💥విఘ్నాధిప‌తి💥

 ⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏


💥విఘ్నాధిప‌తి💥


విశిష్ట స్వరూపుడు వినాయకుడు.

విఘ్నాధిపతిగా, సర్వ శుభంకరునిగా వినాయకుడు నిత్య పూజితుడు.


బ్రహ్మ వైవర్త పురాణం గణపతి పేరును నిర్వచిస్తూ ‘గ’ మేధకు, ‘ణ’ మోక్షానికి సమానార్థకాలంటూ ఆ రెండింటికీ "పతి" (అధిదేవుడని) ఆయనను కొనియాడింది.


వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ

నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా!!


🌹ఓ గణపతి దేవా! వక్రమైన తొండము గలవాడవు, విశ్వమంతటిని తనలో ఇముడ్చుకున్న శరీరము కలవాడవు, కోటిసూర్యుల కాంతితో ప్రకాశించువాడవు అయిన నీకు నమస్కరించుచున్నాను. నేను చేయు ప్రతీ పనియు నిర్విఘ్నముగా జరుగునట్లు అనుగ్రహింపుము. 


💥సకలదోష నివారకుడు ”వినాయకుడు”

"విఘ్నం".. ‘వి’ అంటే విధి.. అనగా ప్రతిజీవి ధర్మాచరణం చేయమని, "ఘ్నము” అంటే భగ్నం చేయునది.


దేవ దానవులెవరైనా మానవులెవరైనా సర్వ విద్యుక్త ధర్మాచారణాన్నీ పాటించువారికి.. ఎట్టి విఘ్నాలు కలగకుండా కాపాడే విధి ఆ విఘ్నేశ్వరునిది. 


ధర్మాచరణను విస్మరించిన వారిని దండించి దారిలో పెట్టడమే ఆ స్వామి అవతార రహస్యం.

ఇది గ్రహించి ఆ స్వామిని స్మరించిన వారికి సర్వ ఐశ్వర్య భోగాలు లభిస్తాయని పురా ణాలు పేర్కొంటున్నాయి.


💥విష్ణువు అతడే శివుడు అతడే శక్తి అతడే ప్రకృతి పురుషులుగా అవతరించిన ప్రణవ రూపుడైన ఓంకార స్వరూపుడు అతడే.


ఈ జగత్తుకు కారకుడైన పరబ్రహ్మ అవతారమే ఈ విఘ్నేశ్వరుడు. సర్వసిద్ధి ప్రదాత. సంకటహరుడు.

సర్వగృహ గ్రహదోష నివారకుడు ఆ స్వామినే.


ప్రసన్న వదనంతో విష్ణుస్వరూపంగా జపించి వినాయకుని ధ్యానిస్తే దరిచేరని శుభం లేదంటే అతిశయోక్తి లేదు.


💥స్వామికి గల అనేకానేక నామాలలో మనకు సుపరిచితమైనది ‘గణపతి’

‘గణం’ అంటే సమూహం అని అర్థం ‘పతి’ అంటే భర్త అని మనకు తెలిసిన అర్థం కానీ "భరించువాడు" అని విశేషార్థం.


జీవన సమూహాలను భరించువాడూ జగద్భారకుడూ అయినందున ఆ స్వామికి గణపతి అని పేరు వచ్చింది ‘గణ’ అంటే జ్ఞానం, నిర్వాణం అని అర్థం రెండూ కలిస్తే పరబ్రహ్మం.


💥గణపతి పూర్యష్టకానికి అధిపతి అని తెలుస్తోంది. "పూర్యష్టకం" అంటే ఎనిమిది రకాల ప్రత్యేకతలున్న పట్టణం అని అర్థం.


ఇక్కడ పూర్యష్టకం అని చెప్పుకోతగిన ఆ పట్టణం మరేదో కాదు- అది మన దేహమే.


జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచభూతాలు, పంచ ప్రాణాలు, కామం, కర్మ, అవిద్య, మనస్సు అనే ఈ ఎనిమిది ప్రత్యేకతలతో రూపొందినదే మానవ దేహం. 


దేహానికి గల ప్రత్యేకతలను గ్రహించి తదనుగుణంగా దానికి అధిపతియైన వినాయకుణ్ణి సేవిస్తే అహం నశించి, మోక్షప్రాప్తి కల్గుతుందని భారతీయ ఋషిగణం, ఆధ్యాత్మిక వేత్తలూ వివరించి చెప్పారు.

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

💥శ్రీ వేంకటేశ్వర అష్టోత్తరశత నామస్తోత్రం💥

ఒక భక్తుడు భగవంతుడిని కోరదగినవి ఏవి? ఏది తపస్సు

శ్రీ సూర్యం ప్రణమామ్యహం