💥హనుమాన్ ద్వాదశ నామ స్తోత్రం
⚜️🕉️🚩శ్రీ ఆంజనేయం 🌹🙏
💥హనుమాన్ ద్వాదశ నామ స్తోత్రం:
హనుమానంజనాసూనుః వాయుపుత్రో మహాబలః
రామేష్ఠ: ఫల్గుణసఖః పింగాక్షో: అమిత విక్రమః [1]
ఉదధికక్రమణశ్చైవ సీతాశోక వినాశకః
లక్ష్మణప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా [2]
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః
తస్యమృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్ [3]
💥మూర్తిభవించిన దాసభక్తి స్వరూపుడు.. కార్యదీక్షాపరుడే కాక మానవజాతికి మార్గదర్శకుడు, అభయప్రదాత ఆంజనేయస్వామి.
సీతారాములను కలుపువారు శ్రీమద్రామాయణంలో పేర్కొన్నట్లు ఇద్దరు. ఒకరు విశ్వామిత్రుడు, రెండవవాడు ఆంజనేయస్వామి.
లోక కళ్యాణార్థం సీతారాముల కళ్యాణాన్ని జరిపించినవాడు విశ్వామిత్రుడైతే, విడిపోయిన జంటను మరల కలిపి జగత్కల్యాణం గావించినవాడు ఆంజనేయుడు.
హనుమంతుని బుద్ధిబలం, పాండిత్యం, మాటనేర్పు శ్రీరామచంద్రుణ్ణి ఆకర్షింపజేశాయి. ఇటువంటి దూత గల ప్రభువుదే కార్యసిద్ధి. ఇటువంటి వాడు సచివుడుగా ఉండే సాధించలేనిది ఏదీ ఉండదు అని శ్రీరాముడు స్వయంగా లక్ష్మణునితో అన్నాడు. అదీ ఆంజనేయుని వ్యక్తిత్వం.
ఆంజనేయస్వామి భక్తి అనుపమానం, ఆదర్శం, స్వార్థరహితం, స్వచ్ఛం.
ఇక సీతాన్వేషణలో ఆయన చూపిన శక్తియుక్తులు అసామాన్యం.
తన మాటతీరుతోనే సీతమ్మకు ఆప్తుడైనాడు. రాముడిచ్చిన అంగుళీయకాన్ని సీతకిచ్చాడు. సీత తన ఆనవాలుగా చూడామణి ఇవ్వగా పుచ్చుకున్నాడు.
తర్వాత రాక్షస బలం తెలుసుకోవడానికి, తన శక్తియుక్తులు వారికి తెలిపేందుకోసం అశోకవనాన్ని ధ్వంసం చేశాడు, అడ్డువచ్చిన రాక్షసులను సంహరించాడు.
రావణ పుత్రుడైన అక్షయ కుమారుడిని అంతం చేశాడు.
బ్రహ్మాస్త్రానికి కట్టుబడ్డట్టు నటించి రావణదర్బారులోకి ప్రవేశించాడు. రావణుడికి "సీత సామాన్య స్త్రీ కాదని" హితబోధ చేశాడు.
రావణుడు తోకకు నిప్పు పెట్టించగా లంకాదహనం చేసి, సీతమ్మ వద్దకు మళ్లీ వచ్చాడు.
"హనుమా, రాముడీ లంక పైకి దండెత్తి వచ్చేటందుకు, ప్రమాణము నీవే. నీమాటపైన ఆధారపడియే రాముడి శ్రేష్ట ప్రయత్నం. నీవు ఏం ప్రయత్నం చేస్తావో, ఎలా చేస్తావో నాదుఃఖాన్ని మాత్రం నాశనం చేయమని’" సీతమ్మ చేత చెప్పించుకున్న ఆప్తుడు హనుమ.
సీతమ్మ తల్లితో "తల్లీ ఎందరో వానరవీరులు రామునికి సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరైనా బలవంతులైన వారిని దూతలుగా పంపరు కదా, కనుకనే నన్ను పంపించారు. ఇదే నీకు సాక్ష్య’’ మన్నాడు హనుమ.
ఇందులోని రాజనీతి, హనుమంతుని వినయం అత్యద్భుతం.
సంజీవని పర్వతాన్ని తెచ్చి లక్ష్మణునికి ప్రాణదానం చేశాడు.
రావణుని స్వయంగా ఎదుర్కొనడానికి లక్ష్మణుడు వెళుతుంటే, ఈ భృత్యుడుండగా మీకెందుకు శ్రమ అంటూ రావణున్ని ఎదుర్కొన్నాడు.
హనుమ అరచేతితో రావణున్ని గట్టిగా చరిచాడు.
ఆ దెబ్బకి రావణుడు, భూకంపానికి పర్వతాలు కంపించినట్టుగా కంపించి, "భేష్ వానరవీరా భేష్ పరాక్రమంలో శత్రువైనా ప్రశంసింపదగిన వాడివి’’ అని మనసారా ఆంజనేయుణ్ణి ప్రశంసించాడు.
విభీషణుడు రాత్రివేళ ఒక కొరివి కట్టెను తీసుకొని తిరుగుతూ జాంబవంతుని వద్దకు వచ్చారు.
గాయాలతో మూలుగుతున్న జాంబవంతుడు, "విభీషణా ఆంజనేయుడు బతికిఉన్నాడా? ఆంజనేయుడు ఒక్కడు బతికి ఉంటే చాలు, సర్వ సైన్యము హతమైనా బ్రతికి ఉన్నట్లే. హనుమ ఒక్కడు హతుడైతే సైన్యమంతా లేనట్లే" అని అన్నాడు. ఇంతకంటె ఆంజనేయుడి శక్తియుక్తులకు తార్కాణమేం కావాలి?
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment