మన పురాణాలలో ‘ఐదు’ కు అత్యంత ప్రాముఖ్యత ఉంది.
🕉️⚜️🚩 ఓం నమః శివాయ 🌹🙏
💢 హర హర మహాదేవ శంభో శంకర 💢
💥ఆధ్యాత్మికంగా "ఐదు" ప్రాముఖ్యత💥
మన పురాణాలలో ‘ఐదు’ కు అత్యంత ప్రాముఖ్యత ఉంది. పంచాక్షరీ మంత్రంతో మొదలై పంచభూతాలు, పంచనదులు, పంచయజ్ఞాలు అంటూ ఐదు సంఖ్యతో కూడిన సంగతులు అనేకం!
వాటిలో కొన్ని వివరాలు:
🍁పంచామూర్తులు:
శ్రీ గణపతి, శ్రీ సుబ్రహ్మణ్యస్వామి, శ్రీ పరమశివుడు, శ్రీ పార్వతీదేవి, శ్రీ చండీకేశ్వరుడు మొదలైన ఐదుగురు మూర్తులను శైవక్షేత్రాలలో "పంచామూర్తులు"గా పూజిస్తుంటారు.
🍁పంచాయతనం:
ఒకే పీఠం పై ఐదుగురు దేవతలను ఆవాహన చేసుకుని పూజించడం.
🍁పంచమాతలు:
తన తల్లి, గురువు భార్య, రాజు భార్య, తన భార్య తల్లి (అత్త)లను మాతలుగా భావించి పూజిస్తారు. అందుకే వీరిని "పంచమాతలు" అనంటారు.
🍁పంచపితృమూర్తులు:
జన్మనిచ్చిన తండ్రి, విద్య బోధించిన వ్యక్తి, మంత్రోపదేశం చేసిన వ్యక్తి, అన్నంపెట్టిన వ్యక్తి, భయాన్ని పోగొట్టిన వ్యక్తులను పంచపితృమూర్తులుగా భావిస్తారు.
🍁పంచప్రతిష్ట:
పాంచరాత్రాగమాన్ని అనుసరించి ఐదు రకాలైన ప్రతిష్ఠలు జరుగుతుంటాయి.
స్థాపన: నిల్చున్న భంగిమలో చేసే ప్రతిష్ఠ
ఆస్థాపన: కూర్చున్న భంగిమలో చేసే ప్రతిష్ఠ
మైస్థాపన: పడుకున్న భంగిమలో చేసే ప్రతిష్ఠ
పరస్థాపన: వాహనాలపై పలు భంగిమలలో చేసే ప్రతిష్ఠ
ప్రతిష్ఠాపన: షణ్మార్చనతో చేసే ప్రతిష్ఠ
🍁శివపంచాయతనం:
మధ్యలో శివలింగాన్ని ప్రతిష్టించి చుట్టూవున్న ప్రదక్షిణంలో సూర్యుడు, వినాయకుడు, అంబిక విష్ణువులను ప్రతిష్టించి పూజించడమే శివ పంచాయతనం.
🍁పంచయజ్ఞాలు:
జల్లెడ, రుబ్బురోలు, చీపురు, రోలు, కుండ ఈ ఐదింటిని వాడటంవల్ల పాపం వస్తుంది. వీటి నివారణకు చేసే యజ్ఞాలను పంచమహాయజ్ఞాలు అనంటారు.
దేవయజ్ఞం: అగ్నితో హోమం చేయడం.
పితృయజ్ఞం: పితృకార్యాలను చేయడం.
భూతయజ్ఞం: జంతువులకు ఆహారాన్ని అందివ్వడం
మానుషయజ్ఞం: విందును ఇవ్వడం
బ్రహ్మయజ్ఞం: రోజూ వేదపఠనం చేయడం
🍁పంచాహోమాలు:
గణపతి హోమం: అనుకున్న కార్యాలు నిర్విఘ్నంగా నెరవేరేందుకై చేసే హోమం.
చండీహోమం: దరిద్రం, భయాలు తొలగేందుకు చేసే హోమం.
నవగ్రహ హోమం: గ్రహదోషం తొలగేందుకు నవగ్రహ హోమం.
సుదర్శన హోమం: సమస్త దోషాలు తొలగేందుకు చేసే హోమం.
రుద్రహోమం: అయుర్ వృద్ధి, ఆరోగ్యం కోసం చేసే హోమం.
🍁పంచయాగాలు:
కర్మయాగం: భగవంతునికి పూజ చేయడం.
తపయాగం: వ్రతం చేయడం.
జపయాగం: మంత్రాలను జపించడం.
ధ్యానయాగం: భగవన్నామాన్ని ధ్యానించడం.
మంత్రయాగం: వేదగ్రంథాలను పఠించడం.
🍁పంచాతాండవం:
ఆనందతాండవం, సంధ్యాతాండవం,
త్రిపురతాండవం, ఊర్థ్వతాండవం,
ముని తాండవం.
🍁పంచనాథ స్థలాలు:
కాశీ – శ్రీవిశ్వనాథుడు
గుజరాత్ – శ్రీసోమనాథుడు
పూరి – శ్రీజగన్నాథుడు
రామేశ్వరం – శ్రీ రామనాథుడు
వైదీశ్వరం – శ్రీవైథీశ్వరుడు
🍁పంచభగవతి స్థలాలు:
కొల్లూరు – మూకాంబిక
వడగరా – లోకాంబిక
పాల్ ఘాట్ – హోమాంబిక
కొడూంగబారు – మహాభగవతి
కన్యాకుమారి – బాలాంబిక
🍁పంచదేవి:
దుర్గ, రాధ, లక్ష్మీ, సరస్వతి, సావిత్రిలను "పంచదేవి"లు అనంటారు.
🍁పంచనదం:
దూతపాప, కిరాణానది, ధర్మనది, గంగ, యమునా నదులను కలిపి పంచనదాలు అంటారు.
ప్రస్తుత పంజాబ్ కూడ ఒకప్పుడు పంచనదం అని పిలిచేవాళ్ళు.
ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి ఐదు నదులు ప్రవహిస్తుంటాయి.
🍁పంచపర్వాలు:
ప్రాణ, అపాన, వ్యాన, సమాన, ఉదానాలు.
🍁పంచబ్రహ్మాసనం:
భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం.
దృశ్యమానప్రపంచం వీటి వల్లే ఏర్పడుతోంది.
🍁పంచలింగాలు:
పృథివీలింగం – కంచి
ఆపల్లింగం – జంబుకేశ్వరం
తేజోలింగం – అరుణాచలం
వాయులింగం – శ్రీకాళహస్తి
ఆకాశలింగం – చిదంబరం
🍁పంచవటం:
గోదావరి తీరంలో ఉంది.
ఇక్కడ ఐదు వటవృక్షాలు (మర్రిచెట్లు) ఉండటంతో "పంచవటి" అని అన్నారు.
ఈ ఐదు మర్రివృక్షాలు గత జన్మలో గంధర్వులు.
అగస్త్యుడిని ఎటూ కదలకుండా చేయాలని ప్రయత్నించి, అతని శాపానికి గురై వృక్షాలుగా మారుతారు.
శ్రీరామదర్శనంవల్ల శాప విమోచనమవుతుందని
చెబుతాడు.
ఇక్కడే రావణాసురుడు సీతాదేవిని అపహరించాడు.
🍁పంచాక్షరీ:
"నమఃశివాయ" అనే ఐదాక్షరాల మంత్రం.
🍁పంచాయతనం:
కాశీలోని శివుని విగ్రహం.
శివుని ఐదు ఆత్మలు ఐదు ఆయతనాలు – అవి: శాంతి, అతీత శాంతి, పరాపర విద్య, ప్ర్రతిష్ట, నివృత్తి.
🍁పంచపాండవులు:
పాండురాజు కుమారులు.
🍁పంచత్రంత్రం:
చిన్న పిల్లలకు జీవితమ పట్ల అవగాహన కలిగేందుకు విష్ణుశర్మ రాసిన కథల పుస్తకం.
🍁పంచద్వారక:
బద్రీనాథ్, పూరీ, అయోధ్య, ద్వారక, పండరీపురం.
🍁ఈశ్వరుని పంచముఖాల నుండి శ్రీ శివ పంచాక్షరీ మంత్రం లోని ఐదు బీజాక్షరాలు (న – మ – శి – వా – య) అందులో నుండి పంచభూతాలు, వాటి నుండి ఈ సమస్త జగత్తు పుట్టిందని చెబుతారు. అందువల్లనే ఈ లోకాలన్నింటికీ పంచాక్షరీ మహా మంత్రం తల్లిగా నిలిచి శుభాలను కలిగిస్తోంది.
సేకరణ... 💐🙏
🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️

Comments
Post a Comment