ్వర! నమో నమో, జగద్రక్షకా! నమో నమో


జయకర! శుభకర! సర్వపరాత్పర! జగదుద్ధారా! నమో నమో


మూషిక వాహన! నమోనమో, మునిజనవందిత! నమో నమో


మాయా రాక్షస మదాపహరణా! మన్మధారిసుత! నమో నమో


విద్యాదాయక! నమో నమో, విఘ్నవిదారక, నమో నమో


విశ్వసృష్టి లయ కారణ శంభో! విమల చరిత్రా! నమో నమో!


గౌరీప్రియ సుత నమో నమో గంగానందన నమో నమో


అధర్వాద్భుతగానవినోదా! గణపతిదేవా! నమోనమో!


నిత్యానంద! నమో నమో, నిజఫలదాయక! నమో నమో


నిర్మలపురవర! నిత్యమహోత్సవ! రామనాథ సుత నమో నమో

⚜️🌸⚜️🌸⚜️🌸⚜️🌸⚜️🌸



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు