Posts

Showing posts from January, 2024

💥హనుమాన్ ద్వాదశ నామ స్తోత్రం

Image
 ⚜️🕉️🚩శ్రీ ఆంజనేయం 🌹🙏 💥హనుమాన్ ద్వాదశ నామ స్తోత్రం: హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః రామేష్ఠ: ఫల్గుణసఖః పింగాక్షో: అమిత విక్రమః [1] ఉదధికక్రమణశ్చైవ సీతాశోక వినాశకః లక్ష్మణప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా [2] ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్యమృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్ [3] 💥మూర్తిభవించిన దాసభక్తి స్వరూపుడు.. కార్యదీక్షాపరుడే కాక మానవజాతికి మార్గదర్శకుడు, అభయప్రదాత ఆంజనేయస్వామి. సీతారాములను కలుపువారు శ్రీమద్రామాయణంలో పేర్కొన్నట్లు ఇద్దరు. ఒకరు విశ్వామిత్రుడు, రెండవవాడు ఆంజనేయస్వామి. లోక కళ్యాణార్థం సీతారాముల కళ్యాణాన్ని జరిపించినవాడు విశ్వామిత్రుడైతే, విడిపోయిన జంటను మరల కలిపి జగత్కల్యాణం గావించినవాడు ఆంజనేయుడు. హనుమంతుని బుద్ధిబలం, పాండిత్యం, మాటనేర్పు శ్రీరామచంద్రుణ్ణి ఆకర్షింపజేశాయి. ఇటువంటి దూత గల ప్రభువుదే కార్యసిద్ధి. ఇటువంటి వాడు సచివుడుగా ఉండే సాధించలేనిది ఏదీ ఉండదు అని శ్రీరాముడు స్వయంగా లక్ష్మణునితో అన్నాడు. అదీ ఆంజనేయుని వ్యక్తిత్వం. ఆంజనేయస్వామి భక్తి అనుపమానం, ఆదర్శం, స్వార్థరహితం, స్వచ్ఛం.  ఇక సీతాన్వేషణ...

💥మనం తెలుసుకోవాల్సిన జీవిత యధార్థం…!!

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 నమోస్తు దేవదేవాయ మహాదేవాయ వేధసే | శంభవే స్థాణవే నిత్యం శివాయ పరమాత్మనే || 💥 మనం తెలుసుకోవాల్సిన జీవిత యధార్థం…!! ధనము ఉన్నదని.. అనుచరణ గణం ఉన్నదని.. యౌవనం ఉన్నదని గర్వించే మానవ జన్మకు ఉపనిషత్తులు తెలిపిన చిన్న సూచన... ఈ ప్రపంచంలోని లౌకిక సంపదలన్నీ అనిత్యమైనవి, భ్రమాత్మకమైనవి, ఈ క్షణిక మైన సంపదలను చూచుకొని మనిషి గర్విస్తాడు, అహంకరిస్తాడు, శాశ్వతమనుకొని భ్రమ పడతాడు… ధన జన యౌవన గర్వం...!!! కొందరికి ధన గర్వం...!!! కావలసినంత ధనం ఉన్నదని, ఇళ్ళూ, వాకిళ్ళు, తోటలు, దొడ్లూ, భూములు, బ్యాంకు బ్యాలెన్సులూ ఉన్నాయని, ఎవరి దగ్గరా చేయి చాపనవసరం లేదని, గర్విస్తారు... వీటిని చూసుకొని కళ్లు మూసుకొని పోతాయి, ధన పిశాచి పట్టిన వాడికి భార్యా, పిల్లలు, బంధువులు, మిత్రులు, ఇరుగు, పొరుగు అనే భావం ఉండదు… అంతా డబ్బే, డబ్బున్నవారు మాత్రమే మిత్రులు, డబ్బులేని వారు శతృవులు, అన్నింటిని డబ్బుతోనే విలువ కడతారు... ఎవరిని ఏ మోసం చేసి, ఏమి మాయమాటలు చెప్పి ఎలా డబ్భు, ధనం లాగాలనే నిత్య స్మరణ లో వుంటారు... కొందరికి జన గర్వం...!!! తన వెనుక ఎందరో ఉన్నారు అనుకుంటారు, తనవల్ల ఏదో ప్రయోజనం పొందాలని త...

💥భక్తితో గూడిన దానికే విలువ..

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 భక్తితో గూడిన దానికే విలువ .. పూర్వకాలమున ఒకానొక గ్రామమున ఒక భక్తుడు నివసించుచుండెను. అతడు “ఓం నమో నారాయణాయ” అను అష్టాక్షరీ మహా మంత్రమును నిరంతరము జపించుచుండెడివాడు. తన పూజా మందిరములో శ్రీమన్నారాయణుని విగ్రహము నెదుట గూర్చొని భక్తి పూర్వకముగ ప్రతిదినము పై మంత్రమును పునశ్చరణ చేయుచుండెను. ప్రాపంచిక పదార్థములపై అతనికి ఏమాత్రము ఆసక్తి లేకుండెను. వైరాగ్య సంపన్నుడై భోగవస్తుజాలమును లెస్సగా పరిత్యజించి, దృష్టిని బహిర్ముఖముగ ప్రసరింపజేయక, నారాయణుడే తనకు దిక్కని నమ్మినవాడై మనోవాక్యాయములచే ఆయననే హృదయమున సంస్మరించుచు నుండెను. ఇట్లుండ, ఒకనాడతడు ప్రతిదిన పద్ధతి ప్రకారము ఉదయముననే స్నానాదులను నిర్వర్తించుకొని శుచిర్భూతుడై తన పూజా మందిరమున శ్రీమన్నారాయణుని దివ్యమంగళ విగ్రహము నెదుట గూర్చుండి దృష్టిని భ్రూమధ్యమున నిలిపి తదేక దృష్టితో నారాయణుని భావించుచు అష్టాక్షరీ మంత్రమును జపించుచుండ.. ఆతని భక్తికి, అపరిమిత శ్రద్ధకు మెచ్చి వైకుంఠనాథుడు శంఖ చక్ర గదాధారియై ఆకస్మికముగ ఆ పూజా మందిరమున ప్రత్యక్షమయ్యెను. భగవానుని ప్రత్యక్షముగ దర్శింప గల్గు మహద్భాగ్యము ఉదయించుటచే ఇక ఆ భక్తున...

⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః🌹🙏

💥అష్టాదశపురాణాలు💥

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 అష్టాదశపురాణాలు 💥 అష్టాదశ పురాణాలు అంటే 18 పురాణాలు. వీటిని వ్యాసభగవానుడు మనకు అందించాడు. ఈ 18 గుర్తుపెట్టుకోవడం కష్టమైతే, ఈ క్రింది శ్లోకం నేర్చుకుంటే గుర్తుపెట్టుకోవడం చాలా సులభం. శ్లో! ! మద్వయం భద్వయం చైవ, బ్రత్రయం వచతుష్టయం ! అనాపలింగ కూస్కానీ, పురాణాని ప్రచక్షత !! మద్వయం: మ కారంతో ప్రారంభమయ్యేవి 2. అవి మత్స్య పురాణం. మార్కండేయ పురాణం. భద్వయం: భ కారంతో ప్రారంభమయ్యేవి 2. అవి భాగవత పురాణం. భవిష్యత్ పురాణం. బ్రత్రయం: బ్ర కారంతో ప్రారంభమయ్యేవి 3. అవి బ్రహ్మ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మాండ పురాణం. వచుతష్టయం: వకారంతో ప్రారంభమయ్యేవి 4. అవి వాయుపురాణం, వరహా పురాణం, వామన పురాణం, విష్ణు పురాణం. అ కారంతో అగ్ని పురాణం, నా కారంతో నారద పురాణం, ప కారంతో పద్మ పురాణం, లి కారంతో లింగ పురాణం, గ కారంతో గరుడ పురాణం, కూ కారంతో కూర్మ పురాణం మరియు స్క కారంతో స్కంద పురాణం రచించిరి. 1) మత్స్య పురాణం: దీనీలో 14000 శ్లోకములన్నవి. మత్స్యావతార మెత్తిన విష్ణువుచే మనువుకు బోధింపబడినది. కార్తికేయ, మయాతి, సావిత్రుల చరిత్రలు. ధర్మాచరణములు, ప్రయాగ, వారణాసి మొదలగు పుణ్యక్ష...

💥క్షీరసాగరమధనం.. లక్ష్మీదేవి ఆవిర్భావం

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏 లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం!! 💥లక్ష్మీదేవి ఒక్కొక్క మన్వంతరంలో ఒక్కోరీతిలో ప్రకటితమయినట్లు పురాణాలు తెలుపుతున్నాయి. 1) స్వాయంభువ మన్వంతరంలో - భృగువు, ఖ్యాతిల పుత్రికగా జననం. 2) సార్వోచిష మన్వంతరంలో - అగ్ని నుండి అవతరణ. 3) జౌత్తమ మన్వంతరంలో - జలరాశి నుండీ, 4) తామస మన్వంతరంలో - భూమి నుండీ, 5) రైవత మన్వంతరంలో - బిల్వవృక్షం నుండీ, 6) చాక్షుష మన్వంతరంలో - సహస్రదళ పద్మం నుండీ, 7)వైవస్వత మన్వంతరంలో క్షీరసాగరంలో నుండి ఆవిర్భవించినట్లు తెలుస్తుంది. 💥పూర్వం ఒకసారి దూర్వాస మహా ముని కల్పవృక్ష మాలను దేవేంద్రునికి బహూకరించగా దేవేంద్రుడు ఆ మాలను తన వాహనమైన ఐరావతానికి ధరింపచేస్తాడు. ఆ ఏనుగు ఆ మాలను కిందపడేసి, కాళ్ళతో తొక్కి ముక్కలు చేస్తుంది. అది చూసిన దూర్వాస మహాముని కోపోద్రిక్తుడై "నీ రాజ్యం నుండి లక్ష్మి వెళ్ళిపోవుగాక" అని శపిస్తాడు. శాపఫలితంగా స్వర్గలోకంలో ఐశ్వర్యం నశించిప...

⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏

అరుణాచలం గురించి సాక్షాత్తు మహాశివుడు ఏమన్నారంటే...?

Image
 ⚜️🕉️🚩ఓం అరుణాచలేశ్వరాయ నమః🌹🙏 💥 అరుణాచలం గురించి సాక్షాత్తు మహాశివుడు ఏమన్నారంటే...? అరుణాచలం... అది శిలల సమూహం కాదు ప్రోది చేసిన భక్తి రాశి పోసిన జ్ఞానం... అచలంగా సాకారమైన పరమ శివచైతన్యం. ఋగ్వేదం ప్రకారం పరమశివుడు అరుణవర్ణ స్వరూపుడు. అందుకు నిదర్శనమే అరుణాచలం.  పంచభూతలింగాల్లో అరుణాచలేశ్వరుడు అగ్నిలింగం. తిరువణ్ణామలైలోని ఆయన సన్నిధిలో భక్తులు అగ్ని తాపాన్ని భరించలేరని… అందుకే పరమ కారుణ్యంతో, పరమేశ్వరుడు అరుణాచలమై నిలిచాడని పారమార్థికులు నమ్ముతారు. కేవలం ఆ గిరి దర్శనంతో, ప్రదక్షిణంతో పరమ శివుడు తన అనుగ్రహాన్ని కురిపిస్తాడని భావిస్తారు. అరుణాచలం ప్రాపంచిక బంధాల రుణ విముక్తి క్షేత్రమని కూడా పౌరాణికుల ప్రబోధం. అరుణాచల క్షేత్ర స్మరణం పావనత్వాన్నిస్తుందని స్వయానా శివుడే చెప్పినట్లు శివపురాణం చెబుతోంది. 💥బ్రహ్మ విష్ణువుల ప్రార్థనలతో పరమేశ్వరుడు పంచాక్షరాలతో కూడిన అరుణాచలం అనే పర్వతంగా ఆవిర్భవించాడన్నది పురాణ కథనం. పంచాక్షరీ మంత్ర జపానికి ఉన్న అనంతమైన శక్తి అరుణాచలం అన్న నామానికి కూడా ఉందని మహర్షులు చెబుతారు. అందుకే "స్మరణ మాత్రముననే పరముక్తి ఫలద, కరుణామృత జలధి అరుణాచలమది" అని...

💥జై నారసింహ!! జై జై లక్ష్మి నారసింహ!!💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ లక్ష్మీ నృసింహ స్వామినే నమః 🌹🙏 💥జై నారసింహ!! జై జై లక్ష్మి నారసింహ!!💥

💥విఘ్నాధిప‌తి💥

Image
 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏 💥 విఘ్నాధిప‌తి 💥 విశిష్ట స్వరూపుడు వినాయకుడు. విఘ్నాధిపతిగా, సర్వ శుభంకరునిగా వినాయకుడు నిత్య పూజితుడు. బ్రహ్మ వైవర్త పురాణం గణపతి పేరును నిర్వచిస్తూ ‘గ’ మేధకు, ‘ణ’ మోక్షానికి సమానార్థకాలంటూ ఆ రెండింటికీ "పతి" (అధిదేవుడని) ఆయనను కొనియాడింది. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా!! 🌹ఓ గణపతి దేవా! వక్రమైన తొండము గలవాడవు, విశ్వమంతటిని తనలో ఇముడ్చుకున్న శరీరము కలవాడవు, కోటిసూర్యుల కాంతితో ప్రకాశించువాడవు అయిన నీకు నమస్కరించుచున్నాను. నేను చేయు ప్రతీ పనియు నిర్విఘ్నముగా జరుగునట్లు అనుగ్రహింపుము.  💥సకలదోష నివారకుడు ”వినాయకుడు” "విఘ్నం".. ‘వి’ అంటే విధి.. అనగా ప్రతిజీవి ధర్మాచరణం చేయమని, "ఘ్నము” అంటే భగ్నం చేయునది. దేవ దానవులెవరైనా మానవులెవరైనా సర్వ విద్యుక్త ధర్మాచారణాన్నీ పాటించువారికి.. ఎట్టి విఘ్నాలు కలగకుండా కాపాడే విధి ఆ విఘ్నేశ్వరునిది.  ధర్మాచరణను విస్మరించిన వారిని దండించి దారిలో పెట్టడమే ఆ స్వామి అవతార రహస్యం. ఇది గ్రహించి ఆ స్వామిని స్మరించిన వారికి సర్వ ఐశ్వర్య భోగాలు లభిస్తాయని పురా ణ...

⚜️🕉️🚩శ్రీ ఆంజనేయం 🌹🙏

Image
 ⚜️🕉️🚩శ్రీ ఆంజనేయం 🌹🙏 కచ్చిదాశాస్తిదేవానాం ప్రసాదం పార్థివాత్మజః కచ్చిత్‌ పురుషకారంచ దైవంచ ప్రతిపద్యతే!! లంకా నగరం లోని అశోకవనంలో సీతాదేవిని దర్శించాడు హనుమ. ఆ సాధ్వి రామచంద్రుడి కుశలమడుగుతూ హనుమను ఇలా ప్రశ్నించింది. రాజకుమారుడైన రాముడు దేవతల అనుగ్రహాన్ని కోరుతున్నాడు కదా! పురుషకారానికీ (మానవ ప్రయత్నం), దైవబలానికీ సమానమైన ప్రాధాన్యం ఇచ్చి వాటిని సమంగా సేవిస్తూ ఉన్నాడు కదా’ అని హనుమను ప్రశ్నించింది సీతమ్మ. ప్రశ్నగా చూస్తే ఇందులో భర్త గురించి ఓ భార్య పడే ఆరాటంగా అనిపిస్తుంది. శ్రీరాముడి దినచర్యను గమనించిన సీతమ్మకు రాముడు చేసే దైవారాధన గురించి తెలుసు. 'తాను దూరమయ్యాక రాముడు శోకంలో మునిగిపోయి తననే తలచుకొని దుఃఖిస్తూ దేవతారాధన విస్మరించలేదు కదా!’ అని సీతమ్మ పడే తపన మాత్రమే కనిపిస్తుంది. కానీ, లోతుగా చూస్తే, విష్ణుమూర్తి అవతారమైన రాముడు దేవతానుగ్రహాన్ని కోరి, భక్తిపూర్వకంగా అర్చనలు చేసేవాడని తేటతెల్లమవుతుంది. ఇక్ష్వాకు వంశ ప్రభువులకు శ్రీరంగనాథస్వామి ఇలవేలుపు. సూర్యవంశపు రాజులు కాబట్టి ఆదిత్యుడిని కూడా ప్రధానంగా ఆరాధించేవారని భావించవచ్చు.  రాముడి దగ్గరికి వచ్చేసరికి, ఆయన మహావిష్...

💥సకల గుణాభిరామా శ్రీరామా!💥

Image
 ⚜️🕉️🚩 శ్రీరామ జయ రామ జయజయ రామ🌹🙏 💥 సకల గుణాభిరామా శ్రీరామా !💥 జీవితం త్రిగుణాత్మకమైంది. అవే సత్త్వ రజ స్తమో గుణాలు. సత్వగుణం దేవతల్ని, రజోగుణం యక్ష, రాక్షసుల్ని, తమోగుణం భూత, ప్రేత, పిశాచాల్ని ఆశ్రయించి ఉంటుందని భగవద్గీత చెబుతోంది. ఇక్కడ భూతాల్లో తమోగుణం ఉంటుందని కాక, తమో గుణం ఉన్న మనుషులు వాటిలా ప్రవర్తిస్తారని అర్థం చేసుకోవాలి. అలాగే రజోగుణం యక్ష, రాక్షసుల్లా.. సత్వగుణం దేవతల్లా ప్రవర్తింపజేస్తుంది. అంటే మనుషులుగా సహజ స్వభావంతో ఉన్న మనం సాధనతో మాధవత్వానికి ఎదగనూవచ్చు, పిశాచ స్థాయికి దిగజారనూవచ్చు. ఆ విషయాన్నే వాల్మీకి అనేక సన్నివేశాల్లో రాముడి పాత్ర ద్వారా, ప్రత్యేకించి స్త్రీలపట్ల ఆయన ప్రవర్తించే విధానం ద్వారా చాటిచెప్పాడు. 💥బాలకాండలో విశ్వామిత్ర మహర్షి యాగ రక్షణార్థం రామలక్ష్మణుల్ని తన ఆశ్రమానికి తీసుకెళ్లే ప్రధాన ఘట్టాల్లో కొన్ని- తాటకా సంహారం, అహల్యా శాపవిమోచనం, సీతాస్వయంవరం. శ్రీరాముడికి తారసపడిన స్త్రీలలో వీరు ముఖ్యులు. గురువు విశ్వామిత్రుడితో కలిసి యాగరక్షణార్థం వెళ్లి, దారిలో ఆయన ఆజ్ఞతో తాటకను సంహరించాడు.  అలానే గౌతమ ముని ఆశ్రమంలో శిలాసదృశంగా ఉన్న అహల్యకు తన ప...

రామపదమే ధర్మపథం!

Image
 ⚜️🕉️🚩శ్రీ రామ జయ రామ జయజయ రామ 🌹🙏 💥 రామపదమే ధర్మపథం! "రూపు దాల్చిన ధర్మస్వరూపుడే శ్రీరామచంద్రుడు. సకల ప్రాణికోటికి హితాన్నే కలిగించే సాధువర్తనుడు. తిరుగులేని పరాక్రమ సంపన్నుడు. దేవతలకు ఇంద్రుడు రాజైనట్లు ఈ సమస్త చరాచర సృష్టికి శ్రీరాముడే ప్రభువు"  - ఈ మాటలన్నది ఎవరో కాదు, శ్రీ రామునిచేత చావు దెబ్బలు తిని దాదాపు మృత్యుముఖం లోకి వెళ్లి వచ్చిన మారీచుడు.. తన ప్రభువైన రావణాసురునితో పలికిన పలుకులివి. శత్రువు చేతకూడా ప్రస్తుతింపబడే అమేయ పరాక్రమవంతుడే కదా అసలైన వీరుడు. ఆ సత్యపరాక్రముడు శ్రీరామచంద్రుడు. ఆపదా మపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయోభూయో నమామ్యహం ॥ 🌹రామకథ, రామనామం అన్ని ఆపదలనూ తొలగిస్తుంది. అన్ని విధాల అభివృద్ధులను కలిగిస్తుంది. లోకానికంతటికీ ప్రియాతి ప్రియమైంది. అంతటి శ్రీ రామునికి పదేపదే అనేకానేక నమస్కారాలు. 💥శ్రీమద్రామాయణ పారాయణాన్ని వేదపారాయణంతో సమానంగా భావిస్తారు. శ్రీరాముని ధర్మమార్గమే రామాయణం. ఈ మహాకావ్యాన్ని అన్ని వేదాల సమాహారంగా అర్చిస్తారు. పార్వతీమాతకు పరమశివుడు ‘శ్రీరామాయణ మాహాత్మ్యం’తో పాటుగా ఉపదేశించింది రామనామమే. అదే అందరి ఆపదలను తొలగిం...

ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏 శ్రుత్యైనమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యైనమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్యైనమోస్తు శతపత్ర నికేతనాయై పుష్ట్యైనమోస్తు పురుషోత్తమ వల్లభాయై!! 💥శుభములైన శ్రౌత, స్మార్త కర్మలకు సముచిత ఫలముల నొసంగు వేదమాతృ స్వరూపురాలైన లక్ష్మీదేవికి నమస్కారము. ఆనందపఱచు గుణములకు సముద్రము వంటిదగు రతీదేవి స్వరూపురాలైన భార్గవీమాతకు ప్రణామము. నూఱు దళముల పద్మముపై ఆసీనురాలైన శక్తి స్వరూపురాలికి వందనము. విష్ణుమూర్తికి ప్రియురాలైన పుష్టిస్వరూపురాలగు ఇందిరాదేవికి నమస్కారము. సర్వలోక రక్షిణి, సర్వజ్ఞానప్రదాయిని. శక్తి స్వరూపిణి అయిన ఆ జగజ్జననిని భక్తితో ఆరాధిస్తే అనుగ్రహిస్తుంది.  సిరిసంపదలు, సౌభాగ్యాన్ని అనుగ్రహించే ఆ లక్ష్మీదేవిని సేవిస్తే కోరిన వారికి కొంగు బంగారమవుతుంది.  💥ఒకసారి విషయవాంఛలతో విసిగిపోయిన ఇంద్రుడు, తన గురువు బృహస్పతిని కలిసి, తను కోల్పోయిన సంతోషాన్ని ఏవిధంగా తిరిగి తెచ్చుకోవాలో చెప్పమంటాడు. ఇంద్రుని మాటలను విన్న దేవగురువు విజ్ఞానమే అన్ని విధాలైన సంతోషాలకు మూలమనీ, దానిని తెచ్చుకునేందుకు ప్రయత్నించమని చెబుతాడు. ఇంద్రుని మనసులో మరో సందేహం. విజ్ఞానం ...

⚜️🕉️🚩 ఓం శ్రీదత్తాయ నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీదత్తాయ నమః 🌹🙏

💥వేదవేద్యుడు విఘ్నేశ్వరుడు:

Image
 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏 💥వేదవేద్యుడు విఘ్నేశ్వరుడు: గణపతి తత్త్వాన్ని వేదాలు విస్తృతంగా వివరించాయి. ముఖ్యంగా ఋగ్వేదంలో పొందుపరిచి ఉన్న మూలమంత్ర భాగం ఒక్కటి చాలు... ఆ తత్త్వాన్ని అర్థం చేసుకోవడానికి. ఓం గణానాంత్వా గణపతిగుం హవామహే కవిం కవీనా ముపవశ్రవస్తవం జ్యేష్ఠ రాజం బ్రహ్మణా బ్రహ్మణస్పతిః ఆన ష్రుణ్వన్నూతిభిః సీదసాదనం 💥గణపతిని ‘#బ్రహ్మణస్పతి’గా ఋగ్వేదం సంబోధించింది. 'బ్రహ్మణాలు’ అంటే వేదమంత్రాలు. పరిపూర్ణమైన కర్మలను వివరించే వేదమంత్రాలన్నిటికీ మంత్రపతిగా, కర్మాధ్యక్షుడిగా ఉండేవాడు కాబట్టి ఆయన బ్రహ్మణస్పతి. వేదంలో గణపతిని పరబ్రహ్మగా సూచిస్తూ చెప్పిన పదం ఇది. ‘#కవి’ అంటే వేదమంత్రం. సత్యదర్శనం చేసిన వేద మంత్రాలకు ఆయన అధిపతి. కవులకు కవి గణపతి. అలాగే ‘#ఉపమస్రవస్తమం’ అంటే ‘మిక్కిలి కీర్తి కలిగినవాడు’ అని అర్థం. సమస్త శ్రేయస్సులకూ ఆయనే మూలం, లక్ష్యం. ఈ మంత్ర శబ్దానికి ఎందరో, ఎన్నో విధాలుగా భాష్యం చెప్పారు. అన్న సమృద్ధి కలవాడనేది ఒక భాష్యం. ‘అన్నం’ అంటే అనుభవయోగ్యమైన సంపద. శరీరానికి పుష్టిని ఇచ్చేది అన్నం. కంటికి దృశ్యం, చెవికి శబ్దం, నాలుకకు రుచి... ఇలా అన్ని ఇంద్రియాలకూ వాటిని అం...

💥శ్రీస్కంద స్తోత్రం – మహాభారతం💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః 🌹🙏 ద్వాదశాయుత నేత్రాయ ద్వాదశోద్యత బాహవే! ద్వాదశాయుధధారాయ ద్వాదశాత్మన్నమోస్తుతే!! భావం: ద్వాదశాదిత్యుల రూపములో వెలుగొందు వాడా! పన్నెండు నిడివి కన్నులు గలవాడు, పైకి ఎత్తి పెట్టిన పన్నెండు బాహువులలో పన్నెండు ఆయుధములను దాల్చిన వాడు అగు కుమారస్వామికి నమస్కారము. 💥 శ్రీస్కంద స్తోత్రం – మహాభారతం💥 మార్కండేయ ఉవాచ | ఆగ్నేయశ్చైవ స్కందశ్చ దీప్తకీర్తిరనామయః | మయూరకేతుర్ధర్మాత్మా భూతేశో మహిషార్దనః || 1 || కామజిత్కామదః కాంతః సత్యవాగ్భువనేశ్వరః | శిశుః శీఘ్రః శుచిశ్చండో దీప్తవర్ణః శుభాననః || 2 || అమోఘస్త్వనఘో రౌద్రః ప్రియశ్చంద్రాననస్తథా | దీప్తశక్తిః ప్రశాంతాత్మా భద్రకృత్కూటమోహనః || ౩ || షష్ఠీప్రియశ్చ ధర్మాత్మా పవిత్రో మాతృవత్సలః | కన్యాభర్తా విభక్తశ్చ స్వాహేయో రేవతీసుతః || 4 || ప్రభుర్నేతా విశాఖశ్చ నైగమేయః సుదుశ్చరః | సువ్రతో లలితశ్చైవ బాలక్రీడనకప్రియః || 5 || ఖచారీ బ్రహ్మచారీ చ శూరః శరవణోద్భవః | విశ్వామిత్రప్రియశ్చైవ దేవసేనాప్రియస్తథా | వాసుదేవప్రియశ్చైవ ప్రియః ప్రియకృదేవ తు || 6 || నామాన్యేతాని దివ్యాని కార్తికేయస్య యః పఠేత్ | ...

💥పాడి పశువుల పండగ.. కనుమ

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥పాడి పశువుల పండగ.. కనుమ "సంక్రాంతి" అంటే పంటల పండుగే అని అందరికీ తెలిసిందే. కానీ ఆ పంటలు బాగా పండాలంటే, పశువుల సాయం కూడా కావాలిగా! అందుకే సంక్రాంతి మర్నాడు "కనుమ"ని పశువుల పండుగగా పిలుస్తారు. పశువులు ఉన్నవారు ఆ రోజు వాటిని శుభ్రంగా అలంకరించి మంచి ఆహారం పెడతారు. పక్షులకి కూడా ఆహారం అందేలా ఇంటిచూరుకి ధాన్యపు కంకులు వేలాడదీస్తారు. రైతులకు వ్యవసాయ క్షేత్రంలో పంటలకు సహయపడిన పశువును అవి చేసిన సహాయానికి కృతజ్ఞతగా పండిన పంటను తామేకాక, పశువులు, పక్షులతో పాలుపంచుకోవాలని పిట్టల కోసం ధాన్యపు కంకులు ఇంటి గుమ్మాలకు కడతారు.  పల్లెల్లో పశువులే గొప్ప సంపద. అవి ఆనందంగా ఉంటే రైతుకి ఉత్సాహం. పంట పొలాలల్లో వీటి పాత్ర ఎంతో ఉంది. వాటిని గౌరవించి శుభ్రంగా అలంకరించి పూజించి, వాటిని ప్రేమగా చూసుకొనే రోజుగా కనుమను భావిస్తారు. పల్లె ప్రాంతాలలో కనుమ పండుగను వైభవంగా జరుపుకుంటారు. తమకి సుఖ సంతోషాలను అందించడం కోసం అహర్నిశలు కష్టపడుతూ అవి పోషిస్తున్న పాత్రను రైతులు మరిచిపోరు. తమ జీవనాధారమైన పశువుల పట్ల కృతజ్ఞతగా వాళ్లు 'కనుమ' రోజున వాటికి విశ్రాంతినిచ్చి పూజి...

సంబరాల సంక్రాంతి 💥

Image
 💥 ఓం నమో నారాయణాయ🌹🙏 💥రావమ్మ మహాలక్ష్మి రావమ్మ.. నీ కోవెల మా ఇల్లు కొలువై ఉందువు గానీ.. హరిదాసు సుతిమెత్తగా గళమెత్తి తనను కీర్తిస్తుంటే.. మహాలక్ష్మి ఎందుకు రాదు! చిరతల తాళానికి తగ్గట్టుగా చిద్విలాసం చిందిస్తూ ఆయన ఆగిన ముంగిట ముచ్చట గొలుపుతూ నిల్చుంటుంది అమ్మ. ఆ ఇంటి ఇల్లాలు దొడ్డ మనసుతో, ప్రశాంత వదనంతో, మోవిపై చిరునవ్వులు కురిపిస్తూ వచ్చి హరిదాసు నెత్తిన ఉన్న అక్షయ పాత్రలో గుప్పెడు ధాన్యం కుమ్మరిస్తే చాలు.. ఆ ఇంట నవనిధులూ అక్షయం అయ్యేలా వరమిస్తుంది సంక్రాంతి లక్ష్మి. హరిదాసు ఆఖరిమాట ‘కృష్ణార్పణం’. భగవత్‌ కృపతో కలిగిన సంపదను తిరిగి ఆ దేవదేవుడికే సమర్పించడం మన సంప్రదాయం. మూడురోజుల సంక్రాంతి నేర్పేది ఇదే! నలుగురితో పంచుకోవడమే పండుగ పరమార్థం. 💥'కంచి కామాక్షి పలుకు.. మధుర మీనాక్షి పలుకు..’ సంక్రాంతి వేళ ప్రత్యేక ఆకర్షణ ఎరుకల సోదమ్మ. చారెడు ధాన్యమిస్తే చాలు.. బారెడు భవిష్యత్తు చెప్పేస్తుంది. ముగ్గురమ్మలు ఒక్కటై పలికిస్తారో.. వంశపారంపర్యంగా వచ్చిన అనుభవమో తెలియదు కానీ, ఆమె మాట మన్నికైనది! భవిష్యత్తును తీర్చిదిద్దుకోవడానికి మహాలక్ష్మమ్మే సోదమ్మగా సాక్షాత్కరించిన వైనం ఇది. 💥డూడూ బసవన్...

💥సంబురాల "సంక్రాంతి"

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 💥 సంబురాల "సంక్రాంతి" సంక్రాంతి అంటే కొత్త శోభ.. సంక్రాంతి అంటే కొత్త పంట.. సంక్రాంతి అంటే కొత్త అల్లుళ్ల రాక.. సంక్రాంతి అంటే  వాకిట్లో రంగు రంగు చుక్కల ముగ్గులు.. చక్కని గొబ్బెమ్మలపై పువ్వులు.. భగభగ భోగి మంటలు.. హరిదాసుల కీర్తనలు.. డూడూ బసవన్నల ఆటలు.. నోరూరించే పిండి వంటలు.. నింగిని తాకే గాలిపటాలు..  దేశంలోని పలు రాష్ట్రాలు సహా తెలుగు ప్రజలు ఘనంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. అన్ని పండుగల్లా కాకుండా ఈ పండుగకు అనేక ప్రత్యేకతలున్నాయి.  వరుస నాలుగు రోజులు జరిగే ఈ వేడుకలను చూడాలంటే పల్లెల వైపు చూడాల్సిందే. అందుకే ఈ పండుగ సెలవులకు ఎక్కడెక్కడ నుంచో స్వస్థలాలకు చేరుకుంటారు. 💥సంక్రాంతి లేదా "సంక్రమణం" అంటే చేరుట అని అర్ధం. మేషం మొదలైన 12 రాశులలో సంచరించే సూర్యుడు ముందున్న రాశి నుండి తరువాతి రాశిలోనికి ప్రవేశించడమే సంక్రాంతి. సూర్యుని చలనంలో (రధయాత్రలో) ఘట్టాలు నాలుగు. అవి మేష, తుల, కర్కాటక, మకర సంక్రమణాలు. మకర సంక్రమణాన్ని సంక్రాంతి పండుగగా వ్యవహరిస్తారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే కాలమే మకర సంక్రమణము. ఇక్కడి నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప...

💥🔥భోగి మంటలు🔥

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 సంక్రాంతి పండగ రాగానే తెలుగు ఇండ్లకు కొత్త శోభ వస్తుంది. ముగ్గులు.. భోగి మంటలు.. కోడి పందేలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు ఆటలతో పండుగ వాతావరణం నెలకొంటుంది. మూడు రోజుల పాటు కోలాహలంగా జరిగే సంక్రాంతి వేడుకల్లో భాగంగా మొదటి రోజు "భోగి మంటలు" వేయడంతో సంక్రాంతి పండుగ మొదలుపెడతారు. 💥🔥భోగి మంటలు 🔥💥 💥శాస్త్రీయంగా: సంక్రాంతి సమయంలో సూర్యుడు దక్షిణయానం నుంచి ఉత్తరాయానంలోకి ప్రవేశిస్తుంటాడు. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు తగ్గి చలి ఎక్కువ అవుతుంది. ఈ చలిని తట్టుకునేందుకు భోగి మంటలు వేయడం మొదలైందని చెబుతారు. 💥ఆధ్యాత్మికంగా: ఆధ్యాత్మిక విషయానికొస్తే దక్షిణయానంలో పడిన కష్టాలను తొలగించి, సంతోషాలను ప్రసాదించాలని భోగి మంటలను వేస్తారని కూడా చెబుతుంటారు. భోగి మంటలు వేయడం వెనుక పురాణాల్లో ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. 💥పురాణ గాధ: వామన అవతారంలో వచ్చిన శ్రీమహావిష్ణువు బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కేసిన తర్వాత అతనికి ఒక వరం ఇచ్చాడని చెబుతారు. దీని ప్రకారం బలి చక్రవర్తిని పాతాళానికి రాజుగా ఉండమని.. సంక్రాంతి ముందు భూలోకానికి వచ్చి ప్రజలను ఆశీర్వదించాలని చెప్పాడట. అందుకే...

భోగభాగ్యాల భోగి

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ🌹🙏 💥 భోగభాగ్యాల భోగి 💥 చాంద్రమానం పాటించే తెలుగువారు సౌరమానం ప్రకారం జరిపే పర్వాలలో "భోగి" ఒకటి. తెలుగువారి ఇతర పండుగల వలె ఇది తిథి ప్రధానమైన పర్వం కాదు. ఈ పండుగ దక్షిణాయనానికి ఆఖరురోజు, అలాగే ధనుర్మాసానికి కూడా చివరి రోజు. రైతులకు పంటలన్నీ ఈ పండుగ నాటికి దాదాపు ఇంటికి వచ్చేస్తాయి. రైతులకు వ్యవసాయ పనుల రద్దీ తగ్గి సుఖంగా కాలక్షేపం చేయడానికి కావలసిన విశ్రాంతి దొరుకుతుంది. చేతికొచ్చిన పంటను అనుభవానికి తెచ్చుకుని భోగభాగ్యాలు అనుభవించడానికి రైతులకు వీలుకలిగించే పండుగ కాబట్టి దీనికి భోగి అని పేరు వచ్చిందేమో! 💥భోగికి ఆ పేరు రావడానికి ఇంకో విధంగా కూడా చెబుతారు.  శ్రీ విల్లిపుత్తూర్ లో విష్ణుచిత్తుడు అనే పరమ భాగవతోత్తముడు.. ఆయనకు తులసివనంలో లభించిన కూతురు.. గోదాదేవి. గోదాదేవి శ్రీరంగంలోని శ్రీరంగనాథున్ని తప్ప మానవమాత్రులెవరినీ వివాహం చేసుకోనని తండ్రితో చెప్పింది. తన కోరికను నెరవేర్చుకోవడానికి ద్వాపరంలో శ్రీకృష్ణుణ్ణి పొందడానికి గోపికలు నోచిన కాత్యాయనీ వ్రతం మాదిరి తను కూడా చేయప్రారంభిస్తుంది. ఆమె రోజుకొక పాశురంతో (పద్యం) స్వామిని అర్చించేది. తర్వాత నివేదన...

💥అన్నపూర్ణా స్తుతి💥

Image
 ⚜️🕉️🚩ఓం అన్నపూర్ణాయై నమః🌹🙏 అన్నాన్నిచ్చి శారీరకంగా పుష్ఠివంతులుగా చేసేది, సద్బుద్ధి భిక్ష నొసగి జ్ఞాన పుష్టివంతులుగానొనర్చు కరుణామయి, విశేషంగా అర్చించబడు, మూల ప్రకృతి శక్తి- అన్నపూర్ణాదేవి. “బిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ” అని ఆదిశంకరులు ప్రార్థించిన అన్నపూర్ణాష్టకం తప్పనిసరిగా పారాయణ చేయాలి. శంకరులు ఈ స్తోత్రాన్ని కేవలం ఆకలితో ఉన్నప్పుడు కడుపు నింపి లౌకిక సుఖాన్నిచ్చే దేవతను కొలిచే విధంగా ఇవ్వలేదు. ఇది పరాశక్తి స్తోత్రం. వారడిగింది జ్ఙాన వైరాగ్యములను మోక్షం పొందడాన్ని భిక్షగా అడిగారు. అమ్మ కృపను భిక్షగా అడిగారు. 💥 అన్నపూర్ణా స్తుతి💥 నిత్యానందకరీ వరాభయకరీ సౌన్దర్యరత్నాకరీ నిర్ధూతాఖిలఘొరపాపనికరీ ప్రత్యక్షమాహేశ్వరీ|ప్రాలేయాచలవంశపావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలమ్బనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ ||౧||   🌹తాత్పర్యము: నిత్యమైన ఆనందము నిచ్చుదానవు, వరములను- అభయమును ప్రసాదించు దానవు, సౌందర్య సముద్రమైన దానవు, ఘొరమైన పాపముల నన్నిటినీ కడిగి వేయుదానవు, హిమవంతుని వంశమును పవిత్రము చేయుదానవు, కాశి పట్టణమునకు రాణివి, దయామయివి, తల్లివి, అన్నపూర్ణేశ్వరివి అగు నీవు బిక్షపె...

శనీశ్వరుడికి పరమ ప్రీతికరం.. పుష్య మాసం.

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ🌹🙏 💥 శనీశ్వరుడికి పరమ ప్రీతికరం.. పుష్య మాసం. విష్ణువుకు ఇష్టమైన మాసం ఆశ్వీయుజం. శివునకు కార్తీకం. అలాగే పుష్యమాసం "శనీశ్వరుడికి" పరమ ప్రీతికరం. ఎందుకంటే ఆయన జన్మనక్షత్రం పుష్యమి. ఈ నెలంతా శనైశ్చరుణ్ని పూజించే వారిపట్ల శని ప్రసన్నుడై శుభాలు కలిగిస్తాడని పురాణాలు తెలుపుతున్నాయి.  “పుష్య”అనే మాటకు పోషణ శక్తి కలిగినది అని అర్ధం.  చంద్రుడు పుష్యమి నక్షత్రంలో ఉండగా వచ్చే మాసం పుష్య మాసం. ఆధ్యాత్మికంగా జపతపాదులు, ధ్యాన పారాయణలకు శ్రేష్ఠమైన మాసమిది. పితృదేవతలను పూజించి అందరు దోషరహితులయ్యే పుణ్య మాసం పుష్యం. 💥పుష్య పౌర్ణమి వేదాధ్యయానికి చాలా విశిష్టమైనదిగా చెప్పబడింది. శ్రావణ పౌర్ణమి మొదలు పుష్య పౌర్ణమి వరకు వేదాలు, మంత్రాలు నేర్చుకోవడానికి అనువైన సమయంగా చెప్పబడింది.  ఏలినాటి శనితో బాధపడేవారు ఈ మాసంలో రోజూ ఉదయానే శుచిగా స్నానం చేసి శనీశ్వరుణ్ణి భక్తితో ప్రార్థిస్తారు. పౌర్ణమి నాడు శనికి తైలాభిషేకం జరిపించి నవ్వులు దానమిస్తారు. ఆయనకు ఇష్టమైన నువ్వులు, బెల్లం ఆహారంలో భాగం చేసుకుంటారు. శని ధర్మదర్శి న్యాయం, సత్యం, ధర్మాలను ఎత్తి చూపించేవాడు. సర్వప్రా...

💥పురాణాలలో గణపతి:

Image
 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏 సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్ననాశో వినాయకః  ధూమ్రకేతుర్గణాధ్యక్షో ఫాలచంద్రో గజాననః  ద్వాదశైతాని నామాని గణేశస్య తు యః పఠేత్!! 💥పురాణాలలో గణపతి: గణేశుని పుట్టుకకు సంబంధించి ఎన్నో పురాణ గాధలు ఉన్నాయి. వేదవ్యాసుడు వ్రాసిన 18 పురాణాలు ఒక్కొక్క రకమైన ఉత్పత్తి క్రమాన్ని వివరిస్తున్నాయి.  అయితే, ఈ కథనాలను పరస్పర విరుద్ధాలైనవిగా కాకుండా, ఒక్కొక్క కల్పంలో జరిగిన వాటిగానే అర్థం చేసుకోవాలి. 💥ఆవిధంగా ఇప్పుడు వినాయకుని ఆవిర్భావ ఘట్టాలు కొన్నింటిని చూద్దాం! “పినాకి భార్యా తనుజ మృద్భవ” అన్న విధంగా గౌరీదేవి దేహ వ్యర్థం నుండి గణేశుడు జన్మించాడనే స్కాందపురాణంలోని కథ బహుప్రసిద్ధిని పొందింది. బ్రహ్మవైవర్త పురాణంలో పుత్రభిక్షకై పార్వతి, శ్రీమన్నారాయణుడిని ప్రార్థించగా, వైకుంఠవాసుని వరం వల్ల గణపతి ఆవిర్భావం జరిగిందని తెలుస్తోంది. పురాణ కథ ఏదైనా, విఘ్నేశ్వరుని ఆవిర్భావం పరమశివుని సంకల్పానికి అనుగుణంగానే జరిగింది. పురాణాలలో మహాగణపతి వైభవం అనేక విధాలుగా వర్ణించాడు వేదవ్యాసుడు. మహాశివుని వైభవాన్ని వివరించడానికై ఆవిర్భవించిన లింగపురాణం గణే...

సుబ్రహ్మణ్యష్టోత్తర శతనామస్తోత్రం

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః🌹🙏 💥సుబ్రహ్మణ్యష్టోత్తర శతనామస్తోత్రం💥 శక్తిహస్తం విరూపాక్షం శిఖివాహం షడాననమ్ । దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుటధ్వజమ్ ॥ 💥ఇతి ధ్యానం: స్కందో గుహః షణ్ముఖశ్చ ఫాలనేత్రసుతః ప్రభుః । పింగళః కృత్తికాసూనుః శిఖివాహో ద్విషడ్భుజః ॥ 1 ॥ ద్విషణ్ణేత్ర-శ్శక్తిధరః పిశితాశ ప్రభంజనః । తారకాసురసంహారీ రక్షోబలవిమర్దనః ॥ 2 ॥ మత్తః ప్రమత్త ఉన్మత్తః సురసైన్యసురక్షకః । దేవసేనాపతిః ప్రాజ్ఞః కృపాళు ర్భక్తవత్సలః ॥ 3 ॥ ఉమాసుత-శ్శక్తిధరః కుమారః క్రౌంచధారణః । సేనానీ-రగ్నిజన్మా చ విశాఖః శంకరాత్మజః ॥ 4 ॥ శివస్వామీ గణస్వామీ సర్వస్వామీ సనాతనః । అనంతమూర్తి రక్షోభ్యః పార్వతీప్రియనందనః ॥ 5 ॥ గంగాసుత-శ్శరోద్భూత ఆహూతః పావకాత్మజః । జృంభః ప్రజృంభ ఉజ్జృంభః కమలాసనసంస్తుతః ॥ 6 ॥ ఏకవర్ణో ద్వివర్ణశ్చ త్రివర్ణః సుమనోహరః । చతుర్వర్ణః పంచవర్ణః ప్రజాపతి-రహస్పతిః ॥ 7 ॥ అగ్నిగర్భ-శ్శమీగర్భో విశ్వరేతా-స్సురారిహా । హరిద్వర్ణ-శ్శుభకరో పటుశ్చ వటువేషభృత్ ॥ 8 ॥ పూషా గభస్తి-ర్గహన శ్చంద్రవర్ణః కళాధరః । మాయాధరో మహామాయీ కైవల్య-శ్శంకరాత్మజః ॥ 9 ॥ విశ్వయోని-రమేయాత్మా తేజోనిధి...

భగవంతుడు బందీ అయ్యేది భక్తి పాశానికే!

Image
 ⚜️🕉️🚩శ్రీ ఆంజనేయం 🌹🙏 ఆంజనేయ మతిపాటలాననం కాంచనాద్రి కమనీయ విగ్రహం! పారిజాత తరుమూల వాసినం భావయామి పవమాన నందనం!! భగవంతుడు బందీ అయ్యేది భక్తి పాశానికే! అందుకే నవవిధ భక్తిమార్గాల ద్వారా దైవాన్ని చేరుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈ భక్తి విధానాల్లో "దాస్యభక్తి"కి నిలువెత్తు నిదర్శనం హనుమంతుడు. అనంతశక్తులు తనలో దాగి ఉన్నా.. రామబంటుగా ఒదిగి ఉండటమే దాసాంజనేయుడికి ఇష్టం. ఆ పరమభక్తుడు పిల్లల దేవుడు, పెద్దల దేవుడు, అందరి దేవుడు. ఆంజనేయుడి కోవెల లేని ఊరు ఉండదు. ఒకచోట సంజీవరాయడిగా, మరోచోట సహకార ఆంజనేయుడిగా, ఇంకోచోట వీరాంజనేయుడిగా ఊరూరా అభయమిస్తూ ఉంటాడు. మనందరికీ దేవుడే అయినా, తనను తాను సదా రామచంద్రుడి దాసుడిగానే భావిస్తాడు స్వామి.  లంకాపురిలో సీతమ్మ జాడకనిపెట్టి అంతటి ఘనకార్యం చేసినా.. దానికి సహకారం చేసింది రామనామమే అని వినమ్రంగా చెప్పుకొన్నాడు. 💥శ్రీమద్భాగవతంలో తెలిపిన నవవిధ భక్తి మార్గాల్లో దాస్యభక్తికి ప్రతీకగా హనుమంతుడిని చెప్పుకొంటారు.  అయితే, ‘వానరుడిగా జన్మించిన హనుమ ఇంతటి పరిపూర్ణతను ఎలా సాధించగలిగాడు?’ అన్న ప్రశ్నకు ప్రభుపాదుల వారు సహేతుకమైన వివరణ ఇచ్చారు.  "హనుమంతుడు ...