💥🔥భోగి మంటలు🔥
⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏
సంక్రాంతి పండగ రాగానే తెలుగు ఇండ్లకు కొత్త శోభ వస్తుంది. ముగ్గులు.. భోగి మంటలు.. కోడి పందేలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దు ఆటలతో పండుగ వాతావరణం నెలకొంటుంది.
మూడు రోజుల పాటు కోలాహలంగా జరిగే సంక్రాంతి వేడుకల్లో భాగంగా మొదటి రోజు "భోగి మంటలు" వేయడంతో సంక్రాంతి పండుగ మొదలుపెడతారు.
💥🔥భోగి మంటలు🔥💥
💥శాస్త్రీయంగా:
సంక్రాంతి సమయంలో సూర్యుడు దక్షిణయానం నుంచి ఉత్తరాయానంలోకి ప్రవేశిస్తుంటాడు. ఈ సమయంలో ఉష్ణోగ్రతలు తగ్గి చలి ఎక్కువ అవుతుంది. ఈ చలిని తట్టుకునేందుకు భోగి మంటలు వేయడం మొదలైందని చెబుతారు.
💥ఆధ్యాత్మికంగా:
ఆధ్యాత్మిక విషయానికొస్తే దక్షిణయానంలో పడిన కష్టాలను తొలగించి, సంతోషాలను ప్రసాదించాలని భోగి మంటలను వేస్తారని కూడా చెబుతుంటారు.
భోగి మంటలు వేయడం వెనుక పురాణాల్లో ఒక కథ కూడా ప్రాచుర్యంలో ఉంది.
💥పురాణ గాధ:
వామన అవతారంలో వచ్చిన శ్రీమహావిష్ణువు బలి చక్రవర్తిని పాతాళానికి తొక్కేసిన తర్వాత అతనికి ఒక వరం ఇచ్చాడని చెబుతారు.
దీని ప్రకారం బలి చక్రవర్తిని పాతాళానికి రాజుగా ఉండమని.. సంక్రాంతి ముందు భూలోకానికి వచ్చి ప్రజలను ఆశీర్వదించాలని చెప్పాడట.
అందుకే సంక్రాంతి ముందు బలి చక్రవర్తికి ఆహ్వానం పలికేందుకు భోగి మంటలు వేస్తారని పురాణాలు చెబుతున్నాయి.
💥ఆరోగ్యపరంగా:
భగ అనే పదం నుంచి భోగి వచ్చిందని చెబుతుంటారు.
భగ అంటే మంటలు లేదా వేడిని పుట్టించడం అని అర్థం.
భోగి రోజు వేసే మంటలు కూడా వెచ్చదనం కోసం అని చాలామంది అనుకుంటారు. కానీ అవి కేవలం వెచ్చదనం కోసం మాత్రమే కాదు. ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది.
ధనుర్మాసంలో రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో ఇంటి ముందు పిడకలను కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది. సూక్ష్మజీవులు నశిస్తాయి.
భోగి మంటలు పెద్దగా రావడానికి రావి, మామిడి, మేడి వంటి ఔషధ చెట్ల బెరళ్లను కాలుస్తుంటారు. అవి కాలడానికి ఆవు నెయ్యిని వేస్తారు. ఇవన్నీ కూడా ఔషధ గుణాలు కలిగినవే.
వీటిని కాల్చినప్పుడు వచ్చిన గాలిని పీల్చడం వల్ల శరీరంలోని 72వేల నాడులు ఉత్తేజితం అవుతాయి. అందుకే భోగి రోజున భోగి మంటల్లో అందరూ పాల్గొనే సంప్రదాయం వచ్చిందని అంటారు.
సేకరణ... 💐🙏
⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️🕉️⚜️

Comments
Post a Comment