🍁"జగమంతా రామమయం"🍁

 🕉️⚜️🚩 శ్రీ రామ జయ రామ జయ జయ రామ 🌹🙏

🕉️💥🕉️💥🕉️💥🕉️💥🕉️💥🕉️


🍁శ్రీరామచంద్రుడు

పదహారు కళల మిళితమైన సుగుణధాముడు. గుణవంతుడు; వీరుడు; ధర్మజ్ఞుడు; కృతజ్ఞుడు; సత్యవాక్పరిపాలకుడు, దృఢవ్రతుడు;

ఉత్తమ చరిత్ర కలవాడు;

సర్వభూత హితము కోరినవాడు; విద్వాంసుడు; సమర్థుడు;

ప్రియదర్శనుడు (చూడచక్కని ప్రియమైనవాడు);

ఆత్మవంతుడు (ఆత్మజ్ఞాని అనగా తాను దేహం కాదనే సత్యస్పృహ కలవాడు);

జితక్రోధుడు (క్రోధమును జయించినవాడు);

ద్యుతిమంతుడు (తేజోవంతుడు);

అనసూయకుడు (అసూయ లేని వాడు);


🍁ఎవరి క్రోధాన్ని చూసి దేవతాగణమంతా భయపడుతారో అట్టి దేవతామూర్తియే శ్రీరామచంద్రుడు.

ఎంతో మహత్తర గుణ సంపద కల్గినవాడు కనుకనే

రామచంద్రుని నామజపం చేసినవారి పాపాలన్నీ అగ్నిగుండంలో పడిన గడ్డిపోచలా చప్పున భస్మమైపోతాయి.

మహా మహిమాన్వితమైన "రామనామం" త్రిమూర్తులకు ప్రతీకగా నిలిచింది.


🍁ఒకసారి పార్వతీదేవి పరమశివునితో వివిధ విషయాలను గురించి ముచ్చటిస్తూ "స్వామీ!

త్రిమూర్తులలో ఒక్కరు; లయకర్త అయిన మీరు నిత్యం రామనామ జపం చేయడానికి గల కారణమేమిటో తెలుసుకోవచ్చా?" అని ప్రశ్నించింది.

అందుకు పార్వతీవల్లభుడు చిరునవ్వు చిందించి

"దేవీ! రామనామ విశిష్టతను గురించి ఎంత చెప్పినా అది తరగని సంపదగానే మిగిలి ఉంటుంది.

విషయం తెలుసుకోగోరి అడిగావు కనుక వివరిస్తాను విను".


“శ్రీరామరామ రామేతి రమే రామే మనోరమే

సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే!"


"దీనిని బట్టి శ్రీరామనామం విష్ణు సహస్రనామావళికి సరిసమానమైనది.

విష్ణుమూర్తి యొక్క ప్రతినామము సర్వదేవతా సమానం.

అలాంటి వేయి విష్ణునామాలు ఒక్క రామ నామానికి సమానం.

రామనామ స్మరణం బ్రహ్మ హత్యాది మహాపాతకముల నుండి రక్షిస్తుంది.

ఈ కారణంగానే శివకేశవుల మధ్య భేదం లేకుండా నేను నిత్యం రామనామ జపం చేయడం జరుగుతోంది” అంటూ రామనామ విశిష్టతను తెలియజేశాడు పరమశివుడు.


“రామనామాత్పరో మంత్రః నభూతో నభవిష్యతి!!" 


🍁అంటే రామనామం కంటే గొప్పదయిన మంత్రం ఇదివరలో లేదు. భవిష్యత్తులో ఉండబోదు అని అర్థం.

మంత్రాలలో కల్లా గొప్పదయిన గాయత్రీ మంత్రానికీ, శ్రీరామ అనే త్రయాక్షర పద మంత్రానికీ మధ్య భేదం లేదు.

'రామ' అనే రెండక్షరాల పవిత్ర పదాన్ని నోరార ఒక్కసారి పల్కినవారికి గాయత్రీ మంత్రాన్ని నిష్టతో నూట ఎనిమిదిసార్లు జపించినంత ఫల ప్రాప్తి

లభిస్తుందని భారతీయ ఋషి గణం వేలాది సంవత్సరాల క్రితమే మానవాళికి తెలియచెప్పారు. 


🍁'రామ' అని కూడా పలుక లేక పోయిన

వేటగాడికి ‘మరా’ అని పలుకమంటూ దేవర్షి నారదుడు చెప్పగా సరేనని అలాగే పలికాడా బోయవాడు.

'మరా' శబ్దమే 'రామ' శబ్దంగా రూపాంతరం చెంది ఆ వేటగాడే రామాయణ మహాకావ్యాన్ని రాసిన "కవికోకిల" "వాల్మీకి" మహర్షిగా పేరుగాంచాడు.


🍁శ్రీ రామాయణ కావ్యం భారతీయులందరికీ పరమ పవిత్ర గ్రంథంగా నిలచిపోయింది.

అత్యంత సూక్ష్మమైన మర్రి విత్తనం నుండి బ్రహ్మాండమైన మర్రి వృక్షం ఉద్భవించినట్టు 'రాం' అనే బీజాక్షరం నుండి ఈ చరాచర జగత్తు ఏర్పడిందన్న ఆధారాలు ఎన్నెన్నో చూపెట్టారు మన ఋషి గణం.

అందుకే 🍁"జగమంతా రామమయం"🍁 అయింది.

సేకరణ... 💐🙏



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

శ్రీ సూర్యం ప్రణమామ్యహం

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు