"సర్వం సూర్యమయం జగత్"
🕉️⚜️🚩 ఓం సూర్యదేవాయ నమః 🌹🙏
🌹🌼🌸🌹🌼🌸🌹🌼🌸🌹
సప్తలోక ప్రకాశాయ సప్తసప్త రథాయచ
సప్త ద్వీప ప్రకాశయ భాస్కరాయ నమోనమః
సమస్త లోకాలకు కర్మసాక్షిగా అనంతమైన శక్తి కిరణాలతో వెలుగును, తేజస్సును ప్రసాదిస్తున్న "ఆదిత్యుడు" ఆదితి కశ్యప ప్రజాపతి కుమారుడిగా విశాఖ నక్షత్రంలో ఆవిర్భవించినట్లు బ్రహ్మాండ పురాణ కథనం.
సూర్యభగవానుడు నిత్యానుసంధాననీయుడు.
ఆదివారాలలో సూర్య నమస్కారాలు చేసి పాలను నివేదిస్తే సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం.
"ఆరోగ్యమే మహాభాగ్యం" అన్నట్లు పరమోన్నతమైన ఆరోగ్య భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు.
సూర్యుడికి "వివస్వతుడు" అని మరో పేరు ఉంది. ఆయన కుమారుడే ఏడవ మనువు వైవస్వతుడు. రథసప్తమి నాడే ఆయన మన్వంతరం ప్రారంభమైందని చెబుతారు.
కాలానికి ఆదిత్యుడే కొలమానం.
సమస్త జీవరాశికి ఆధారభూతుడు.
కాబట్టే వేదాలు ఆయనను త్రిమూర్తి స్వరూపుడిగా ఆభివర్ణించాయి.
"ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్" (ఆరోగ్యం కోసం భాస్కరుని ఆరాధించాలి) అంటారు.
సూర్యారాధన సర్వ రోగాలను హరించి ఆరోగ్యాన్ని, బలాన్ని, తేజస్సును ప్రసాదిస్తుంది.
"సర్వం సూర్యమయం జగత్" అన్నట్లు సకల జగత్తు ఆయన తేజస్సుతో చైతన్యం పొందుతోంది.
సమస్త ప్రాణకోటి ఆయన పైనే ఆధారపడి ఉంది.
"నమస్కార ప్రియోభానుః" అని ఆర్యోక్తి.
కేవలం వందనంతోనే ప్రసన్నుడై ఆరోగ్య విజ్ఞానాలను ప్రసాదించే ప్రత్యక్ష భగవానుడు సూర్యదేవుడు.
ఉదయాస్తమయ వేళల్లోని సూర్యకిరణాలు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయని ఆయుర్వేదం చెబుతోంది. యోగ్యత అయోగ్యతలతో నిమిత్తం లేకుండా సర్వ జీవకోటికి సమానంగా వెలుగులు (కాంతులు) పంచే భగవానుడు.
సూర్యాద్భవంతి భూతాని సూర్యేణ పాలితానిచ/
సూర్యే లయం ప్రాప్నువంతి య సూర్యః సోహ మేవచ
సృష్టి స్థితి లయాలు సూర్యుని ప్రమేయంతోనే జరుగు తున్నాయని "సూర్యోపనిషత్తు" పేర్కొంది.
ఆదిత్యశ్చ నమస్కారం యే కుర్వంతి దినే దినే/
జన్మాంతర సహస్రేషు దారిద్య్రం నోపజాయతే
అని ఋషి వాణి.
(ఆదిత్యునికి నమస్కరిస్తే జన్మ జన్మాల పాపాలు పటాపంచలవుతాయి)
సేకరణ...💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment