Posts

Showing posts from September, 2023

ఇతిహాసాల్లో సూర్యవైభవం...

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥 ఇతిహాసాల్లో సూర్యవైభవం... ఇతిహాస, పురాణాల్లోనూ సూర్య మహిమ అనేక చోట్ల కనిపిస్తుంది. "యాజ్ఞవల్క్య మహర్షి" సూర్యోపాసన ద్వారా "వాజసనేయ సంహిత" (శుక్ల యజుర్వేదం) పొందాడు. 🍁🍁🍁🍁🍁 💥#పురాణగాథ: నాలుగు భాగాలుగా విభజించిన వేదాలని నేర్పడానికి నలుగురు శిష్యుల్ని ఎంచుకున్నారు వేదవ్యాస మహర్షి.  "పైలవ" మహర్షితో ఋగ్వేదం, "వైశంపాయన" మహర్షితో యజుర్వేదం, "జైమిని" మహర్షితో సామవేదం, "సుమంత" మహర్షితో అథర్వణవేదం అధ్యయనం చేయించారు. ఈ మహర్షులందరు తాము నేర్చుకున్న వేదభాగాన్ని తమ తమ శిష్యులకి నేర్పించారు. ఆ శిష్యులు తాము నేర్చుకున్న వేదాన్నిమళ్ళీ తమ శిష్యులకి నేర్పించడంతో వేదవిద్య క్రమంగా వ్యాప్తిలోకి వచ్చింది. 💥వైశంపాయన మహర్షి తను నేర్చుకున్న వేద భాగాల్లో ఒకటైన యజుర్వేదాన్ని "యాజ్ఞవల్క్యుడు" మొదలైన శిష్యులకి నేర్పించారు. ఒకరోజు భారతదేశంలో ఉన్న మహర్షులందరు మేరు పర్వతం మీద ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అందరూ తప్పకుండా ఆ సమావేశానికి హాజరవాలని, ఎవరేనా రాకప...

💥పుష్కరిణి స్నానం.. సకల పాపహరణం.

Image
 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥పుష్కరిణి స్నానం.. సకల పాపహరణం. శ్రీవారి పుష్కరిణి స్నానం, శ్రీనివాసుని దర్శన భాగ్యం, కటాహతీర్థ పానం– ఈ మూడూ త్రైలోక్య దుర్లభాలని ప్రసిద్ధి. దశరథ మహారాజు పుష్కరిణి తీర్థాన్ని సేవించి స్వామిని వేడుకోవటంతో సాక్షాత్తూ శ్రీమహావిష్ణువునే పుత్రునిగా పొందే భాగ్యం పొందాడు. కుమారస్వామి తారకాసురుని సంహరించడంతో వచ్చిన బ్రహ్మహత్యా పాతకాన్ని ఈ పుష్కరిణిలో స్నానమాచరించి పోగొట్టుకున్నాడట. ఎందరెందరో భక్తులు ఇందులో స్నానమాచరించి రోగ రుగ్మతలను పోగొట్టుకుని, భోగభాగ్యాలు పొందారని పురాణాలు చెబుతున్నాయి. 🍁🍁🍁🍁🍁 💥దేవదేవుడు కొలువైన తిరుమల కొండలు ముక్కోటి తీర్థాలకు నిలయాలు. శేషాచల కొండలలో దాదాపు 108 పుణ్యతీర్థాలు ఉన్నట్లు పురాణాల కథనం. ఈ108 తీర్థాలలోని పవిత్రజలాలు అన్నీ అంతర్గతంగా శ్రీవారి పుష్కరిణి తీరంలో కలుస్తాయి. అందుచేతనే శ్రీవారి పుష్కరిణి స్నానం "సకల పాప హరణం" అంటారు. అయితే భక్తులకు సాధారణంగా శేషాచల ఏడుకొండలలోని ముఖ్యతీర్థాలు మాత్రమే తెలుసు. కానీ సాక్షాత్తూ స్వామివారి గర్భాలయం భూ అంతర్భాగంలో ప్రవహించే దేవనదుల గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఈ ...

శ్రీ సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం:

Image
 ⚜️🕉️🚩ఓం సరస్వత్యై నమః🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ క్షోణితలంబునన్ నుదురు సోకక  మ్రొక్కినుతింతు సైకత శ్రోణికి జంచరీకచయ సుందరవేణికి రక్షితామర శ్రోణికి దోయజాత  భావచిత్త  వశీకరణైక వాణికిన్ వాణికి వక్షదామశుక వారిజపుస్తక రమ్యపానికిన్ 🌹నల్లని అందమైన శిరోజాలు గల తల్లికి, దేవతలను రక్షించే ఆమెకి, బ్రహ్మదేవుని మనస్సును వశపరుచుకున్న దేవికి, రుద్రాక్షమాల, చిలుక,  పద్మం, పుస్తకాన్ని చేతులలో ధరించు వాణికి, సరస్వతీ దేవికి నా నుదురు నేలను తాకేటట్లు వంగి, భక్తితో నమస్కరిస్తాను.    🍁🍁🍁🍁🍁 💥అన్ని సిరులకి మూలాధారం విద్య. సమస్త విద్యల్ని అనుగ్రహించే తల్లి, అన్ని కళలకు శాస్త్రాలకు, వృత్తులకు, మేధస్సుకు, వాక్బుద్దికి అన్నింటికీ అధిష్టాన దేవత సరస్వతి దేవి. శ్వేత వస్త్రాలను ధరించినదై హంస వాహనంతో తెల్లటి తామర పుష్పంపై కొలువుతీరి ఉంటుంది. నాలుగు చేతులు నాలుగు దిక్కుల్లో వ్యాపించిన ఆ తల్లి శక్తిని సర్వవ్యాపకత్వాన్ని సూచిస్తాయి. ఎడమ చేతి లోని పుస్తకం సమస్త భౌతిక విద్యలకు సంకేతమని తెలియచేస్తుంది. కుడి చేతిలోని అక్షమాల సమస్త ఆధ్యాత్మిక విద్యలని ఆత్మ జ్ఞానాన్ని తెలియజేస్తుంది. హస్త భూషణ...

అష్టలక్ష్మి ధ్యానశ్లోకాః

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మి దేవ్యై నమః 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥ప్రార్థన: అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విష్ణు వక్షఃస్థలారూఢే భక్తమోక్ష ప్రదాయిని శంఖచక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే జగన్మాత్రేచ మోహిన్యై మంగళం శుభమంగళం!! 🍁🍁🍁🍁🍁 💥 అష్టలక్ష్మి ధ్యానశ్లోకాః 🌷శ్రీ ఆది లక్ష్మీః - ద్విభుజాం చ ద్వినేత్రాం చ సాభయాం వరదాన్వితామ్ | పుష్పమాలాధరాం దేవీం అంబుజాసన సంస్థితామ్ || పుష్పతోరణసంయుక్తాం ప్రభామండలమండితామ్ | సర్వలక్షణసంయుక్తాం సర్వాభరణభూషితామ్ || పీతాంబరధరాం దేవీం మకుటీచారుబంధనామ్ | సౌందర్యనిలయాం శక్తిం ఆదిలక్ష్మీమహం భజే || 🌷శ్రీ సంతాన లక్ష్మీః - జటామకుటసంయుక్తాం స్థిరాసన సమన్వితామ్ | అభయం కటకం చైవ పూర్ణకుంభం కరద్వయే || కంచుకం సన్నవీతం చ మౌక్తికం చాపి ధారిణీమ్ | దీప చామర హస్తాభిః సేవితాం పార్శ్వయోర్ద్వయోః || బాలసేనాని సంకాశాం కరుణాపూరితాననామ్ | మహారాజ్జీం చ సంతానలక్ష్మీమిష్టార్థసిద్ధయే || 🌷శ్రీ గజ లక్ష్మీః - చతుర్భుజాం మహాలక్ష్మీం గజయుగ్మసుపూజితామ్ | పద్మపత్రాభనయనాం వరాభయకరోజ్జ్వలామ్ || ఊర్ధ్వం కరద్వయే చాబ్జం దధతీం శుక్లవస్త్రకమ్ | పద్మాసనే సుఖాసీనాం గజలక్ష్మీమహం భజే || 🌷శ...

💥అయ్యప్ప దీక్ష...

Image
 ⚜️🕉️🚩స్వామి శరణం – అయ్యప్ప శరణం🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥అయ్యప్ప దీక్ష. .. కోట్లకు అధిపతి అయినా, కార్మికుడైనా... నాయకుడైనా, శ్రామికుడైనా... దీక్ష తీసుకున్న మరుక్షణం నుంచి మనిషి నియమధారి అవుతాడు. చన్నీటి స్నానం, నల్లనివస్త్రాలు, తులసి, స్ఫటిక మాలలు, విభూది, గంధం ధరించడం, కటిక నేలపై శయనించడం, ఏకభుక్తం, పాదరక్షల్ని విడిచిపెట్టడం, బ్రహ్మచర్యాన్ని పాటించడం, త్రికాలాల్లోనూ స్వామి అర్చన, తోటివారందరినీ స్వామీ అని సంబోధించడం... ఇలా అన్ని రకాలుగా మనిషి దైవంగా మారే సాధన కనిపిస్తుంది.  అయ్యప్ప దీక్ష కేవలం 40 రోజుల పాటు గడిపే నియమబద్ధ జీవితం కాదు. అది అద్వైతానికి దిక్సూచి. ఆత్మ, పరమాత్మల సంయోగానికి వారిధి. వేదాంతసారమైన ఉపనిషద్వాక్యాల్ని జీవనసారంగా మలుచుకునేందుకు మనిషి తనకు తానుగా పాడుకునే ఆత్మ చైతన్యగీతిక. ఎన్నో అనుభవాలు. మరెన్నో అనుభూతులు. అన్నీ కలిస్తే... మహోన్నతమైన పరివర్తనకు అంకురార్పణే అయ్యప్ప దీక్షాధారణ. 40 రోజుల దీక్ష పూర్తిచేసుకుని శబరిమల స్వామి ఆలయాన్ని చేరుకుని, పదునెట్టాంబడి ఎక్కగానే ఆలయం ముందుభాగంలో ‘#తత్త్వమసి’ అనే మహావాక్యం కనిపిస్తుంది. ఇది వేదసారం, ఉపనిషద్బోధ. తత్‌, త్వం, అసి...

ఓం నమో భగవతే దక్షిణామూర్తయే

Image
 ⚜️🕉️🚩 ఓం నమో భగవతే దక్షిణామూర్తయే !🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ రాహుగ్రస్తదివాకరేందుసదృశో మాయాసమాచ్ఛాదనాత్ సన్మాత్రః కరణోపసంహరణతో యోఽభూత్సుషుప్తః పుమాన్ ప్రాగస్వాప్సమితి ప్రబోధసమయే యః ప్రత్యభిజ్ఞాయతే తస్మై శ్రీగురుమూర్తయే నమ ఇదం శ్రీదక్షిణామూర్తయే!! 🌹తాత్పర్యము: రాహువు వలన గ్రహణ సమయమున కాంతి తగ్గినట్టు కనిపించినా, సూర్య తేజము ఎల్లప్పుడూ అంతే ప్రకాశముగా  యుండును. అటులనే, బుద్ధి యొక్క పూర్ణ శక్తి తన శక్తిని కోల్పోకుండా, కేవలము నిద్రావస్థ యందు నిద్రాణమై యుండును. ఇదే విధముగా, ఆత్మ ప్రకాశము కేవలం మాయచే కప్పబడి యుండును. ఎలాగైతే నిద్రనుండి మేల్కొనిన వ్యక్తి తాను అంతకు ముందు నిద్రలోయున్నాను, మరియు ఆ నిద్రలోని స్వప్నములు నిజము కావని గ్రహిస్తాడో,  అలాగే, ఆత్మ ప్రకాశము పొందిన వ్యక్తి తన అంతకు మునుపటి అజ్ఞాన స్థితిని అసత్యముగా గ్రహిస్తాడు. ఎవరి అనుగ్రహము వలన ఈ ఆత్మ ప్రకాశము కలుగునో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి  నా నమస్కారములు. 🍁🍁🍁🍁🍁 💥ఆధ్యాత్మిక జీవిత సాఫల్యానికి.. ఓం నమో భగవతే దక్షిణామూర్తయే! గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం | నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః |...

💥శ్రావణ పూర్ణిమ.. హయగ్రీవజయంతి💥

Image
 ⚜️🕉️🚩 ఓం హయగ్రీవాయ నమః🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥శ్రావణ పూర్ణిమ.. హయగ్రీవజయంతి💥 జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే॥ 🌹అనంతమైన, ఆనందమయమైన జ్ఞానానికి అధిపతి, స్వచ్ఛమైన స్ఫటికం వంటి ఆకృతి కలిగి, సకల విద్యలకు అధిదేవత అయిన హయగ్రీవుడికి నమస్కరిస్తున్నాను.. అని పై శ్లోకానికి అర్థం. 🍁🍁🍁🍁🍁 💥కాలానికి అందనివాడు.. సృష్టికి ముందున్నవాడు హయగ్రీవుడు. బ్రహ్మదేవుడికి సృష్టి చేయడానికి వేదాలు అవసరం. ఆ వేదాల సంరక్షణ కోసం విష్ణుమూర్తి శ్రావణ పౌర్ణమినాడు హయగ్రీవుడిగా అవతరించాడు. తెల్లని రూపం వాడు, జ్ఞాన-అజ్ఞానాల్ని తేటతెల్లం చేసే చల్లని దేవుడు హయగ్రీవుడు. శ్రీమహావిష్ణువు ధరించిన అవతారాల్లో హయగ్రీవ అవతారం ఒకటి. ఈ అవతారంలో స్వామి వేదాలను ఉద్ధరించారు. అందువల్ల, వేదాలతోపాటు సమస్తమైన వాఙ్మయానికి, జ్ఞానానికి హయగ్రీవుడు అధిపతి అయ్యాడు. ఈ అవతారంలో స్వామి గుర్రం ముఖం, మానవ శరీరం కలిసిన రూపంలో దర్శనమిస్తాడు. స్వామి వామాంకం మీద లక్ష్మీదేవి ఆసీనురాలై ఉంటుంది.  స్వామిది తెల్లటి శరీర ఛాయ. నాలుగు చేతుల్లో శంఖం, చక్రం, చిన్ముద్ర, పుస్తకాలను ధరించి భక్తులను అనుగ్రహిస్తూ ఉ...

💥ఋణ విమోచన శ్రీ నృసింహ స్తోత్రం💥

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ లక్ష్మినృసింహ స్వామినే నమః🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥ఋణ విమోచన శ్రీ నృసింహ స్తోత్రం💥 ధ్యానమ్ - వాగీశా యస్య వదనే లక్ష్మీర్యస్య చ వక్షసి | యస్యాస్తే హృదయే సంవిత్తం నృసింహమహం భజే || అథ స్తోత్రమ్ - దేవతా కార్య సిద్ధ్యర్థం సభా స్తంభ సముద్భవమ్ | శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 1 || లక్ష్మ్యాలింగిత వామాంగం భక్తానాం వరదాయకమ్ | శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 2 || ఆంత్ర మాలాధరం శంఖ చక్రాబ్జాయుధ ధారిణం | శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 3 || స్మరణాత్ సర్వపాపఘ్నం కద్రూజవిషనాశనమ్ | శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 4 || సింహనాదేన మహతా దిగ్దంతిభయనాశనమ్ | శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 5 || ప్రహ్లాద వరదం శ్రీశం దైత్యేశ్వర విదారిణమ్ | శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 6 || క్రూరగ్రహైః పీడితానాం భక్తానామభయప్రదమ్ | శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 7 || వేద వేదాంత యజ్ఞేశం బ్రహ్మ రుద్రాది వందితమ్ | శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || 8 || య ఇదం పఠతే నిత్యం ఋణమోచన సంజ్ఞితమ్ | అనృణే జాయతే సత్యో ధనం శీఘ్రమవాప్నుయాత్ || 9 || సర్వస...

⚜️🕉️🚩శ్రీవల్లీదేవసేనాపతే శ్రీసుబ్రహ్మణ్య నమోస్తుతే🌹

Image
 ⚜️🕉️🚩శ్రీవల్లీదేవసేనాపతే శ్రీసుబ్రహ్మణ్య నమోస్తుతే🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ కార్తికేయం మహాభాగం | మయూరోపరిసంస్థితం || తప్తకాంచనవర్ణాభం | శక్తిహస్తం వరప్రదం || ద్విషడ్భుజం శత్రుహంతారం | నానాలంకారభూషితం || ప్రసన్నవదనం దేవం | కుమారమ్ పుత్రదాయకమ్ || 🍁🍁🍁🍁🍁 💥సుబ్రహ్మణ్యస్వామిని నాగదేవత స్వరూపంగా ఎందుకు పూజిస్తారు? సుబ్రహ్మణ్యేశ్వరుడు మన శరీరంలోని కుండలిని శక్తికి సంపూర్ణమైన సంకేతం. మనలో కుండలిని రూపంలోన ఒదిగిన సుబ్రహ్మణ్యుడే పుట్టలో ఒదిగి ఆరాధనలు అందుకుంటున్న మహా సర్పరూపం. మనము మార్గ శీర్ష శుద్ధ షష్ఠి నాడు పుట్టలో పాలని పోస్తాము. పుట్ట ఎవరో కాదు మానవ శరీరమే. మనము కూర్చొనప్పుడు వెనుక నుండి చూస్తే మన విశాలమైన క్రింద భాగం పుట్ట అడుగు భాగం. పోను పోను తల దగ్గరికి సన్నగా వెళ్లే విధానంలోనే పుట్ట ఆకారం ఉంటుంది. ఆ పుట్ట పై ఉండే చిల్లు అది శిరస్సు మధ్యలో ఉండే బ్రహ్మ రంద్రానికి సంకేతం. పాలు ఙ్ఞానమునకు సంకేతం. అందుకే పుట్టలో పాలు పోయడం అంటే శరీరం నిండుగా ఙ్ఞానమును నింపడం అని అర్థం. అంటే ఏది చెయ్యకూడదో, చేయవచ్చునో దాన్ని నింపడం. కుండలం అంటే పాము చుట్ట అని అర్థం. పాము చుట్టవేసుకొని కూర్చుంటుంది. సాగద...

💥శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం 💥

Image
 ⚜️🕉️🚩 శ్రీ ఆంజనేయం🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రం 💥       (విభీషణ కృతం) ఓం అస్య శ్రీ ఆపదుద్ధారక హనుమత్ స్తోత్ర మహామంత్ర కవచస్య, విభీషణ ఋషిః, హనుమాన్ దేవతా, సర్వాపదుద్ధారక శ్రీహనుమత్ప్రసాదేన మమ సర్వాపన్నివృత్త్యర్ధే, సర్వకార్యానుకూల్య సిద్ధ్యర్థే జపే వినియోగః | #ధ్యానం | వామే కరే వైరిభిదాం వహంతం శైలం పరే శృంఖలహారిటంకమ్ దధానమచ్చచ్చవియజ్ఞసూత్రం భజే జ్వలత్కుండల మాంజనేయమ్ || 1 || సంవీత కౌపీనముదంచితాంగుళిం సముజ్జ్వలన్మౌంజిమథోపవీతినమ్, సకుండలం లంబిశిఖాసమావృతం తమాంజనేయం శరణం ప్రపద్యే || 2 || ఆపన్నాఖిలలోకార్తిహారిణే శ్రీ హనూమాతే ఆకస్మాదాగతోత్పాదనాశనాయ నమోనమః || 3 || సీతావియుక్త శ్రీరామ శోకదుఃఖ భయాపహ తాపత్రితయసంహారిన్! ఆంజనేయ! సమోస్తుతే || 4 || ఆధివ్యాధి మహామారి గ్రహపీడా పహారిణే, ప్రాణాపహార్త్రే దైత్యానాం రామప్రాణాత్మనే నమః || 5 || సంసార సాగరావర్త కర్తవ్యభ్రాంత చేతసామ్, శరణాగతమర్త్యానాం శరణ్యాయ నమోస్తుతే || 6 || వజ్ర దేహాయ కాలాగ్ని రుద్రాయామితతేజసే, బ్రహ్మాస్త్రస్తం భనాయాస్మై నమః రుద్రమూర్తయే || 7 || రామేష్టం కరుణాపూర్ణం హనూమంతం భయపహమ్ శత్రునాశకరం భీమం...

💥శివాష్టకం - తాత్పర్యము..

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 🔱 హర హర మహాదేవ శంభో శంకర🔱 🏵️🌼🏵️🌼🏵️ 💥శివాష్టకం - తాత్పర్యము.. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశానమీడే 🌹తాత్పర్యము: ప్రభువు, మా ప్రాణ నాథుడు, జగత్పతి, విశ్వనాథుడు, జగన్నాథుడు అయిన విష్ణువునకు నాథుడు, ఎల్లప్పుడూ ఆనందంలో అలరు వాడు, జగమంతటికి ప్రకాశాన్ని కలిగించే వాడు, జీవులకు, భూతములకు, అన్నిటికి నాథుడయిన శివుని, శంకరుని, శంభుని నేను ధ్యానిస్తున్నాను. గళే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాధిపాలం జటాఝూటగంగోత్తరంగైర్విశిష్యం శివం శంకరం శంభుమీశానమీడే 🌹తాత్పర్యము: మెడలో కపాలములు ధరించిన వాడు, శరీరము అంతా సర్పములు కలిగిన వాడు, యముని సంహరించిన వాడు, గణేశునికి అధిపతి,  గంగానదీ ప్రవాహము ధరించుట వలన విశాలమైన జటా ఝూటములు కలిగిన శివుని, శంకరుని, శంభుని నేను ధ్యానిస్తున్నాను. ముదామాకరం మండలం మండయంతం మహామండలం భస్మభూషాధరంతం అనాదిహ్యపారం మహామోహహారం శివం శంకరం శంభుమీశానమీడే 🌹తాత్పర్యము: ప్రపంచానికి ఆనందం పంచే వాడు, అంతటా ఉన్నవాడు, సర్వము తనే అయిన వాడు, భస్మము శరీరమంతా కలిగిన వాడు, ఆది లేని...

💥లయకారుడు.. శివుడు

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 🔱 హర హర మహాదేవ శంభో శంకర🔱 🏵️🌼🏵️🌼🏵️ వందే సర్వజగ ద్విహార మతులం వందే కరిత్వగ్ధరం వందే దేవ శిఖామణిం శశినిభం వందే హరేర్వల్లభం వందే పర్వత కన్యకార్థ వపుషం వందే పరం చిన్మయం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం !! 💥లయకారుడు.. శివుడు. "జన్మించిన ప్రాణి మరణించక తప్పదు. మరణించిన తర్వాత జన్మించక తప్పదు" ఇది ప్రకృతి ధర్మం. ఈ ధర్మానికి ప్రధాన రక్షకులు ముగ్గురు. వాళ్లే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. బ్రహ్మ- సృష్టి ధర్మానికి రక్షకుడు. ప్రాణికోటిని సృష్టించడమే ఈయన ధర్మం. విష్ణువు- సృష్టిని పోషించి, రక్షించడమే ఈయన ధర్మం. అందుకోసమే ఎన్నో అవతారాలెత్తాడు.  మహేశ్వరుడు- లయకారకత్వం ఈయన ధర్మం. లయం’ అంటే ‘ నాశనం’ అని ఓ తప్పుడు అర్ధాన్ని చెప్పేస్తారు. కానీ ‘లయం’ అంటే లీనం చేసుకోవడం, లేదా తనలో కలుపుకోవడం.  ఈ సృష్టిచైతన్యాన్ని లయం చేసుకోవడం అంటే మాటలా? దానికి ఎంతో తపఃశక్తి కావాలి. అందుకే శివుడు ఎప్పుడూ తపస్సమాధి స్థితిలో ఉంటాడు. సృష్టికి, రక్షణకు నాశనం ఉంది. ‘లయం’కు నాశనం లేదు. అది శాశ్వతం. భౌతికంగా కనిపించేది ప్రతీదీ నాశనం అయ్యేవే. అభౌతికమైనవే శాశ్వతంగా ఉండేవి. ఏది...

"రామో విగ్రహవాన్ ధర్మః"

Image
 ⚜️🕉️🚩 శ్రీరామ జయ రామ జయ జయ రామ 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ రామం లక్ష్మణ పూర్వజం రఘువరం సీతాపతిం సుందరం కాకుత్స్థం కరుణార్ణవం గుణనిధిం విప్రప్రియం ధార్మికమ్ । రాజేంద్రం సత్యసంధం దశరథతనయం శ్యామలం శాంతమూర్తిం వందే లోకాభిరామం రఘుకుల తిలకం రాఘవం రావణారిమ్ ॥ 🌹మనోహరుడు, లక్ష్మణుని అగ్రజుడు, సీతాపతి, రఘుకులములో ఉత్తముడు, కరుణా సాగరుడు, సర్వ సులక్షణ సంపన్నుడు, బ్రాహ్మణులకు ప్రియుడు, ధర్మ రక్షకుడు, సత్య సంధుడు, రాజేంద్రుడు, దశరథ పుత్రుడు, నల్లని వాడు, శాంతమూర్తి, రావణుని సంహరించిన వాడు, లోకాభిరాముడు అయిన రామునికి వందనములు. 🍁🍁🍁🍁🍁 💥ఒక మంచి సోదరుడు, ఒక మంచి కుమారుడు, ఒక మంచి పాలకుడు, ఒక మంచి మిత్రుడు, ఒక మంచి శిష్యుడు, ఒక మంచి నాయకుడు, అసమాన వీరుడు ఇలా ఎన్నో ఉత్తమ పార్శ్వాలు దర్శనమిస్తాయి శ్రీరామునిలో... మాధవుడే మానవునిగా జన్మించినా, పరిపూర్ణ మానవునిగా, మానవాళికి వెలుగుచూపే దారిదివ్వె.  నాటికీ, నేటికీ, ఏనాటికీ రాముని శీలసంపద, గుణసంపత్తి, అగాధమైన అమృతసాగరం.  సర్వకాలాలకూ, సర్వదేశాలకూ ఒక దీపస్తంభం రాముని వ్యక్తిత్వం. జన్మతః రాక్షసుడైనా రామ బాణ స్పర్శతో విశేషమైన పరివర్తనకు లోనైన మారీచుడు...

💥తం సూర్యం ప్రణమామ్యహమ్...

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ సూర్యనారాయణ స్వామినే నమః 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥తం సూర్యం ప్రణమామ్యహమ్... యేవ సూర్య జ్యొతిషా బాధసే తమో జగచ్చ విశ్వముదియర్షి భానునా తేనాస్మద్విశ్వామనిరామనాహుతి మపామీవామప దుష్వస్న్యం సువ  – (ఋగ్వేదం) 🌹"ఓ సూర్య భగవానుడా నీవు నీ తేజస్సుతో ఏవిధంగా అంధకారాన్ని బంధిస్తున్నావో, ఏవిధంగా జగత్తుకు నీ దీప్తి వలన తేజస్సును ఇస్తున్నావో, అదేవిధంగా మా రోగాలను సర్వనాశనం చేసి, చెడు స్వప్నాలను మాకు దూరం చేయగలవు” - పై మంత్రం ద్వారా సూర్యకాంతి సర్వరోగనివారిణి అని మనకు తెలుస్తోంది. 🍁🍁🍁🍁🍁 💥అదితి, కశ్యపులు సూర్యశక్తినుపాసించారు. సూర్యుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. అదితి దేవతలను కాపాడమన్నది. సూర్యశక్తి ఆమె గర్భంలో చేరింది. ఉపవాసాలు చేసింది.  వారించిన ముని మాటలతో అదితి గర్భాండమును పరిత్యజించగా, ఆ తేజం వలన నిప్పులు చెలరేగాయి. ముని వేద మంత్రాలతో స్తుతించాడు. అండం పగిలి దానినుండి ఒక సుదర్శన బాలుడు పుట్టి సూర్య నామముతో దేవతల నాయకుడై విజయం అందించాడు. విశ్వ నియంతయైనాడు. అనంతకోటి కిరణుడు- తేజమయుడు- దినకరుడు- వే వెలుగుల జ్యోతిర్మయుడు- త్రైలోక్య చూడామణి- దినమణి- ఆదిత్యుడు- శుభదాయక...

🌹🌹దశావతారస్తోత్రం🌹🌹

Image
 ⚜️🕉️🚩 ఓం నమో నారాయణాయ 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥"దశావతార స్తోత్రం" శ్రీ మహావిష్ణువును కీర్తించే అద్భుతమైన స్తోత్రం. ఈ స్తోత్రాన్ని  విన్నా, చదివినా నారాయణ అనుగ్రహం లభించి ఆయురారోగ్యాలు, సిరి సంపదలు లభిస్తాయి అని పురాణాలలో చెప్పబడింది. 🍁🍁🍁🍁🍁 🌹🌹దశావతారస్తోత్రం🌹🌹 నామస్మరణాదన్యోపాయం న హి పశ్యామో భవతరణే | రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే || వేదోద్ధారవిచారమతే సోమకదానవసంహరణే మీనాకారశరీర నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ || 1 || రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే | రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే || మంథానాచలధారణహేతో దేవాసుర పరిపాల విభో కూర్మాకారశరీర నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ || 2 || రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే | రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే || భూచోరకహర పుణ్యమతే క్రీఢోద్ధృతభూదేశహరే క్రోఢాకార శరీర నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ || 3 || రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే | రామ హరే కృష్ణ హరే తవ నామ వదామి సదా నృహరే || హిరణ్యకశిపుచ్ఛేదనహేతో ప్రహ్లాదాఽభయధారణహేతో నరసింహాచ్యుతరూప నమో హరి భక్తం తే పరిపాలయ మామ్ || 4 || రామ హరే కృష్ణ హర...

💥సర్వరక్షాకరం... శ్రీవారి "చక్రస్నానం"

Image
 ⚜️🕉️🚩 ఓం నమో వేంకటేశాయ 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥సర్వరక్షాకరం... శ్రీవారి "చక్రస్నానం" చక్రం పూర్ణత్వానికి ప్రతీక. ఈ విశ్వమంతా చక్రమండలమయమే. ఏడేడు పద్నాలుగు లోకాలు అన్నీ చక్రాలే. వాయు, వహ్ని, గగన, జలమండలాలన్నీ చక్రాలే!  ఒక్కమాటలో చెప్పాలంటే అండపిండ బ్రహ్మాండాలన్నీ చక్రాలే. ఆ చక్రాన్ని ధ్యానించి, అభిషేకార్చనలతో సేవిస్తే శాంతి సౌఖ్యాలు చేకూరతాయని పురాణోక్తి. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో తొమ్మిదవరోజు ఉదయం భూదేవీ సమేత మలయప్పస్వామివారిని సుదర్శన చక్రత్తాళ్వార్‌తో వరాహస్వామివారి ఆలయ ప్రాంగణంలో వేంచేపు చేయించి, పంచామృత స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. తర్వాత "#శ్రీచక్రత్తాళ్వార్‌"ను అంటే సుదర్శన చక్రాన్ని స్వామి పుష్కరిణిలో ముంచి, పవిత్రస్నానం చేయిస్తారు. అదే సమయంలో లక్షలమంది భక్తులు కూడా శ్రద్ధాభక్తులతో శిరఃస్నానం చేస్తారు. ఆ సమయంలో శ్రీవారి దివ్యమూర్తుల శక్తి, శ్రీవారి పంచాయుధాల్లో ప్రముఖమైన శ్రీసుదర్శనాయుధశక్తి పుష్కరిణి జలంలో సూక్ష్మరూపంతో మిళితమై ఉంటాయి. అందుకే ఈ చక్రస్నానం సృష్టి చక్రానికంతటికీ అత్యంత పవిత్రమైంది. దీనికే అవభృథస్నానమని కూడా పేరు. శ్రీవారి దివ్యాయుధాలలో చక్రాయ...

🌹🌹💥శ్రీ మహాలక్ష్మీ అష్టకం💥🌹🌹

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యై నమః 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 🌹🌹💥శ్రీ మహాలక్ష్మీ అష్టకం💥🌹🌹 ఇంద్ర ఉవాచ - నమస్తేఽస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే । శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 1 ॥ నమస్తే గరుడారూఢే కోలాసుర భయంకరి । సర్వపాపహరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 2 ॥ సర్వజ్ఞే సర్వవరదే సర్వ దుష్ట భయంకరి । సర్వదుఃఖ హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 3 ॥ సిద్ధి బుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని । మంత్ర మూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 4 ॥ ఆద్యంత రహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి । యోగజ్ఞే యోగ సంభూతే మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 5 ॥ స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహోదరే । మహా పాప హరే దేవి మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 6 ॥ పద్మాసన స్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి । పరమేశి జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 7 ॥ శ్వేతాంబరధరే దేవి నానాలంకార భూషితే । జగస్థితే జగన్మాతః మహాలక్ష్మి నమోఽస్తు తే ॥ 8 ॥ ఫలశృతి: మహాలక్ష్మష్టకం స్తోత్రం యః పఠేద్ భక్తిమాన్ నరః । సర్వ సిద్ధి మవాప్నోతి రాజ్యం ప్రాప్నోతి సర్వదా ॥ ఏకకాలే పఠేన్నిత్యం మహాపాప వినాశనమ్ । ద్వికాలం యః పఠేన్నిత్యం ధన ధాన్య సమన్వితః ॥ త్రికా...

🌹🌹సర్వశుభప్రదం "వరలక్ష్మీ వ్రతం"🌹🌹

Image
 ⚜️🕉️🚩ఓం వరలక్ష్మ్యై నమః🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 🌹 🌹సర్వశుభప్రదం "వరలక్ష్మీ వ్రతం" 🌹🌹 సౌభాగ్యానికి, సకల భోగభాగ్యాలకు, అష్టైశ్వర్యాలకు, లక్ష్మీ కటాక్షం పొందటానికి ఉత్తమమైన వ్రతం "వరలక్ష్మీ వ్రతం" వర అంటే శ్రేష్ఠమైనది, కోరుకున్నది. ఉత్తమమైన వరాలు వరలక్ష్మీ వ్రతం ప్రసాదిస్తుంది. వరలక్ష్మీ వ్రతం మహత్తరమైన వ్రతం. మహోత్కృ ష్టమైన వ్రతం. శ్రావణ పౌర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడే లక్ష్మీదేవి భృగు మహర్షి యింట జన్మించిందని పురాణాల ఆధారంగా చెబుతారు. ఈ కారణంగా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని జరుపుకుంటారు. వరలక్ష్మీ వ్రతానికి తిథి, నక్షత్ర, సమయాలతో సంబంధం లేదు. వారమే ప్రధానం. ఏదైనా కారణం చేత పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వీలవని వారు, శ్రావణ మాసంలోని ఏదో ఒక శుక్రవారం చేసుకోవచ్చును. భక్తి ప్రపత్తులతో ఎవరు వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తారో, వారికి లక్ష్మీదేవి కటాక్షం, సిరిసంపదలు కలుగుతాయి. సంపదలు అంటే కేవలం ధనం మాత్రమే కాదు.  అష్టలక్ష్ములు అనబడే ఎనిమిది శక్తులైన ఆదిలక్ష్మి, ధాన్య లక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక...

⚜️🕉️🚩 ఓం శ్రీ గురు దత్తాయ నమః 🌹🙏

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ గురు దత్తాయ నమః 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ శరణాగతదీనార్త పరిత్రాణపరాయణమ్ । నారాయణం విభుం వందే స్మర్తృగామి సనోవతు ॥  💥గురు పరంపరకు ఆద్యుడు - #దత్తాత్రేయుడు దత్తాత్రేయుడిని స్మరణకు తెచ్చుకోగానే, మూడు ముఖాలు, ఆరు చేతులు, వెనుక కామధేనువు, ఔదుంబర (మేడి) వృక్షం, తన ముందు నాలుగు శునకాలు గల స్వరూపం మదిలో మెదలుతుంది.  త్రిమూర్తుల ప్రతిరూపం, వారికి ఆధారమైన ప్రజ్ఞానమే దేహంగా, షట్ శాస్త్రాలే చేతులుగా, నాలుగుపాదాలపై నిలిచిన ధర్మమే గోవుగా, అవిద్యను నిర్మూలించే నాలుగు వేదాలే శునకాలుగా, విశ్వశాంతియే ఔదుంబర వృక్షంగా దత్తోపాసకులు భావిస్తారు. దత్తాత్రేయుడే గురుపరంపరకు ఆద్యుడని ఆయన ఉపాసకులు విశ్వసిస్తారు. స్వయంగా తండ్రికి జ్ఞానబోధ చేయడం ద్వారా ఆయన గురుపరంపరకు ఆద్యుడయ్యాడని అంటారు. అనంతర కాలంలో దత్తప్రభువు.. కార్తవీర్యార్జునుడు, దలాదనుడు మొదలైన వారికి ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించాడని దత్తపురాణం చెబుతుంది. 💥స్మరించిన క్షణమే.. స్వామి అమిత కరుణామూర్తి అన్నది దత్త భక్తుల దృఢ నమ్మకం. దత్తాత్రేయుడు స్మర్తృగామి.. అంటే, స్మరించిన వారి చెంతకు తక్షణమే చేరి కష్టాలను తీర్చే భగవానుడు.  వింధ్యా...

🌹శ్రీ నరసింహ మహా మృత్యుంజయ మంత్రం:🌹

Image
 ⚜️🕉️🚩 ఓం శ్రీ లక్ష్మి నృసింహస్వామినే నమః🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥ఆర్తరక్షణ పరాయణుడు. దుష్ట శిక్షకుడు. తలచినంతనే అపమృత్యుభయాన్ని అపహరించివేసే ఆపద్బాంధవుడు "శ్రీ లక్ష్మీ నరసింహుడు" ఉగ్ర రూపం ధరించినా నిత్యం తలిచే భక్తులను మాత్రం కాపాడుతూనే ఉంటాడు. భక్తితో కొలిచినవారికి ఆయన కొంగు బంగారం. ప్రహ్లాదుడిని ఎన్నో విధాలుగా ఆదుకొని, దుష్ట శిక్షణ చేశాడు. ఆర్తరక్షణ పరాయణుడైన నరసింహ స్వామి భక్తులను మృత్యువు నుంచి కాపాడతాడు. వేదాంతాలుగా భాసిల్లే ఉపనిషత్తులలో నరసింహ తత్వం వర్ణించబడి వుంది. 🌹శ్రీ నరసింహ మహా మృత్యుంజయ మంత్రం:🌹 ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం ఈ మంత్రాన్ని నిత్యం 108 సార్లు జపించినట్టయితే అనారోగ్య బాధలూ, అపమృత్యు దోషాలు తొలగి, దీర్ఘాయుష్షు లభిస్తుందనీ శాస్త్రవచనం. పెద్దలే కాదు, పిల్లల చేత కూడాఈ మంత్రాన్ని వల్లె వేయిస్తే... అనవసరమైన భయాలు దూరమై, స్థిరమైన బుద్ధి, ఆయురారోగ్యాలూ కలుగుతాయి.  స్వామి నామ మంత్రాన్ని ఒకసారి పరిశీలిస్తే తన భక్తులకు అభయమిచ్చే అంతరార్ధం అందులో నిబిడీకృతమై వున్నట్లు తెలుస్తుంది. 🌹ఉగ్రం: నృశింహుడు ఉగ్రమూర్...

💥సమస్త గణాలకు అధినాయకుడు.. వినాయకుడు

Image
 ⚜️🕉️🚩 ఓం ఉమాపుత్రాయ నమః🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 💥సమస్త గణాలకు అధినాయకుడు.. వినాయకుడు ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించే ముందు విఘ్నేశ్వరుడిని పూజించడం ఆనవాయితీ. సమస్త దేవతలను పూజించిన ఫలితం దక్కాలంటే ముందు గణపతిని పూజించాలి. గణపతిని తలచుకుంటే చాలు తలపెట్టిన ఏ కార్యక్రమమైనా నిరాటకంగా సాగిపోతుంది. ఏ కార్యంలోనైనా తొలి పూజలందుకునే వినాయకుడు అంటే అందరికి ఎంత భక్తిభావమో, తన భక్తులపై కూడా గణపతికి వల్లమాలిన అభిమానం. ఆయన రూపం, నామాలు మనకు ఎన్నో విషయాలను తెలియజేస్తాయి. విఘ్నాధిపతి రూపం విశ్వమానవాళి గుణగణాలకు ఓ సంకేతం. వినాయకుని తొండం ఓంకారానికి, ఏకదంతం పరబ్రహ్మకు, ఉదరం స్థిరత్వానికి, చేతుల్లోని పాశం రాగానికి, అంకుశం క్రోధానికి, అభయహస్తం భక్తుల రక్షణకు, మణికహస్తంలోని మోదకం ఆనందానికి ప్రతీకలు. ఇతరులలోని అవలక్షణాలను చూడరాదనే విషయాన్ని గణపతి నేత్రాలు తెలియజేస్తే, ఇతరులు చెప్పేది శ్రద్ధగా వినాలని చెవులు తెలియజేస్తాయి. అన్ని విషయాలను కడుపులో దాచుకోవాలనే స్థిరత్వానికి సంకేతం తన ఉదరం ద్వారా వెల్లడిస్తే, ఇతరులు వేసే నిందలు, దుర్భాషలను పట్టించుకోరాదని సంకేతం ఆయన పాదాలు వివరిస్తాయి.  స్వామి ఒక చేతిలో ...

💥శ్రీ హనుమాన్ చాలీసా.. తెలుగులో

Image
 ⚜️🕉️🚩శ్రీ ఆంజనేయం 🌹🙏 🏵️🌼🏵️🌼🏵️ 🌹🌹జై శ్రీరామ్  -  జై హనుమాన్🌹🌹 💥శ్రీ హనుమాన్ చాలీసా.. తెలుగులో అనువాదము: శ్రీ ఎం ఎస్ రామారావు గారు. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం | లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం || హనుమాన్ అంజనా సూనుః వాయుపుత్రో మహా బలః రామేష్టః ఫల్గుణ సఖః పింగాక్షో అమిత విక్రమః | ఉధధిక్రమణ శ్చైవ సీతా శోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా | ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్ || -------*---------*--------- శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు | బుద్ధిహీనతను కలిగిన తనువులు బుద్భుదములని తెలుపు సత్యములు ||  జయ హనుమంత జ్ణానగుణవందిత జయపండిత త్రిలోక పూజిత  రామదూత అతులిత బలధామ అంజనీపుత్ర పవనసుతనామ  ఉదయభానుని మధురఫలమని భావన లీల అమృతమును గ్రోలిన  కాంచనవర్ణ విరాజితవేశా కుండలమండిత కుంచితకేశా || | శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు | రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి రాజపదవి సుగ్రీవున నిలిపి  జానకీపతి ముద్రిక దోడ్కొని జలధి...

💥శివ పంచాక్షరీ స్తోత్రము... భావ సహితం:

Image
 ⚜️🕉️🚩 ఓం నమః శివాయ 🌹🙏 🔱 హర హర మహాదేవ శంభో శంకర 🔱 🏵️🌼🏵️🌼🏵️ 💥శివ పంచాక్షరీ స్తోత్రము... భావ సహితం: నాగేంద్రహారాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మై "న" కారాయ నమః శివాయ 🌹భావం: నాగేంద్రుని హారముగా ధరించిన వాడు, మూడు కన్నులు గలవాడు, పవిత్రమైన బూడిదని ఒళ్లంతా పూసుకొన్న వాడు, మహేశ్వరుడు, నిత్యుడు, శుద్ధ స్వరూపుడు, నలుదిక్కులను వస్త్రములుగా ధరించిన వాడు, పంచాక్షరీ మహామంత్రంలో 'న' కారముచే చెప్పబడే ఆ పరమ శివునకు వందనము. మందాకినీ సలిల చందన చర్చితాయ నందీశ్వర ప్రమథనాథ మహేశ్వరాయ మందార ముఖ్య బహుపుష్ప సుపూజితాయ తస్మై "మ" కారాయ నమః శివాయ 🌹భావం: మందాకిని నదీ జలాలతో పూజింపబడే వాడు, చందనంతో పూయబడిన మేని కలిగిన వాడు, నంది, సకల భూతప్రేతాలకు అధిపతి అయిన మహేశ్వరుడు, మందారం మరియు అనేక ఇతర పుష్పాలతో పూజింపబడేవాడు, పంచాక్షరీ మహామంత్రంలో ' మ' కారముచే చెప్పబడే ఆ పరమ శివునకు వందనము. శివాయ గౌరీ వదనాబ్జ బృంద సూర్యాయ దక్షాధ్వర నాశకాయ శ్రీ నీలకంఠాయ వృషభధ్వజాయ తస్మై "శి" కారాయ నమః శివాయ 🌹భావం: మంగళ కరుడు, గౌరీ వదనారవిందాన్ని ఉదయి...

💥శ్రావణమాసం శుక్ల పంచమి... "నాగపంచమి"/"గరుడ పంచమి"

Image
 ⚜️🕉️🚩 ఓం నాగేంద్రాయ నమః🌹🙏  🏵️🌼🏵️🌼🏵️ 💥శ్రావణమాసం శుక్ల పంచమి... "నాగపంచమి"/"గరుడ పంచమి" పార్వతీదేవికి సాక్షాత్తు పరమేశ్వరుడు నాగపంచమి వైశిష్ట్యాన్ని వివరించినట్లు స్కంద పురాణంలో ఉంది. నిత్యం పూజించే నారాయణుడి శేషశయునుడి పర్వమే ఈ నాగ పంచమి. బ్రహ్మదేవుడు, ఆదిశేషువును అనుగ్రహించిన రోజు.. ఆదిశేషుడు తనకు చేసిన సేవకు మెచ్చిన శ్రీమహావిష్ణువు అతడిని ఏదైనా వరం కోరుకొమ్మని అడిగితే, తాము (సర్పజాతి) ఆవిర్భవించిన రోజున సృష్టిలోని మానవులంతా తమకు పూజ చేసేలా అనుగ్రహించమని అడిగాడు. విష్ణుమూర్తి అనుగ్రహించాడు. ఈ వరం కారణంగా శ్రావణ శుద్ధ పంచమిని నాగపంచమిగా జరుపుకునే ఆచారం వ్యాప్తిలోకి వచ్చింది. నాగ పంచమి రోజున పూజ చేసిన వారికి విష భాధలు ఉండవు. సర్ప స్తోత్రాన్ని ప్రతిరోజు మరియు నాగ పంచమి రోజున చదివిన వారికి ఇంద్రియాల వల్ల ఎలాంటి బాధలు లేక రోగాలు రావు. వంశము అభివృద్ధి అవుతుంది. సంతానోత్పత్తి కలుగుతుంది. కార్యసిద్ధి జరుగుతుంది. అన్ని కార్యములు సవ్యంగా నెరవేరతాయి. కాలసర్ప దోషాలు, నాగ దోషాలు ఉన్నా తొలగిపోతాయి. 💥చక్కని సంతానాన్ని ఇచ్చే "గరుడ పంచమి" కశ్యప ప్రజాపతికి వినత...