💥మనం తెలుసుకోవాల్సిన జీవిత యధార్థం…!!

 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏


నమోస్తు దేవదేవాయ మహాదేవాయ వేధసే |

శంభవే స్థాణవే నిత్యం శివాయ పరమాత్మనే ||


💥మనం తెలుసుకోవాల్సిన జీవిత యధార్థం…!!


ధనము ఉన్నదని.. అనుచరణ గణం ఉన్నదని.. యౌవనం ఉన్నదని గర్వించే మానవ జన్మకు ఉపనిషత్తులు తెలిపిన చిన్న సూచన...


ఈ ప్రపంచంలోని లౌకిక సంపదలన్నీ అనిత్యమైనవి, భ్రమాత్మకమైనవి, ఈ క్షణిక మైన సంపదలను చూచుకొని మనిషి గర్విస్తాడు, అహంకరిస్తాడు, శాశ్వతమనుకొని భ్రమ పడతాడు…


ధన జన యౌవన గర్వం...!!!


కొందరికి ధన గర్వం...!!!


కావలసినంత ధనం ఉన్నదని, ఇళ్ళూ, వాకిళ్ళు, తోటలు, దొడ్లూ, భూములు, బ్యాంకు బ్యాలెన్సులూ ఉన్నాయని, ఎవరి దగ్గరా చేయి చాపనవసరం లేదని, గర్విస్తారు...


వీటిని చూసుకొని కళ్లు మూసుకొని పోతాయి, ధన పిశాచి పట్టిన వాడికి భార్యా, పిల్లలు, బంధువులు, మిత్రులు, ఇరుగు, పొరుగు అనే భావం ఉండదు…

అంతా డబ్బే, డబ్బున్నవారు మాత్రమే మిత్రులు, డబ్బులేని వారు శతృవులు, అన్నింటిని డబ్బుతోనే విలువ కడతారు...


ఎవరిని ఏ మోసం చేసి, ఏమి మాయమాటలు చెప్పి ఎలా డబ్భు, ధనం లాగాలనే నిత్య స్మరణ లో వుంటారు...


కొందరికి జన గర్వం...!!!


తన వెనుక ఎందరో ఉన్నారు అనుకుంటారు, తనవల్ల ఏదో ప్రయోజనం పొందాలని తనను ఆశ్రయించిన వారందరూ తనవారే అనుకుంటారు,

అందరూ తన శ్రేయోభిలాషులే అనుకుంటారు.


తన అధికారాన్ని చూచి తన చుట్టూ చేరిన వారిని చూచి గర్విస్తారు... కాని

"అధికారాంతము నందు చూడవలె ఆ అయ్య సౌభాగ్యముల్" అన్నట్లు అధికారం పోతే తెలుస్తుంది.

తన శ్రేయోభిలాషులు ఎవరో ఎంత మందో అప్పుడు తెలుస్తుంది...


ఇక కొందరికి యౌవన గర్వం...!!!


యవ్వనం శాశ్వతం అనుకుంటారు, శరీరంలోని బిగువులు ఎల్లప్పుడూ ఇలాగే ఉంటాయని అతడి/ఆమె గర్వం..

ఆ గర్వంలో అతడు/ఆమె మంచి చెడూ, గమనించరు…

కళ్లు మూసుకుపోయి ప్రవర్తిస్తారు, అహంభావంతో ఉంటారు, ముసలివాళ్ళను ఎగతాళి చేస్తారు...


హరతి నిమేషాత్కాలః సర్వం...!!!


ఈ మొత్తం ఒక్క క్షణంలో హరించిపోతాయి అని తెలిసుకోలేరు...

ఒక్క 10 సెకండ్లు భూకంపం వస్తే నీ ఇళ్ళూ, వాకిళ్ళు, ధన సంపదలూ అన్నీ నేలమట్టమైపోతాయి...

నాకేం.. కోట్ల ఆస్తి ఉంది, బ్రహ్మాండమైన భవనం ఉంది అని గర్వించిన వాడు మరు క్షణంలో ఎవరో దయతో పంపించే ఆహార పొట్లాల కోసం ఎగబడాల్సి వస్తుంది…


ఇప్పుడు ఏమైంది ఆ గర్వం.. నీ ధనం నిన్ను రక్షిస్తుందా.. నీ జనం నిన్ను రక్షిస్తారా.. అలాగే యౌవనం కూడా ఎప్పుడూ శాశ్వతంగా ఉండేది కాదు, వృద్ధాప్యం ఎక్కిరిస్తూ ప్రతీ జీవి మీదికి వచ్చి కూర్చుంటుంది…


కాబట్టి ఇదంతా మాయా జాలం అని, క్షణికమైనవని భావించు.

అంటే అనుభవించు తప్పులేదు, కాని వాటితో సంగభావం పెట్టుకోవద్దని ఉపనిషత్తులు తెలుపుతున్నాయి.


మా కురు ధన జన యౌవన గర్వం 

హరతి నిమేషాత్కాలః సర్వం |

మాయామయమిదమఖిలం హిత్వా

బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా ||


🌹తాత్పర్యం:

ధనము, పరివారము, యోవ్వనము కలవని గర్వముతో ఉండకుము. క్షణములో వీటినన్నిటిని కాలము హరించును. ఇదంతయు మాయామయమని, మిథ్యయని, అశాశ్వతమని గ్రహించి జ్ఞానివై పరబ్రహ్మమును పొందుము.


🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

సేకరణ... 💐🙏

⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️



Comments

Popular posts from this blog

వైశాఖ అమావాస్య శని జయంతి.

ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః 🌹🙏

🌺🏵️🌼పూలపండుగ.. బతుకమ్మ🌹🙏