సుబ్రహ్మణ్యష్టోత్తర శతనామ స్తోత్రం
🕉️⚜️🚩ఓం శ్రీ వల్లీదేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః🌹🙏
🌼🌸🌼🌸🌼🌸🌼🌸🌼
💥శరవణభవుడు💥
🍁ఇచ్ఛా, జ్ఞాన, క్రియా అనే మూడు శక్తులమయమైన శక్తిని ధరించిన కుమారస్వామి... అమోఘమైన శివతేజాన్ని, పృథ్వి, అగ్ని, జలం, ఆరు కృత్తికల శక్తిని (నక్షత్ర శక్తి) ధరించి, శరవణంలోనించి (పార్వతిదేవి) స్వామి జన్మించాడు.
అందుకే స్వామి శరవణభవుడు.
🍁శరవణభవ మంత్రంలో –
శ – లక్ష్మీబీజము అధిదేవత శంకరుడు
ర – అగ్నిబీజము అధిదేవత అగ్ని
వ – అమృతబీజము అధిదేవత బలభద్రుడు
ణ – యక్షబీజము అధిదేవత బలభ్రద్రుడు
భ – అరుణ బీజము అధిదేవత భద్రకాళీదేవి
వ – అమృతబీజము అధిదేవత చంద్రుడు
శ – శమింపజేయువాడు
ర – రతిపుష్టిని ఇచ్చువాడు
వ – వంధ్యత్వం రూపుమాపువాడు
ణ – రణమున జయాన్నిచ్చేవాడు
భ – భవసాగరాన్ని దాటించేవాడు
వ – వందనీయుడు
అని ‘శరవణభవ’కు గూఢార్థం.
శరవణభవ అనే మంత్రాన్ని పఠిస్తే చాలు సమస్త సన్మంగళాలు నిర్విఘ్నంగా జరుగుతాయి.
💥 సుబ్రహ్మణ్యష్టోత్తర శతనామ స్తోత్రం 💥
శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననమ్ ।
దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుటధ్వజమ్ ॥
ఇతి ధ్యానం
స్కందో గుహః షణ్ముఖశ్చ ఫాలనేత్రసుతః ప్రభుః ।
పింగళః కృత్తికాసూనుః శిఖివాహో ద్విషడ్భుజః ॥ 1 ॥
ద్విషణ్ణేత్ర-శ్శక్తిధరః పిశితాశ ప్రభంజనః ।
తారకాసురసంహారీ రక్షోబలవిమర్దనః ॥ 2 ॥
మత్తః ప్రమత్త ఉన్మత్తః సురసైన్యసురక్షకః ।
దేవసేనాపతిః ప్రాజ్ఞః కృపాళు ర్భక్తవత్సలః ॥ 3 ॥
ఉమాసుత-శ్శక్తిధరః కుమారః క్రౌంచధారణః ।
సేనానీ-రగ్నిజన్మా చ విశాఖః శంకరాత్మజః ॥ 4 ॥
శివస్వామీ గణస్వామీ సర్వస్వామీ సనాతనః ।
అనంతమూర్తి రక్షోభ్యః పార్వతీప్రియనందనః ॥ 5 ॥
గంగాసుత-శ్శరోద్భూత ఆహూతః పావకాత్మజః ।
జృంభః ప్రజృంభ ఉజ్జృంభః కమలాసనసంస్తుతః ॥ 6 ॥
ఏకవర్ణో ద్వివర్ణశ్చ త్రివర్ణః సుమనోహరః ।
చతుర్వర్ణః పంచవర్ణః ప్రజాపతి-రహస్పతిః ॥ 7 ॥
అగ్నిగర్భ-శ్శమీగర్భో విశ్వరేతా-స్సురారిహా ।
హరిద్వర్ణ-శ్శుభకరో పటుశ్చ వటువేషభృత్ ॥ 8 ॥
పూషా గభస్తి-ర్గహన శ్చంద్రవర్ణః కళాధరః ।
మాయాధరో మహామాయీ కైవల్య-శ్శంకరాత్మజః ॥ 9 ॥
విశ్వయోని-రమేయాత్మా తేజోనిధి-రనామయః ।
పరమేష్ఠీ పరంబ్రహ్మ వేదగర్భో విరాట్సుతః ॥ 10 ॥
పుళిందకన్యాభర్తా చ మహాసారస్వతావృతః ।
అశ్రితోఖిలదాతా చ చోరఘ్నో రోగనాశనః ॥ 11 ॥
అనంతమూర్తి-రానంద-శ్శిఖండీకృతకేతనః ।
డంభః పరమడంభశ్చ మహాడంభో వృషాకపిః ॥ 12 ॥
కారణోపాత్తదేహశ్చ కారణాతీతవిగ్రహః ।
అనీశ్వరోఽమృతః ప్రాణః ప్రాణాయామపరాయణః ॥ 13 ॥
విరుద్ధహంతా వీరఘ్నో రక్తశ్యామగళోఽపి చ ।
సుబ్రహ్మణ్యో గుహః ప్రీతో బ్రహ్మణ్యో బ్రాహ్మణప్రియః
వంశవృద్ధికరో వేదో వేద్యోఽక్షయఫలప్రదః ॥ 14 ॥
🍁ఇతి శ్రీ సుబ్రహ్మణ్యాష్టోత్తర శతనామస్తోత్రం సంపూర్ణమ్ ।
🔸🔹🔸🔹🔸🔹🔸🔹🔸

Comments
Post a Comment