💥 దుర్గా సప్త శ్లోకీ 💥

 🕉️⚜️🚩 ఓం శ్రీ మాత్రే నమః 🌹🙏

🍀🏵️🌼🍀🏵️🌼🍀🏵️🌼🍀🏵️🌼


💥దయ గల తల్లి దుర్గమ్మ💥

అమ్మలగన్న అమ్మ- ముగ్గురమ్మల మూలపుటమ్మ’, ఆదిశక్తి "దుర్గామాత"


యా దేవీ మధుకైటభ ప్రమథనీ; యాచండ ముండాపహాయా మాయా మహిషాసుర ప్రమథనీ; యా రక్త బీజాపహాయా సా శుంభ నిశుంభ సూదనకరీ; యాదేవ దేవార్చితాసా దేవీ మమపాతు దేహమఖిలం- మాతా సదా చండికా


"దుష్టులైన మఽధు-కైటభులను నిర్జించి, చండ-ముండాసురులను వధించి, మహిషాసురుణ్ణి మట్టుపెట్టి, రక్తబీజుని పీచమణచి, శుంభ-నిశుంభులను సంహరించి... సకల లోక రక్షణ, ధర్మరక్షణ చేసి... సకలదేవతా కోటి పూజలందుకున్న సర్వ జగజ్జననీ! చండీమాతా! దుర్గాంబా! మమ్మల్ని సదా రక్షించి, చల్లగా చూడమ్మా!’’


దేవీ ఆరాధన అతి ప్రాచీనమైనదని మన పురాణాలు చెబుతున్నాయి. ప్రాచుర్యంలో ఉన్న రామాయణ, మహాభారతాది ఇతిహాస కథల్లో దుర్గాదేవిని ఆరాధనకు సంబంధించిన కథలు కనిపిస్తాయి. ఆమెను శ్రీరాముడు పూజించి... విజయదశమి రోజున రావణుడిపై విజయం సాధించినట్టు చెబుతారు.


అలాగే "మహా భారతం"లోని విరాటపర్వంలోనూ ఈ ప్రస్తావన ఉంది. విరాటరాజు కొలువులో... బృహన్నల రూపంలో ఉన్న పాండవ మధ్యముడు అర్జునుడు... విజయదశమి నాడు అజ్ఞాతవాసాన్ని ముగించి, గాండీవం ధరించి, అమ్మవారిని ప్రార్థించి... ఉత్తర గోగ్రహణ యుద్ధంలో కౌరవులను ఓడిస్తాడు. 


దుర్గమ్మను సేవించి శ్రీకృష్ణుణ్ణి భర్తగా రుక్మిణి పొందిన ‘రుక్మీణీ కళ్యాణ’ ఘట్టం సుప్రసిద్ధం.

ఇలా పురాణ కాలం నుంచి ఆ జగన్మాత తనను ఆశ్రయించిన వారిని అనుగ్రహిస్తోంది.

తన దయామృతాన్ని వారిపై కురిపిస్తోంది.


చెడును తుంచడానికీ, మంచిని పెంచడానికీ దైవ శక్తులు అవతారాలు ధరించిన ఉదంతాలు ఎన్నో కనిపిస్తాయి. 

 శ్రీ దుర్గాదేవి ఆవిర్భావ పరమార్థం కూడా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణే. 


ఇంద్రాది దేవతల ప్రార్థనపై భండాసురుణ్ణి వధించడానికి... సకలదేవతా శక్తిస్వరూపిణిగా... మహాగ్నికుండం నుంచి ఆమె ఆవిర్భవించింది.


దుష్టులైన రాక్షసులను వధించి, లోకకల్యాణం గావించింది.

ఆదిశక్తి అయిన ఆమె వివిధ అవతారాలు ధరించి... శుంభ, నిశుంభ, రక్తబీజ, చండ ముండాసుర, అరుణాసుర, మహిషాసురాదులను సంహరించి, సకల లోకాలకూ రాక్షస పీడ నుంచి విముక్తి కలిగించింది.

సర్వ శక్తి స్వరూపిణిగా భక్తుల పూజలు అందుకుంటోంది.


ఆర్తితో పిలిస్తే ఆదరించే కరుణామయి.

శ్రీ వేదవ్యాస మహర్షి కృతమైన ‘శ్రీ దేవీ భాగవత పురాణం’ దుర్గాదేవి భక్తులకు కల్పతరువు. 

దాన్ని పారాయణ చేస్తే... సకల శుభాలు, విజయాలు, సౌభాగ్యం, మోక్షం లభిస్తాయన్నది పెద్దల మాట.


‘శ్రీ దుర్గాదేవ్యై నమః’ అని మనసారా స్మరిస్తే ఆ అమ్మవారి కరుణకు పాత్రులవుతారు.


💥 దుర్గా సప్త శ్లోకీ 💥


శివ ఉవాచ-


దేవీ త్వం భక్తసులభే సర్వకార్యవిధాయిని |

కలౌ హి కార్యసిద్ధ్యర్థముపాయం బ్రూహి యత్నతః ||


దేవ్యువాచ-


శృణు దేవ ప్రవక్ష్యామి కలౌ సర్వేష్టసాధనమ్ |

మయా తవైవ స్నేహేనాప్యంబాస్తుతిః ప్రకాశ్యతే ||


ఓం అస్య శ్రీ దుర్గా సప్తశ్లోకీ స్తోత్రమంత్రస్య నారాయణ ఋషిః,

అనుష్టుప్ ఛందః,


శ్రీ మహాకాళీ మహాలక్ష్మీ మహాసరస్వత్యో దేవతాః,

శ్రీ దుర్గా ప్రీత్యర్థం సప్తశ్లోకీ దుర్గాపాఠే వినియోగః |

ఓం జ్ఞానినామపి చేతాంసి దేవీ భగవతీ హి సా |

బలాదాకృష్య మోహాయ మహామాయా ప్రయచ్ఛతి || 1 ||


దుర్గే స్మృతా హరసిభీతిమశేషజంతోః

స్వస్థైః స్మృతామతిమతీవ శుభాం దదాసి |

దారిద్ర్యదుఃఖ భయహారిణి కా త్వదన్యా

సర్వోపకారకరణాయ సదార్ద్ర చిత్తా || 2 ||


సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే |

శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణీ నమోఽస్తు తే || 3 ||


శరణాగతదీనార్త పరిత్రాణపరాయణే |

సర్వస్యార్తిహరే దేవి నారాయణి నమోఽస్తు తే || 4 ||


సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తిసమన్వితే |

భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోఽస్తు తే || 5 ||


రోగానశేషానపహంసి తుష్టారుష్టా తు కామాన్ సకలానభీష్టాన్ |

త్వామాశ్రితానాం న విపన్నరాణాం త్వామాశ్రితాహ్యాశ్రయతాం ప్రయాంతి || 6 ||


సర్వబాధాప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి |

ఏవమేవ త్వయా కార్యమస్మద్వైరి వినాశనమ్ || 7 ||


ఇతి శ్రీ దుర్గా సప్తశ్లోకీ |

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు