💥వేదవేద్యుడు విఘ్నేశ్వరుడు:
⚜️🕉️🚩 ఓం గం గణపతయే నమః 🌹🙏
💥వేదవేద్యుడు విఘ్నేశ్వరుడు:
గణపతి తత్త్వాన్ని వేదాలు విస్తృతంగా వివరించాయి. ముఖ్యంగా ఋగ్వేదంలో పొందుపరిచి ఉన్న మూలమంత్ర భాగం ఒక్కటి చాలు... ఆ తత్త్వాన్ని అర్థం చేసుకోవడానికి.
ఓం గణానాంత్వా గణపతిగుం హవామహే కవిం కవీనా ముపవశ్రవస్తవం
జ్యేష్ఠ రాజం బ్రహ్మణా బ్రహ్మణస్పతిః ఆన ష్రుణ్వన్నూతిభిః సీదసాదనం
💥గణపతిని ‘#బ్రహ్మణస్పతి’గా ఋగ్వేదం సంబోధించింది.
'బ్రహ్మణాలు’ అంటే వేదమంత్రాలు.
పరిపూర్ణమైన కర్మలను వివరించే వేదమంత్రాలన్నిటికీ మంత్రపతిగా, కర్మాధ్యక్షుడిగా ఉండేవాడు కాబట్టి ఆయన బ్రహ్మణస్పతి.
వేదంలో గణపతిని పరబ్రహ్మగా సూచిస్తూ చెప్పిన పదం ఇది.
‘#కవి’ అంటే వేదమంత్రం. సత్యదర్శనం చేసిన వేద మంత్రాలకు ఆయన అధిపతి. కవులకు కవి గణపతి.
అలాగే ‘#ఉపమస్రవస్తమం’ అంటే ‘మిక్కిలి కీర్తి కలిగినవాడు’ అని అర్థం.
సమస్త శ్రేయస్సులకూ ఆయనే మూలం, లక్ష్యం.
ఈ మంత్ర శబ్దానికి ఎందరో, ఎన్నో విధాలుగా భాష్యం చెప్పారు.
అన్న సమృద్ధి కలవాడనేది ఒక భాష్యం.
‘అన్నం’ అంటే అనుభవయోగ్యమైన సంపద.
శరీరానికి పుష్టిని ఇచ్చేది అన్నం.
కంటికి దృశ్యం, చెవికి శబ్దం, నాలుకకు రుచి... ఇలా అన్ని ఇంద్రియాలకూ వాటిని అందించే శక్తులే అన్నములు.
ఈ ఐశ్వర్యాలను ఇచ్చేవాడు గణపతి.
ఇక ‘#జ్యేష్టరాజు’ అనే శబ్దానికి ‘ఉత్కృష్టమైన వాటిలో మహోత్కృష్టంగా’ ప్రకాశించేవాడు అని అర్థం.
అందుకే గణపతి అగ్రపూజను అందుకుంటున్నాడు.
💥'వేదవేద్యుడవైన ఓ గణపతీ! నిన్ను ఆహ్వానిస్తున్నాను. మా స్తుతులను విని, పాలన హేతువులైన శక్తులతో యజ్ఞమందిరానికి వచ్చి ఆసీనుడవుకా!’ అంటూ గణపతి తత్త్వాన్ని ఈ వేదమంత్రం ఆమూలాగ్రంగా వివరించింది.
ప్రత్యేకించి ఈ మంత్రంలోని ‘గణములు’ (సమూహాలు) రూప ప్రపంచాన్నీ, కవి, ‘బ్రహ్మణములు’ శబ్ద ప్రపంచాన్నీ సూచిస్తాయి.
రూప ప్రపంచానికీ, శబ్ద ప్రపంచానికీ అధిపతి అయిన గణపతి మాహత్మ్యాన్నీ, రక్షణ సామర్థ్యాన్నీ ఈ మంత్రం స్పష్టం చేసింది.
వేదవేద్యమై, ఆదిమూలమైన పరతత్త్వం గణపతిగా వేదాలలో, ఉపనిషత్తులలో, మంత్ర, తంత్ర శాస్త్రాలలో, పురాణాలలో విభిన్న ఉపాసనమూర్తులుగా సాక్షాత్కరిస్తోంది.
💥కరుణా సముద్రుడు, సకలాభీష్టప్రదుడు, సచ్చిదానంద స్వరూపుడైన గణపతి భక్తులు సమర్పించే గరిక పూజలకు సంతోషిస్తాడు.
కుడుములు, ఉండ్రాళ్ళు, వడపప్పు పెడితే ఆనందిస్తాడు.
వయోబేధం లేకుండా భారతీయులందరూ భక్తి శ్రద్ధలతో పూజించుకొనే గణపతిది సమ్మోహన రూపం.
ఆ రూపంలో ఉండే వైశిష్ట్యాన్ని మన ప్రాచీన గ్రంథాలు ఎంతగానో ప్రస్తుతించాయి.
వేదవేద్యుడైన ఆ గణపతి కటాక్షవీక్షణాలు అందరిపైనా ప్రసరించాలని ప్రార్థించాలి.
ఓం గం గణపతయే నమః
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment